ఆత్మ కథ ,జీవిత చరిత్ర భేదం :
ఆత్మకథ
అంటే తనకు తానుగా రాసుకున్నది ,అది ఎందుకు రాసుకుంటారు అంటే తనని తాను
పొగుడుకోడానికి రాసుకోరు ,తన జీవితములో ఉద్దాన పతనాలని ,జీవితములో వచ్చిన
తప్పులని ,తన కష్టాలని ,తన యొక్క బలాన్ని ,తన బలహీనతని ,తను సాదించినదానిని
,తాను విపలమైనదానిని అన్ని చెప్తారు ,నిష్పాక్షికముగా చెప్తారు . గాంధీ
గారి జీవిత చరిత్ర ఉంటుంది ,గాంధీ గారి జీవిత చరిత్రలో వారు చిన్న తనములో
చేసినటువంటి దొంగతనం చెప్తారు ,ఆయన చేతి దస్తూరి బావుండదు ,నా దస్తూరి
బాగుండదు అని చెప్తారు ,ఆయనికి చిన్నపుడు ఆటలు ఆడలేదు ,ఆయన ఆటలు ఆడకపోవడము
వలన శరీరం దారుడ్యం ఎందుకు కలగలేదో చెప్తారు ,ఆయన ఒకప్పుడు పెద్ద ఉద్యమము
చేస్తే , 1920 లో సహాయ నిరాకరనోద్యమము జరుగుతుండగా భారత దేశానికి
స్వాతంత్ర్యం రావాల్సింది ,చౌరీ చౌర అన్న చోట ఒక ఆంగ్లేయ సిఫాయి ని
పట్టుకుని సజీవదహనం చేసారు ,ఉద్యమం లోకి హింస ప్రవేశించింది కాబట్టి ,అహింస
నా ఉద్యమానికి ప్రాణం కాబట్టి ఈ ఉద్యమం జరగడానికి వీలులేదని ఆపేసారు
,దానివలన సిద్దాంతం పట్ల గాంధీ గారికి ఎంత విశ్వాసం ఉంటుందో అర్ధమవుతుంది
,అది చివరికి చనిపోయేముందు కూడా తుపాకీ గుండు తగులుతున్నా కూడా "హే రామ్"
అంటూ పడిపోయారు అంటే ఆయన ఎంతటి మహితాత్ముడో అర్ధమవుతుంది .ఆయన జీవితములో
ఉద్దానపతనాలని చూసినపుడు ఆయన ఏ విషయాలు నేను చిన్నతనము లో చేసానని
బాధపడానని చెప్పారో అవి మనము చెయ్యకూడదు అని అర్ధం . ఏ బలం ఆయన్ను
నిలబెట్టిందో అది చదివిననాడు ఆ బలం సంతరించుకోవాలన్న ఆలోచన కలుగుతుంది .
తాన జీవితాన్ని పుస్తకముగా తెరచిపెట్టి పదిమంది దాంట్లోంచి వచ్చే
ఉత్స్తహాన్ని పుంజుకుని ఉన్నతమైన పధం లో నడవాలన్న కోర్కెతో మహాత్ములైన వారు
జీవిత చరిత్రలు వ్రాస్తారు . అందుకే అటువంటి జీవిత చరిత్రలు తప్పకుండా
చదవాలి . ఇక రెండవ విషయం మహత్ములయొక్క జీవితాలను చరిత్రలుగా రాయడం ,ఇది
వారు ఉన్నపుడు రాసేటటువంటి విదానం ఒకటి . వారు శరీరం విడిచిపెట్టిన తర్వాత
రాసే విధానం ఒకటి . ఈ మధ్య కాలములో pvrk ప్రసాద్ గారు గొప్ప సీనియర్ ఐఏఎస్
ఆఫీసర్ ,ఒకప్పుడు ప్రధానమంత్రి కార్యాలయములో పనిచేసారు ,ఆయనో పుస్తకం
