cricket ad

Wednesday, 30 November 2016


सरस्वती पेड़ के छात्रों के लिए इस अद्भुत उपहार। पावर काम स्मृति द्वारा दूध के अलावा के साथ वृद्धि हुई है, भस्म हो जाता है मस्तिष्क सक्रिय

 సరస్వతి చెట్టు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఎన్నో అద్భుతమైన గుణాలు కలిగిన ఈ చెట్టుని ఆయుర్వేద వైద్యంలో విరివిరిగా ఉపయోగిస్తారు. సరస్వతి చెట్టు ఆకులు తీపి, చేదు, వగరు రుచులు కలిగి ఉంటాయి.సరస్వతి చెట్టు ఉపయోగాలు :సరస్వతి చెట్టు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఎన్నో అద్భుతమైన గుణాలు కలిగిన ఈ చెట్టుని ఆయుర్వేద వైద్యంలో విరివిరిగా ఉపయోగిస్తారు. సరస్వతి చెట్టు ఆకులు తీపి, చేదు, వగరు రుచులు కలిగి ఉంటాయి.సరస్వతి చెట్టు ఉపయోగాలు :సరస్వతి చెట్టు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఎన్నో అద్భుతమైన గుణాలు కలిగిన ఈ చెట్టుని ఆయుర్వేద వైద్యంలో విరివిరిగా ఉపయోగిస్తారు. సరస్వతి చెట్టు ఆకులు తీపి, చేదు, వగరు రుచులు కలిగి ఉంటాయి.సరస్వతి చెట్టు ఉపయోగాలు :


