cricket ad

Saturday, 10 December 2016

బంధువులంతా లైన్‌లో నిల‌బ‌డి… పెళ్లికూతురికి న‌గదు విత్ డ్రా చేసి ఇచ్చారు..!

పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న వెలువ‌డిన‌ప్ప‌టి నుంచి మ‌న దేశంలోని ప్ర‌జ‌లు ఎలాంటి అవ‌స్థ‌లు ప‌డుతున్నారో గత కొద్ది రోజులుగా మ‌నం చూస్తూనే ఉన్నాం. న‌గ‌దు స‌రిగ్గా రాక‌పోతుండ‌డంతో అన్ని వ‌ర్గాలకు చెందిన ప్ర‌జ‌ల ప‌నులు ఆగిపోతున్నాయి. అనేక రంగాల్లో కార్య‌క‌లాపాలు స్తంభించిపోయాయి. ప్ర‌ధానంగా ఇది పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో చాలా మంది త‌మ త‌మ కుటుంబాల్లో జ‌ర‌గ‌నున్న పెళ్లిళ్లు ఎలా చేయాల‌నే ఆందోళ‌న‌తో ఉన్నారు. కొంద‌రు ఏకంగా వాటిని ర‌ద్దు చేసుకున్నారు. కొంద‌రు ఎలాగో అప్పు పెట్టో, బ‌తిమాలో, చెక్కులు ఇచ్చో పెళ్లిళ్లు చేశారు. కొంద‌రి పెళ్లిళ్లు ఆగిపోయాయి. అది వేరే విషయం. అయితే ఇలా పెళ్లి ఎక్క‌డ ర‌ద్దు అవుతుంద‌నుకుందో ఏమో ఆ వ‌ధువు మాత్రం త‌న పెళ్లి గురించి చాలా ఆందోళ‌నే ప‌డింది. అయితే ఎట్ట‌కేల‌కు అంద‌రూ స‌హ‌క‌రించ‌డంతో వివాహ తంతు విజ‌య‌వంతంగా ముగిసింది.


 చాలా ఆందోళ‌నే ప‌డింది. అయితే ఎట్ట‌కేల‌కు అంద‌రూ స‌హ‌క‌రించ‌డంతో వివాహ తంతు విజ‌య‌వంతంగా ముగిసింది.
notes-bride
మ‌హారాష్ట్ర కొల్హాపూర్ లోని యాల్గుద్ గ్రామానికి చెందిన స‌యాలీ అనే ఓ యువతిది పేద కుటుంబం. ఆమె తండ్రి వ్య‌వ‌సాయం చేసి చాలా న‌ష్టాల్లోకి కూరుకుపోయాడు. దీంతో అత‌నికి కూతురు స‌యాలీ పెళ్లి చేయ‌డం క‌ష్టంగా మారింది. అయితే స‌యాలీ అందుకు దిగులు చెందలేదు. సొంతంగా ఉద్యోగం చేసింది. పైసా పైసా కూడ‌బెట్టింది. పెళ్లిక‌య్యే డ‌బ్బును ఎప్ప‌టిక‌ప్పుడు బ్యాంక్‌లో సేవ్ చేస్తూ వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఆమెకు అదే ప్రాంతానికి చెందిన ఓ కిరాణా షాపు న‌డుపుకునే యువ‌కుడితో పెళ్లి నిశ్చ‌య‌మైంది. అయితే అనుకోకుండా పెద్ద నోట్ల ర‌ద్దు బాంబ్ పడింది.
ఈ క్ర‌మంలో వైపు పెళ్లి ద‌గ్గ‌ర ప‌డుతోంది. మ‌రో వైపు చూస్తే చేతిలో ఖ‌ర్చుల‌కు డ‌బ్బులు లేవు. బ్యాంకుకు వెళ్లినా రూ.2వేల‌కు మించి ఇవ్వ‌క‌పోవ‌డంతో త‌న పెళ్లిపై స‌యాలీ చాలా ఆందోళ‌న‌కు గురైంది. అయితే ఆమె స్నేహితులు, ఇత‌ర బంధువులు అంద‌రూ క‌లిసి ఆమె స‌హాయం చేశారు. ఆమె అకౌంట్ నుంచి త‌మ త‌మ ఖాతాల‌కు ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా డ‌బ్బును ట్రాన్స్ ఫ‌ర్ చేసుకున్నారు. అనంత‌రం అంద‌రూ బ్యాంకులు, ఏటీఎంల వ‌ద్ద లైనులో నిలుచుని మ‌రీ స‌యాలీకి న‌గ‌దును తీసి ఇచ్చారు. దీంతో ఆమె అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకుంది. త‌న ప‌క్క‌నున్న వారి ఇంత‌లా స‌హాయ ప‌డ‌తాన‌ని ఊహించలేద‌ని, ఏది ఏమైనా చివ‌ర‌కు త‌న‌కు మంచే జ‌రిగింద‌ని, ఆనందంలో పెళ్లి చేసుకుంది స‌యాలీ..!

