cricket ad

Wednesday, 30 November 2016

పెళ్ళికి ముందు సహజీవనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోర్టు..!

ఓ పెళ్లి కానీ జంట సహజీవనానికి సహజీవనానికి సిగ్నల్ ఇచ్చింది. ప్రేమించుకున్న ఓ హిందూ యువతి, ఓ ముస్లిం యువకుడు కలసి ఉండవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ వివరాలలోకి వెళితే.. గుజరాత్‌ లోని పాకిస్థాన్ సరిహద్దు గ్రామం ధనేరా కు చెందిన ముస్లిం యువకుడు (20 ), అదే ఊరికి చెందిన హిందూ అమ్మాయి (19 ) ప్రేమించుకున్నారు. స్కూల్‌ మేట్స్‌ అయిన కారణంగా.. కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. గత జులైలో ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ.. అబ్బాయి మైనర్‌ కావడంతో పెళ్లి సాధ్యం కాలేదు.
దీనితో ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. వాళ్లిద్దరూ కలసి ఉన్నప్పుడు.. గత సెప్టెంబర్‌ లో ఆ యువతి బంధువులు అమ్మాయిని ఇంటికి తీసుకుపోయారు. ప్రియురాలితో కలిసే ఉండేందుకు అనుమతించాలని కోరుతూ ముస్లిం యువకుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశాడు. కోర్టు ఆదేశాల మేరకు బనస్‌ కాంత్‌ పోలీసులు అమ్మాయిని విచారణకు హాజరుపర్చగా.. తాను ఆ యువకుడితో ఉంటానని కోర్టుకి తెలిపింది.
ఇరు పక్షాల వాదనలు విన్న సీనియర్‌ జడ్జిలు జస్టిస్‌ అఖిల్‌ ఖురేషీ, జస్టిస్‌ బీరేన్‌ వైష్ణవ్‌ లు.. ఆమెకు న్యాయసహకారం అందించకుండా ఉండలేమని.. ఆమెకు ఇష్టమైన చోట ఉండగోరే హక్కును కాదనలేమని చెప్పి.. తనకు ఇష్టమైతే ‌20 ఏళ్ల యువకుడితో కలిసే ఉండొచ్చు అని తీర్పు చెప్పారు. అయితే.. 21 ఏళ్లు నిండగానే అమ్మాయిని పెళ్లి చేసుకునే విధంగా యువకుడితో  అఫిడవిట్‌ దాఖలుచేయించారు.

జూన్‌ లో రూ.2 వేల నోటూ ర‌ద్దు.. మొత్తం డిజిట‌ల్ లావాదేవీలే..!

