cricket ad

Wednesday, 30 November 2016

అందరికీ ధ్యానయోగ్యమైన మూర్తులు :
అత్యంత శ్రేయదాయకమైనది దక్షిణామూర్తి స్వరూపం . కృష్ణ బగవానుడు గొప్పగా ధ్యానానికి యోగ్యమైన మూర్తి, కానీ గృహస్తు దానిని ధ్యానం చేస్తే కాళ్ళ దగ్గర ఆవు దూడ ఉన్నటువంటి మూర్తినే ధ్యానం చెయ్యాలి అనే ఒక నియమాన్ని పెద్దలు చెప్తారు . దక్షిణామూర్తి అనుకోండి విధ్యార్ది ధ్యానం చేస్తే అపారమైనటువంటి జ్ఞాపక శక్తి ,తేజస్సు ,ఆరోగ్యం కలుగుతాయి . గృహస్తు ధ్యానం చేస్తే సమస్తమైన ఐశ్వర్యం కలుగుతుంది ,ధర్మము నందు అనురక్తి కలుగుతుంది వానప్రస్తుకి వైరాగ్యం బాగా పెరుగుతుంది . సన్యాసి కి ధ్యానం నిలబడుతుంది . ఎవరికి ఏది కావాలో దానిని అది అనుగ్రహిస్తుంది . అందరికి ఒకలా కాదు . ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇవ్వగలదు పైగా పరమ మంగళ మూర్తి , దక్షిణామూర్తి ని చూడడమే ఎంతో ఆనందముగా ఉంటుంది అసలు ఆ వీరాసనములో కూర్చుని ఒక కాలు క్రింద పెట్టి ఆ కాలు కింద ఉన్నటువంటి మాయ రాక్షసులు కూడా తలెత్తి నవ్వుతుంటాడు ఆ రెండవ కాలు తీసుకువచ్చి కింద పెట్టినటువంటి కాలు యొక్క తొడ మీద వేసుకుని నాలుగు చేతులతో ఉంటాడు చక్కగా చిన్న చిరునవ్వు నవ్వుతూ పెద్దా వట వృక్షం కింద కూర్చుని ఉంటాడు ఆ ధ్యానం చేసేటప్పుడు చాలా తేలికగా మీరు ఆయన దగ్గరికి వెళ్లినట్టు మీరు మోకాళ్ళ మీద వంగినట్టు మీ తల తీసుకునివెళ్ళి కింద పెట్టినటువంటి పాదం మీద మోపినట్టు ఆయన బొటన వ్రేలు దాని ప్రక్కన పాదము యొక్క తలము మెత్తగా మీ తలకి తగిలినట్టు మీరు లేచి ఆయన పాదం పట్టుకున్నట్టు ,ఆయన పాదాన్ని నిమిరినట్టు ,ఆయన కాలు వొత్తుతున్నట్టు ,మీరు నీరాజనం ఇచ్చినపుడు ఆ చేతులు ,ఆ చేతులో ఉండేటటువంటి ఆయుధములు ,కిరీటము, ఆయన తొడ మీద వేసుకున్నటువంటి ఎర్రటి పాదం దాని యొక్క వేళ్ళు ,గోళ్ళు అన్ని కనపడుతుండగా మీరు ఆయనికి నీరాజనం ఇస్తూ ఒకసారి దర్శనం చేయొచ్చు ,మీరు ధ్యానములో ఆయన్ని చూస్తూ దగ్గరగా కూర్చుని చూస్తుంటే మనసు రంజిల్లిపోయి చాలా తేలికగా ఆయన అందు లయమై ఉంటుంది . ప్రత్యేకించి అది జ్ఞానకారకము ,మంగళ కరము శివ స్వరూపము . అన్నిటిని మించి దక్షిణామూర్తి దగ్గర ఉన్న గొప్పతనము ఏమిటి అంటే అసలు దక్షిణామూర్తి దగ్గర్నుంచి ఇది మాత్రమే వస్తుంది అని చెప్పడానికి అవది లేదు . ఏదైనా ఇవ్వగలరు . అన్ని ఇవ్వగలిగినటువంటి దక్షిణామూర్తి స్వరూపాన్ని ఇంట్లో ఉంచుకుని పిల్లలు దగ్గర నుంచి పెద్దలు వరకు అందరు కొంత సేపు ఆయన్ని ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే అసలు గురుమండలములో ప్రదానమైనటువంటి గురువుకి కూడా నమస్కారం చేసినటువంటి అనుగ్రహం లబిస్తుంది ఎందుకంటే ఆయన గురుస్వరూపం .
ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం
వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ||
ముదితవదనం చిరునవ్వుతో వుంటాడు , మనసుకు ఒక లక్షణము ఉంటుంది అది విసుగు చెందుతుంది . మీరు రోజు ఒక లాగే చూపించరనుకొడి , రోజు కింద పెట్టిన పాదం చూపిస్తే నిన్న ఇదే చేశా కదా మల్లి ఎటో వెళ్తుంది, కాదు మీరు ఈరోజు పాదం జ్ఞానం చేస్తే రేపు చిన్ముద్ర ధ్యానం చేయొచ్
అందరికి గురుపౌర్ణమి శుభాకాంక్షలు !!
ఈరోజు గురుపౌర్ణమి వ్యాసుల వారి జన్మదినం , మన గురువు గారు ఏ ప్రవచనం మొదలు పెట్టిన వ్యాసుల వారిని ఈ విధముగా సృతిస్తారు .
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే !
నమో వై బ్రహ్మనిథయే వాసిష్టాయ నమో నమః !
వ్యాస మహర్షి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం .
వేదవ్యాసుడు జన్మ వృత్తాంతం అష్టాదశ పురాణాలలొ పెక్కు మార్పు మార్లు చెప్పబడింది. ఈ దిగువ నున్న వృత్తాంతం మహాభారతము ఆది పర్వం తృతీయా ఆశ్వాసము నండి గ్రహించబడింది.
పూర్వకాలములో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తుండేవాడు, ఒకరోజు వేటకు అడవికి వెళ్ళిన రాజు ఆ అడవి లో మునులు తపస్సు చేయడము చూసి తాను తపస్సు చేయడం ఆరంభించాడు. అప్పుడు ఇంద్రుడు అది గ్రహించి ఆ మహారాజు వద్దకు వెళ్ళి దైవత్వము ప్రసాదిస్తున్నాని చెప్పి ఒక విమానాన్ని ఇచ్చి, భూలోకములో రాజ్యం చేస్తూ, అప్పుడప్పుడు స్వర్గానికి రమ్మని చెబుతాడు. ఇంద్రుడు వేణుదుస్టి అనే అతి పరాక్రమ వంతమైన ఆయుధాన్ని కుడా ప్రసాదిస్తాడు. వసువు నివసిస్తున్న నగరానికి ప్రక్కగా శుక్తిమతి అనే నది ఉన్నది. శుక్తిమతి అనే నది ప్రక్కన ఉన్న కోలహలుడు అనే పర్వతము శుక్తిమతి మీద మోజుపడి ఆ నదిలో పడతాడు. అప్పుడు ఆ నది మార్గములో వెళ్తున్న వసువు తన ఆయుధంతో కోలహలుడిని ప్రక్కన పాడేస్తాడు. శుక్తిమతికి మరియు కోలహలుడికి మధ్య జరిగిన సంపర్కము వలన గిరిక అనే కుమార్తె వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు. శుక్తిమతి వారివురిని వసువు కి కానుక గా ఇస్తుంది. వసువు గిరికని వివాహం చేసుకొంటాడు. వసువు వసుపదుడు ని సైన్యాధిపతిగా చేస్తాడు. ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు అప్పుడు తన భార్య గిరిక గుర్తు రావడం తో రేతస్సు పడుతుంది. ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి , ఆ దొన్నెని డేగకి ఇచ్చి తన భార్యకి ఇవ్వమంటాడు. ఆ డేగ ఆ దొన్నెను తీసుకొని పోవుతుండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని ఆలోచించి, ఆ డేగతో పోట్లాడూతుంది అప్పుడూ ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది. ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సు అని భక్షిస్తుంది ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడి పిండం గా మారుతుంది. ఒకరోజు బెస్తవారు చేపలు పట్టు తుండగా ఈ చేప చిక్కుతుంది. ఆ చేపను బెస్తవారు వారి రాజైన దాశరాజు వద్దకు తీసుకొని పోతారు.
దాశరాజు ఆ చేపని చీల్చి చూడగా ఆ చేపలొ ఒక మగ శిశువు మరియు మరో ఆడ శిశువు ఉంటారు. బ్రహ్మ శాపం వల్ల ఒక అద్రిక అనే అప్సరస చేప క్రింద మారి యమునా నదిలో ఉంది. చేపని చీల్చిన వేంటనే అ చేప అక్కడ నుండి అంతర్థానమై పోయింది. ఆ మగ బిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దదయ్యింది. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నది పై నావ నడుపుతుండేది. ఇలా జరుగుతుండగా ఒక రోజు వశిష్ట మహర్షి మనమడు, శక్తి మహర్షి కుమారుడాయిన పరాశరుడు ఆ నది దాటడానికి అక్కడ కు వస్తాడు.
అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి మోహించే రతి సుఖాన్ని ఇవ్వమంటాడు, అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని, కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏవిధంగా మొగము చూపగలని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరాశరుడు మత్స్యగంధి వసువు వీర్యానికి అద్రిక నే అప్సరసకి జన్మించినది అనిజన్మ వృత్తాంతం చెబుతాడు. చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరము వరకు సుగంధం వెదజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు. అప్పటి నుండి యోజన గంధిగా పేరు పొందింది. అప్పటి రతి గరపడానికి సంకోచిస్తున్న మత్స్యగంధి తో పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు. పగటి పూట రతి సలపడం అనే విషయం వ్యక్తపరిస్తే , అక్కడా ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు. ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకి వెళ్ళి పోతాడు. తల్లికి ఎప్పుడైన మననం చేసుకొంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు.