రాసారు ,అప్పుడు ఏమైంది అని అది ఆ పుస్తకం పేరు . భారతదేశం అంతటిని
కుదిపేసినటువంటి ఒక సందర్బములో అప్పుడు ప్రధానమంత్రి గా ఉన్నటువంటి pv
నరసింహారావు గారు ఏమ్చేసారు అన్నది ఆయన దగ్గర కార్యదర్శిగా ఉన్న pvrk
ప్రసాద్ గారికి తెలుసు ,అందుకే ఒక మహాద్భుతమైన పుస్తకాన్ని రాసారు "అప్పుడు
ఏమైందంటే" అని ,అది చరిత్ర . జరిగిపోయిన దానిని రాసారు . ఒక్కొక్కచో వారు
ఉండగానే రాస్తారు . వారు ఉండగానే ఎందుకు రాస్తారు అంటే ఆయన అంతటి
మహితాత్ముడు దానికిక ఎప్పుడో అయన జీవితం పరిసమాత్మము అయిన తర్వాత బయటకి
రావడం కాదు ,వెంటనే వచ్చేయాలి అంతే ,ఒక్కొక్కసారి ఏదో ఒక వయసులో చేయవలసిన
ఉపనయనాన్ని చాలా ముందే చేసేస్తారు ,ఎందుకు చేసేస్తారు అంటే ఆ పుట్టిన
పిల్లవాడు ఏక సంతాగ్రహి అనుకోండి అన్నేళ్ళు వచ్చే వరకు ఆపకూడదు , శాస్త్రం
చదువకోవడానికి ,వేదం చదువుకోవడానికి తొందరగా ఉపనయనం చేసేస్తారు . అలా
అటువంటి మహానుభావుడు అయితే ఆయన జీవించి ఉండగానే , ఆయన జీవితానికి సంబదించిన
విశేషాలు ,ఆయన చెప్పినవి రెండు కలిపి పుస్తకముగా ఇస్తారు ,ఇది ఏ మహాత్ముడు
గురుంచి చెప్పారో ఆయనతో పాటుగా అలా చెప్పిన వారికీ కూడా మనదరం ఋణపడి ఉంటాం
ఏ కారణం చేత అంటారేమో ఆ మహాత్ముడు ఎవరు ఉంటారో ఆయనకి అసలు అది గ్రంధస్తం
అవ్వాలని కోరిక ఉంటుందా ,ఉండదా అంటే చెప్పలేం ,కష్టం . ఒక ఉదాహరణ
చెప్పాలంటే కామకోటి కంచి మఠానికి ఎందరో జగద్గురువులు వచ్చారు ,సామాన్యులు
కారు ,ఒక్కొక్క జగద్గురు ఎటువంటి స్థానాలకి వెల్లిపోయారంటే ,చంద్రషేకరేంద్ర
సరస్వతి అన్న పేరుతొ ఇంకో ఆయన కూడా ఉండేవారు ,ఒకసారి ఆయన దగ్గరికి
ప్రతివాదులు వచ్చి వాదించడానికి కూర్చున్నారు , మొదలు పెట్టండి అన్నారు ఆయన
, వాళ్ళు ఏదో మొదలు పెట్టబోయి , వారికి స్పురణ తట్టలేదు . వాళ్ళన్నారు మీ
వల్లో ఒక పసిపిల్ల ఆడుకుంటుంది , ఆ పిల్ల ఆడుతుంటే ,నవ్వుతుంటే మాకు
జ్ఞాపకం రావట్లే ,ఆ పిల్లను దింపెయండి మాట్లాడతాం అన్నారు , ఆయన అన్నారు
నేను సన్యాసిని నా వల్లో పిల్ల ఎందుకు ఆడుకుంటుంది ,నా వల్లో పిల్ల లేదు
,మీరు ఉంది అనుకుంటున్నారు ,చెప్పండి అన్నారు ,వాళ్ళకి ఆ పిల్ల కనపడుతుంది
నవ్వుతూ ,ఆ పిల్ల నవ్వుతూ కనపడుతుంటే వాళ్ళకేం గుర్తురావడం లేదు