నల్ల ధనాన్ని పూర్తిగా నిర్ములించడానికి న‌గ‌దు ర‌హిత భార‌తదేశ‌మ‌ని భావిస్తుండడంతో.. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఈ మేరకు ప్ర‌స్తుతం కొత్తగా వచ్చిన రూ.2 వేల నోట్ల‌ను కూడా వ‌చ్చే జూన్‌ లో ర‌ద్దు చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. నిజానికి పెద్ద నోట్ల రద్దుకు.. రూ.2వేల నోటుకు ఎటువంటి సంబంధం లేద‌ని.. రూ.2వేల నోట్లు ప్ర‌వేశ‌పెట్టాల‌ని ఎప్పుడో తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. రూ.500 నోటు కంటే ముందే మార్కెట్లోకి రూ.2 వేల‌ నోటు ముంచెత్త‌డానికి ఇదే కార‌ణ‌మ‌ని.. 4 ప్రింటింగ్ ప్రెస్‌లు ఉంటే ఒక్క‌దాంట్లోనే రూ.2 వేల నోట్ల‌ను ప్రింట్ చేస్తున్నార‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి.
న‌గ‌దు ర‌హితంగా తీర్చిదిద్దాల‌నే ల‌క్ష్యంలో భాగంగానే.. రూ.500 నోట్ల‌ను ప‌రిమితంగా ముద్రిస్తున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ధ్వారా తెలుస్తుంది. ప్ర‌భుత్వం పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేసిన త‌ర్వాత న‌ల్ల‌కుబేరులు త‌మ వ‌ద్ద ఉన్న సొమ్మును.. రూ.2 వేల నోట్ల రూపంలో మార్చుకున్నారు. వ‌చ్చే జూన్‌లో మ‌ళ్లీ ప్ర‌భుత్వం రూ.2 వేల నోటును రద్దు చేస్తే.. న‌ల్ల‌కుబేరులు మ‌ళ్లీ రూ.500 నోట్ల‌లోకి మార్చేసుకుంటారు. ఇలా చేసుకుంటూ పోతే న‌ల్ల‌ధ‌నం ఎప్ప‌టికీ బ‌య‌ట‌కు రాద‌నే ఉద్దేశంతో.. ప్ర‌భుత్వం ప‌క్కా వ్యూహంతోనే రూ.500 నోట్ల‌ను ముద్రిస్తున్నట్లు తెలుస్తుంది. రూ.2 వేల నోటును ర‌ద్దు చేసిన త‌ర్వాతే పూర్తిస్థాయిలో రూ.500 నోట‌ను విడుద‌ల చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.
కాగా ఇప్పుడు ఉన్న నోట్ల కొర‌త‌ను తీర్చాలంటే మార్కెట్లోకి ఏకంగా రూ.8.3 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు ప్ర‌వేశ‌పెట్టాల్సి ఉంది. ఇందుకోసం 1660 కోట్ల నోట్ల‌ను ముద్రించాల్సి ఉండగా.. రూ.500 నోట్ల‌ను పూర్తిస్థాయిలో మార్కెట్లోకి తీసుకురావాలంటే క‌నీసం ఆరు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. జూన్‌లో రూ.2వేల నోటును ర‌ద్దు చేసే నాటికి రూ.500 నోట్ల ముద్ర‌ణ పూర్తి అవుతుంది. అలానే.. రూ.1000 నోట్లును తిరిగి తీసుకువ‌చ్చే ఆలోచ‌న ప్ర‌భుత్వానికి లేద‌ని కూడా సమాచారం. దీనిని బ‌ట్టి చూస్తే ప్ర‌జ‌లు ప్ర‌స్తుతం ప‌డుతున్న క‌ష్టాలు జూన్ వ‌ర‌కు కొన‌సాగే అవ‌కాశం ఉంది.
దీనితో ప్ర‌జ‌ల‌కు న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం వంటి చ‌ర్య‌ల‌ను ప్ర‌భుత్వం చేప‌డుతుంది. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లు డిజిట‌ల్ లావాదేవీల‌కు వెళ్లాల్సిన పరిస్థితిని ప్ర‌భుత్వం క‌ల్పిస్తుంది. అలానే ప్ర‌జ‌లు కూడా గ‌త్యంత‌రం లేక జ‌న‌వ‌రి నుంచి ఇదే విధానం అవ‌లంబించే అవ‌కాశం కూడా ఉంది. ఇలా జూన్ నాటికి పూర్తిస్థాయిలో న‌గ‌దు ర‌హిత లావాదేవీలు నిర్వ‌హించే ప్ర‌క్రియ‌ను పూర్తిచేయాల‌న్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు.

రాత్రికి రాత్రే బిలియనీర్ గా మారిన ఆటోడ్రైవర్..!