వ్యాసుడు జన్మించిన వెంటనే తల్లి అనుమతితో తపోవనానికి వెళతాడు. ఆ తరువాత సత్యవతీ శంతనుల వివాహం జరిగింది. వివాహకాలంలో దాశరాజు విధించిన షరతుకారణంగా భీష్ముడు ఆమరణాంతం బ్రహ్మచర్య వ్రతం అవలంబిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. శంతనుని మరణం తరువాత వారి కుమారులైన చిత్రాంగధుడు బలగర్వంతో గంధర్వుని చేతిలో మరణం చెందాడు. విచిత్రవీరుడు సుఖలాలసతో అకాలమరణం చెందాడు. భరతవంశం వారసులను కోల్పోయిన తరుణంలో సత్యవతి భరతవంశ పునరుద్ధరణ కొరకు తన పుత్రుడైన వ్యాసుని మనన మాత్రంచే తన వద్దకు రప్పించింది. భరతవంశాన్ని నిలపమని వ్యాసునికి ఆదేశించింది. తల్లి ఆదేశాన్ననుసరించి వ్యాసుడు అంబికకు దృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజుని మరియు దాశీకు విదురుని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళతాడు. ఆతరువాత వ్యాసుడు గాంధారి గర్భస్రావం సమయంలో ప్రవేశించి గాంధారి మృత పిండం నూట ఒక్క నేతికుండలలో పెట్టి వాటిని పరిరక్షించే విధానాన్ని చెప్పి తిరిగి తనదారిన తాను వెళతాడు. ఆతరువాత దుర్యోధనుడు భీమునిపై మూడుమార్లు హత్యాప్రయత్నం జరిపిన పిమ్మట తన తల్లికి కురువంశంలో రానున్న పెను దుష్పరిణామాలు సూచించి వాటిని ఆమె తట్టుకోవడం కష్టమని తపోవనానికి వెళ్ళి ప్రశాంత జీవితం గడపమని సూచించి తిరిగి తనదారిన తాను వెళతాడు. ఆ తరువాత లక్క ఇంటి దహనం తరువాత హిడింబాసురుని మరనానంతరం హిడింబి భవిష్య సూచనపై శాలిహోత్రుడు నివశించిన ఆశ్రమప్రాంతంలో పాడవులు నివసించే సమయంలో వ్యాసుడు పాండవుల చెంతకు వచ్చి వారికి ఊరట కలిగించాడు. ఆ ఆశ్రమ మహత్యం చెప్పి అక్కడ సరస్సులో జలము త్రాగిన వారికి ఆకలి దప్పులు ఉండవని, అక్కడి వృక్షముకింద నివసించే వారికి శైత్య, వాత, వర్ష, ఆతప భయములుండవని సలహా అందించాడు. భీముని వివాహమాడ కోరిన హిడింబను కోడలిగా చేసుకోవడానికి సంశయిస్తున్న కుంతీదేవికి హిడింబ పతివ్రత అని ఆమెను కోడలిగా చేసుకోవడం శుభప్రథమని ఆమె సంతానం ద్వారా పాండవులకు సహాయమందగలరచి సూచించి తనదారిని తాను వెళతాడు. ఆ తరువాత కాలంలో ద్రౌపతీ స్వయంవరానికి ముందుగా పాందవులకు దర్శనమిచ్చి వారికి ద్రౌపతి పూర్వజన్మ వృత్తాంతం వివరించి స్వయంవరానికి వెళ్ళమని వారికి శుభంకలుగుతందని చెప్పి ద్రౌపతీ వివాహం తీరు ముందుగానే సూచించి అంతర్ధాన మయ్యాడు.
Share it

నెమలి : నెమలి గురుంచి కొంచం తెలుసుకుందాము...

నెమలి : నెమలి గురుంచి కొంచం తెలుసుకుందాము
పురి విప్పి నాట్యం చేసేది మగ నెమలి ,ఆడ నెమలి మగ నెమలి వెంట తిరుగుతుంది అడుగులేస్తూ ,అది కూడా ఎందుకు తిరుగుతుంది అంటే నెమలికి ప్రత్యుత్పత్తి భౌతికమైన సంభోగము వలన లేదు. అది చాలా సంతోషము కలుగుతుంది ఎప్పుడు అంటే వర్షాకాలం వచ్చేముందు చీకటి ఐపోతుంది ,అకస్మాత్తుగా మబ్బేసేస్తుంది ,ఇక వర్షం పడుతుంది అనగా గాలి మొదలైనపుడు పర్వత ప్రాంతాల్లోను ,అరణ్యల్లోను ఆ మగ నెమలి నాట్యం చేయడం మొదలు పెడుతుంది . ఆ మగ నెమలి నాట్యం చేసి మొట్ట మొదట వడగళ్ళు అని పెద్ద చినుకు టప్ టప్ మని పడటం మొదలవుతుంది . అది నాట్యం చేసి చేసి చేసి సంతోషం తో ఒక ఆనందభాష్పాన్ని వదులుతుంది కంటి వెంట నీటి చుక్క అది నేల పడకుండా ఆడ నెమలి పట్టుకుంటుంది . పట్టుకుని మింగి గర్భం ధరిస్తుంది . అందుకని దానికి భౌతిక సంపర్కం లేదు . అందుకే కృష్ణ పరమాత్మ నెమలి ఈక కిరీటం మీద పెట్టుకుంటారు . పదహారు వేల మంది ఉన్నారు అని నాకదే పని అనుకుంటున్నారేమో ఇంక భార్యలతో తిరగడం అసలు నేను నిత్య బ్రహ్మచారిని తప్ప నాకసలు భార్య సంపర్కమే లేదు అని చెప్పడానికి ఒక నెమలి ఈక ఒకటి పెట్టుకుంటారు ఆయన . నెమలి సృష్టిలో ఒక అపురూపమైన ప్రాణి మనకి భారతదేశం లో జాతీయ పక్షి . తనంత తాను స్వేచ్ఛగా ఆడే నెమలి ఆటను చూడాలి ,మనము ఎలా చూస్తాము అంటే నెమలి కనపడితే ఏ పుల్లలతోనో ఈకలు నొక్కేసి లాగేద్దామని తాపత్రయం . అసలు నెమల్ల అందాలు చూడాలంటే ఢిల్లీ ప్రాంతాల్లో చూడాలి వాళ్ళు అలా పట్టుకోరు . కాకులు ఎలా ఉంటాయో ,నెమల్లు అలా ఉంటాయి ఆ ప్రాంతములో అన్ని నెమల్లు తెల్లవారి లేచేటప్పటికి మేడల మీద నెమల్ల క్రేన్కనాలు వినబడుతూ ఉంటాయి , సాయంకాల వేల దానికేదో సంతోషం వస్తుంది . మీరు ఎప్పుడైనా నెమల్లు పురి విప్పి తిరగడం చూసారా , పురి విప్పడం అంటే కేవలం ఏదో అలా విప్పుతుంది అనుకోకండి ,అది అడుగులు వేసి నాట్యం చేసేటప్పుడు మీరు చూడాలి దాన్ని వెనక్కి నొక్కి మద్యలో చుట్టూ వృత్తం లాగా ఏర్పాటు చేస్తుంది ,ఒకోసారి ఒంచి పెద్దా విసినికర్రలా పెట్టి నాట్యం చేస్తుంది . అది సంతోషం కలిగినప్పుడు ఆ వెనకాల ఉండేటటువంటి పించాన్ని ఆదారం చేసుకుని అది ఆడేటటువంటి తీరు అత్యద్భుతముగా ఉంటుంది . నెమలికి ఇంద్రుడు ఇచ్చినటువంటి వరం పాము వలన దానికి భయం ఉండదు ,పాము ని నువ్వు చంపేస్తావ్ అని వరం ఇచ్చాడు ఇంద్రుడు.

కుచేలోపాక్యనం: భాగవతములో శ్రీ కృష్ణుని దర్శనాన్ని.

