cricket ad

Wednesday, 30 November 2016

పుట్టిన రోజును ఎలా జరుపుకోవాలి :

పుట్టిన రోజును ఎలా జరుపుకోవాలి :
తప్పకుండా గుర్తుపెట్టుకిని తాను జరుపుకోవల్సినవి కొన్ని ఉంటాయి అందులో పుట్టినరోజు ఒకటి . నేను నా పుట్టినరోజు చేసుకోనండి అనకూడదు . తన పుట్టిన రోజు తాను చక్కగా జరుపుకోవాలి ,అలా జరుపుకోడానికి శాస్త్రం ఒక విదిని నిర్ణయించింది . పుట్టినరోజును ఎలా పడితే అలా జరుపుకోకూడదు . పుట్టినరోజు జరుపుకునేటతువంటి వ్యక్తి ఆరోజు తెల్లవారుజామున లేచి అభ్యంగన స్నానం చేయాలి , అంటే ఒంటికి నూనె రాసుకుంటే అలక్ష్మి పోతుంది ఆ నూనె అలదుకుని తల స్నానం చేస్తారు . చేసే ముందు పెద్దవాళ్ళు తల మీద చేయి పెట్టి ఆశీర్వాదం చేసి వెన్నుపాము నిమరడం ఆచారముగా వస్తుంది . ఆ స్నానం చేసిన తర్వాత ఇష్ట దేవతని ఆరాధన చేయాలి ,ఇంట్లో కుల దైవం ,ఇష్ట దైవం ఉంటారు . ఆ కుల దైవాన్ని ,ఇష్ట దైవాన్ని ఆరాదన చేయాలి . చేసిన తర్వాత ఆవు పాలలో బెల్లం ముక్క ,నల్ల నువ్వులు ఈ మూడు కలిపినటువంటి పదార్ధాన్ని మౌనముగ తూర్పు దిక్కుకు తిరిగి కూర్చుని మూడు మార్లు చేతిలో ఆచమనం చేస్తే ఎలా తింటామో అలా మూడు మార్లు తీసుకుని లోపలికి పుచ్చుకోవాలి , ఎందుచేత అంటే నల్ల నువ్వులు ,బెల్లం ,ఆవు పాలు కలిసినటువంటి పదార్దాన్ని మూడు మార్లు పుచ్చుకుంటే వచ్చే పుట్టినరోజు కు ఏదైనా గండ కాలం ఉంటె తొలగిపోతుంది . కాబట్టి ఈ మూడు పదార్దములు కలిసినటువంటి దానిని చేతిలో వేసుకుని మూడు మార్లు పుచ్చుకోవాలి . పుచ్చుకున్న తర్వాత ఏడుగురు చిరంజీవులు ఉంటారు అంటే వారు పుట్టుక చేతనే చిరంజీవత్వాన్ని పొందారు . ఇంక కొంత మంది చిరంజీవత్వాన్ని సాదించుకున్నవాళ్ళు ఉన్నారు . సాదించుకున్నవాళ్ళు కాదు పుట్టకతో చిరంజీవులు అయిన వారు అశ్వర్దమా ,బలి ,వ్యాసుడు ,హనుమంతుడు ,విభీషణుడు ,కృపాచార్యుడు ,పరశురాముడు వీరు ఏడుగురు కూడా పుట్టుకతో చిరంజీవులు ,ఈ ఏడుగురు పేర్లు మనసులోనన్న స్మరించాలి ,పైకన్న చెప్పాలి ,ఆ రోజున తల్లిదండ్రులకి ,గురువు గారికి తప్పకుండ నమస్కారం చేసి ,వాళ్ళ ఆశీర్వచనం అందుకోవాలి . మీ ఇంటికి దగ్గరలో ఏ దేవాలయం ఉందో ఆ దేవాలయాన్ని దర్శనం చేయాలి ,చక్కగా ముష్నన్న భోజనము చేయొచ్చు ,రాత్రి మాత్రం బ్రహ్మచర్యాన్ని పాటించాలి పుట్టినరోజుని . పుట్టినరోజున బ్రహ్మచర్య దీక్షకి విరుద్దమైన సంసారికమైన కార్యక్రమాలని నిర్వహించకూడదు అలా ఉంటె ఆ రోజుని పుట్టినరోజుని సక్రమముగా చేసుకున్నాడు అని చెప్తారు . తన శక్తి కొలది దాన ధర్మాలు నిర్వహించాలి . తనకి ఐశ్వర్యం ఉందా దానం చేస్తాడు . తనకి ఐశ్వర్యం లేదు గో గ్రాసం అంటారు , చేతి నిండా కసన్ని పచ్చగడ్డి పట్టుకుని ఒక ఆవుకి తినిపించి ప్రదక్షిణం చేసి నమస్కరిస్తే చాలు ,ఇవి పుట్టిన రోజు నాడు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకుని చేయవల్సినవంటి పనులు ,వీటికి విరుద్ధముగా పుట్టిన రోజులు మాత్రం చేసుకోవద్దు . అది కేవలం ఏదో సరదా కోసం ,వినోదం కోసం చేసుకునేది కాదు ,అది ఆయుర్దాయ సంబందమైనటువంటిది . ఆ రోజు దీపం చాల ప్రదానం పొరపాటున కూడా అక్కరలేని విషయాలు పిల్లలకి నేర్పితే అవే విశుమ్కత్వాన్ని పొందుతాయి రేపోద్దిన ,ఎన్నో ఏడు పుట్టిన రోజు చేసుకుంటున్నాడో అన్ని కొవ్వుత్తులు ,దీపాలు వెలిగించడం ఉఉప్ అని ఉదుతు దీపాలు అర్పేయడం పరమ అమంగాలమైనటువంటి విషయం ,దీపాలు ఆర్పి చేతితో కత్తి పట్టుకుని ఏదో నిన్న రాత్రో ,మొన్న రాత్రో తయారు చేసిన ఒక పదార్దం , ఎవరు చేసిన ఆశీర్వాదం అర్ధం కాదు రంగురంగులుగా రాసిన హ్యాపీ birthday ,అర్ధం లేకుండా అందరు చేస్తున్న తప్పట్లు ,వీటి మద్యలో కత్తితో కోసి నిర్లజ్జగా భార్య నోటిలో సబాముఖంగా పెట్టడం ,ఇలాంటి పిచ్చ పనులు చేయమని శాస్త్రములో లేదు . దీపాన్ని గౌరవించు ,దీపాన్ని వెలిగించు ,దీపం దగ్గర మట్టు మీద ఒక అక్షితో ,పువ్వో వేసి నమస్కారం చేయి . అది నీ ఇంట కాంతి నింపుతుంది . నీ జీవితాన్ని నిలబెడుతుంది .. గురువు గారికి నమస్కారం చేయి ,తల్లిదండ్రులకి నమస్కారం చేయి ,పెద్దలికి నమస్కారం చెయి వాళ్ళ నోటితో వాళ్ళు ఆశీర్వదించాలి "శతమానం భవతి శతాయు; పురుషహ శతెన్ద్రియహ అయూశెవెన్ద్రియె ప్రతితిష్టతి . "చక్కగా అలా దేవాలయానికి వెళ్లి నీ పేరు మీద పూజ చేయించు ,ఈశ్వరుడి అర్చన చేయి ,అపముత్య దోషం కబలించకుండా ఉండడానికి ఆవు పాలు ,నువ్వులు ,బెల్లం కలిపిన పదార్దాన్ని మూరు మాట్లు స్వీకరించు ,సప్త చిరంజీవుల పేర్లు మనసులో స్మరించడం లేదా పైకి చెప్పడం ,ఒక వేల నీకు చేతకాకపోతే కనీసం అది గుర్తున్న వాళ్లతో సంప్రదించి ,లేదా కనీసం వ్రాసుకో అక్కర్లేని విషయాలు ఎన్నో వ్రాసుకున్నావు , వ్రాసుకుని జ్ఞాపకం పెట్టుకుని నీ పుట్టిన రోజు నాడు ,ఇంట్లో వాళ్ళ పుట్టిన రోజు నాడు ఆ ఏడుగురు పేర్లు చెప్పు . అది పుట్టిన రోజు చేసుకునేటటువంటి విదానం .
   share ur fb friends..
విదితాఖిలశాస్త్రసుధాజలధే మహితోపనిషత్ కథితార్థనిధే |
హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణమ్ || ౧ ||
కరుణావరుణాలయ పాలయ మాం భవసాగరదుఃఖవిదూనహృదమ్ |
రచయాఖిలదర్శనతత్త్వవిదం భవ శంకర దేశిక మే శరణమ్ || ౨ ||
భవతా జనతా సుహితా భవితా నిజబోధవిచారణ చారుమతే |
కలయేశ్వరజీవవివేకవిదం భవ శంకర దేశిక మే శరణమ్ || ౩ ||
భవ ఏవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా |
మమ వారయ మోహమహాజలధిం భవ శంకర దేశిక మే శరణం || ౪ ||
సుకృతేzధికృతే బహుధా భవతో భవితా సమదర్శనలాలసతా |
అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశిక మే శరణమ్ || ౫ ||
జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామహసశ్ఛలతః |
అహిమాంశురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణమ్ || ౬ ||
గురుపుంగవ పుంగవకేతన తే సమతామయతాం నహి కోzపి సుధీః |
శరణాగతవత్సల తత్త్వనిధే భవ శంకర దేశిక మే శరణమ్ || ౭ ||
విదితా న మయా విశదైకకలా న చ కించన కాంచనమస్తి గురో |
ద్రుతమేవ విధేహి కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణమ్ || ౮