పంజాబ్ లోని అమృతసర్ లో ఓ ఆటోడ్రైవర్ రాత్రికి రాత్రే బిలియనీర్ గా మారాడు. ఆ విషయం అతనికి కూడా తెలియదు. మరి అతని కూడా తెలియకుండా అతను బిలియనీర్ గా మారాడు. కారణం బ్యాంకు అధికారులు చేసిన పొరపాటు. ఆ వివరాలలోకి వెళితే.. అమృతసర్ కు చెందిన బల్వీందర్ సింగ్ అనే ఆటో డ్రైవరు స్టేట్ బ్యాంకు ఆఫ్ పాటియాలా బ్రాంచ్ లో 3 వేల రూపాయలతో ప్రధాని జన్ ధన్ యోజన ఖాతాను ఓపెన్ చేసాడు. అతని ఖాతాలో ఆ మొత్తమే ఉంది. అయితే.. నవంబరు 4వ తేదీన తన ఖాతాలోకి 9,806 కోట్లరూపాయలు జమ అయ్యాయని తెలుసుకొన్న బల్వీందర్ సింగ్ షాక్ కి గురి అయ్యాడు.
నవంబరు 4వ తేదీన బ్యాంకు నుంచి 200 తీసుకుందామని బ్యాంకు వెళ్లిన బల్వీందర్.. తనకు కావాల్సిన మొత్తం తీసుకుని బ్యాంకు క్యాషియర్ కు ఖాతా పుస్తకం అందించాడు. అయితే.. బ్యాంకులో ఉన్న మొత్తం 2,800 వేయాల్సిన బ్యాంకు సిబ్బంది.. పొరపాటున అతని అకౌంట్ నెంబర్ ను క్యాష్ కాలమ్ లో నింపడంతో.. అతని అకౌంట్లో ఒక్కసారి 9,80,55,12,231 రూపాయలు వచ్చి పడ్డాయి. అనంతరం చేసిన తప్పు తెలుసుకుని షాక్ కు గురైన సిబ్బంది జరిగిన పొరపాటు గురించి కనీసం బల్వీందర్ సింగ్ కి  సమాచారం కూడా అందించకుండా పొరపాటును సరిదిద్దడం విశేషం. ఆ తరువాత జరిగిన విషయం తెలుసుకున్న బల్వీందర్ సింగ్ కి నవ్వాలో, ఏడవాలో తెలియలేదు.

పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి ఎందుకొచ్చాడో చెప్పిన నాగబాబు

సినిమాలతో ఎంతో బిజీగా ఉంటూ.. కోట్ల రూపాయలు సంపాదిస్తున్న పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ఎందుకు స్థాపించారన్న ప్రశ్నకు అతని సోదరుడు నాగబాబు సమాధానం ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. గొప్ప భావజాలం, మానవత్వం, గొప్ప గుణం పవన్ కు ఉన్న లక్షణాలని చెప్పారు. పవన్ కల్యాణ్ దేన్నీ అంత సాధారణంగా వదలడని చెప్పారు. రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ కోరినందుకో.. అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ లేకపోవడం వల్లో జనసేనను పవన్ స్థాపించలేదని.. ప్రజలకు అండగా నిలబడాలనే పవన్ రాజకీయాల్లోకి వచ్చాడని చెప్పారు.
తన ఎదుట ఎవరైనా బాధ పడితే పవన్ తట్టుకోలేడని.. ఎంతో నిరాశతోనే ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టాడని తెలిపారు. పవన్ ఇంతకు ముందు చెప్పినట్టే, అతని ఆర్థిక పరిస్థితి అంత మెరుగ్గా లేదని.. తన వల్ల కూడా తమ్ముడు కొంచెం డబ్బు నష్టపోయాడని తెలిపారు. అయితే.. డబ్బుకు పవన్ ప్రాధాన్యత ఇవ్వడని.. ఆర్థిక సమస్యలను లెక్క చేయడని చెప్పారు. మరో నాలుగు లేదా ఐదు సినిమాలు చేస్తే.. ఆర్థికంగా సెటిల్ అవుతాడని.. అప్పుడు రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తాడని చెప్పారు.