కుచేలోపాక్యనం:
భాగవతములో శ్రీ కృష్ణుని దర్శనాన్ని అపెక్షించనటువంటి వారు ఎవరు ఉండరు . పరిపూర్నావతారం కృష్ణావతారం ,అటువంటి కృష్ణుని యొక్క పాదములు పట్టుకొన్నవాళ్ళు కృష్ణనుగ్రహాన్ని కోరుకున్నవాల్లే తప్ప కృష్ణుడే వచ్చి ఒక పేద బ్రాహ్మణుడి యొక్క పాదాలు పట్టుకుని ఆ పాదాలు కడిగి ఆయనికి నమస్కరించి ఆ పాదాలు కడిగిన నీళ్ళు తాను తలమీద చల్లుకుని తన పట్టమహిషి రుక్మిణి దేవి యొక్క తల మీద చల్లడం అసాదరమైనటువంటి ఘట్టం ,ప్రమాణ వాక్కు అని లోకములో ఒకటి ఉంటుంది అంటే ఏది పట్టుకుంటే తరిస్తామో అటువంటి ప్రమాణాన్ని నిర్ణయం చేస్తారు . వేదాన్ని విభాగము చేసి 18 పురాణములను ,మహాభారతాన్ని ,బ్రహ్మాసూత్రాలని ఇచ్చిన మహాపురుషుడు వేద వ్యాసుడు . అందుకే వేద వ్యాసుడు చెప్పిన మాటలు మాత్రమే చెప్పడానికి ఇష్టపడతారు గురువులందరు ఎందుకంటే అవి అటువంటి పరమ పవిత్రమైనటువంటి గంగా నది వంటివి తప్ప ,అసలు వ్యాసుడు చెప్పిన మాటలు ఎవరికీ చెప్పవలిసిన అవసరము ఎవరికీ ఉండదు . వ్యాసుడు చెప్పినదే చెప్తుంటారు కారణం ఏమిటంటే వ్యాసుడు అంత గొప్పగా మహాసముద్రాలంత వాంగ్మయం ఇచ్చేసాడు . అటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు రచించిన భాగవతాన్ని ఆంధ్రీకరించిన పోతన గారు కుచేలుడు ఎంత గొప్పవాడో చెప్పారు ,కుచేలుడు గొప్ప బ్రాహ్మణుడు, సిగ్గు విడిచిపెట్టి అందరి దగ్గరికి వెళ్లి చెయ్యిచాపి నాకు సహాయం చెయ్యండి అని అయన జీవితములో లేదు ,ఆయనకి రాగ ద్వేషాలు లేవు ధర్మమే ఆయన ,ఆయనే ధర్మం ,ధర్మవస్తలుడు ,చాలా గొప్పవాడు ,ఇంద్రియములును గెలిచాడు ,సామాన్యమైన విషయము కాదు ,బ్రహ్మవేత్త ,దారిద్రియం ఆయన్ని బాధించింది కానీ ఆయనికి దారిద్రియం యొక్క స్పృహ లేదు అంటే మనకనిపిస్తుంది కుచేలుడు దరిద్రుడని కానీ ఆయనికి మాత్రం దరిద్రము ఉన్నదన్న విషయం అసలు జ్ఞాపకములో ఉండదు ,ఎందుకుండదు ,ఎప్పుడు పరబ్రహ్మ్మములో రమిస్తూ ఆనందపడిపోతాడు . అటువంటి బ్రహ్మవేత్త ,బ్రహ్మజ్ఞాని కుచేలుడు . అంతటి బ్రహ్మ్మజ్ఞాని అయినటువంటి కుచేలుడికి ఒక రూపాయి దొరికితే అదే పదివేల రూపాయిలు అనుకుంటాడు ,నాకిది లేదన్న భావన లేదు ,ఈశ్వరుడు ఏమివ్వలేదు అంటాడు , అంత సంతోషముతో ఉంటాడు ,ఒక బ్రాహ్మణుని కి ఉండవలిసిన మొట్ట మొదటి లక్షణం ,పరమ సంతోషముతో ఉండాలి నాకేమ్లేదు ,ఈశ్వరుడు నాకేమివ్వలేదన్న ఆనందుముగా ఉండాలి అది ఉన్నటువంటి వాడు కుచేలుడు . అసలు అయన పేరేమిటి షుబాముడు అని ప్రతీతి . కుచేలుడు అనే పేరెందుకు వచ్చింది అంటే చేలము అంటే బట్ట కుచేలము అంటే చిరిగిపోయినటువంటి బట్ట ,చిరిగిపోయిన బట్ట కట్టకూడదు ,వేదములో నియమము ఉంది ,కాలిన బట్ట గాని ,చిరిగిపోయిన బట్ట గాని కట్టుకుని ఉండకూడదు అలక్షణం ,మరి కుచేలుడు ఎందుకు కట్టుకుంటాడు అది ఆయన చిరిగిపోయిన బట్ట అన్న విషయము ఆయనకి జ్ఞాపకము ఉండదు అసలు ఆయన బట్ట చూస్తాడు అబ్బా పీతాంబరము అని కట్టుకుంటాడు ,ఇది చిరిగిపోయింది రా అన్న భావన ఆయనికి ఉండదు . బ్రహ్మ వేత్తలని అర్దము చేసుకోవడం అంత తేలిక కాదు . రమణ మహర్షి గోచి అంతా కన్నాలు పడిపోయాయి ,అప్పుడప్పుడు ఆ గోచి తడిపి ఆరేసేవారు ,తువాలు అలానే ఉండేది ఆయనికి అన్ని కన్నాలే ఒకసారి కొంతమంది అయిశ్వర్యవంతులు ,అంతేవాసులు చూసి అన్నారు అయ్యో అయ్యో అయ్యో ఇన్ని కన్నాల అందులో దారపుపోగులు కన్నా కన్నాలే ఉన్నాయి చెప్తే రెండు తువాళ్ళు తేమండి అన్నారు . అయన అన్నారు కన్నాల ఇంద్రుడు నా గోచి సహస్రాక్షుడు ,తృప్తి ఉన్నవాడికి దరిద్రము ఏమిటి ,అయన గోచి చిరిగిపొతే గిరి ప్రదక్షిణం చేస్తూ ఆయనకేమి శరీర బ్రాంతి లేదు , చుట్టూ ఉండేవాళ్ళు అనేవారు భగవాన్ మీకు శరీర స్పృహ లేదు కానీ లోకము ఉందిగా ఒక గోచి పెట్టుకోండి అన్నారు అంటే పెట్టుకునేవారయిన ,అది చిరిగిపోతే నా గోచి చిరిగి పోయింది ఒక తువాలు పట్రండి అని అనలేదు ,ఆ రక్కసి పొదల్లోకి వెళ్లి ఒక రక్కసి ముళ్ళు తెంపి ఆ ముళ్ళు తోటే ఇంకొక ముల్లుకి కన్నం పెట్టి గోచి ఊడదీసి అందులో దారాలు తీసి దారము రక్కస ముళ్ళు సూదిలోకి ఎక్కించి చిరిగి పోయిన చోట కుట్టేసుకుని గోచి పెట్టుకుని ప్రదక్షిణ చేసేవారు ,ఇది లేదన్న మాట బ్రహ్మ వేత్తకు ఉండదు అందుకే అటువంటి వారి పేరు స్మరిస్తే పుణ్యం ,అటువంటి వారు పేరు తలవడం అంటే మాటలండీ ,అటువంటి వారిని తలుచుకుంటే చాలు పుణ్యం వచ్చేస్తుంది ,కుచేలుడు అంటే శరీర బ్రాంతి లేనివాడు . కుచేలుడి భార్య ఆవిడ అంతకన్నా గొప్ప ఇల్లాలు ,ఆవిడ చెప్పిన మాట భాగవతం లో అమృత బాండం . భగవంతుడు అంటే ఎంత కారుణ్య మూర్తి అండి ,అసలు ఎప్పుడు తలచుకోనివాడు కూడా కష్టం వచ్చినపుడు తలచుకుంటే రక్షిస్తాడే ,పిల్లలికి అన్నం లేదు ఒక సారి మీ స్నేహితున్ని అడగండి , వెళతాను గాని స్నేహితుని దగ్గరకు వెళ్ళేటపుడు ఎమన్నా పట్టికేల్లాలి ఎమన్నా ఉందా అన్నాడు ,అప్పుడు అడిగాడు ఎమన్నా ఉందా ఇంట్లో అని ,అప్పటి వరకు నే తినాలి ఎమన్నా ఉందా అని ఆయన జీవితములో అడగలేదు ,అటుకులు మూట కట్టింది ఆ ఉత్తరీయానికి ,పిచ్చి బ్రాహ్మణుడు ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళాడు ద్వారకా నగరానికి ఎందుకు కృష్ణ దర్శనం అవుతుంది అది ఆయన సంతోషం ,తీరా ద్వారకా నగరానికి వెళ్ళాక గుర్తు వచ్చింది ,నేను ఇలా ఉన్నాను కదా ,నన్ను పంపిస్తార కృష్ణునికి స్నేహితున్ని అంటే నమ్ముతార అని ,ఎలాగోలా వెళ్తున్నాడు , ఉత్తరీయం లేదు ఆయనికి ఓ ముక్క వేసుకున్నాడు ఎందుకని ,ఉత్తరీయం లేకుండా ఉండకూడదు కాబట్టి ,పెద్దలు దగ్గరికి వెళ్ళేటపుడు ఎడం బుజం మీద ఉత్తరీయం లేకుండా ఉండకూడదు ,అందుకేసుకున్నాడు ఓ గుడ్డముక్క దానికి అటుకుల మూట కట్టుకున్నాడు ,ఏమి తిన్నాడు ,ఎప్పుడు తిన్నాడు ,ఏమి తాగాడు ,శరీరానికి బడలిక ఉండదా ?