,చెప్పలేకపోయారు ఆకరికి వారికి జ్ఞాపకానికి వచ్చింది , ఆయన ఎవరో తెలుసా
,పురుష రూపములో ఉన్న కామాక్షి ఆయనతో వాదిస్తావ అని కామాక్షి పరదేవతయే ఆయన
వల్లో పసిపిల్లయై పడుకుంది . ఇపుడు ఎదురుకుండా ఉన్నవాళ్లు వాదిన్చలేకపోయారు
,ఈ విషయం ఎలా వస్తుంది వెలుగులోకి , శృంగేరి పీటాధిపత్యమ్ వహించిన ఉగ్ర
నరసింహ భారతి స్వామి వారు ఒకప్పుడు దక్షిణ దేశములో ఉన్న మదురై వెళితే
గుళ్ళోకి రావద్దన్నారు ,ఆయనికి నేనే గుళ్ళోకి వచ్చి పూజ చేయకూడద అని అచర్యం
కలిగి ,శిష్యుణ్ణి కొబ్బరి బొండం తెమ్మని మంత్రం చదివి కొబ్బరి బొండం
పట్టుకున్నారు ,ఎదురుకుండా ఉన్న మీనాక్షి దేవతలో ఉన్న శక్తి అంతా కొబ్బరి
బొండం లోకి వెళ్ళిపోయింది ,ఆయన ఆ కొబ్బరి కాయ పట్టికిల్లి ,వీదిలోకి
వెళ్ళిపోయి ,సింహాసనం మీద పెట్టి పూజ చేసారు ,అమ్మవారి విగ్రహం వెల వెల వెల
పోయింది ,ఏదో తెల్లగా పాలిపోయినట్టు అయిపొయింది ,అంత తేజస్సు పోయింది
,పయిగా రోజు రోజుకు వివర్ణం అయిపోతుంది ,అప్పుడు పసిగట్టారు ,ఉగ్ర నరసింహ
భారతి స్వామి వారు ,శక్తి అంతటిని లాగేసారు కొబ్బరి బొండం లోకి ,వెళ్లి ఆయన
కాళ్ళ మీద పడ్డారు ,అయ్యా పొరపాటు మీ లాంటి మహితాత్ములు వస్తే గుళ్ళోకి
రావద్దనడము ఏంటి ,అలాంటి వారు వస్తారనే స్వామి సంతోషముగా నిలబడతాడు ,ఆయన్ని
రావద్దని అంటే ఇంకేమిటి అపచారము కాదు కాబట్టి వెంటనే ఆయన దగ్గరకి వెళ్లి
కాళ్ళమీద పడి ప్రార్ధన చేస్తే ,ఆయన మళ్ళి గుళ్ళోకి వెళ్లి నిలబడి ,కొబ్బరి
బొండము లో ఉన్నటువంటి అమ్మవారి శక్తులన్నీ ,అమ్మవారిలోకి ప్రవేషపెట్టేసారు
,అంతే మీనాక్షి పరమ కాంతితో నిలబడింది ,ఎలా తెలుస్తుంది ఈ విషయం ,ఎవరో ఆయన
కాలములో ఉన్నవాళ్ళు రాయాలా వద్దా ,వాళ్ళు రాస్తే కదు మనకు అందింది ,ఇపుడు
ఉగ్ర నరసింహ భారతి వారి ఒకరికే కాదు నమస్కారం ,ఆ రాసినవాడికి కూడా నమస్కారం
,లేకపోతే ఎలా అందుతుంది ,కంచి కామకోటి చరిత్ర శ్లోకము ల రూపములో ఇచ్చారు
సదాశివ బ్రహ్మేంద్ర ,అలా ఇచ్చారు కాబట్టి అందింది జగద్గురువుల చరిత్ర అలాగే
రమణ మహర్షి ఎప్పుడు మాట్టడేవారు కాదు ,ఎప్పుడైనా నోరు తెరచి మాట్టడేవారు
,ఆయన ఏదైనా మాట్లాడారంటే ,పరమాద్భుతమైనటువంటి విషయం , అది ఇక మాములుగా
ఉండదు ఇక ,ఒక మాట మాట్లాడుతారు అంటే నోరు తెరచి ,ఎపుడు మాట్లాడతారో ఎవరికీ
