cricket ad

Monday 12 December 2016

దేశంలో ఈ వ్యాధుల వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారట..!

మన దేశంలో ఎక్కువ మంది గుండె జబ్బులు, పక్షవాతం, ఊపిరితిత్తుల్లో సమస్యల వల్ల చనిపోతున్నారని తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. వీటి తర్వాత షుగర్, మూత్రపిండ వ్యాధులు, న్యుమోనియా, అతిసారం, టీబీ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారట. వ్యాధులే కాకుండా రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువ మందిని బలితీసుకుంటున్నాయని రీసర్చ్ తెలిపింది.
 
195 దేశాల్లో పరిశోధకులు జరిపిన అధ్యయనంలో మరణాలకు గల కారణాలు వెల్లడయ్యాయి. పాశ్చాత్య జీవనశైలిని పాటించే క్రమంలో, మన దేశంలో అంటువ్యాధులు ఎక్కువ అవుతున్నాయని వెల్లడైంది. అయితే, జీవనశైలిని మార్చుకోవడం, యాంటీబయోటిక్స్ తో సత్వర చికిత్స చేయించుకోవడం ద్వారా అంటువ్యాధులను నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. సురక్షిత నీరు, పారిశుద్ధ్యం లేకపోవడంతో నెలలు నిండకుండానే చిన్నారులు మృత్యువాత పడుతున్నారని వారు పేర్కొన్నారు. ప్రతి ఏడాది మన దేశంలో కోటి కంటే ఎక్కువ మంది చనిపోతున్నారని వివరించారు.

No comments:

Post a Comment