వ‌ల‌స‌ల దేశం.. రెండో ప్ర‌పంచ యుద్దం త‌రువాత ఇదే రికార్డ్..

భూలోక స్వ‌ర్గ‌మంటూ ఈ దేశం ఎగిరొచ్చావా?.. పోలేక ఉండ‌లేక కంటి నీరై నిలిచావ అంటూ ఓ క‌వి రాసిన రాత‌లు అక్ష‌ర సత్యాల‌వుతున్నాయి. కుటుంబ బాధ్య‌త‌ల కోసం.. ఆర్థిక ఇబ్బందులు దాటేందుకు ఉన్న ఊరుని, క‌న్న‌త‌ల్లిని వ‌దులుకుని ప‌రాయి దేశం వెళుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అయితే ఇందులో బ్రతుకు దెరువు కోసం కాక ప్రాణాల‌ను కాపాడుకునేందుకు ఇత‌ర దేశాల‌కు వెళుతున్న వారి సంఖ్య పెరుగుతుంద‌ని స‌ర్వేలు చెపుతున్నాయి. అయితే ఈ రెండేళ్లల చోటు చేసుకున్న వ‌ల‌స‌ల లెక్క‌తో ఐక్య‌రాజ్య స‌మితే ఆశ్చ‌ర్య పోయింది.
Sikh carrying his wife on his shoulders as he walks with others migrating to their new homeland after the creation of Sikh and Hindu section of Punjab India due to the division of India.
ప్రపంచవ్యాప్తంగా ఆరున్నర కోట్ల మంది ప్రజలు సొంత దేశాల నుండి ప‌రాయి దేశానికి వలస వెళ్లారంటా.. రెండో ప్రపంచ యుద్ధం త‌రువాత ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు స్థానభ్రంశం చెందటం ఇదే మొదటిసారని ఐక్యరాజ్యసమితి శ‌ర‌ణార్థుల‌ సంస్థ అయిన‌ యూఎన్ హెచ్ సీఆర్ ఓ నివేదికలో పేర్కొంది. వీరి సంఖ్య ప్ర‌పంచ జనాభాలో 0.8 శాతం గా ఉంద‌ని తెలిపింది. వ‌ల‌స వెళ్లిన మొత్తం జనాభా.. ఫ్రాన్స్ తో స‌మాన‌మంటా. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల జనాభా మొత్తం కలిపితే ఎంత ఉంటుందో అంత మంది జ‌నాభా వివిధ కార‌ణాల రిత్యా వ‌ల‌స వెళ్లార‌ని ఐక్య‌రాజ్య స‌మితి వెళ్ల‌డించింది. ఒక్క 2015 సంవత్సరంలోనే 58 లక్షల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా వలస వెళ్లాగ.. ఇందులో పెద్ద‌ల కంటే పిల్ల‌లే ఎక్కువ‌గా ఉన్నార‌ని పేర్కోంది.
1442324724syrianrefugees-1170x740
అయితే ఎక్కువ వ‌ల‌స‌లు వెళుతున్న ప్ర‌జ‌లు సిరియా ప్రాంతానికి చెందిన వార‌ని స‌మాచారం. వీరంతా మ‌ధ్య ప్రాచ్య ప్రాంతానికి వ‌ల‌స వస్తున్నార‌ని తెలిపింది. ఇక్క‌డ‌ ప్రతి 20 మందిలో ఒకరు వలస వచ్చిన వారే ఉంటున్నారు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా వలసవెళ్లిన‌ వారిలో ప్రతి 5 పౌరుల్లో ఒకరు సిరియన్ ఉన్నార‌ని తెలిపింది. అయితే శ‌ర‌ణార్థుల‌కు అధికంగా ఆశ్ర‌యం క‌లిపించిన దేశం మాత్రం టర్కీ.. గతేడాది 25 లక్షల మంది శరణార్థులకు ఈ దేశానికి ఆశ్రయం కోసం వ‌చ్చారని స‌మాచారం. శ‌రణార్థుల‌కు ఆశ్ర‌యం కల్పించ‌డంలో భార‌త్ చివ‌రి వ‌రుస‌లో ఉందంటా..?