తెలిదు ,పది రోజులకి ఒకసారి మాట్లాడొచ్చు ,ఆయన ఒకసారి అన్నారు ,అరణ్యములో
అనేక జంతువులు ఉంటాయి ,అవి ఎప్పుడూ అరుస్తూ ఉంటాయి ,సింహం ఒక్కసారి
అరుస్తుంది ,సింహా గర్జన ,అది అరిస్తే మిగిలిన జంతువులు అరవడం మానేస్తాయి
,గురువు సింహం లాంటివాడు ,గురువు నోరు తెరిస్తే ,మిగిలిన పశువులు అన్ని
నోళ్ళు మూసేస్తాయి ,ఎందుకని అంటే ,గురువుది సింహా గర్జన ,దాని ముందు ఇవి
నిలబడవు కనుక ,ఆయన ఒక్క మాట అన్నారు ,గురువు యొక్క వైభవం ఏంటో అర్దమైయిందా
లేదా ,అది వెంటనే సూర్య నాగమ్మ గారు రాసుకున్నారు ,సూరి నాగమ్మ లేఖలు అని
,దాదాపుగా ,రెండు దశాబ్దాల పై చిలుకు ,భగవాన్ రమణులు పాదాల దగ్గర కూర్చుని
,ఆయన ఎప్పుడు నోరు విప్పితే అప్పుడు రాసుకుని ,ఆయన చెప్పిన మాట ఆ
కాగితాన్ని వాళ్ళ అన్నయికి పోస్ట్ చేసేవారు ,ఆ లేఖలు పుస్తకాలుగా వచ్చాయి
,కాబట్టి రమణ మహర్షి ఎప్పుడు ఏం మాట్లాడారో అన్న విషయం లోకానికి అందింది
,లేకపోతె అసలు అందవు ,ఇప్పుడు రమణ మహర్షికి నమస్కారముతో పాటు ,సూరి నాగమ్మ
గారికి నమస్కారం ,లేకపోతే రమణ మహర్షి చెప్పిన విషయం ఎలా అందుతుంది ,రమణ
మహర్షి జీవితములో జరిగిన సంగటలని వర్ణించారు ,ఆయన ఎలా నడిచోస్తారో ,ఎలా
సోఫాలో పడుకుంటారో ,ఆకరికి ఓ రోజున పెద్ద పాము తిరుగుతుంది చెట్టు మీద ,ఆయన
అలా చూస్తున్నారు ,ఇంతలోకే ఎవరో వచ్చారు ,బాబోయి పామ్ ,బాబోయి పామ్
అన్నారు ,ఆయన అన్నారు వారు రోజు వస్తారు ,ఇక్కడ ఇది పడుకుంటుంది ,వారు
తిరుగుతుంటారు ,ఇది వారిని చూస్తుంది ,నేను అనేవారు కాదు ,ఇది అనేవారు
,అంటే వారు అన్నారు ,ఇది చూడడం ,వారు వెళ్ళడం బాగుంది ,మాకు భయం ,మేము
ఆస్తాయి కాదు ,ఎలా వారు రోజు తిరుగుతుంటే మాకు భయము కాదు అన్నారు , ఆయన
అన్నారు పైకి చూసి ,వారు భయపడుతున్నారు అంట మనలని చూసి ,ఎందుకొస్తారు
,వేరొక చోట తిరగకూడదు ,ఎందుకు వారిని ఇబ్బంది పెడతారు అన్నారు , అంతే ఆ
పాము జర జర జర వెళ్ళిపోయింది ,అంటే ఒక జ్ఞాని మాటలు ఉపాది సంబదము లేకుండా
అన్దేస్తాయి జీవుడికి ,ఎలా అందింది ,సూరి నాగమ్మ గారు ఉండబట్టేనా అందింది
,జరిగిన సంగటనలు అందుతాయి ,సంగటనలుతో పాటు వారు చెప్పినటువంటి ఉపదేశాలు
అందుతాయి ,రెండు సద్గురువు యొక్క చరిత్ర గ అందుతాయి ,సాయిబాబా గారు ఉన్నారు