ఈ ఆకులను నీడలో ఎండ పెట్టి పొడి చేసి ఆ పొడిని విద్యార్థులకి పాలలో కలిపి ఇస్తే వారు జ్ఞానాన్ని సంపాదిస్తారు. వారి మెమరీ పవర్ బాగా పెరుగుతుంది.
విద్యార్థుల్లో కొంత మంది ఆహారం సరిగా తీసుకోరు అలా తక్కువ తినేవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
చిన్న పిల్లలకు నత్తి రాకుండా ఉండటానికి ఈ చెట్టు ఆకుల పొడిని ఉపయోగిస్తారు.
ఈ ఆకుల రసం ఆయుష్షు పెరగటంలో మరియు కామెర్ల వ్యాధి నివారణలో తోడ్పడుతుంది.
మెదడుకి సంబంధిత వ్యాధులను నివారిస్తుంది .
మనిషిలో మేధా శక్తి పెంచుతుంది. రకాన్ని శుభ్ర పరుస్తుంది.
మిరియాల పొడి+ఉప్పు+నిమ్మరసం=మైండ్ బ్లోయింగ్ ప్రయోజనాలు
ఏదైనా చిన్న అనారోగ్యం వ‌చ్చిందంటే చాలు. మెడిక‌ల్ షాపుకు ప‌రిగెత్త‌డం మనకు అలవాటు అయ్యిపోయింది. మందులు కొని తెచ్చి వేసుకోవ‌డం ఈ రోజుల్లో సాధారణం అయ్యిపోయింది.
చిన్న స‌మ‌స్య‌కు కూడా మందుల‌ను వాడుతుండ‌డంతో అవి దీర్ఘ‌కాలికంగా మ‌న‌కు వివిధ ర‌కాల సైడ్ ఎఫెక్ట్స్‌ను తెచ్చి పెడుతున్నాయి.
ఈ క్ర‌మంలో మ‌న ఇంట్లో ఉండే న‌ల్ల మిరియాల పొడి, ఉప్పు, నిమ్మ‌ర‌సంలను ఉప‌యోగించి చిన్న‌పాటి అనారోగ్యాల‌ను ఎలా దూరం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
గొంతు నొప్పి, మంట‌, ద‌గ్గు…
ఒక టేబుల్ తాజా నిమ్మ‌ర‌సం, అర టీస్పూన్ న‌ల్ల మిరియాల పొడి, ఒక టీస్పూన్ ఉప్పుల‌ను ఒక గ్లాస్ వేడి నీటిలో క‌లిపి మిశ్ర‌మంగా త‌యారు చేసుకోవాలి. దీన్ని రోజులో ఎప్ప‌టిక‌ప్పుడు గొంతులో పోసుకుని పుక్కిలిస్తుంటే గొంతు నొప్పి, మంట, ద‌గ్గు త‌గ్గిపోతాయి.
జ‌లుబుకు…
న‌ల్ల మిరియాల పొడి, దాల్చిన చెక్క‌, జీరా పొడి, యాల‌కుల పొడిల‌ను స‌మాన భాగాల్లో తీసుకుని అన్నింటినీ క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు వాస‌న పీలుస్తుంటే జ‌లుబు, ముక్కు దిబ్బడ త‌గ్గిపోతుంది.
గాల్‌స్టోన్స్‌…
మూడు భాగాల ఆలివ్ ఆయిల్‌, 1 భాగం నిమ్మ‌ర‌సం, కొంత న‌ల్ల మిరియాల పొడిల‌ను తీసుకుని మిశ్ర‌మంగా క‌ల‌పాలి. దీన్ని రోజూ సేవిస్తుంటే గాల్ స్టోన్స్ పోతాయి.
బ‌రువు త‌గ్గేందుకు…
ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె, 2 టేబుల్ స్పూన్ల నిమ్మ‌ర‌సం, 1/4 టీస్పూన్ న‌ల్ల మిరియాల పొడిల‌ను వేసి బాగా క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని రోజూ తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు.
వికారంగా ఉంటే…
ఒక టేబుల్ స్పూన్ నిమ్మ‌ర‌సం, 1 టీస్పూన్ న‌ల్ల మిరియాల పొడిల‌ను ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి మిశ్ర‌మంగా త‌యారు చేయాలి. దీన్ని రోజులో వీలైన‌న్ని సార్లు సేవిస్తుంటే క‌డుపులో పుట్టే వికారం త‌గ్గిపోతుంది.
ఆస్త‌మాకు…
ప‌ది న‌ల్ల మిరియాలు, 2 ల‌వంగాలు, 15 తుల‌సి ఆకుల‌ను ఒక క‌ప్పు మ‌రుగుతున్న నీటిలో వేయాలి. అనంత‌రం స్ట‌వ్‌ను 15 నిమిషాల పాటు సిమ్మ‌ర్‌లో ఉంచి నీటిని మ‌ళ్లీ మ‌రిగించాలి. నీరు మ‌ర‌గ‌గా వ‌చ్చిన ద్ర‌వాన్ని వ‌డ‌క‌ట్టి ఒక జార్‌లోకి తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల తేనెను వేయాలి. ద్ర‌వం చ‌ల్లారే దాకా ఉండి దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి 2 వారాల పాటు పాల‌తో సేవించాలి. దీంతో ఆస్త‌మా అదుపులోకి వ‌స్తుంది.
దంతాల నొప్పుల‌కు…
అర టీస్పూన్ న‌ల్ల మిరియాల పొడి, కొద్దిగా ల‌వంగం నూనెల‌ను తీసుకుని మిశ్ర‌మంగా త‌యారు చేయాలి. దాన్ని నొప్పి పుడుతున్న ప‌న్నుపై అప్లై చేయాలి. రోజూ ఇలా చేస్తుంటే దంతాల నొప్పి త‌గ్గ‌డ‌మే కాకుండా దంతాలు దృఢంగా మారుతాయి.
జ‌లుబు, ఫ్లూ జ్వ‌రానికి…
ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా నిమ్మ‌ర‌సాన్ని, కొంత తేనెను క‌లిపి తాగుతుంటే జ‌లుబు, సాధారణ ఫ్లూ జ్వ‌రం త‌గ్గిపోతాయి.
ముక్కు నుంచి రక్తం కారుతుంటే…
నిమ్మ‌ర‌సంలో కాట‌న్ బాల్‌ను ముంచి దాన్ని ర‌క్తం కారుతున్న ముక్కు రంధ్రంపై ఉంచితే బ్లీడింగ్ ఆగిపోతుంది.

పెళ్ళికి ముందు సహజీవనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోర్టు..!

