cricket ad

Monday 12 December 2016

ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి... కొత్త పార్టీకీ ఏర్పాట్లు..!

సూప‌ర్ ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి రానున్నాడ‌ని కొత్త పార్టీ పెట్ట‌బోతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. జయలలిత మరణంతో తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. అధికార అన్నాడీఎంకే పార్టీలో అంతర్గతంగా చాలా లుకలుకలు ఉన్నాయి. మరోవైపు కొంతమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను లాగి... ప్రతిపక్ష డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యత్నాన్ని కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయమని ఆయన చెప్పారు. రజనీ రాజకీయాల్లోకి రావాలని ఎన్నో ఏళ్లుగా ఆయన అభిమానులు కోరుతున్నారని... అభిమానుల కోరిక నెరవేరడానికి ఇదే సరైన తరుణమని తెలిపారు.  చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రజనీ తాజా చిత్రం వచ్చే ఏడాది పూర్తవుతుందని... అప్పటి వరకు తమిళనాట రాజకీయ పరిస్థితులను ఆయన పరిశీలిస్తుంటారని... ఆ తర్వాత ఏదైనా జరగవచ్చని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీ బీజేపీలో చేరుతారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... అలాంటిదేమీ ఉండదని, రాజకీయాల్లోకి వస్తే కొత్త పార్టీనే స్థాపిస్తారని చెప్పారు. పార్టీని స్థాపిస్తే రజనీ విజయం ఖాయమని తెలిపారు. ఈ విష‌యాల‌న్నీ ఆయ‌న సోద‌రుడే స్వ‌యంగా చెప్ప‌డంతో ర‌జనీకాంత్ రాజ‌య‌కీయ అరంగేట్రం త్వ‌ర‌లో ఖాయం అని విశ్లేష‌కులు అంటున్నారు.

జ‌న‌ధన్ ఖాతాల్లోకి 74వేల 610కోట్లు..!

పెద్ద నోట్ల ర‌ద్దుతో జ‌న‌ధన్ ఖాతాల్లోకి పెద్ద మొత్తం డ‌బ్బు వ‌చ్చి చేరింది.  ఇప్పటివరకు 74 వేల 610 కోట్లు జ‌నధ‌న్ ఖాతాల్లో జమయ్యాయి. ఈనెలాఖరు వరకు రద్దైన పాత నోట్లను బ్యాంకుల్లో డిపాటిట్ చేసుకొనే అవకాశం ఉంది. చివరి గడువు నాటికి ఈ మొత్తం పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ న‌వంబ‌ర్ 8 రాత్రి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. . అక్కడి నుంచి సామాన్యుల జనధన్ ఖాతాల్లోకి బడాబాబుల నల్లధనం కుప్పులు తెప్పలుగా వచ్చి చేరుతోంది. జన్ ధన్ అకౌంట్ లలో 50 వేల కంటే ఎక్కవ డిపాజిట్ చేయడనికి వీళ్లేదు. లక్షల్లో పోగైన జన్ ధన్ ఖాతాలోని సొమ్మును సీజ్ చేస్తామని ఐటీ శాఖ వెల్లడించింది.

వీటి ధరలు భారీగా తగ్గనున్నాయట

అమృత్ పథకం కింద దాదాపు రెండువేల మెడిసిన్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఎమ్మార్పీ రేట్ల కంటే 60 నుంచి 90శాతం వరకు మందుల ధరలను తగ్గించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ధరలు తగ్గనుండటంతో రోగులకు మేలవుతుందని ఆయన పేర్కొన్నారు. సామాన్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో  ఈ మందులను ధరలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో రోగులకు సరైన వైద్య సేవలు అందించేందుకు మరిన్ని పథకాలను ప్రవేశపెడతామని తెలిపారు.వీటి ధరలు భారీగా తగ్గనున్నాయట…

దేశంలో ఈ వ్యాధుల వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారట..!