పలికెడది బాగవతమట, పలికెంచెడు వాడు రామబద్రుండట ,నే పలికిన బవహరమగునట, పలికెద వేరొండు గద పలుకగనేల ..

meaning:
పలుకునది భాగవతం అట,పలికేంచేడి వాడు రాముడు అట, నేను పలికినట్లయిన సంసార భందనములు తొలగుట అవుతుందట, అందుకే పలుకుదును ఇంకొక కద పలకడం ఎందులకు ?

పోతన గారిచే రచించబడిన బాగవతము లోని ఈ మొట్ట మొదటి పద్యము అందరి తెలుగు వారికి చాలా ఇష్టమైన పద్యం .

 share fb friends


భోజనం చేసిన తర్వాత ఇవి చేయకండి

1) DON’T SMOKE:
ధూమపానము చేయరాదు.
********************
భోజనము చేసినతరువాత ఒక cigarette
కాల్చితే పది cigarettesకు సమానము అని
చెబుతున్నారు. కాన్సెర్ వచ్చే అవకాశాలు కూడా ఇంకా ఎక్కువగా ఉంటాయట.
2) DON’T EAT FRUITS:
పళ్ళు తినకూడదు.
**************
భోజనము చేసిన వెను వెంటనే
పళ్ళు తినడం వలన కడుపు మొత్తం గాలితో
నిండిపోతుంది. అందుకే పళ్ళు తినాలనుకునేవారు రెండు గంటలు ముందు కానీ
తరువాతగాని తింటే మంచిది.
3) DON’T DRINK TEA:
టీ తాగకూడదు.
*******************
టీవలన పెద్దమొత్తంలో ఆసిడ్ విడుదల చేసి ఆహరం జీర్ణం అవ్వడం కష్టంఅవుతుంది.
4) DON’T LOOSEN YOUR BELT:
బెల్టు లూస్ చేయకూడదు(పెట్టుకునే వారు)
*******************************
దీనివల లోపల ఎక్కడన్నా ఇరుక్కున్న
ఆహరం సరిగ్గా జీర్ణం కాదు.
5) DON’T BATH:
స్నానం చేయకూడదు.
*****************
భోజనం చేసినవెంటనే స్నానం చేస్తే రక్తం అంతా చేతులకి కళ్ళకి మొత్తం ఒంటికి
పాకి, పొట్ట దగ్గర రక్తం తగ్గిపోయి జీర్ణప్రక్రియని నెమ్మది చేస్తుంది. దీనివల
జీర్ణ వ్యవస్థ సామర్ధ్యం తగ్గిపోతుంది.
6) DON’T SLEEP:
నిద్ర పోకూడదు.
*************
భోజనం చేసిన వెంటనే పడుకుంటే
ఆహరం సరిగ్గా జీర్ణం అవ్వక gastric & infection వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. మాములుగా భోజనం చేసిన వెంటనే ఎవరికైనా సరే నిద్ర వస్తుంది. తప్పకుండా పడుకోవాలి అంటే ఒక పదిహేను నుండి ఇరవైనిముషాలు కంటే ఎక్కువగా
పడుకోకుండా ఉంటె మీ ఆరోగ్యానికి మంచిది
అంటున్నారు డాక్టర్లు.

బ్రహ్మ తలల వెనక ఉన్న ఆసక్తికర కథ ఏంటి ?