సంతోషంలో మరిచిపోయడాయన ,ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాడు ,మిగిలిన వాళ్ళందరూ ,అందరూ నవ్వుతున్నారు ,పీనుగు నడిచి వెళితే ఎలా ఉంటుందో అలా ఉన్నాడురా , ఉరఃపంజరం అంత కనపడుతుంది ,ఎముకలన్నీ కనపడుతున్నాయి ,దవడలన్ని పోడుచుకోచ్చేసాయి ,పైన శరీరం కుచేలము ,లోపల ఉన్నవాడు బ్రహ్మవేత్త ,బ్రహ్మజ్ఞాని ఉన్నాడు లోపల ,మహానుభావుడు ఉన్నాడు ,పరమేశ్వరుడు పాదాక్రాన్తుడు అవుతాడు ఆయనికి ,ఆయన వస్తుంటే కృష్ణుడు కూర్చున్నాడు ,రుక్మిణి దేవితో కలిసి ఉన్నాడు తల్పం మీద ,కూర్చిలో కూర్చోలేదు ,హంస తూలికా తల్పం మీద నుంచి దూకేసాడు ,పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకున్నాడు ,ఒరేయ్ ఎపుదోచావ్ రా ,ఎన్నాలైన్దోయ్ ,ఎక్కడ కూర్చోపెత్తారో అని రాసారో తెలుసా పోతన గారు ,కూర్చీలో కూర్చో పెట్టలే ,తాను రుక్మిణి దేవితో కలిసి శయనించేటటువంటి ,కూర్చునేటటువంటి హంసతూలికా తల్పం మీద కూర్చోబెట్టారు ,చూసి చెలికత్తెలు అన్నారు ,ఉన్నవాళ్లు , మేము ఋషులు దర్శనం చేస్తే చూసాం కృష్ణున్ని ,మహర్షులు ,మునులు ఈయనతో సరిపోతారా ,అరెరె కృష్ణుడు ఎదురు వచ్చి తీసుకెళ్లాడయ ,రుక్మిణి దేవితో కలిసి కూర్చునే తల్పం మీద కూర్చోబెట్టాడు ,రుక్మిణి చూస్తావే వెళ్లి పట్రా బంగారు చెంబు పళ్ళెం అన్నాడు ,పళ్ళెం కాళ్ళ కింద పెట్టి పొయ్ నీళ్ళు అన్నాడు ,ఎవరికి చేసాడు భాగవతం లో ఇలా ,కూర్చోపెట్టి సాక్షాత్తు ఆది లక్ష్మీ ,ఆవిడ తీగంటి చూపు పడితే చాలు మహాదైస్వర్యం అందుతుంది ,ఆవిడ విష్ణు పాదములు కడగడం కాదు ,కుచేలుడు పాదాలు కృష్ణుడు కడుగుతుంటే నీళ్ళు పోసింది ,ఆవిడ పోస్తుంటే కృష్ణుడు కింద కూర్చుని కడిగాడు ఆయన పాదాలు ,ఏదో అలవోకగా కదగలె స్నేహితుడు అని ,పరమ భక్తితో కడిగాడు ,ఎందుకో తెలుసా నీవంటి బ్రహ్మవేత్త లేడు ,ఆయన కాళ్ళు కడిగి తలమీద జల్లుకున్నాడు ,రా రుక్మిణి దేవికి జల్లాడు ,అంతఃపుర పరివారానికి జల్లాడు ,చందనం తీసి పట్టుకొచ్చి ,అయన వొళ్ళంతా చందనం రాసాడు ,ఎంత అలసిపోయవో ,నీకు తెలియదు ,నీకు భార్య ,బిడ్డలు ,భూములు ,ధనం ఏమి అవసరం లేదు,ఎప్పడు సంతోషం లో ఉంటావు ,కుచేల ఎక్కడుంటాడు నీలాంటి వాడు అని ,ఆయన శ్రమ పోయేటట్టు తనే విసిరి కర్ర పట్టుకుని ,తాటాకు విసినికర్రతో విసిరాడు ,ఆయనికి దూపం తీసుకుని వచ్చి చూపించాడు ,సువాసన పీల్చవోయి ,దీపాలతో హారతులు ఇచ్చాడు ,ఎవరు ఎవరికీ పరిపూర్నావతారం అయిన కృష్ణ భగవానుడు ,అంతటి బ్రహ్మ వేత్త అయినటువంటి కుచేలుడికి కాళ్ళు కడిగి తల మీద చల్లుకున్నాడు అంటే మీరొకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి ,ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత పరమేశ్వరుడు కూడా పరవశం అయిపోతాడో ,కుచేల ,మీ స్నేహితుడు కుచేలుడికి ఒక నమస్కారం అన్నారు అనుకోండి పొంగిపోతాడు ,అంతటి బ్రహ్మవేత్త . కుచేలుడి గొప్పతనం ఎక్కడుంది అంటే ఆయన తీసుకువచ్చిన అటుకులు పెట్టడానికి సిగ్గుపడ్డాడు ,ఇద్దరు కలిసి చదువుకున్నారు కదూ ,ఏవోయ్ నీకు మన గురువు గారు గుర్తు ఉన్నారా శందీపని మహర్షి అని గురువు గారిని పొగిడాడు ,స్నేహితుడివి నాకేదో తేకుండా ఉండవు ,ఏదో తెచ్చావ్ అని వొళ్ళంతా తడిమేసి ఆ ఉత్తరీయానికి కట్టుకున్న అటుకులు ,గట్టిగా లాగితే చిరిగి పోతుంది బట్ట అవి తీసుకుని గుటుక్కున నోటిలో పోసుకుని పర పర పర నమిలి మింగుతున్నాడు ,ఎవరు లక్ష్మీనాధుడు ,ఇంకొక పిడికిడి తీసాడు ,భాగవతం మొత్తం మీద ఇలా లేదు ,రుక్మిణి దేవి ఆదిలక్ష్మి వచ్చి కృష్ణుని చేయి పట్టుకుంది ఎందుకని ,,లక్ష్మీ దేవి పట్టేసుకుంది చేయి ఇంక తినొద్దు అని ,ఇలా అన్నాడు కృష్ణుడు ఏ ,ఒక్క పిడికిడి తింటే మీరేమిచ్చేసారో నాకు తెలుసు ,ఇంకొక్క పిడికిడి తింటే ఆ భక్తుడికి నన్ను ,నిన్ను కలిపిచ్చేస్తారు ,ఆయన అడిగాడ ఐశ్వర్యం కావాలని ,అడగలే ,చాలా విచిత్రం తెలుసా కుచేలోపాక్యనము లో అంతా అయిపొయింది భోజనం పెట్టేసాడు ,మర్నాడు సాగనంపెసాడు ,వెళ్ళిపోతున్నాడు కుచేలుడు ,అయ్యా దరిద్రం లో ఉన్నాను ఒక్క రూపాయి ఇప్పించండి అని అనలేదు కుచేలుడు ,వెళ్ళిపోతున్నాడు ,ఆ కృష్ణుడు ఎందుకివ్వలేదో నాకర్ధమైంది ,ఈ దరిద్రం లో ఉంటె హాయిగా సంతోషముగా నేను భగవంతుడిని స్మరించొచ్చు ,రేపోద్దిట బోలెడంత డబ్బు వచ్చి పడిపోతే అదంతా రాసుకుంటూ కూర్చుంటే ఈశ్వరుడు ని మరిచిపోతానని ఇవ్వకుండా నన్ను రక్షించాడు ,కృష్ణా నీకో నమస్కారమయ ,పెద్ద భవనం కనపడింది ఎవరో ఒకావిడ ఆబరనాలన్నీ పెట్టుకుని వచ్చి దాన్నం పెట్టింది అమ్మా అమ్మా ఎవరమ్మ నీవు అన్నాడు ,మీ అవిడనండి అంది ,అయ్యో ఎక్కడిదే ఈ ఐశ్వర్యం అన్నాడు ,ఇదిగో ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి పాక అంతఃపురం అయిపొయింది అంది ,అప్పుడే అటుకులు తిన్నాడు ,కుచేలోపాక్యనం మీరు చదవండి ,కుచేలోపాక్యనానికి చిట్ట చివర ఒక మాట చెప్తారు ,అన్ని అంతఃపురాలలో ఉన్న కుచేలుడికి ఐశ్వర్య భావం లేదు ,ఎప్పడు బ్రహ్మ్మముతో రమించి ,బ్రహ్మ్మము నందు ఐక్యం అయిపోయాడు ,కుచేలోపాక్యనం ఒక్క దానికే పల శృతి కూడా చెప్తారు ,గజేంద్ర మోక్షానం వాటికి చెప్పినట్టు ,కుచేలోపాక్యనానికి పల శృతి ఉంది ,అది చదివితే ,అది వింటే భగవంతుని యొక్క విశేషనమైనటువంటి అనుగ్రహం చేత దీర్గాయువు ,కీర్తి ,సంపద కలుగుతాయి ,అంత గొప్పది కుచేలోపాక్యనం ,ఒక బ్రాహ్మణుడు ఇంత దరిద్రములో ఉండి కూడా ,దరిద్రంతో సంబంధం లేకుండా ,ఆయన్ని భాదిన్చిది ,శరీరాన్ని భాదిన్చకపోలేదు కానసలు ఆయనికి ఆ భాద యొక్క స్పృహ తెలీదు ,మత్తు ఇచ్చి శరీరాన్ని కోస్తారు ,శరీరాన్ని కోయడం తెలుస్తుందా ,తెలీదు ,అలా ఆయనికి భగవంతుని యొక్క అనుబవానన్దమునన్దు భాహ్యము నందు ఉన్న దారిద్ర్యం తెలియనేలేదు అంతటి బ్రహ్మవేత్త ,అంతటి మహానుభావుడు కుచేలుడు అంటే అందుకే అంతటి పరమ భాగవతోత్తముడు వచ్చినపుడు మీకేంకావాలి అని అడగలేదు ,అంతటి పరిపూర్నవతారమే మహర్షులకి కూడా చెయ్యనటువంటి పూజ కుచేలుడికి చేసాడు అంటే అయన అంతటి బ్రహ్మ్మవేత్త ,అంతటి జితేంద్రియుడు ,అంతటి భక్తి తత్పరుడు ,ఎంతటి జ్ఞాని మనకర్దమవుతున్ది అటువంటి కుచేలోపాక్యనాన్ని ఇంట్లో పెద్దవాళ్లందరూ కూడా పిల్లలకి చెప్పాలి ,అందరు పోతనగారి భాగవతము లోనుంచి చదువుకోవాలి ,కుచేలోపాక్యనం భాగవతం దశమ స్కందం ఉత్తర భాగం లో ఉంది ,ఉత్తర భాగములో ఉన్నటువంటి కుచేలోపాక్యనాన్ని యదతదముగా చదువుకోవాలి ,ప్రతిరోజూ కుచేలోపాక్యనాన్ని చదువుకుని కుచేలుడి యొక్క గొప్పతనానికి పరవసించిపోతే అదే భగవంతుని యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది ,కుచేలుడు ఏవేవో కారణానికి దరిద్రుడు భాగవతములో లేదు ,కుచేలుడు బ్రహ్మవేత్త ,లేనితనమే తెలీకుండా పోలేదు ,ఉన్నతనం కూడా ఆయనకు తెలిదు . ఇది బ్రహ్మవేత్త అంటే ,ఐశ్వర్యం వచ్చిన తర్వాత స్పృహ ఉందేమిటి ,అదీలేదు .