ట్రైన్, బస్ లలో కూడా 500నోట్లు చెల్లవు.! 5 రోజులు కుదిస్తూ కేంద్రం నిర్ణయం.

కేంద్ర స‌ర్కార్ మ‌రో బాంబు పేల్చింది. శ‌నివారం అర్థ‌రాత్రి నుంచి ప్ర‌యాణాల్లో పాత‌ నోట్లు చెల్ల‌వంటు ప్ర‌క‌టించింది. ముందుగా ప్ర‌క‌టించిన ప్ర‌క‌ట‌న ప్ర‌కారం పాత నోట్ల చెల్లుబాటు డిసెంబ‌ర్ 15 వ‌ర‌కు ఉండేది. అయితే ఆ తేదిని కుదిస్తూ మ‌రో తాజా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది కేంద్ర స‌ర్కార్. రైలు, బస్సు, సబర్బన్‌, మెట్రో టికెట్ల కొనుగోలుకు డిసెంబ‌ర్ 10 అంటే శనివారం అర్ధరాత్రి నుంచి పాత రూ.500 నోట్లు చెల్లవు అని దీని సారాంశం.
hy27news0_gdhad_hy_2388154f
దీంతో ప్ర‌యాణాల్లో ఉన్న సామాన్యులు షాక్ కు గుర‌వుతున్నారు. స‌డ‌న్ గా ఇలా నిర్ణయం తీసుకుంటే మా ప‌రిస్థితి ఏంటంటూ ప్ర‌శ్నిస్తున్నారు. నోట్ల ర‌ద్దు జ‌రిగి ఇప్ప‌టికే నెల గ‌డిచిపోయిన కొత్త నోట్లు పూర్తి స్థాయిల్లో చేతిలోకి రాలేద‌ని.. చిల్ల‌ర క‌ష్టాలు తీవ్రంగా ఉన్నాయ‌ని వాపోతున్నారు. 5 రోజులు పొడ‌గించాల్సింది పోయి.. గ‌డువును కుదిస్తారంటూ మండిప‌డుతున్నారు. ఇక తాజా ప్ర‌క‌ట‌న ప్ర‌కారం ప్ర‌యాణానికి కొత్త నోట్లను వాడాల్సిందే. లేదా చలామణీలో ఉన్న పాత రూ.100, 50, 20, 10, 5 నోట్లను, నాణేలను వినియోగించుక త‌ప్ప‌ని ప‌రిస్థితి.
02/10/2014 - Hyderabad: Secunderabad railway station saw a huge rush of passengers waiting to take trains to return to their native places during the festival season - Deccan Chronicle Photo. [Telangna, Crowd]
పాత నోట్లు ఇంకా ఎక్క‌డ చెల్లుబాట‌వుతాయంటే..
  • డిసెంబ‌ర్ 15 న వ‌ర‌కు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యచికిత్సలకు
  • వైద్యుల అనుమ‌తితో ప్రభుత్వ ఆస్పత్రుల్లోని మందుల షాపుల్లో మందులు కొనుగోలు చేసేందుకు..
  • గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్, నీటి బిల్లుల చెల్లింపునకు, గ్యాస్‌ సిలిండర్ల కొనుగోలుకు
  •  స్మశానాల్లో దహనసంస్కారాల‌కు
  • ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో ఫీజుల చెల్లింపునకు
  • పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని కట్టడాల సందర్శన టికెట్లకు డిసెంబరు 15 దాకా పాత రూ.500 నోట్లను అనుమతిస్తారు.
  • ఇక పాత 1000 నోటు కేవ‌లం బ్యాంకులో డిపాజిట్ కు త‌ప్ప ఎక్క‌డ ప‌ని చేయ‌డం లేద‌న్న‌ది తెలిసిందే.

ఎయిర్ టెల్ క‌స్ట‌మ‌ర్ల‌కు శుభ‌వార్త.. జియో త‌ర‌హ‌లోనే ఫ్రీ వాయిస్ కాల్స్ కు రెడీ.!

జియో దెబ్బ‌కు టెలికాం సంస్థ‌లు దిగి వ‌స్తున్నాయి. నిన్న‌ామొన్న‌టి వ‌ర‌కు టారిప్ రేట్ల‌తో వినియోగ‌దారుల‌కు చుక్క‌లు చూపించిన టెలికాం సంస్థ‌లు జియో ఎంట్రీతో ఒక్క సారిగా ఆలోచ‌న‌లో ప‌డ్డాయి. తాజాగా వెల్ల‌డించిన జియో న్యూ ఇయ‌ర్ ఆఫ‌ర్ తో భార‌త్ లో భారీగా క‌స్ట‌మ‌ర్ల‌ను కలిగిన ఎయిర్ టెల్ కు మ‌రిన్ని క‌ష్టాలు వ‌చ్చిప‌డ్డ‌ట్టైంది. దీంతో  దిద్దు బాటు చ‌ర్య‌గా క‌స్ట‌మ‌ర్ల ను కాపాడుకునేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది ఎయిర్ టెల్ . జియో త‌ర‌హ‌లోనే దేశవ్యాప్తంగా ప్రీ కాల్స్, ఫ్రీ డాటా అంటూ రెండు కొత్త ప్రీ పెయిడ్ పథకాలను ప్రకటించింది.


జియో దెబ్బ‌కు టెలికాం సంస్థ‌లు దిగి వ‌స్తున్నాయి. నిన్న‌ామొన్న‌టి వ‌ర‌కు టారిప్ రేట్ల‌తో వినియోగ‌దారుల‌కు చుక్క‌లు చూపించిన టెలికాం సంస్థ‌లు జియో ఎంట్రీతో ఒక్క సారిగా ఆలోచ‌న‌లో ప‌డ్డాయి. తాజాగా వెల్ల‌డించిన జియో న్యూ ఇయ‌ర్ ఆఫ‌ర్ తో భార‌త్ లో భారీగా క‌స్ట‌మ‌ర్ల‌ను కలిగిన ఎయిర్ టెల్ కు మ‌రిన్ని క‌ష్టాలు వ‌చ్చిప‌డ్డ‌ట్టైంది. దీంతో  దిద్దు బాటు చ‌ర్య‌గా క‌స్ట‌మ‌ర్ల ను కాపాడుకునేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది ఎయిర్ టెల్ . జియో త‌ర‌హ‌లోనే దేశవ్యాప్తంగా ప్రీ కాల్స్, ఫ్రీ డాటా అంటూ రెండు కొత్త ప్రీ పెయిడ్ పథకాలను ప్రకటించింది.
reliance-jio-vs-airtel-4g-volte
ఆఫ‌ర్ల వివ‌రాలుః 
  • రూ.345 తో రిచార్జ్ చేసుకంటే భారతదేశం లో ఏ నెట్వర్క్ కైనా…అన్ లిమిటెడ్ ఫ్రీ   వాయిస్ కాల్స్ (లోకల్ అండ్ ఎస్టీడీ) చేసుకోవచ్చు. దీంతో అద‌నంగా 1 GB 4G డేటాను కూడా ఉచితంగా పొందవ‌చ్చు.
  • రూ. 145 తో రిచార్జ్ చేసుకుంటే దేశవ్యాప్తంగా ఎయిర్ టెల్ టు ఎయిర్ టెల్ కాలింగ్ ఫ్రీ.. అద‌నంగా స్మార్ట్ పోన్ల‌కు
  • 300MB  4G డాటా.. 50MB  డాటా బేసిక్ ఫోన్లకు ఉచితం.
  • రూ. 145 తో చేసుకునే రిచార్జ్ కు వాలిడిటీ 28 రోజులు ఉంటుద‌ని తెలిపింది.