మన దేశంలో ఎక్కువ మంది గుండె జబ్బులు, పక్షవాతం, ఊపిరితిత్తుల్లో సమస్యల వల్ల చనిపోతున్నారని తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. వీటి తర్వాత షుగర్, మూత్రపిండ వ్యాధులు, న్యుమోనియా, అతిసారం, టీబీ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారట. వ్యాధులే కాకుండా రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువ మందిని బలితీసుకుంటున్నాయని రీసర్చ్ తెలిపింది.
 
195 దేశాల్లో పరిశోధకులు జరిపిన అధ్యయనంలో మరణాలకు గల కారణాలు వెల్లడయ్యాయి. పాశ్చాత్య జీవనశైలిని పాటించే క్రమంలో, మన దేశంలో అంటువ్యాధులు ఎక్కువ అవుతున్నాయని వెల్లడైంది. అయితే, జీవనశైలిని మార్చుకోవడం, యాంటీబయోటిక్స్ తో సత్వర చికిత్స చేయించుకోవడం ద్వారా అంటువ్యాధులను నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. సురక్షిత నీరు, పారిశుద్ధ్యం లేకపోవడంతో నెలలు నిండకుండానే చిన్నారులు మృత్యువాత పడుతున్నారని వారు పేర్కొన్నారు. ప్రతి ఏడాది మన దేశంలో కోటి కంటే ఎక్కువ మంది చనిపోతున్నారని వివరించారు.

ఒత్తిడికి చెక్ పెట్టాలంటే..?

ఒత్తిడికి చెక్ పెట్టాలంటే.. రోజంతా పనిచేయాల్సిన అవసరం లేదు. పక్కా ప్లాన్ ప్రకారం వేసుకుంటే సరిపోతుంది. కార్యాలయాలు వెళ్ళే మహిళలు రోజూ హడావుడిగా కదలడం ద్వారా వారికి అనారోగ్య సమస్యలు తప్పవని.. అందుచేత చేసే పనిని సమయాన్ని వృధా చేసుకోకుండా చేసుకుంటే.. ఎలాంటి తలనొప్పులు ఉండవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్రపోకుండా త్వరగా నిద్రపోవాలని తెలుపుతున్నారు. రాత్రి ఎంత త్వరగా పనులన్నీ పూర్తి చేసుకుని నిద్రిస్తారో ఆరోగ్యానికి అంత మేలు చేసినట్లవుతుంది. దీని ద్వారా ప్రతి మనిషిలో ఆందోళన తగ్గుతుంది. ప్రతి రోజూ ఒక సమయానికి నిద్ర లేవడం ద్వారా జీవక్రియల రేటు మెరుగవుతుంది. ఈ ప్రక్రియను కొనసాగించాలంటే.. సెలవు రోజూ ఉదయాన్నే లేవాలి.  
 
నిద్రలేవగానే బద్ధకం, మత్తుగా అనిపిస్తే దాన్ని వెంటనే వదిలించుకోవాలి. లేదంటే ఆ ప్రభావం రోజంతా ఉంటుంది. ఉదయం పూట సూర్మరశ్మి తగిలితే శరీరానికి నూతనోత్తేజం అందుతుంది, అసౌకర్యం దూరమవుతుంది. ఎండలో ఉండే 'డి' విటమిన్ ఒత్తిళ్లనూ దూరం చేస్తుంది.
 