లెకపొతె స్పృహ ఉందేమిటి అది లేదు . రెండిటి లోను స్పృహ లేదు ,ఉన్న స్పృహ ఈశ్వర స్పృహ ఒక్కటే అటువంటి బ్రహ్మజ్ఞాని ,అంతటి మహానుబావుడు ,అటువంటి కుచేలుడికి ప్రతిరోజూ ఒక నమస్కారం చెయ్యాలి ,కృష్ణ భగవానుడు అంతటివాడు చేత పూజలందుకున్నాడు ,అటువంటి కుచేలోపాక్యనాన్ని స్మరించడం ,ఆయనికి నమస్కారం చెయ్యడం ,కృష్ణ భగవానుడి దగ్గర ,గురువుల దగ్గర కుచేలోపక్యనాన్ని ఒక్కసారి చెప్పుకుంటే చాలు పరవసించిపోతారు అందుకని కుచేలుడు పూజలందుకుంటున్నాడు
విశ్వాన్ని సృష్టించింది విశ్వకర్మ. శ్లో నభూమి నజలం చైవ నతేజో నచ వాయవః నచబ్రహ్మ నచవిష్ణు నచనక్షత్ర తారకః సర్వశూన్య నిరాంబం స్వయంభూ విశ్వకర్మణః

తా భూమి – జలము – అగ్ని – వాయువు – ఆకాశము, బ్రహ్మ – విష్ణు – మహేశ్వర – ఇంద్ర –సూర్య – నక్షత్రంబులు లేని వేళ విశ్వకర్మ స్వయంభు రూపమైయుండెను.భూమి నీరు అగ్ని గాలి బ్రహ్మ విష్ణు రుద్రుడు నక్షత్రా లేమియు లేనపుడు విశ్వకర్మ భగవానుడు తనంత తాను సంకల్ప ప్రభావంచేత నవతరించాడు. ఆ స్వయంభూ విశ్వకర్మ పరమేశ్వరునకే విశ్వాత్ముడు, విశ్వేశ్వరుజు, సహస్ర శిర్షుడు! సగుణ బ్రహ్మం, అంగుష్ట మాతృడు, జగద్రక్షకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మొదలైన అనంతనామనులు – అనంతరూపములు కలిగినై. “ప్రజాపతి విశ్వకర్మ మనః “అని కృష్ణ యజుర్వేదమున విశ్వకర్మయే ప్రజాపతియైన బ్రహ్మయనియు చెప్పబడినది. ఆయనకు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానము లనెడి నైదు ముఖలు. శ్లో పూర్వావనా త్సానగః దక్షణా త్సనాతనః అపరా దహభూవః ఉద్వీచ్యాం ఉర్ధవాత్సుపర్ణః తా తూర్పు ముఖమునందు సానగ ఋషి, దక్షిణ ముఖము నందు సనాతన ఋషి, పశ్చిమ ముఖము నందు అహభూన ఋషి, ఉత్తర ముఖము నందు బ్రత్న ఋషి, ఊర్ధ్వముఖము నందు సుపర్ణ ఋషులుద్బవించిరి.విశ్వకర్మ పరాత్పరుని యొక్క తూర్పు ముఖమైన సద్యోజాతము నందు సానగబ్రహ్మర్షి మకుబ్రహ్మయు, దక్షిణముఖమైన వసుదేవము నందు సనాతన మహర్షి యను మయబ్రహ్మయు, పశ్చిమముఖమైన అఘేరియునందు అహభూవ మహర్షి యను త్వష్టబ్రహ్మయు, ఉత్తరముఖమైన తత్పురుషము నందు ప్రత్న మహర్షి యను శిల్పి బ్రహ్మయు, ఊర్ధ్వముఖమైన ఈశానము నందు సువర్ణ మహర్షియను విశ్వజ్ఞబ్రహ్మయు ప్రభవించినట్లు చెప్పబడినై. ఋక్ వేదం లోని పదవ మండలం 81,82 సూక్తాలు విశ్వకర్మ యొక్క సృష్టి నిర్మాణ క్రమాన్నివివరిస్తాయి. అందరికీ సుపరిచితమైన పురుష సూక్తం కూడా విశ్వకర్మను విరాట్ పురుషునిగా వర్ణించింది. విశ్వకర్మకు పర్యాయ పదంగా త్వష్ట ను గుర్తిస్తారు.

విశ్వకర్మ పూజ:

విశ్వకర్మ పూజ ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17న జరుపుకుంటారు. ఇవి ముఖ్యంగా కర్మాగారాలు మరియు పారిశ్రామిక ప్రాంతాలలో తప్పకుండా జరుపుతారు. వారి పనిముట్లను విశ్వకర్మ ముందుంచి పూజిస్తారు.

విశ్వకర్మ నిర్మాణాలు:

విశ్వకర్మ పురాణాల ప్రకారం ఎన్నో పట్టణాలను నాలుగు యుగాలలో నిర్మించాడు. సత్యయుగంలో దేవతల నివాసం కోసం స్వర్గలోకం నిర్మించాడు. త్రేతాయుగంలో సువర్ణ లంకను శివుని కోసం నిర్మించాడు. ద్వాపర యుగంలో ద్వారక నగరాన్ని మరియు కలియుగంలో హస్తినాపురం మరియు ఇంద్రప్రస్థం నిర్మించాడు.

ఆత్మ కథ ,జీవిత చరిత్ర భేదం రమణ మహర్షికి ఎలా నమస్కారము పెడతామో..

ఆత్మ కథ ,జీవిత చరిత్ర భేదం :
ఆత్మకథ అంటే తనకు తానుగా రాసుకున్నది ,అది ఎందుకు రాసుకుంటారు అంటే తనని తాను పొగుడుకోడానికి రాసుకోరు ,తన జీవితములో ఉద్దాన పతనాలని ,జీవితములో వచ్చిన తప్పులని ,తన కష్టాలని ,తన యొక్క బలాన్ని ,తన బలహీనతని ,తను సాదించినదానిని ,తాను విపలమైనదానిని అన్ని చెప్తారు ,నిష్పాక్షికముగా చెప్తారు . గాంధీ గారి జీవిత చరిత్ర ఉంటుంది ,గాంధీ గారి జీవిత చరిత్రలో వారు చిన్న తనములో చేసినటువంటి దొంగతనం చెప్తారు ,ఆయన చేతి దస్తూరి బావుండదు ,నా దస్తూరి బాగుండదు అని చెప్తారు ,ఆయనికి చిన్నపుడు ఆటలు ఆడలేదు ,ఆయన ఆటలు ఆడకపోవడము వలన శరీరం దారుడ్యం ఎందుకు కలగలేదో చెప్తారు ,ఆయన ఒకప్పుడు పెద్ద ఉద్యమము చేస్తే , 1920 లో సహాయ నిరాకరనోద్యమము జరుగుతుండగా భారత దేశానికి స్వాతంత్ర్యం రావాల్సింది ,చౌరీ చౌర అన్న చోట ఒక ఆంగ్లేయ సిఫాయి ని పట్టుకుని సజీవదహనం చేసారు ,ఉద్యమం లోకి హింస ప్రవేశించింది కాబట్టి ,అహింస నా ఉద్యమానికి ప్రాణం కాబట్టి ఈ ఉద్యమం జరగడానికి వీలులేదని ఆపేసారు ,దానివలన సిద్దాంతం పట్ల గాంధీ గారికి ఎంత విశ్వాసం ఉంటుందో అర్ధమవుతుంది ,అది చివరికి చనిపోయేముందు కూడా తుపాకీ గుండు తగులుతున్నా కూడా "హే రామ్" అంటూ పడిపోయారు అంటే ఆయన ఎంతటి మహితాత్ముడో అర్ధమవుతుంది .ఆయన జీవితములో ఉద్దానపతనాలని చూసినపుడు ఆయన ఏ విషయాలు నేను చిన్నతనము లో చేసానని బాధపడానని చెప్పారో అవి మనము చెయ్యకూడదు అని అర్ధం . ఏ బలం ఆయన్ను నిలబెట్టిందో అది చదివిననాడు ఆ బలం సంతరించుకోవాలన్న ఆలోచన కలుగుతుంది . తాన జీవితాన్ని పుస్తకముగా తెరచిపెట్టి పదిమంది దాంట్లోంచి వచ్చే ఉత్స్తహాన్ని పుంజుకుని ఉన్నతమైన పధం లో నడవాలన్న కోర్కెతో మహాత్ములైన వారు జీవిత చరిత్రలు వ్రాస్తారు . అందుకే అటువంటి జీవిత చరిత్రలు తప్పకుండా చదవాలి . ఇక రెండవ విషయం మహత్ములయొక్క జీవితాలను చరిత్రలుగా రాయడం ,ఇది వారు ఉన్నపుడు రాసేటటువంటి విదానం ఒకటి . వారు శరీరం విడిచిపెట్టిన తర్వాత రాసే విధానం ఒకటి . ఈ మధ్య కాలములో pvrk ప్రసాద్ గారు గొప్ప సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ,ఒకప్పుడు ప్రధానమంత్రి కార్యాలయములో పనిచేసారు ,ఆయనో పుస్తకం రాసారు ,అప్పుడు ఏమైంది అని అది ఆ పుస్తకం పేరు . భారతదేశం అంతటిని కుదిపేసినటువంటి ఒక సందర్బములో అప్పుడు ప్రధానమంత్రి గా ఉన్నటువంటి pv నరసింహారావు గారు ఏమ్చేసారు అన్నది ఆయన దగ్గర కార్యదర్శిగా ఉన్న pvrk ప్రసాద్ గారికి తెలుసు ,అందుకే ఒక మహాద్భుతమైన పుస్తకాన్ని రాసారు "అప్పుడు ఏమైందంటే" అని ,అది చరిత్ర . జరిగిపోయిన దానిని రాసారు . ఒక్కొక్కచో వారు ఉండగానే రాస్తారు . వారు ఉండగానే ఎందుకు రాస్తారు అంటే ఆయన అంతటి మహితాత్ముడు దానికిక ఎప్పుడో అయన జీవితం పరిసమాత్మము అయిన తర్వాత బయటకి రావడం కాదు ,వెంటనే వచ్చేయాలి అంతే ,ఒక్కొక్కసారి ఏదో ఒక వయసులో చేయవలసిన ఉపనయనాన్ని చాలా ముందే చేసేస్తారు ,ఎందుకు చేసేస్తారు అంటే ఆ పుట్టిన పిల్లవాడు ఏక సంతాగ్రహి అనుకోండి అన్నేళ్ళు వచ్చే వరకు ఆపకూడదు , శాస్త్రం చదువకోవడానికి ,వేదం చదువుకోవడానికి తొందరగా ఉపనయనం చేసేస్తారు . అలా అటువంటి మహానుభావుడు అయితే ఆయన జీవించి ఉండగానే , ఆయన జీవితానికి సంబదించిన విశేషాలు ,ఆయన చెప్పినవి రెండు కలిపి పుస్తకముగా ఇస్తారు ,ఇది ఏ మహాత్ముడు గురుంచి చెప్పారో ఆయనతో పాటుగా అలా చెప్పిన వారికీ కూడా మనదరం ఋణపడి ఉంటాం ఏ కారణం చేత అంటారేమో ఆ మహాత్ముడు ఎవరు ఉంటారో ఆయనకి అసలు అది గ్రంధస్తం అవ్వాలని కోరిక ఉంటుందా ,ఉండదా అంటే చెప్పలేం ,కష్టం . ఒక ఉదాహరణ చెప్పాలంటే కామకోటి కంచి మఠానికి ఎందరో జగద్గురువులు వచ్చారు ,సామాన్యులు కారు ,ఒక్కొక్క జగద్గురు ఎటువంటి స్థానాలకి వెల్లిపోయారంటే ,చంద్రషేకరేంద్ర సరస్వతి అన్న పేరుతొ ఇంకో ఆయన కూడా ఉండేవారు ,ఒకసారి ఆయన దగ్గరికి ప్రతివాదులు వచ్చి వాదించడానికి కూర్చున్నారు , మొదలు పెట్టండి అన్నారు ఆయన , వాళ్ళు ఏదో మొదలు పెట్టబోయి , వారికి స్పురణ తట్టలేదు . వాళ్ళన్నారు మీ వల్లో ఒక పసిపిల్ల ఆడుకుంటుంది , ఆ పిల్ల ఆడుతుంటే ,నవ్వుతుంటే మాకు జ్ఞాపకం రావట్లే ,ఆ పిల్లను దింపెయండి మాట్లాడతాం అన్నారు , ఆయన అన్నారు నేను సన్యాసిని నా వల్లో పిల్ల ఎందుకు ఆడుకుంటుంది ,నా వల్లో పిల్ల లేదు ,మీరు ఉంది అనుకుంటున్నారు ,చెప్పండి అన్నారు ,వాళ్ళకి ఆ పిల్ల కనపడుతుంది నవ్వుతూ ,ఆ పిల్ల నవ్వుతూ కనపడుతుంటే వాళ్ళకేం గుర్తురావడం లేదు ,చెప్పలేకపోయారు ఆకరికి వారికి జ్ఞాపకానికి వచ్చింది , ఆయన ఎవరో తెలుసా ,పురుష రూపములో ఉన్న కామాక్షి ఆయనతో వాదిస్తావ అని కామాక్షి పరదేవతయే ఆయన వల్లో పసిపిల్లయై పడుకుంది . ఇపుడు ఎదురుకుండా ఉన్నవాళ్లు వాదిన్చలేకపోయారు ,ఈ విషయం ఎలా వస్తుంది వెలుగులోకి , శృంగేరి పీటాధిపత్యమ్ వహించిన ఉగ్ర నరసింహ భారతి స్వామి వారు ఒకప్పుడు దక్షిణ దేశములో ఉన్న మదురై వెళితే గుళ్ళోకి రావద్దన్నారు ,ఆయనికి నేనే గుళ్ళోకి వచ్చి పూజ చేయకూడద అని అచర్యం కలిగి ,శిష్యుణ్ణి కొబ్బరి బొండం తెమ్మని మంత్రం చదివి కొబ్బరి బొండం పట్టుకున్నారు ,ఎదురుకుండా ఉన్న మీనాక్షి దేవతలో ఉన్న శక్తి అంతా కొబ్బరి బొండం లోకి వెళ్ళిపోయింది ,ఆయన ఆ కొబ్బరి కాయ పట్టికిల్లి ,వీదిలోకి వెళ్ళిపోయి ,సింహాసనం మీద పెట్టి పూజ చేసారు ,అమ్మవారి విగ్రహం వెల వెల వెల పోయింది ,ఏదో తెల్లగా పాలిపోయినట్టు అయిపొయింది ,అంత తేజస్సు పోయింది ,పయిగా రోజు రోజుకు వివర్ణం అయిపోతుంది ,అప్పుడు పసిగట్టారు ,ఉగ్ర నరసింహ భారతి స్వామి వారు ,శక్తి అంతటిని లాగేసారు కొబ్బరి బొండం లోకి ,వెళ్లి ఆయన కాళ్ళ మీద పడ్డారు ,అయ్యా పొరపాటు మీ లాంటి మహితాత్ములు వస్తే గుళ్ళోకి రావద్దనడము ఏంటి ,అలాంటి వారు వస్తారనే స్వామి సంతోషముగా నిలబడతాడు ,ఆయన్ని రావద్దని అంటే ఇంకేమిటి అపచారము కాదు కాబట్టి వెంటనే ఆయన దగ్గరకి వెళ్లి కాళ్ళమీద పడి ప్రార్ధన చేస్తే ,ఆయన మళ్ళి గుళ్ళోకి వెళ్లి నిలబడి ,కొబ్బరి బొండము లో ఉన్నటువంటి అమ్మవారి శక్తులన్నీ ,అమ్మవారిలోకి ప్రవేషపెట్టేసారు ,అంతే మీనాక్షి పరమ కాంతితో నిలబడింది ,ఎలా తెలుస్తుంది ఈ విషయం ,ఎవరో ఆయన కాలములో ఉన్నవాళ్ళు రాయాలా వద్దా ,వాళ్ళు రాస్తే కదు మనకు అందింది ,ఇపుడు ఉగ్ర నరసింహ భారతి వారి ఒకరికే కాదు నమస్కారం ,ఆ రాసినవాడికి కూడా నమస్కారం ,లేకపోతే ఎలా అందుతుంది ,కంచి కామకోటి చరిత్ర శ్లోకము ల రూపములో ఇచ్చారు సదాశివ బ్రహ్మేంద్ర ,అలా ఇచ్చారు కాబట్టి అందింది జగద్గురువుల చరిత్ర అలాగే రమణ మహర్షి ఎప్పుడు మాట్టడేవారు కాదు ,ఎప్పుడైనా నోరు తెరచి మాట్టడేవారు ,ఆయన ఏదైనా మాట్లాడారంటే ,పరమాద్భుతమైనటువంటి విషయం , అది ఇక మాములుగా ఉండదు ఇక ,ఒక మాట మాట్లాడుతారు అంటే నోరు తెరచి ,ఎపుడు మాట్లాడతారో ఎవరికీ తెలిదు ,పది రోజులకి ఒకసారి మాట్లాడొచ్చు ,ఆయన ఒకసారి అన్నారు ,అరణ్యములో అనేక జంతువులు ఉంటాయి ,అవి ఎప్పుడూ అరుస్తూ ఉంటాయి ,సింహం ఒక్కసారి అరుస్తుంది ,సింహా గర్జన ,అది అరిస్తే మిగిలిన జంతువులు అరవడం మానేస్తాయి ,గురువు సింహం లాంటివాడు ,గురువు నోరు తెరిస్తే ,మిగిలిన పశువులు అన్ని నోళ్ళు మూసేస్తాయి ,ఎందుకని అంటే ,గురువుది సింహా గర్జన ,దాని ముందు ఇవి నిలబడవు కనుక ,ఆయన ఒక్క మాట అన్నారు ,గురువు యొక్క వైభవం ఏంటో అర్దమైయిందా లేదా ,అది వెంటనే సూర్య నాగమ్మ గారు రాసుకున్నారు ,సూరి నాగమ్మ లేఖలు అని ,దాదాపుగా ,రెండు దశాబ్దాల పై చిలుకు ,భగవాన్ రమణులు పాదాల దగ్గర కూర్చుని ,ఆయన ఎప్పుడు నోరు విప్పితే అప్పుడు రాసుకుని ,ఆయన చెప్పిన మాట ఆ కాగితాన్ని వాళ్ళ అన్నయికి పోస్ట్ చేసేవారు ,ఆ లేఖలు పుస్తకాలుగా వచ్చాయి ,కాబట్టి రమణ మహర్షి ఎప్పుడు ఏం మాట్లాడారో అన్న విషయం లోకానికి అందింది ,లేకపోతె అసలు అందవు ,ఇప్పుడు రమణ మహర్షికి నమస్కారముతో పాటు ,సూరి నాగమ్మ గారికి నమస్కారం ,లేకపోతే రమణ మహర్షి చెప్పిన విషయం ఎలా అందుతుంది ,రమణ మహర్షి జీవితములో జరిగిన సంగటలని వర్ణించారు ,ఆయన ఎలా నడిచోస్తారో ,ఎలా సోఫాలో పడుకుంటారో ,ఆకరికి ఓ రోజున పెద్ద పాము తిరుగుతుంది చెట్టు మీద ,ఆయన అలా చూస్తున్నారు ,ఇంతలోకే ఎవరో వచ్చారు ,బాబోయి పామ్ ,బాబోయి పామ్ అన్నారు ,ఆయన అన్నారు వారు రోజు వస్తారు ,ఇక్కడ ఇది పడుకుంటుంది ,వారు