శృంగారంలో స్త్రీలకు 237 ర‌కాల కోరిక‌లుంటాయంట. అందులో టాప్-5 ఇదిగో.!

శృంగారం.. ఈ ప‌దం విన‌గానే చాలు కుర్రాళ్ల కోరిక‌లు గుర్రాళ్ల ప‌రిగెడితాయ్.శృంగార విష‌యంలో మ‌గాళ్ల కంటే మ‌గువ‌ల‌కే ఎక్కువ కోరిక‌లుంటాయ‌ని చెపుతున్నారు ప‌రిశోద‌కులు. మ‌గ‌వారిలో సెక్స్ కోరిక‌లు క‌ల‌గ‌డానికి ప్రేరేపించే కార‌ణాలు ఒక‌టి రెండ‌యితే.. మ‌గువ‌ల్లో మాత్రం ఆ సంఖ్య 237 అని చెపుతున్నారు. స్త్రీల మీద శృంగార విష‌యంలో చేసిన ప‌రిశోధ‌న‌లే ఇందుకు సాక్ష్యం అని కూడా చెబుతున్నారు.
పురుషుడు బెడ్ మీదకి రావ‌డానికి స్త్రీ శ‌రీరాకృతి.. స‌మ‌యం.. త‌న మూడ్ కార‌కాలైతే స్త్రీ బెడ్ మీద కు రావ‌డానికి 237 కార‌ణాలుంటాయి. స్త్రీలో శృంగార కోరికను రేకెత్తించే కార‌ణాల గురించి జ‌రిగిన అధ్య‌య‌నం లో ఈ విషయం వెల్ల‌డైంది. ఎలాంటి ఆలోచ‌న క‌లిగిన‌ప్పుడు మీకు శృంగారంలో ఉండాల‌నిపిస్తుంది అని ప‌రిశోద‌కులు అడిగినప్పుడు విచిత్ర‌మైన స‌మాధానాలు వ‌చ్చాయంట. కొంద‌రైతే ప‌రిశోద‌కులే బిత్త‌ర‌పోయే స‌మాధానాల‌ను చెప్పారంట. అందులో టాప్ 5 స‌మాధానాలు ఇదిగో….
timthumb_by_leccia-d7umlng
1. శారీర‌క ఆక‌ర్ష‌ణ‌
రెండు విభిన్న ధృవాల మ‌ధ్య ఆకార్ష‌ణ ఎక్కువ‌. ఈ విష‌యం కొత్త‌గా చెప్పేది కాక‌పోయినా.. స్త్రీకి పురుషుడి మీద ఆశ, కోరిక పెర‌గ‌డానికి కార‌ణం ఈ శారీర‌క ఆక‌ర్షణే అని మ‌రో సారి తేలింది. పార్ట్ న‌ర్ ఆక‌ర్షించినపుడు త‌మ లో శృంగార కోరిక‌లు తార స్థాయికి చేరుతాయ‌ని ఎక్కువ మంది స్త్రీలో పేర్కోన్నారు. సెక్స్ కోరిక‌ల‌కి ప్ర‌ధాన కార‌ణం ఆక‌ర్ష‌ణ అని వారి చెపుతున్నారు.
2. ప్రేమ‌
పురుషుడి మీద‌ ప్రేమను శృంగారం ద్వారా వ్యక్తీకరించడం రెండ‌వ కార‌ణం. ప్రేమను ప్రదర్శించడానికి కూడా శృంగారం ఒక గొప్ప మార్గమని మగువలు నమ్ముతున్నారట.
o-first-year-of-marriage-facebook
3.లైంగిక తృప్తి
స్త్రీలు శృంగారంలో కలిగే మధురానుభూతి రతికి ప్రేరేపిస్తుందని చెప్పారట. లైంగిక తృప్తి శృంగారంలో అల్టిమేట్ అని మ‌గువ‌లు కితాబిచ్చారు.
4. ఆనందం
ఈ కార‌ణాన్ని ఎక్కువ మంది స్త్రీలు ఒప్పుకున్నారంట‌. సెక్స్ లో శ‌రీరం ఆనందాన్ని పొందుతుంద‌ని త‌మ శారీర‌క ప్ర‌గ‌తి ఎక్కువ‌గా ఉన్న‌ట్టు అనిపిస్తుందని మ‌హిళ‌లు చెపుతున్నారు.
married
5. సెక్స్ ను ఆట‌గా భావించడం
పురుషుల కంటే స్త్రీలు ఇది ఒక మాంచి కిక్కిచ్చే ఆట‌గా ప‌రిగ‌ణిస్తారంటా. సెక్స్ లో ఉన్న‌ప్పుడు ప్రేమ‌లో ఉన్నామనే భావన ఎక్కువ ఉంటుంద‌ని స్త్రీలు చెప్పుకొచ్చారు.
ఇక శృంగారం ద్వార పిల్ల‌లు క‌నే ఆలోచ‌న విష‌యానికి వ‌స్తే 72 శాతం మంది మాత్ర‌మే ఇందుకు టాప్ టెన్ లో చోటు ఇచ్చిన‌ట్టు చెప్పారు. పిల్ల‌ల కావాల‌ని శృంగారంలోకి వెళితే ఆనందం దొర‌క‌ద‌ని 12 శాతం తెలిపిన‌ట్టు ప‌రిశోధకులు చెబుతున్నారు.