అత్యంత దారుణానికి ఒడిగట్టిన 19 ఏళ్ల యువతి.. బాయ్ ఫ్రెండ్ ను ఇంటికి పిలిపించుకుని

అమెరికాలోని స్ప్రింగ్ ఫీల్డ్ లో దారుణం చోటు చేసుకుంది. రక్తపిశాచి కావాలనే బలమైన కోరికతో 19 ఏళ్ల యువతి అత్యంత దారుణానికి పూనుకుంది. తన బాయ్ ఫ్రెండ్ ను ఇంటికి పిలిపించుకున్న విక్టోరియా వనట్టెర్.. అతని చేత మద్యం తాగించింది. ఆ తర్వాత తన రక్తం తాగాలంటూ అతడిని ఒత్తిడి తెచ్చింది. రక్తం తాగడానికి తొలుత ఒప్పుకోకపోయినా.. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ ఓకే చెప్పాడు. దీనితో తన చేతిని బాక్స్ కట్టర్ చేత కట్ చేయించి.. తన రక్తాన్ని అతడిచేత తాగించింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య చిన్న గొడవ జరగడంతో కత్తితో అతనిపై దాడి చేసి, చంపబోయింది.
ఈ గొడవలో.. అతని భుజంలో కత్తి దింపింది. ఆ తరువాత ఇద్దరూ స్పృహ తప్పిపోయారు. స్థానికుల సమాచారం మేరకు.. పోలీసులు ఆ ఇంటికి చేరుకునే సమయానికి వారిద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు. వారిద్దరినీ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. ఆమె కోలుకున్నాక కోర్టులో ప్రవేశపెట్టగా.. తనను క్షమించి వదిలేయాలని వేడుకుంది. దీంతో.. ఆమెకి జరిమానాతో పాటు ఆమెకు జైలు శిక్షను విధించింది కోర్టు.

Tuesday, 29 November 2016

మన భారతీయ జీవన విధానములో స్నానానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత వుంది . ప్రతీ రోజు స్నానం చెయ్యడం మన పద్దతి .కొంతమంది రొండు పూటలా చేస్తారు .పండగ వోచ్చినపుడు ప్రత్యెక స్నానం చెయ్యడం అందరికి తెలిసిందే .వస్తు గుణ దీపిక లో తలంటు స్నానం గురించి వ్రాయబడింది. సంక్రాంతి నాడు తలంటు స్నానం ఒక ప్రత్యెక కార్యక్రమమని అందరికి తెలుసు .తలంటు స్నానాన్ని అబ్యాన్గన స్నానమని అంటారు . కొబ్బరి నూనె,నువ్వులనూనె,ఆవునెయ్యి ,ఆముదం వీటిలో దేనినైన అబ్యాన్గన స్నానానికి వాడవొచ్చు .నూనె చాలా మంచిది .ముందుగా నూనె శరీరానికి బాగా పట్టించి మర్దనా చెయ్యాలి 




.కనీసం పదినిమిషాలు ఆగిన తర్వాత సున్నిపిండితో నలుగు పెట్టాలి ,తర్వాత మరో పది నిమిషాలు ఆగాలి తర్వాత పొడి పిండి తో మొత్తం దేహానికి పట్టిన నలుగును వదిలించుకోవాలి. తర్వాత శరీరమంతా శుబ్ర పడేలా రెండు బకెట్ నీళ్ళతో స్నానం చెయ్యాలి. ఈ విధముగా చేయడం వలన గజ్జి, చిడుము, సర్పి, దద్డురులు మొ .చర్మ రోగములు ,దుస్వప్నములు దరి చేరావు. శరీరం మీద మలినాలను ,దుర్గందాల ను పోగొడుతుంది సుఖ నిద్ర ,శరీరం తేలికగా వుండడం ,దేహానికి పుష్టి,కాంతి , మృదుత్వం కలుగుతుంది. కండ్లకు చాలవ చేస్తుంది, పైత్యాన్ని అనుస్తుంది .