తిరుగుతుంటారు ,ఇది వారిని చూస్తుంది ,నేను అనేవారు కాదు ,ఇది అనేవారు ,అంటే వారు అన్నారు ,ఇది చూడడం ,వారు వెళ్ళడం బాగుంది ,మాకు భయం ,మేము ఆస్తాయి కాదు ,ఎలా వారు రోజు తిరుగుతుంటే మాకు భయము కాదు అన్నారు , ఆయన అన్నారు పైకి చూసి ,వారు భయపడుతున్నారు అంట మనలని చూసి ,ఎందుకొస్తారు ,వేరొక చోట తిరగకూడదు ,ఎందుకు వారిని ఇబ్బంది పెడతారు అన్నారు , అంతే ఆ పాము జర జర జర వెళ్ళిపోయింది ,అంటే ఒక జ్ఞాని మాటలు ఉపాది సంబదము లేకుండా అన్దేస్తాయి జీవుడికి ,ఎలా అందింది ,సూరి నాగమ్మ గారు ఉండబట్టేనా అందింది ,జరిగిన సంగటనలు అందుతాయి ,సంగటనలుతో పాటు వారు చెప్పినటువంటి ఉపదేశాలు అందుతాయి ,రెండు సద్గురువు యొక్క చరిత్ర గ అందుతాయి ,సాయిబాబా గారు ఉన్నారు ,సాయిబాబా గారి జీవిత కాలములో జరిగినటువంటి సంగటలని ,హేమాద్రి పంత్ అనే ఆయన రాసారు అని అంటారు ,అలాగే ఆయన చెప్పిన మాటలని రాసారు ,ఇప్పుడు హేమాద్రి పంత్ రాయబట్టేన మనం చదువుతున్నాం ,కాబట్టి ఇప్పుడు సాయిబాబా గారికి ఎంత నమస్కారము పెడుతున్నామో ,అలాగే అది చదువుకునే ముందు హేమాద్రి పంత్ కూడా నమస్కారము పెట్టాలి ,రమణ మహర్షి గురించి చదువుకుంటే రమణ మహర్షికి ఎలా నమస్కారము పెడతామో ,సూరి నాగమ్మ గారికి అలా నమస్కారము పెడతాం ,కామకోటి పీట గురువులకు నమస్కారము చేస్తూ ,అది రాసిన మహాత్ముడు సదాశివ బ్రహ్మెంద్రులు వారికీ నమస్కారము పెడతాము ,రామకృష్ణ పరమహంసతో తన అనుభవాలు వివేకానందుడు వ్రాశాడు కాబట్టి రామకృష్ణ పరమహంస యొక్క గొప్పతనము అర్ధమవుతుంది ,రామకృష పరమహంసకు నమస్కారము పెట్టి అది చెప్పిన వివేకానందుడికి నమస్కారము పెడతాము ,అందుకే గురు చరిత్రలో రెండు భాగాలుగా ఉంటుంది అని మనవి చేసారు ,వారు చెప్పినవి ,వారి చేష్టితముగా కనపడేటటువంటి లీలలు ,ఇప్పుడు ఒక పాము విషయము చుడండి ,రమణులు చెప్తే పాముకి ఎలా అర్ధమవుతుంది అంటే అందులోను ఆత్మ ఉంది ,ఇక్కడా ఆత్మ ఉంది ,ఆత్మ సర్వగతం ,సర్వగతం అయిన ఆత్మ ప్రకంపనలు ఒకదాని నుంచి ఒకటి అందుకుంటాయి ,అదే మౌన వాఖ్యానం ,ఆ మాట అందేసుకుంటుంది ,మనం చెప్తే అందదు ,ఆయన చెప్తే అందుతుంది అందుకే ఆయన వచ్చి కూర్చుంటే అరునాచలములొ ప్లేగు వ్యాది వచ్చి శవాలు పట్టుకొచ్చి పీక్కు తింటున్నటువంటి పులులు ,రమణ మహర్షిని చూసేటప్పటికి రెండు కాళ్ళు చాపి ,నమస్కారము చేసి కూర్చుని ఆయన్ని అలా చూస్తూ వేల్లిపోయేవి ,బ్రహ్మ తేజస్సు అంటే అటువంటిది ,ఒక కుచేలుడు బ్రహ్మ వేత్త ,రమణులు బ్రహ్మవేత్త ,సాయి బాబా గారు బ్రహ్మవేత్త అలాంటి మహా పురుషులు గురుంచి తెలియాలి అంటే ,వారితో సమకాలినుడిగా ఉంటూ ,అంటే ఆ కాలమునందు ఉండడం వాళ్ళ అదృష్టం ,వాళ్ళది రాసి ఉండడం ,మనకి చేసిన మహోపకారం ,అటువంటి మహోపకారం చేసినటువంటి వాళ్ళకు మనం ఏమి ఇవ్వలేం ,మనమేలాగు కృతజ్ఞత చెప్పలేము ,కనిసములొ కనీసం మనం చేయగలిగినది ఏమిటంటే అంత గొప్ప గ్రంధాలు ఇచ్చినందుకు వారికొక నమస్కారము చెయ్యాలి .
share it ..
నివేదన , నైవేద్యము భేదం :
నివేదన అన్న మాట పర్యాయ పదమే నైవేద్యము ,సాధారణముగా మనము నైవేద్యము అనేటువంటిది చెయ్యకుండా ఉండం ,ఎందుకంటే పంచ ఉపచారములు తప్పకుండా ఇంట్లో జరగాలి ,గంధ ,పుష్ప ,ధూప ,దీప ,నైవేద్యములు ఈ ఐదు జరగకపోతే అది క్రుతగ్నతతో లేని గృహముగా గుర్తిస్తారు ,ఈ ఐదు జరగాలి . ఇంట్లో గంధము ఈశ్వరుడికి అలంకరించాలి ,పుష్ప పువ్వు వెయ్యాలి ,పువ్వు లేకపోతే అక్షిత అన్నా వెయ్యాలి ,ధూప ఈశ్వరుడికి ధూపము వెయ్యాలి ,దీప ,దీపము పెట్టాలి ,నైవేద్య ,నైవేద్యము పెట్టాలి . ఇవి ఎందుకు చేస్తున్నావు ఆయనే మనలని నిలబెడుతున్నాడన్న సాత్వికమైన బుద్దితో పూజ చేసావు ,ఆయనే మనలని కాపాడుతున్నాడు ,మన ఇంద్రియాలికి శక్తిని ఇస్తున్నాడు ,సత్వ గుణముతో చేస్తున్నాడు కాబట్టి సాత్విక పదార్దముతో నైవేద్యం చేస్తారు ,మధుర పదార్దాలు ,పళ్ళు ఇటువంటివి నైవేద్యం పెడతారు . నైవేద్యము అన్న మాట ,నివేదన అన్న మాట కేవలం పూజలో ఒక భాగముగ మాత్రమే కాదు ,అది ఎక్కడికి వెళ్ళాలి అంటే జీవితమే నివేదనగా మారిపోవాలి ,ఎలా నివేదన అంటే మీకు గురువుగారు ఒక మాట చెప్తారు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ,ఒక విగ్రహం దగ్గర కూర్చున్నామన్న భావన కాదు ,భగవంతుడు విగ్రహముగా ఉన్నాడు అని గుర్తించాలి . వాడు పిల్లవాడు కాదు ,నా మనమడు పిల్లవాడిగా ఉన్నాడు ,అప్పుడు కదా ప్రేమ ,విగ్రహము కాదు పరమేశ్వరుడు అలా ఉన్నాడు ,ఆ రూపములో అక్కడ కూర్చున్నాడు ,ఇప్పుడు నివేదన అంటే నా కష్టం ,నా సుఖం ,నా భావాలు అన్ని కూడా ఆయనతో చెప్పుకోవాలి అందుకే నివేదన రెండు కింద వెళిపోతుంది జీవితములో ,ఒకటి నాకు తోడ్పడమని అడుగుతూ ఉంటాడు ,ఈశ్వర నేను సాత్వికముగా ప్రవర్తిన్చాలనుకుంటున్నాను ,భక్తితో ఉండాలని ఉంది ,ఎప్పుడు ఎవరి జోలికి వెళ్ళకూడదు ,గురువుగారు చెప్పిన మంచి మాటలు ,గురువుగారు మంచి మాటలే చెబుతారు ,గురువు గారు చెప్పిన మాటలు జీవితములో అనుష్టాన పర్యన్తములోకి తెచ్చుకోవాలి కోరికుంది కాని మనసు అటూ ,ఇటూ లాగేస్తుంది ,స్వార్ధం వైపుకి లాగేస్తుంది కాబట్టి మీరు నా మనసు నిలకడగా నిలబడేటట్టు నేను ధార్మికముగా బ్రతికేటట్టు నన్ను అనుగ్రహించండి ,ఇప్పుడు తినమని ఆపిల్ పండు ఒకటే పెట్టాడ తన కష్ట సుఖాలు ఈశ్వరునితో చెప్పుకున్నాడ , చెప్పుకున్నాడు అది నివేదన ,అలా చెప్పుకోవడము ఒకటి ఒచ్చింది అనుకోండి అనుబంధం ఒకటి ఏర్పడుతుంది మీకు ,కాకినాడ పట్టనములోనే చలపతి రావు గారు అని ఒక ఆయన ఉన్నారు ,కాకినాడ సస్తంగం లో ,ఆయన ఎప్పుడైనా పండగ వచ్చిందనుకోండి బట్టలు కొనడానికి వెళ్తాడు ,బట్టలు కొనడానికి వెళ్తే ఆయన , ఆయన ,ఆయన భార్య ,ఆయన కూతుళ్ళు ,ఆయన అల్లుళ్ళు ,ఆయన మనవలు తో బాటు ఒక పంచ ,ఒక చీర కొంటాడు ,ఒక సారి మనవి చేసారు , అవి స్వామికి మన ఇంట్లో సింహసనములో ఉన్నారు కదండీ ,పండగ ఆయనికి కూడా కదా ,ముందు ఆయనికి కొన్నానండి ,పెద్దాయన కదా ,తల్లి ,తండ్రి కదండీ ,ఆయనికి పెట్టి ,అయన కట్టుకుంటాడు ,మేము కట్టుకుంటాము అన్నాడు .
భావన మాత్ర సంతుష్టాయే నమోనమః !!