బ్రహ్మ హిందువుల దేవుడు. త్రిమూర్తులలో ఒకరు. విష్ణు, శివుడు, బ్రహ్మ.. ఈ ముగ్గురిని త్రిమూర్తులు అని పిలుస్తారు. బ్రహ్మ సృష్టికర్త కూడా. బ్రహ్మ పురాణం ప్రకారం మను తండ్రి బ్రహ్మ. మను అంటే.. మనుల వారసులుగా మనుషులు పుట్టారని తెలుస్తోంది. బ్రహ్మదేవుడికి ముగ్గురు భార్యలు ఉన్నట్టు చెబుతారు. సరస్వతి, సావిత్రి, గాయత్రి. ఈ ముగ్గురు భార్యలనూ.. వేదమాతలుగా గౌరవిస్తారు. వేదమాత అంటే.. వేదాలకు తల్లి అని అర్థం. బ్రహ్మదేవుడిని ప్రజాపతి, వేద దేవుడు అని పిలుస్తారు.
ఈ విశ్వ సృష్టికర్తగా బ్రహ్మను పేర్కొంటారు. నాలుగు తలలు కలిగి దేవుడిగా బ్రహ్మను చెబుతారు. కానీ.. వాస్తవానికి బ్రహ్మకు ఐదు తలలు ఉండేవని బ్రహ్మ పురాణం చెబుతోంది. ఈ కథ ప్రకారం.. విశ్వాన్ని సృష్టిస్తున్న సమయంలో బ్రహ్మ ఒక తలని కోల్పోయాడని తెలుస్తంది. అసలు బ్రహ్మకు ఎన్ని తలలు ? బ్రహ్మ తలల వెనక ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐదు తలలు
నాలుగు తలలతో కనిపించే బ్రహ్మకు వాస్తవానికి ఉండేది ఐదు తలలట.
శతరూప
బ్రహ్మ పురాణం ప్రకారం విశ్వాన్ని సృష్టిస్తున్న సమయంలో.. శతరూప అనే దేవతను సృష్టించి.. ఆమెపై తీవ్ర మోహాన్ని పెంచుకున్నారు బ్రహ్మ.
ఒక్కోవైపు ఒక్కో తల
బ్రహ్మను వ్యతిరేకిస్తూ.. శతరూప అన్ని వైపులకూ పరుగుపెట్టింది. అలా ఆమె వెనక పరుగెత్తే సమయంలో బ్రహ్మ ఒక్కో వైపు ఒక్కో తల ఏర్పరచుకున్నాడు.
తల నరకడం
అదే సమయంలో బ్రహ్మను కంట్రోల్ చేసే యత్నంలో శిశుడు బ్రహ్మకు చెందిన పై తలను నరికేశాడు.
బ్రహ్మ కూతురుగా
అంతేకాదు శివుడు శతరూపను బ్రహ్మ కూతురిగా భావించాడు. తన ద్వారా రూపొందిన ఆమె బ్రహ్మకు కూతురవుతుందని భావించాడు. అందుకే ఆమెతో అలా ప్రవర్తించడం సరికాదని… నిర్ణయించుకుని.. తల నరికేశాడు.
బ్రహ్మకు పూజలు లేవు
బ్రహ్మ తలను నరికేసిన తర్వాత బ్రహ్మను ఏ దేవాలయాల్లోనూ పూజించకూడదని.. శివుడు సూచించాడు.
శివ, వైష్ణవాలయాలు
అందుకే కేవలం శివుడు, విష్ణువులను మాత్రమే పూజిస్తున్నాం. దాదాపు బ్రహ్మను పూజించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అలాగే శివాలయాలు, వైష్ణవాలయాలు ఉన్నాయి కానీ.. బ్రహ్మకు ఆలయం లేదు.
ఎవరు గొప్ప మరో కథనం ప్రకారం బ్రహ్మ, విష్ణువు తమలో ఎవరు గొప్పవాళ్లని ఒకరికొకరు వాదించుకుంటున్న సమయంలో.. శివుడు బ్రహ్మ తల నరికేసినట్టు తెలుస్తోంది.
శివుడి చేతిలో బ్రహ్మ పుర్రె
సాధారణంగా శివుడి ఫోటోలలో ఆయన చేతిలో పట్టుకుని వెళ్లే పుర్రె బ్రహ్మ ఐదో తల అని చెబుతారు.
నీళ్లు తాగడానికి
అంతేకాదు కొన్ని సందర్భాల్లో శివుడు పుర్రెను నీళ్లు తాగడానికి ఉపయోగిస్తాడట. అలాగే పుర్రెలతో తయారు చేసిన మాల ధరిస్తాడట. ఆ పుర్రెనే శివుడు నరికిన బ్రహ్మ తలగా వివరిస్తారు.