వృదాప్యం తొందరగా రాదు,అలసటనూ, వాతమును పోగొడుతుంది.సుఖ నిద్ర పట్టును, కాంతి, ఆయుష్షు పెరుగుదల ,బుద్ధి బలిమి ,దేహపుష్టి ,వీర్య వృద్ది కలుగుతాయి .జటరాగ్ని బాగుంటుంది .దేహము కాళ్ళు చేతులు ,గోళ్ళు, సిరస్సులందు పుట్టిన తాపమును ,మంటలను పోగొట్టును .మాడపట్టున చమురు ను వుంచి మర్దించడం వలన చెవులకు ,తక్కిన అవయములకు బలము నిచ్చును






 .తలవెంట్రుకలు వృద్ధ్హిపరచును ,మృదుత్వాన్ని ఇచ్చును .అరిపాదాలకు చమురు మర్దించడం వలన మంటలను పోగొట్టును .అరికాళ్ళ నొప్పులు హరించును . అబ్యాన్గన స్నానం వలన ఇన్ని రకముల ప్రయోజనములు వున్నై కాబట్టే మన పూర్వీకులు స్నానానికి అధిక ప్రాధాన్యత నిచ్చారు . ఆధునిక యుగంలో అబ్యాన్గన స్నానానికి ప్రాధాన్యత తగ్గిపోవడము వలన దేహానికి అనారోగ్యం ఎక్కువ అవుతోంది .పూర్వ కాలంలో చర్మ వ్యాధులు చాలా తక్కువుగా ఉండేవి. వారం వారం అబ్యాన్గన స్నానం చాలామంచిది .కనీసం పండగలలోనైనా తలంటు స్నానం చేస్తే మంచిది .
షేర్ చేయండి

శ్రీవారి కరుణ కలగాలంటే తిరుమల యాత్ర ఎలాచేయాలి.

कैसे तिरुमाला क्या करना Yathra प्रभु आशीर्वाद प्राप्त 

తిరుమల మామూలు క్షేత్రము కాదు. పరమాత్మ స్వయంభూగా వెలసిన క్షేత్రరాజము. అక్కడ ప్రతి చెట్టు, ప్రతి పుట్ట భగవంతుని ధ్యానిస్తున్న మహర్శులే అని చెప్పబడుతున్నాయి. ఆ ఏడుకొండలు సాక్షాత్తూ ఆదిశేషుడేనని పురాణాలు వివరిస్తున్నాయి. కనుకనే రామానుజులలాంటి సద్గురువులు అక్కడ ఎలా మెలగాలో ఆచరణాత్మకంగా చూపించారు. అన్నమయ్య లాంటి మహానుభావులు అక్కడ నివాసం కోసం తపించి తరించారు. ఇక యాత్ర నెలా చేయాలో పెద్దలు చెప్పినది చూద్దాము.





కొండనెక్కటం అలిపిరి నుంచి మొదలవుతుంది. చెప్పులతో కొండ ఎక్కరాదు. మొదటగా స్వామి వారు భక్తునకు స్వయంగా తన పాదరక్షల కొలతలనివ్వగా ఆ భక్తుడు తయారు చెసిన పాదరక్షలు అక్కడ పూజింపబడుతుంటాయి. ఆపాదరక్షలను ముందుగా తలపై వుంచుకుని స్మామివారిని స్మరించుకోవాలి.




 అక్కడ రాజైనా చక్రవర్తియైనా సరే వాళ్ల అహంకారాలు అణగేలా చెప్పులతో కొట్టబడతారు. దానితో నేనింతవానిని అంతవానిననే అహంకారం అణగిపోతుంది. ఆతరువాత బహుకష్ట సాధ్యమైన ఆ కొండనెక్కుతూ వుంటే [అప్పటిలో ఇంత సౌకర్యాలు లేవులెండి] ఆయాసముతో కళ్ళుతిరుగుతుంటాయి. భక్తులు భగవన్నామస్మరణంతో బహుకష్టాలతో చేరుకుంటారు పైకి . దానితో తమ చెడుఖర్మలు నశించటమేకాదు, తమ శారీరిక బలం ఎంతో దాని పరిమితి ఎంతో తెలిసివస్తుంది.



