పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడినప్పటి నుంచి మన దేశంలోని
ప్రజలు ఎలాంటి అవస్థలు పడుతున్నారో గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే
ఉన్నాం. నగదు సరిగ్గా రాకపోతుండడంతో అన్ని వర్గాలకు చెందిన ప్రజల
పనులు ఆగిపోతున్నాయి. అనేక రంగాల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి.
ప్రధానంగా ఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలా మంది తమ తమ కుటుంబాల్లో
జరగనున్న పెళ్లిళ్లు ఎలా చేయాలనే ఆందోళనతో ఉన్నారు. కొందరు ఏకంగా
వాటిని రద్దు చేసుకున్నారు. కొందరు ఎలాగో అప్పు పెట్టో, బతిమాలో,
చెక్కులు ఇచ్చో పెళ్లిళ్లు చేశారు. కొందరి పెళ్లిళ్లు ఆగిపోయాయి. అది వేరే
విషయం. అయితే ఇలా పెళ్లి ఎక్కడ రద్దు అవుతుందనుకుందో ఏమో ఆ వధువు
మాత్రం తన పెళ్లి గురించి చాలా ఆందోళనే పడింది. అయితే ఎట్టకేలకు
అందరూ సహకరించడంతో వివాహ తంతు విజయవంతంగా ముగిసింది.
చాలా ఆందోళనే పడింది. అయితే ఎట్టకేలకు అందరూ సహకరించడంతో వివాహ తంతు విజయవంతంగా ముగిసింది.
చాలా ఆందోళనే పడింది. అయితే ఎట్టకేలకు అందరూ సహకరించడంతో వివాహ తంతు విజయవంతంగా ముగిసింది.
మహారాష్ట్ర కొల్హాపూర్ లోని యాల్గుద్
గ్రామానికి చెందిన సయాలీ అనే ఓ యువతిది పేద కుటుంబం. ఆమె తండ్రి
వ్యవసాయం చేసి చాలా నష్టాల్లోకి కూరుకుపోయాడు. దీంతో అతనికి కూతురు
సయాలీ పెళ్లి చేయడం కష్టంగా మారింది. అయితే సయాలీ అందుకు దిగులు
చెందలేదు. సొంతంగా ఉద్యోగం చేసింది. పైసా పైసా కూడబెట్టింది. పెళ్లికయ్యే
డబ్బును ఎప్పటికప్పుడు బ్యాంక్‌లో సేవ్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే
ఆమెకు అదే ప్రాంతానికి చెందిన ఓ కిరాణా షాపు నడుపుకునే యువకుడితో పెళ్లి
నిశ్చయమైంది. అయితే అనుకోకుండా పెద్ద నోట్ల రద్దు బాంబ్ పడింది.
ఈ క్రమంలో వైపు పెళ్లి దగ్గర
పడుతోంది. మరో వైపు చూస్తే చేతిలో ఖర్చులకు డబ్బులు లేవు. బ్యాంకుకు
వెళ్లినా రూ.2వేలకు మించి ఇవ్వకపోవడంతో తన పెళ్లిపై సయాలీ చాలా
ఆందోళనకు గురైంది. అయితే ఆమె స్నేహితులు, ఇతర బంధువులు అందరూ కలిసి
ఆమె సహాయం చేశారు. ఆమె అకౌంట్ నుంచి తమ తమ ఖాతాలకు ఆన్ లైన్ బ్యాంకింగ్
ద్వారా డబ్బును ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు. అనంతరం అందరూ బ్యాంకులు,
ఏటీఎంల వద్ద లైనులో నిలుచుని మరీ సయాలీకి నగదును తీసి ఇచ్చారు. దీంతో
ఆమె అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంది. తన పక్కనున్న వారి ఇంతలా సహాయ
పడతానని ఊహించలేదని, ఏది ఏమైనా చివరకు తనకు మంచే జరిగిందని,
ఆనందంలో పెళ్లి చేసుకుంది సయాలీ..!
No comments:
Post a Comment