108 సంఖ్య పవర్ అంతా ఇంతా కాదు!! ప్రపంచానికే సైన్స్ ను పరిచయం చేసిన హిస్టరీ ఆ సంఖ్యది.

108 ఈ సంఖ్య చెప్ప‌గానే ట‌క్కున గుర్తుకు వ‌చ్చేది ప్ర‌భుత్వ‌ అంబులెన్స్. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిలో ప్రాణాలు కాపాడేందుకు వినియోగించే అంబులెన్స్ వాహ‌నానికి ఆ నెంబ‌ర్ నే ఎందుకు పెట్టారు?. ప్రాణాలు నిలిపేంత శ‌క్తి ఈ సంఖ్య‌కు ఉందా.. గుడిలో 108 ప్ర‌ద‌క్షిణాలు చేస్తే కోరిన కోరిక‌లు తీరుతాయ‌ని న‌మ్మ‌డం వెనుకున్న ర‌హ‌స్యం ఏంటి..? దేవుని నామ‌స్మ‌ర‌ణ‌లో ఉండే పూస‌ల సంఖ్య 108 ఎందుకు ఉంటాయి.? అస‌లు ఈ సంఖ్య వెనుకున్న మ‌ర్మం ఏంటి.. హిందు ధ‌ర్మం చెపుతున్న ర‌హ‌స్యం ఏంటి..?
హింధు ధ‌ర్మం ప్ర‌కారం..
క‌ష్టాల క‌డ‌లిలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి దీక్ష‌తో న‌మ్మ‌కంతో అష్టోత్తరశతనామావళి పఠిస్తే దేవుడు క‌రుణిస్తాడ‌ని న‌మ్మ‌కం. అందుకు జ‌ప‌మాల‌తో నామ‌స్మ‌ర‌ణ చేయవ‌ల‌సి ఉంటుంది. అయితే ఆ జ‌ప‌మాల‌లో స‌రిగ్గా 108 పూస‌లు ఉంటాయి. అనాథిగా ఈ ఆచారం కొన‌సాగుతూ వ‌స్తుంది. 108 సార్లు దేవుడి నామ‌స్మ‌ర‌ణ చేయ‌డం ద్వారా మ‌న‌సుకు.. మ‌నిషికి ప్ర‌శాంత‌త ల‌భిస్తుంద‌నేది నిజం. మ‌రి కొన్ని మ‌తాల్లో కూడా ఈ జ‌ప‌మాల సంప్ర‌దాయం ఉంది.
the-benefits-of-chanting-japam-1
అమృతం పుట్టుక‌కు కార‌ణం 108..
క్షీరసాగరమథనంలో 54 మంది రాక్షసులు, 54 దేవగణాలు ఇరువైపుల ఉండి సాగ‌రాన్ని చిలికితే అమృతం వెలికి వచ్చింది. అయితే ఇందులో ముందుగా విషం వ‌చ్చింద‌న్న‌ది తెలిసిన స‌త్య‌మే. అయినా విశ్రమించ‌కుండా సాగ‌ర‌మ‌థ‌నాన్ని కొన‌సాగించారు. చివ‌ర‌న పుట్టిందే అమృతం. ఈ 108 సంఖ్య మనిషిలోని మంచీ, చెడు లక్షణాల‌ను రెండుగా వేరు చేస్తుంద‌ని శాస్త్రం చెపుతోంది. ఈ సంఖ్య బ‌లంతో మంచిది పైచేయి అయి మ‌నిషి అమృతమయమైన మోక్షాన్ని సాధించగలుగుతాడ‌ని చెపుతోంది.
kurma
108 లోనే ప్ర‌పంచం..