,సాయిబాబా గారి జీవిత కాలములో జరిగినటువంటి సంగటలని ,హేమాద్రి పంత్ అనే
ఆయన రాసారు అని అంటారు ,అలాగే ఆయన చెప్పిన మాటలని రాసారు ,ఇప్పుడు హేమాద్రి
పంత్ రాయబట్టేన మనం చదువుతున్నాం ,కాబట్టి ఇప్పుడు సాయిబాబా గారికి ఎంత
నమస్కారము పెడుతున్నామో ,అలాగే అది చదువుకునే ముందు హేమాద్రి పంత్ కూడా
నమస్కారము పెట్టాలి ,రమణ మహర్షి గురించి చదువుకుంటే రమణ మహర్షికి ఎలా
నమస్కారము పెడతామో ,సూరి నాగమ్మ గారికి అలా నమస్కారము పెడతాం ,కామకోటి పీట
గురువులకు నమస్కారము చేస్తూ ,అది రాసిన మహాత్ముడు సదాశివ బ్రహ్మెంద్రులు
వారికీ నమస్కారము పెడతాము ,రామకృష్ణ పరమహంసతో తన అనుభవాలు వివేకానందుడు
వ్రాశాడు కాబట్టి రామకృష్ణ పరమహంస యొక్క గొప్పతనము అర్ధమవుతుంది ,రామకృష
పరమహంసకు నమస్కారము పెట్టి అది చెప్పిన వివేకానందుడికి నమస్కారము పెడతాము
,అందుకే గురు చరిత్రలో రెండు భాగాలుగా ఉంటుంది అని మనవి చేసారు ,వారు
చెప్పినవి ,వారి చేష్టితముగా కనపడేటటువంటి లీలలు ,ఇప్పుడు ఒక పాము విషయము
చుడండి ,రమణులు చెప్తే పాముకి ఎలా అర్ధమవుతుంది అంటే అందులోను ఆత్మ ఉంది
,ఇక్కడా ఆత్మ ఉంది ,ఆత్మ సర్వగతం ,సర్వగతం అయిన ఆత్మ ప్రకంపనలు ఒకదాని
నుంచి ఒకటి అందుకుంటాయి ,అదే మౌన వాఖ్యానం ,ఆ మాట అందేసుకుంటుంది ,మనం
చెప్తే అందదు ,ఆయన చెప్తే అందుతుంది అందుకే ఆయన వచ్చి కూర్చుంటే
అరునాచలములొ ప్లేగు వ్యాది వచ్చి శవాలు పట్టుకొచ్చి పీక్కు తింటున్నటువంటి
పులులు ,రమణ మహర్షిని చూసేటప్పటికి రెండు కాళ్ళు చాపి ,నమస్కారము చేసి
కూర్చుని ఆయన్ని అలా చూస్తూ వేల్లిపోయేవి ,బ్రహ్మ తేజస్సు అంటే అటువంటిది
,ఒక కుచేలుడు బ్రహ్మ వేత్త ,రమణులు బ్రహ్మవేత్త ,సాయి బాబా గారు
బ్రహ్మవేత్త అలాంటి మహా పురుషులు గురుంచి తెలియాలి అంటే ,వారితో
సమకాలినుడిగా ఉంటూ ,అంటే ఆ కాలమునందు ఉండడం వాళ్ళ అదృష్టం ,వాళ్ళది రాసి
ఉండడం ,మనకి చేసిన మహోపకారం ,అటువంటి మహోపకారం చేసినటువంటి వాళ్ళకు మనం ఏమి
ఇవ్వలేం ,మనమేలాగు కృతజ్ఞత చెప్పలేము ,కనిసములొ కనీసం మనం చేయగలిగినది
ఏమిటంటే అంత గొప్ప గ్రంధాలు ఇచ్చినందుకు వారికొక నమస్కారము చెయ్యాలి .
share it ..
No comments:
Post a Comment