ఓ పెళ్లి కానీ జంట సహజీవనానికి సహజీవనానికి సిగ్నల్ ఇచ్చింది. ప్రేమించుకున్న ఓ హిందూ యువతి, ఓ ముస్లిం యువకుడు కలసి ఉండవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ వివరాలలోకి వెళితే.. గుజరాత్‌ లోని పాకిస్థాన్ సరిహద్దు గ్రామం ధనేరా కు చెందిన ముస్లిం యువకుడు (20 ), అదే ఊరికి చెందిన హిందూ అమ్మాయి (19 ) ప్రేమించుకున్నారు. స్కూల్‌ మేట్స్‌ అయిన కారణంగా.. కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. గత జులైలో ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ.. అబ్బాయి మైనర్‌ కావడంతో పెళ్లి సాధ్యం కాలేదు.
దీనితో ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. వాళ్లిద్దరూ కలసి ఉన్నప్పుడు.. గత సెప్టెంబర్‌ లో ఆ యువతి బంధువులు అమ్మాయిని ఇంటికి తీసుకుపోయారు. ప్రియురాలితో కలిసే ఉండేందుకు అనుమతించాలని కోరుతూ ముస్లిం యువకుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశాడు. కోర్టు ఆదేశాల మేరకు బనస్‌ కాంత్‌ పోలీసులు అమ్మాయిని విచారణకు హాజరుపర్చగా.. తాను ఆ యువకుడితో ఉంటానని కోర్టుకి తెలిపింది.
ఇరు పక్షాల వాదనలు విన్న సీనియర్‌ జడ్జిలు జస్టిస్‌ అఖిల్‌ ఖురేషీ, జస్టిస్‌ బీరేన్‌ వైష్ణవ్‌ లు.. ఆమెకు న్యాయసహకారం అందించకుండా ఉండలేమని.. ఆమెకు ఇష్టమైన చోట ఉండగోరే హక్కును కాదనలేమని చెప్పి.. తనకు ఇష్టమైతే ‌20 ఏళ్ల యువకుడితో కలిసే ఉండొచ్చు అని తీర్పు చెప్పారు. అయితే.. 21 ఏళ్లు నిండగానే అమ్మాయిని పెళ్లి చేసుకునే విధంగా యువకుడితో  అఫిడవిట్‌ దాఖలుచేయించారు.

జూన్‌ లో రూ.2 వేల నోటూ ర‌ద్దు.. మొత్తం డిజిట‌ల్ లావాదేవీలే..!