కేవ‌లం హింధు ధ‌ర్మం.. హిందు దేశంలోనే కాదు ఈ సంఖ్య‌ను పాశ్చ‌త్య దేశాలు కూడా పాటిస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక‌త అస‌లు పుట్ట‌నే పుట్ట‌ని స‌మ‌యంలో వందల ఏళ్ల క్రితమే భార‌త్ ఖగోళశాస్త్రం పై ప‌ట్టు సాధించింది. ఇందుకు సాక్ష్యం ఇప్పుడు మ‌నం ఫాలో అవుతున్న సైన్స్. భార‌తీయ ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు పదిహేను వందల సంవత్సరాల క్రితమే సూర్యసిద్ధాంతం ద్వారా విశ్వంలో చిట్ట‌చివ‌రన ఉన్న శ‌ని గ్ర‌హం చుట్టు కొల‌త క‌నుగొన్నారు. సూర్యుడికి భూమి కి మ‌ధ్య కొల‌త‌ల‌ను ఖ‌చ్చితంగా లెక్క‌క‌ట్ట‌గ‌లిగారు. ఆ లెక్క‌ల్లోని సంఖ్యే 108. సూర్యుని చుట్టుకొలతను 108 గుణిస్తే భూమికీ, సూర్యునికీ మధ్య ఉన్న దూరం వస్తుంది. చంద్రుని చుట్టుకొలతను 108తో గుణిస్తే భూమికీ, చంద్రునికీ మధ్య ఉన్న దూరం వస్తుంది. అంతే కాదు సూర్యుడు దాదాపు భూమికి 108 రెట్లు పెద్దగా ఉంటాడ‌ని కూడా 15 వంద‌ల సంత్స‌రాల క్రిత‌మే మ‌న భార‌తీయులు తెల్చేశారు. దీంతో 108 పై శాస్త్ర‌వేత్త‌లకు సైతం పూర్తి న‌మ్మ‌కం ఉంద‌ని స‌మాచారం.
108-1
పుట్టుక నుంచి చావు వ‌ర‌కు 108..
హిందు సంప్ర‌దాయం ప్ర‌కారం వ్య‌క్తి పుట్టుక‌ను 108 సంఖ్య తెలియజేస్తుంది. 27 నక్షత్రాల‌ను నాలుగేసి పాదాలతో భాగిస్తే 108 పాదాలు వస్తాయి. దీంతో పుట్టిన ప్ర‌తి ప్రాణి 108 వర్గాలలో ఏదో ఓ వ‌ర్గానికి ప్ర‌తిబింబ‌మే అని చెపుతోంది శాస్త్రం. ఇక చావు కూడా కాని ఈ సంఖ్య వెనుకున్న పూర్తి ర‌హ‌స్యాల‌ను మాత్రం ఇప్ప‌టికి ఎవ‌రు బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌లేక‌పోయారు. ఈ సంఖ్య కి మ‌నిషి కి జీవితంలో ఎక్క‌డో ఓ సంబందం ఉంద‌ని మాత్రం అర్థం అవుతుంది. న‌మ్మిన వారికి బ‌లాన్నిచ్చే సంఖ్య న‌మ్మ‌కం లేని వారికి కూడా స‌హ‌యం చేసే ప్రాణ దాత 108. చివ‌ర‌గా చెప్పేది 108 గురించి తెలిసింది గోరంత తెలియాల్సింది కొండంత.