శ్రీ శివ రక్షా స్తోత్రం

శ్రీ శివ రక్షా స్తోత్రం
అస్య శ్రీ శివరక్షాస్తోత్రమంత్రస్య యాజ్ఞవల్క్య ఋషిః | శ్రీ సదాశివో దేవతా | అనుష్టుప్ ఛందః | శ్రీ సదాశివప్రీత్యర్థం శివరక్షాస్తోత్రజపే వినియోగః ||
చరితం దేవదేవస్య మహాదేవస్య పావనమ్ |
అపారం పరమోదారం చతుర్వర్గస్య సాధనమ్ || ౧ ||
గౌరీవినాయకోపేతం పంచవక్త్రం త్రినేత్రకమ్ |
శివం ధ్యాత్వా దశభుజం శివరక్షాం పఠేన్నరః || ౨ ||
గంగాధరః శిరః పాతు భాలం అర్ధేన్దుశేఖరః |
నయనే మదనధ్వంసీ కర్ణో సర్పవిభూషణః || ౩ ||
ఘ్రాణం పాతు పురారాతిః ముఖం పాతు జగత్పతిః |
జిహ్వాం వాగీశ్వరః పాతు కంధరం శితికంధరః || ౪ ||
శ్రీకంఠః పాతు మే కంఠం స్కంధౌ విశ్వధురన్ధరః |
భుజౌ భూభారసంహర్తా కరౌ పాతు పినాకధృక్ || ౫ ||
హృదయం శంకరః పాతు జఠరం గిరిజాపతిః |
నాభిం మృత్యుంజయః పాతు కటీ వ్యాఘ్రాజినాంబరః || ౬ ||
సక్థినీ పాతు దీనార్తశరణాగతవత్సలః |
ఊరూ మహేశ్వరః పాతు జానునీ జగదీశ్వరః || ౭ ||
జంఘే పాతు జగత్కర్తా గుల్ఫౌ పాతు గణాధిపః |
చరణౌ కరుణాసింధుః సర్వాంగాని సదాశివః || ౮ ||
ఏతాం శివబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ |
స భుక్త్వా సకలాన్కామాన్ శివసాయుజ్యమాప్నుయాత్ || ౯ ||
గ్రహభూతపిశాచాద్యాః త్రైలోక్యే విచరంతి యే |
దూరాదాశు పలాయంతే శివనామాభిరక్షణాత్ || ౧౦ ||
అభయంకరనామేదం కవచం పార్వతీపతేః |
భక్త్యా బిభర్తి యః కంఠే తస్య వశ్యం జగత్త్రయమ్ || ౧౧ ||
ఇమాం నారాయణః స్వప్నే శివరక్షాం యథాఽదిశత్ |
ప్రాతరుత్థాయ యోగీంద్రో యాజ్ఞవల్క్యః తథాలిఖత్ || ౧౨ ||
ఇతి శ్రీయాజ్ఞవల్క్యప్రోక్తం శివరక్షాస్తోత్రం సంపూర్ణం
ఒకసారి ఒక ఆంగ్లేయుడు సత్యశోధన కోసం అనేక మత గ్రంధాలు శోధించాడు అయన స్వతహాగా క్రీస్టియన్. అన్ని మతాలు వెదికి చివరికి హిందూ సనాతనధర్మం లో ఉన్న రామాయణ, భారత, భాగవత, పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు చదివాడు. ఎన్నో ఏళ్ల నుండి తను చేస్తున సత్యాన్వేషణ హిందూ సనాతన ధర్మం వలన లభించింది అని అన్నాడు.


అయితే హిందువుల్లో అంతమంది దేవుళ్ళు ఎందుకుంటారు అని అడిగేవాళ్లకు లేదా ఎగతాళి చేసేవాళ్లకు అయన ఇలా సమాధానం చెప్పాడు.