ఆయన నమ్మాడు ఉన్నాడు మా ఇంట్లో అని ,లక్ష్మీ నారాయణులు అనండి ,పార్వతీ పరమేశ్వరులు అనండి మా ఇంట్లో ఉన్నారు సింహసనములో వాళ్ళు కూర్చుంటారు ఎప్పుడు నా యోగ క్షేమాలు చూస్తారు ఎప్పుడును ,వాళ్ళకు కొనద్దు బట్టలు అందుకని ముందు కొన్నాడు ,వాళ్ళ ఇద్దరికీ బట్టలు కొని ,అందరికి వాళ్ళ కుటుంబ సభ్యుల బట్టల చూపిస్తూ ,ఇవీ చూపిస్తుంటాడు . పండగొస్తే స్నానం చేసి ముందు వాళ్ళ ఇద్దరి దగ్గర పెడతాడు ,ఇద్దరు కట్టుకోండి అంటాడు . వాళ్ళు ఇద్దరు కట్టుకుంటే ఎలా ఉందో మనసుతో భావన చేసి ,చూసి పొంగిపోతాడు ,హా అమ్మా బలే ఉందమ్మా ఈ ఆకుపచ్చ పట్టుచీర నీకు ,స్వామి తెల్ల పంచ చాలా బాగుంది ,ఆ పాదాలకి నమస్కారములు చేస్తారు . ఇప్పుడు అక్కడ పెట్టిన బట్టలు ఈశ్వరుడి గా కట్టుకోమని ఒక బ్రాహ్మణునికి ఇచ్చేస్తాడు . ఆయనికి ఒక కష్టం వచ్చిందనుకోండి పూజ గదిలోకి వెళ్లి స్వామి ఏమిటో ఇలా ఇబ్బంది వచ్చింది ,చాల మనక్లేశ్యం పడుతున్నానండి అని చెప్తాడు . ఆయనకో సుఖం వచ్చిందనుకోండి కొడుకు ఎంసెట్ పరీక్షకి వెళ్తుంటే కాపాడమని దండం పెట్టి ,కొడుక్కి మంచి రాంక్ వస్తే మాత్రం భావమరిది కి ఫోన్ చేయడు ,మల్లీ మంచి రాంక్ వచ్చిందని ముందు వెళ్లి పరమేశ్వరునికే చెప్తాడు ,స్వామి వెళ్ళే ముందు మిమ్మల్ని అడిగాను కదా ఎంత అనుఘ్రహించారు ,మంచి రాంక్ వచ్చింది స్వామి కృతజ్నుడుని ,నా బిడ్డని అలాగే కాపాడండి అని నమస్కారము పెడతాడు తప్ప ,వెళ్ళే ముందు ఈశ్వరుడు ,ర్యాంకు వచ్చినపుడు భావుమరిది ఏమి భక్తి అది . నివేదన అంటే వాడు ముందు గుర్తుకు వచ్చుట ,కష్టం నందు, సుఖము నందు కూడా ,అన్ని ఆయనతో పంచుకోవడము అలవాటు అయిపొయింది , అప్పుడు ఏమవుతుంది . భక్తీ పూజ గదికి పరిమితం కాదు ,విశ్వవ్యాప్తమైంది ,నీకు అంతటా భగవంతుడే ఉన్నాడు ,ఒక వేల అది జరుగలేదు ,నువ్వు అనుకున్న పని అవలేదు ,ఇప్పుడు బెంగ పెట్టుకోడు ,ఈశ్వర ఎందుకలాచేసావో ,అది జరిగితే ఏదో ప్రమాదం ఉండేదన్నమాట ,జరగకుండా చేసావు ధన్యుడిని , ఒక ఉదాహరణ ,ఒకప్పుడు తెలిసిన వాళ్ళు అందరు ఒక పెళ్ళికి వెళ్లారు ,ఒక ఆయన మాత్రం ఏవండి ఆయన చాల తెలుసున్నాయన అండి కానీ పెళ్ళికి భోజనానికి వెల్లలేకపోతున్ననండి ,పొద్దునే వెళ్ళి ఏదో ఒకసారి అభినందిచేసి కానుకిచ్చేసాను ,చాల తెలుసున్నాయన కానీ ఏమ్చేస్తానండి చాలా అకస్మాత్తు ప్రయాణము వచ్చింది ,సాయంకాలము వెళ్ళాలి ,పెళ్ళికి వెళ్ళలేక పోతున్నాను అని బెంగ పెట్టుకుని వెళ్ళిపోయాడు . ఈ పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు అందరూ భోజనము చేసారు ,అందులో ఎలా కలిసిపాయినదో ,ఆహారములో విషము కలిసి పోయింది ,వీళ్ళందరినీ hospitalize చేసేసారు ,కన్యాదాతలుతో కలిపి ,మగ పెళ్లి వారితో కలిపి , ఈయన ఒక్కడు రైలేక్కిపోయాడు కాబట్టి బ్రతికిపోయాడు . ఆ అన్నం తినకముందు అన్నాడు ,తినలేక పోతున్నానండి ,పెళ్లి భోజనానికి వెళ్ళటము లేదు ,పెళ్ళికి ఉండడం లేదు అన్నాడు ,ఇది ఫోన్ లో విని అన్నాడు ఈశ్వరుడు నాకు ఎంతటి అదృష్టం ఇచ్చావు , రైలు ఏ పదింటికో అయితే అక్కడే పడిపోతే ఎంత ముఖ్యమైన పనిమీద వెల్లాల్లండి , ఏమైపోవును నా జీవితం అన్నాడు . అది జరగనప్పుడు నీకు తెలియలేదు ,ఎందుకు జరగలేదో కానీ ఆ జరగకుండా ఉన్నది ,ఎందుకు జరగలేదో తెలిసినప్పుడు మాత్రం నమస్కారము చేస్తావు . అన్ని వేళలా తెలియాలని ఏమి నియమము లేదు . అన్ని వేళలా తెలియక్కరలేదు . ఈశ్వరుడు వైద్యుడు లాంటి వాడు మనము జబ్బు ఒకటే చెప్తాం . డాక్టర్ గారు ఇంత మందిస్తాడు ,మూడు పూటలా వేసుకోండి అంటాడు . నా లోపల ఏ సూక్ష్మజీవులు ఉన్నవి ,ఏవి చేయుచున్నవి ,ఎందువలన జబ్బు వచ్చినది ,ఇందులో ఏమున్నది ,అవి లోపలికి వెళ్లి ఎట్లు పోరాడును ,ఎట్లు చంపును ,చెప్తే వేసుకుంటాను అంటే ఛి అవతలపో అంటాడు . ఆయన చెప్పాడు నువ్వు వేసుకో ,ఎందుకంటే ఈశ్వరుడు .
వైద్యో నారాయణో హరిహి !!
భగవంతుడు కూడా అంతే ఆయనని నమ్ము ,నువ్వు ఉపద్రవాలలో పడిపోకుండా ఆయన చూసుకుంటాడు . ఒక వేల నీకేదో కష్టం వచ్చింది వెనక ఏదో ఉంది ,ఈశ్వరుడి యొక్క ఆలోచన ,ఏదో కారణం లేకుండా ఆయన ఏది చెయ్యడు . కాబట్టి అందులో కూడా నీపట్ల ఏదో అనుగ్రహం ఉందని ఎప్పుడో చూపిస్తాడు ,అప్పుడు నువ్వు సంతోషిస్తావ్ ,తొందరపడి ఈశ్వరుని నింద చేయకూడదు . నివేదన ,పట్టికెళ్ళి అరటిపండి ,ఆపిల్ పండు పెట్టడముతో సరిపోదు ,ఎప్పుడు వాడు నా ప్రక్కన ఉన్నాడు అనుకుని ,వాడితో చెప్తుండడం అందుకే ,సఖ్య భక్తి అని నవవిధ భక్త్తుల్లో ఒకటి ఉంది ,సఖ్య భక్తి అంటే ఏమ్చేస్తం పక్కనే నాతో ఉంటాడు ఎప్పుడు ఒక ఆయన ,గోపాలకృష్ణ గారు ఉన్నారు ఎప్పుడు గురువు గారితో ఉంటారు . గురువు గారు విమానం ఎక్కుతున్నారు ,ఆయన ఎక్కుతారు ,రండి గోపాలకృష్ణ ,స్నేహితుడు పట్ల ప్రవర్తించినట్టు ప్రవర్తించడం , ఇరువరి అనుభందం వేరు కానీ ,స్నేహితుడికి ఉదాహరణగా చెప్తున్నారు ,అలా భగవంతుడితో స్వామి ఆఫీసు కి వెళ్దాం బయలుదేల్తారా ,ఆయన వస్తాడు ,కూర్చోండి ,ఆయన కూర్చుంటాడు ,అయ్యా మీ అనుగ్రహం పని మొదలు పెడుతున్నాను ,భోజనానికి వెళ్దాం బయలుదేల్తారా ,మహా నైవేద్యం స్వామి మీ అనుగ్రహం లేకపోతె ఇది ఎక్కడ నుంచి వస్తుంది నాకు తినడానికి , ఆయనికి ఏదైనా ఆయనికి చెప్తున్నావు ,మనసులో అది ,పైకి అంటే కానీ ఏదో అస్తమాను పైకి మాట్లాడుకుంటే బాగుండదు . లోపల ప్రతిదానికి ఈశ్వరుడు తో సమన్వయము అవుతావు ,ఆకరున ఊపిరి అందదు ,అయిపొయింది ఎనబై యెల్లో ,తొంబై ఎల్లో అయిపోయాయి ,ఊపిరి అందట్లే ఎవరికీ చెప్పుకోవాలి ,అలవాటు అయిపోయింది ,స్వామి ఏమిటో చాల బాధగా ఉంది ఊపిరి అందడం లేదు ,చమటలు పట్టేస్తున్నాయి ,బెంగ పెట్టుకోకురా నేనున్నానురా అని కనపడుతాడు ఆయన ,అనుగ్రహిస్తాడు ,తేలికగా వదిలేస్తాడు . అస్తమానం ఆయన్నే పట్టుకోవడం అలవాటు అయిన వాడికి చిట్ట చివర ఎవరిని పట్టుకుంటాడు ఆయన్నే పట్టుకుంటాడు . పట్టుకుంటే ఏమవుతుంది ఆయనలోనే కలిసిపోతాడు . కాబట్టి నివేదన కేవలం ఒక పదార్దం పెట్టడం కాదు ,నివేదన జీవితములో అన్ని విషయములందు విస్తరించాలి . చిట్టచివరికి జీవితమే నివేదన ,వాడి జీవితం అంతా ఈశ్వరుని తో సమన్వయము ,ఇది ఎందుకు చేయవయ ,ఆయన ఉన్నాడండి ,ఆయన చూస్తాడు ,ఎందుకండి నాకా తప్పు నేను చేయను ,ఇది ఎందుకు చేస్తావయ అలాగా ,చేదస్తం కాదండి ఆయన చేయమన్నాడు ,ఆయన చేయమన్నది నేను చేస్తా ,ఇప్పుడు నీకు ఈశ్వర ప్రోక్తము ,విహితం ఈశ్వరుడు చెప్పనిది నిషిద్దము ,ఇదే ధర్మము . కాబట్టి ఇప్పుడు నివేదన కేవలము ఒక పదార్ధము పెట్టడము కాదు . నివేదన జీవితము నందు విస్తరించవలసినటువంటి విషయము.
share it ur fb friends