పంజాబ్ లోని అమృతసర్ లో ఓ ఆటోడ్రైవర్ రాత్రికి రాత్రే బిలియనీర్ గా మారాడు. ఆ విషయం అతనికి కూడా తెలియదు. మరి అతని కూడా తెలియకుండా అతను బిలియనీర్ గా మారాడు. కారణం బ్యాంకు అధికారులు చేసిన పొరపాటు. ఆ వివరాలలోకి వెళితే.. అమృతసర్ కు చెందిన బల్వీందర్ సింగ్ అనే ఆటో డ్రైవరు స్టేట్ బ్యాంకు ఆఫ్ పాటియాలా బ్రాంచ్ లో 3 వేల రూపాయలతో ప్రధాని జన్ ధన్ యోజన ఖాతాను ఓపెన్ చేసాడు. అతని ఖాతాలో ఆ మొత్తమే ఉంది. అయితే.. నవంబరు 4వ తేదీన తన ఖాతాలోకి 9,806 కోట్లరూపాయలు జమ అయ్యాయని తెలుసుకొన్న బల్వీందర్ సింగ్ షాక్ కి గురి అయ్యాడు.
నవంబరు 4వ తేదీన బ్యాంకు నుంచి 200 తీసుకుందామని బ్యాంకు వెళ్లిన బల్వీందర్.. తనకు కావాల్సిన మొత్తం తీసుకుని బ్యాంకు క్యాషియర్ కు ఖాతా పుస్తకం అందించాడు. అయితే.. బ్యాంకులో ఉన్న మొత్తం 2,800 వేయాల్సిన బ్యాంకు సిబ్బంది.. పొరపాటున అతని అకౌంట్ నెంబర్ ను క్యాష్ కాలమ్ లో నింపడంతో.. అతని అకౌంట్లో ఒక్కసారి 9,80,55,12,231 రూపాయలు వచ్చి పడ్డాయి. అనంతరం చేసిన తప్పు తెలుసుకుని షాక్ కు గురైన సిబ్బంది జరిగిన పొరపాటు గురించి కనీసం బల్వీందర్ సింగ్ కి సమాచారం కూడా అందించకుండా పొరపాటును సరిదిద్దడం విశేషం. ఆ తరువాత జరిగిన విషయం తెలుసుకున్న బల్వీందర్ సింగ్ కి నవ్వాలో, ఏడవాలో తెలియలేదు.
No comments:
Post a Comment