దానితో తమ శరీర బలాన్ని చూసుకుని విర్రవీగే వారికి వాస్తవం అర్ధమవుతుంది.
ఆ తరువాత ముఖ్యమయిన పని శిరోముండనమ్ అంటే గుండు చేయించుకోవటం ఒక ముఖ్యమయిన నియమము అందరికీ. ఇది ఆడమగ అందరూ పాటించేవారు పూర్వము, ఆధునికత పేరుతో బాహ్యసౌందర్య పోషణపట్ల శ్రద్ధపెరిగి ఇప్పుడు కొందరు పాటించటం లేదు. కాని దీనివెనుక చాలా పెద్ద ఆధ్యాత్మిక కారణమున్నది. మనిషిని మభ్యపెట్టి మనో వికారాలను కల్పించేది సౌందర్యం.



 దానికి ఆధారము శిరోజాలు. అవి వున్నప్పుడు ఎక్కడకెళ్ళినా తమ సౌందర్యము పట్ల అతిశయమైన భావన వెన్నంటివస్తూ మనసును కామవికారాలవైపు పరుగుపెట్టిస్తుంది. కనుక ఆ వికారాలను తొలగించకపోతే మనసు మాధవుని వైపు మళ్లదు పక్కదోవలగుండా పారి పోవాలని చూస్తుంది. కనుక ఆ శిరోజాలను తీసి వేస్తే ప్రతి మానవునికి తమ సహజస్వరూపమేమిటో అర్ధమయిపోతుంది.



ఎదుట వున్న జీవులను చూడగానే కామ భావన సమూలంగా నశిస్తుంది. నిర్వికారమైన మనోస్థితి కలుగుతుంది. [గుండు చేయించుకుని మిమ్మల్ని మీరు అద్దములో చూసుకోండి ఒకసారి, ఏవిధమయిన వికారాలు లేక ప్రశాంతమైన స్థితి వస్తుంది.]




అప్పుడు ఆలయ ప్రవేశము చేస్తుంటే మనసంతా ఆ దివ్యస్వరూపాన్ని చూడాలనే తపన తప్ప మరొకటి తలపుకు రాదు. ఆస్థితిలో కోటిసూర్యకాంతుల సమప్రభుడు ఆ కొండలరాయుడు మనకు దర్శనమిస్తాడు. ఆ తన్మయత్వంతో స్వామిని దర్శించి నప్పుడు తిరుమల యాత్ర సఫలమవుతుంది. ఆ తరువాత నిలువుదోపిడీ చేసి మనలను ధనవంతులమనే అహంకారాన్నుంచి రక్షించి ప్రపంచములో ఏజీవైనా నీవొక్కడివే దిక్కు నాకు అనేలా భావన కలగచేస్తాడు స్వామి.




 ఇలా వెళ్ళినప్పుడే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభించి మనకు శుభాలు కలుగుతాయి.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన ఆ స్వామి ముందు తమ తుచ్చమైన పలుకుబడులను, ధనాన్ని ప్రదర్శించి చెసే దర్శనముమేలు చేయదు సరికదా ఆయన ఆగ్రహానికి గురయ్యేలా చేస్తుందని చెప్పవచ్చు. ఆ పవిత్ర క్షేత్రములో అడుగు పెట్టిన ప్రతి భక్తుడు స్వామి వారి పరివారమే.




 కనుక మన అతితెలివి తోటి సాటి భక్తుల కిబ్బందికలిగేలా మనము దర్శనాదులను చేయరాదు. భక్తులకు చెసే అపచారాన్ని ఆయన అసలు క్షమించడు. అందుకే ఎక్కడెక్కడ మనం చేసిన తప్పులన్నిటికీ కొండమీదకు వెళ్లాక అనేకరూపాలుగా దోపిడిగా మనకు అనుభవానికొచ్చి మనసు విలవిల లాడుతుంటుంది. మీకు తెలుసోలేదో నిరుపేదలు రోజులతరబడి ఆ గదులలో స్వామి వారి దర్శనానికి వేచివున్నా వారికి శ్రీవారి పట్ల విసుగు కాని, అక్కడ అసౌకర్యాల పట్ల గమనికే వుండదు. కాస్త స్థితి కలిగాక మనమే గంటసేపన్న ఆగలేక అల్లడిపోయి పక్కదారిలో దర్శనమేమన్నా దొరుకుతుందా అని వెతుకుతుంటాము.