నల్ల ధనాన్ని పూర్తిగా నిర్ములించడానికి న‌గ‌దు ర‌హిత భార‌తదేశ‌మ‌ని భావిస్తుండడంతో.. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఈ మేరకు ప్ర‌స్తుతం కొత్తగా వచ్చిన రూ.2 వేల నోట్ల‌ను కూడా వ‌చ్చే జూన్‌ లో ర‌ద్దు చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. నిజానికి పెద్ద నోట్ల రద్దుకు.. రూ.2వేల నోటుకు ఎటువంటి సంబంధం లేద‌ని.. రూ.2వేల నోట్లు ప్ర‌వేశ‌పెట్టాల‌ని ఎప్పుడో తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. రూ.500 నోటు కంటే ముందే మార్కెట్లోకి రూ.2 వేల‌ నోటు ముంచెత్త‌డానికి ఇదే కార‌ణ‌మ‌ని.. 4 ప్రింటింగ్ ప్రెస్‌లు ఉంటే ఒక్క‌దాంట్లోనే రూ.2 వేల నోట్ల‌ను ప్రింట్ చేస్తున్నార‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి.
న‌గ‌దు ర‌హితంగా తీర్చిదిద్దాల‌నే ల‌క్ష్యంలో భాగంగానే.. రూ.500 నోట్ల‌ను ప‌రిమితంగా ముద్రిస్తున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ధ్వారా తెలుస్తుంది. ప్ర‌భుత్వం పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేసిన త‌ర్వాత న‌ల్ల‌కుబేరులు త‌మ వ‌ద్ద ఉన్న సొమ్మును.. రూ.2 వేల నోట్ల రూపంలో మార్చుకున్నారు. వ‌చ్చే జూన్‌లో మ‌ళ్లీ ప్ర‌భుత్వం రూ.2 వేల నోటును రద్దు చేస్తే.. న‌ల్ల‌కుబేరులు మ‌ళ్లీ రూ.500 నోట్ల‌లోకి మార్చేసుకుంటారు. ఇలా చేసుకుంటూ పోతే న‌ల్ల‌ధ‌నం ఎప్ప‌టికీ బ‌య‌ట‌కు రాద‌నే ఉద్దేశంతో.. ప్ర‌భుత్వం ప‌క్కా వ్యూహంతోనే రూ.500 నోట్ల‌ను ముద్రిస్తున్నట్లు తెలుస్తుంది. రూ.2 వేల నోటును ర‌ద్దు చేసిన త‌ర్వాతే పూర్తిస్థాయిలో రూ.500 నోట‌ను విడుద‌ల చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.
కాగా ఇప్పుడు ఉన్న నోట్ల కొర‌త‌ను తీర్చాలంటే మార్కెట్లోకి ఏకంగా రూ.8.3 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు ప్ర‌వేశ‌పెట్టాల్సి ఉంది. ఇందుకోసం 1660 కోట్ల నోట్ల‌ను ముద్రించాల్సి ఉండగా.. రూ.500 నోట్ల‌ను పూర్తిస్థాయిలో మార్కెట్లోకి తీసుకురావాలంటే క‌నీసం ఆరు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. జూన్‌లో రూ.2వేల నోటును ర‌ద్దు చేసే నాటికి రూ.500 నోట్ల ముద్ర‌ణ పూర్తి అవుతుంది. అలానే.. రూ.1000 నోట్లును తిరిగి తీసుకువ‌చ్చే ఆలోచ‌న ప్ర‌భుత్వానికి లేద‌ని కూడా సమాచారం. దీనిని బ‌ట్టి చూస్తే ప్ర‌జ‌లు ప్ర‌స్తుతం ప‌డుతున్న క‌ష్టాలు జూన్ వ‌ర‌కు కొన‌సాగే అవ‌కాశం ఉంది.
దీనితో ప్ర‌జ‌ల‌కు న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం వంటి చ‌ర్య‌ల‌ను ప్ర‌భుత్వం చేప‌డుతుంది. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లు డిజిట‌ల్ లావాదేవీల‌కు వెళ్లాల్సిన పరిస్థితిని ప్ర‌భుత్వం క‌ల్పిస్తుంది. అలానే ప్ర‌జ‌లు కూడా గ‌త్యంత‌రం లేక జ‌న‌వ‌రి నుంచి ఇదే విధానం అవ‌లంబించే అవ‌కాశం కూడా ఉంది. ఇలా జూన్ నాటికి పూర్తిస్థాయిలో న‌గ‌దు ర‌హిత లావాదేవీలు నిర్వ‌హించే ప్ర‌క్రియ‌ను పూర్తిచేయాల‌న్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు.

రాత్రికి రాత్రే బిలియనీర్ గా మారిన ఆటోడ్రైవర్..!

పంజాబ్ లోని అమృతసర్ లో ఓ ఆటోడ్రైవర్ రాత్రికి రాత్రే బిలియనీర్ గా మారాడు. ఆ విషయం అతనికి కూడా తెలియదు. మరి అతని కూడా తెలియకుండా అతను బిలియనీర్ గా మారాడు. కారణం బ్యాంకు అధికారులు చేసిన పొరపాటు. ఆ వివరాలలోకి వెళితే.. అమృతసర్ కు చెందిన బల్వీందర్ సింగ్ అనే ఆటో డ్రైవరు స్టేట్ బ్యాంకు ఆఫ్ పాటియాలా బ్రాంచ్ లో 3 వేల రూపాయలతో ప్రధాని జన్ ధన్ యోజన ఖాతాను ఓపెన్ చేసాడు. అతని ఖాతాలో ఆ మొత్తమే ఉంది. అయితే.. నవంబరు 4వ తేదీన తన ఖాతాలోకి 9,806 కోట్లరూపాయలు జమ అయ్యాయని తెలుసుకొన్న బల్వీందర్ సింగ్ షాక్ కి గురి అయ్యాడు.
నవంబరు 4వ తేదీన బ్యాంకు నుంచి 200 తీసుకుందామని బ్యాంకు వెళ్లిన బల్వీందర్.. తనకు కావాల్సిన మొత్తం తీసుకుని బ్యాంకు క్యాషియర్ కు ఖాతా పుస్తకం అందించాడు. అయితే.. బ్యాంకులో ఉన్న మొత్తం 2,800 వేయాల్సిన బ్యాంకు సిబ్బంది.. పొరపాటున అతని అకౌంట్ నెంబర్ ను క్యాష్ కాలమ్ లో నింపడంతో.. అతని అకౌంట్లో ఒక్కసారి 9,80,55,12,231 రూపాయలు వచ్చి పడ్డాయి. అనంతరం చేసిన తప్పు తెలుసుకుని షాక్ కు గురైన సిబ్బంది జరిగిన పొరపాటు గురించి కనీసం బల్వీందర్ సింగ్ కి  సమాచారం కూడా అందించకుండా పొరపాటును సరిదిద్దడం విశేషం. ఆ తరువాత జరిగిన విషయం తెలుసుకున్న బల్వీందర్ సింగ్ కి నవ్వాలో, ఏడవాలో తెలియలేదు.

పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి ఎందుకొచ్చాడో చెప్పిన నాగబాబు

సినిమాలతో ఎంతో బిజీగా ఉంటూ.. కోట్ల రూపాయలు సంపాదిస్తున్న పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ఎందుకు స్థాపించారన్న ప్రశ్నకు అతని సోదరుడు నాగబాబు సమాధానం ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. గొప్ప భావజాలం, మానవత్వం, గొప్ప గుణం పవన్ కు ఉన్న లక్షణాలని చెప్పారు. పవన్ కల్యాణ్ దేన్నీ అంత సాధారణంగా వదలడని చెప్పారు. రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ కోరినందుకో.. అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ లేకపోవడం వల్లో జనసేనను పవన్ స్థాపించలేదని.. ప్రజలకు అండగా నిలబడాలనే పవన్ రాజకీయాల్లోకి వచ్చాడని చెప్పారు.
తన ఎదుట ఎవరైనా బాధ పడితే పవన్ తట్టుకోలేడని.. ఎంతో నిరాశతోనే ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టాడని తెలిపారు. పవన్ ఇంతకు ముందు చెప్పినట్టే, అతని ఆర్థిక పరిస్థితి అంత మెరుగ్గా లేదని.. తన వల్ల కూడా తమ్ముడు కొంచెం డబ్బు నష్టపోయాడని తెలిపారు. అయితే.. డబ్బుకు పవన్ ప్రాధాన్యత ఇవ్వడని.. ఆర్థిక సమస్యలను లెక్క చేయడని చెప్పారు. మరో నాలుగు లేదా ఐదు సినిమాలు చేస్తే.. ఆర్థికంగా సెటిల్ అవుతాడని.. అప్పుడు రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తాడని చెప్పారు.

అత్యంత దారుణానికి ఒడిగట్టిన 19 ఏళ్ల యువతి.. బాయ్ ఫ్రెండ్ ను ఇంటికి పిలిపించుకుని

అమెరికాలోని స్ప్రింగ్ ఫీల్డ్ లో దారుణం చోటు చేసుకుంది. రక్తపిశాచి కావాలనే బలమైన కోరికతో 19 ఏళ్ల యువతి అత్యంత దారుణానికి పూనుకుంది. తన బాయ్ ఫ్రెండ్ ను ఇంటికి పిలిపించుకున్న విక్టోరియా వనట్టెర్.. అతని చేత మద్యం తాగించింది. ఆ తర్వాత తన రక్తం తాగాలంటూ అతడిని ఒత్తిడి తెచ్చింది. రక్తం తాగడానికి తొలుత ఒప్పుకోకపోయినా.. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ ఓకే చెప్పాడు. దీనితో తన చేతిని బాక్స్ కట్టర్ చేత కట్ చేయించి.. తన రక్తాన్ని అతడిచేత తాగించింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య చిన్న గొడవ జరగడంతో కత్తితో అతనిపై దాడి చేసి, చంపబోయింది.
ఈ గొడవలో.. అతని భుజంలో కత్తి దింపింది. ఆ తరువాత ఇద్దరూ స్పృహ తప్పిపోయారు. స్థానికుల సమాచారం మేరకు.. పోలీసులు ఆ ఇంటికి చేరుకునే సమయానికి వారిద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు. వారిద్దరినీ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. ఆమె కోలుకున్నాక కోర్టులో ప్రవేశపెట్టగా.. తనను క్షమించి వదిలేయాలని వేడుకుంది. దీంతో.. ఆమెకి జరిమానాతో పాటు ఆమెకు జైలు శిక్షను విధించింది కోర్టు.