మరో బాలీవుడ్‌ నటి ప్రేమలో జహీర్‌?



భారత్‌లో బాలీవుడ్‌కు, క్రికెటర్లకు మధ్య అనుబంధం ఇప్పటిది కాదు. వారి మధ్య ప్రేమలు, పెళ్లిల్లు సాధారణమే. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ ఆలీఖాన్‌ తల్లిదండ్రులైన మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడి, షర్మిలా ఠాగూర్‌ల ప్రేమాయణం నుంచి నేటి విరాట్‌ కోహ్లీ, అనుష్కా శర్మల లవ్‌స్టోరీ వరకు మనకు పరిచయమే. ఇటీవలె డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ యువరాజ్‌ సింగ్‌, నటి హాజెల్‌ కీచ్‌లు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 
తాజాగా ఈ జాబితాలో టీమిండియా మాజీ ఫాస్ట్‌బౌలర్‌ జహీర్‌ఖాన్‌ చేరినట్టు సమాచారం. జహీర్‌ ఇంతకుముందే ఇషా శర్వాణీ (కిస్నా ఫేమ్‌) అనే బాలీవుడ్‌ హీరోయిన్‌తో ప్రేమాయణం సాగించాడు. అయితే ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు. ఇప్పుడు జహీర్‌ మరో బాలీవుడ్‌ హీరోయిన్‌కు దగ్గరైనట్టు సమాచారం. ఆమె ఎవరో కాదు షారూక్‌ నటించిన ‘చక్‌ దే ఇండియా’లో నటించిన బెంగాలీ నటి సాగరికా ఘట్గే. జహీర్‌, సాగిరకలు ప్రస్తుతం ప్రేమలో మునిగి తేలుతున్నట్టు సమాచారం. వీరిద్దరూ జంటగా యువరాజ్‌ పెళ్లి వేడుకకు కూడా హాజరై కనువిందు చేశారు. 
యువీకి వివాహ శుభాకాంక్షలు చెప్పిన క్రికెటర్‌ రోహిత్‌ శర్మ.. నెక్ట్స్‌ జహీరే అని ట్వీట్‌ చేశాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన జహీర్‌ త్వరలోనే సాగిరకతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు కోడై కూస్తోంది బాలీవుడ్‌ మీడియా.