సూపర్‌ మార్కెట్లో పళ్లు, కూరగాయలు కొనేముందు వీటిని గమనించండి

సూపర్‌ మార్కెట్‌లో అమ్మే పళ్లు, కాయగూరలను గమనిస్తే వాటిపై ఏవో లేబుల్స్‌ అతికించి ఉంటాయి. కానీ చాలామంది వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. ఆ లేబుల్‌... ఉత్పత్తి చేసేవాడికి, అమ్మేవాడికి మాత్రమే సంబంధించిన విషయంగా భావిస్తారు. నిజానికా లేబుల్‌ వినియోగదారుడు తను కొంటున్న వస్తువు ఎలాంటిదో తెలుసుకోవడానికి ఉద్దేశించినది. 
ప్రస్తుతం ఎక్కడ ఎవరి నోట విన్నా ఆర్గానిక్‌ అనే మాట వినిపిస్తోంది. ఆర్గానిక్‌ కాయగూరలు, పళ్లు అంటే సేంద్రీయ ఎరువులు వేసి సహజ పద్ధతుల్లో పండించినవని మనకు తెలుసు. అందుకే అవి ఆరోగ్యానికి మంచివని కొంచెం ఖరీదు ఎక్కువైనా కొంటుంటాం. ముఖ్యంగా పళ్ల రసాలకి ఆర్గానిక్‌ పళ్లే శరణ్యం. ఎందుకంటే పళ్లరసాలు త్వరగా జీర్ణమై మన శరీరంలో కలిసిపోతాయి. ఆ పళ్లరసం పెస్టిసైడ్స్‌, ఫంగిసైడ్స్‌ వేసి, రసాయనిక ఎరువులు వాడి పండించిన పళ్లనుంచి తయారు చేసినదైతే... పళ్లరసం తీసుకున్న వెంటనే విష పదార్థాలు నేరుగా మన శరీరంలో కలిసిపోతాయి. దానివల్ల అప్పటికప్పుడు ఆరోగ్యం పాడు కావడంతో పాటు... భవిష్యత్తులో క్యాన్సర్‌ వంటి ప్రమాదకర జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. 
మరి ఏవి సహజ పద్ధతుల్లో పండించినవి? ఏవి పురుగు మందులు, రసాయనిక ఎరువులు వేసి పండించినవి? ఏవి జన్యుమార్పిడి ద్వారా పండించినవి?... అని తెలుసుకోవాలంటే పళ్ళు, కాయగూరలపై వేసే లేబుల్స్‌ను జాగ్రత్తగా గమనించాలి.
ఆపిల్‌కున్న లేబుల్‌పై నాలుగు అంకెలు ఉండి, మొదటి అంకె మూడు లేదా నాలుగు ఉంటే రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడి పండించిన పంట.
లేబుల్‌పై అయిదు అంకెలు ఉండి... మొదటి అంకె ఎనిమిది అయితే జన్యుమార్పిడి ద్వారా పండించిన పంట.
లేబుల్‌పై అయిదు అంకెలు ఉండి... మొదటి అంకె తొమ్మిది ఉన్నట్లయితే అది ఆర్గానిక్‌ పంట.
ఇక పళ్లపై లేబుల్‌ని పిల్లలు చూసుకోకుండా తినేస్తే గాభరా పడాల్సిన అవసరం లేదు. ఆ లేబుల్‌ కాగితాన్ని తినదగిన పేపర్‌తోనే తయారు చేస్తారు. అంతేకాదు.. ఆ లేబుల్‌ని అతికించడానికి ఉపయోగించే జిగురు సైతం తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలతోనే తయారవుతుంది.
 

ఆ జ్యూస్ తో గ్యాస్ మటుమాయం

కొందరికి త‌ర‌చుగా క‌డుపులో మంట‌ రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు.ఈ నొప్పి వ‌చ్చిన‌ప్పుడు ఏ ప‌నిని స‌క్ర‌మంగా చేయ‌నివ్వ‌దు.. మంట వ‌స్తూనే ఉంటుంది. దీంతో త‌ర‌చూ బాధ‌ప‌డేవారు గ్యాస్ నొప్పి అని గుర్తించారా.. త‌ర‌చూ నొప్పి వ‌స్తే వైద్యుని స‌ల‌హాతో త‌గిన మందులు వాడడం, స‌రైన స‌మ‌యానికి ఆహారం తీసుకోవ‌డం చేస్తుంటాం.
వీటితో పాటు త్వ‌ర‌గా గ్యాస్ నొప్పి దూరం కావాలంటే బూడిద గుమ్మ‌డి కాయ ర‌సం తాగాలి. క‌డుపులో ఉబ్బ‌రాన్ని త‌గ్గించే గుణాలు ఈ ర‌సంలో ఉన్నాయి. అంతేకాదు బ‌రువు త‌గ్గ‌డానికి దోహ‌దం చేస్తుంది. రోజూ ఓ క‌ప్పు బూడిద గుమ్మ‌డికాయ జ్యూస్‌ను తాగితే క‌లిగే ప్ర‌యోజ‌నాలను తెలుసుకుందాం