” తల్లి తన బిడ్డకి ఆకలి వేసినప్పుడు చేతిలో గరిటెలు పట్టుకుని అన్నపూర్ణా దేవిలా మారుతుంది. అమ్మా ఈ లెక్క నాకు అర్థం కాలేదు అంటే పుస్తకం తీసుకొని ఇలా చెయ్యమని సరస్వతి అవుతుంది. అమ్మ ఖర్చులకి డబ్బులు కావాలంటే తన చేతితో



డబ్బు ఇచ్చి లక్ష్మిదేవిలా మారుతుంది. ఏదైనా తప్పు చేస్తే దండించి ఆదిపరాశక్తి లా మారిపోతుంది.
ఇలా ఎదురుగా ఉన్న తల్లి వివిధ సందర్భాలలో వివిధ రకాలైన అవతారాలు ధరిస్తుంటే,



 తను సృష్టి చేసిన దేవుడు తన పిల్లల కోసం ఎన్ని అవతారలైనా ధరిస్తాడు. అందుకే హిందూ మతంలో ఇన్ని మంది దేవుళ్ళు, దేవతలు ఉన్నారు ” అన్నాడు.



అలానే కాకుండా హిందూ ధర్మంలో ఉండి ఏమి లేదు అనుకునేవారు కూడా సరిగ్గా ఆరాధిస్తే ఆ ఫలితం తెలుస్తుంది. ఎలాగంటే… మంచు చూడడానికి మనకి ఒకేలా కనిపిస్తుంది. కాని ఆ మంచులో నివసించేవారు చెప్పే మాట “మంచులో మొత్తం 47 రకాలు ఉన్నాయి” అంటారు. దూరంగా ఉండే మనకి ఒకటే. కాని దగ్గరకి వెళ్లి పరిశీలించిన వారికే తెలుస్తుంది.

హిందూ పూజా విధానంలోని క్రియలలో అంతరార్థము

1. గంటలు :
దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది. ఒకటి-బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం, రెండవది-మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది.
2.దీప హారతి:
దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం. దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం. దైవమే కాంతి. ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది. ” స్వామీ! నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు. కాంతివి నీవే. నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి, మా బుద్ధిని ప్రభావితం చేయి” అని.
3. ధూపం
భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరువత్తులను వెలిగిస్తాము. వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి. వీటి ధూపం క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి. విశ్వమంతా నిండియున్నాడు అన్న భావన అందరిలో కలుగుతుంది. ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికీ జ్ఞప్తి చేసినట్లవుతుంది.
4. కర్పూర హారతి
వ్యక్తిగతమైన అహంకారము కర్పూరమువలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం. ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని భక్తులు కోరుకుంటారు.
5. గంధపు సేవ
ఈ సేవలో చాలా అర్థం ఉంది. భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు. అంత శ్రమకు లోనయినప్పటికీ గంధం ఓర్పుతో సహించి, మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లదం కలిగిస్తుంది. ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనయినప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు. ఇదే ఈ గంధసేవలోని అంతరార్థం.
6. పూజ
దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు. కాని భగవంతునికి వీటితో పనిలేదు. నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు. కాని ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది.
7 పత్రం(శరీరము)
ఇది త్రిగుణాలతో కూడుకున్నది. పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు.
8 పుష్పం (హృదయము)
ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పూవు అని అర్థం కాదు. సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం అని అర్థం. ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి.
9 ఫలం (మనస్సు)
మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి.దాన్నే త్యాగం అంటారు.
10. తోయం(నీరు)
భగవంతుని అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం మొదలైన దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద భాష్పాలు దైవానికే అర్పితం కావాలి.
11 కొబ్బరికాయలు
హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. దానిలో ఉండే నీరు సంస్కారము. కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరుజేసి, తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి. అదే నిజమైన నివేదన. లోపల సంస్కారము అనేవి వున్నంతకాలం, హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకొని ఉంటుంది. హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు. మనంచేసే పనులను విత్తనాలతో పోలుస్తారు.మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.
12. నమస్కారము
చేతులు జోడించగానే పదివేళ్లు కలసివుంటాయి. ఈ పదివేళ్లు పది ఇంద్రియములకు గుర్తు. ఇందులో కర్మేంద్రియ,జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను అని చేతులు జోడించుటయే నమస్కారములోని అంతరార్థము.
13. ప్రదక్షిణము
ముల్లోకములన్నియు భగవంతుని స్వరూపముతో నిండివున్నాయి. ఆ భగవంతుని సగుణాకరామైన విగ్రహమునకు గాని, లింగమునకు గాని, ప్రదక్షిణము చేసినట్లయిన ముల్లోకములు చుట్టి సర్వదేవతలకు నమస్కారములు చేసిన ఫలితము వుంటుంది.. అందుకే ప్రదక్షిణము పూజాంగములలో ఒకటిగా చేర్చారు