cricket ad

Thursday 4 August 2016

కాలేయంపై మద్యం ప్రభావాలు...దయచేసి షేర్ చేయండిdaily health tips

కాలేయంపై మద్యం ప్రభావాలు...దయచేసి షేర్ చేయండి

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -కాలేయంపై మద్యం ప్రభావం(Effects of Alcohol on Liver)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …




దీర్ఘకాలికంగా ఎక్కువగా ఆల్కహాల్‌ సేవించడం వలన మనిషిలోని కాలేయం మూడు రకాలుగా దెబ్బ తింటుంది. అవి – ఆల్కహాలిక్‌ ఫ్యాటి లివర్‌ (90 శాతం), ఆల్కహాలిక్‌ హెపటైటిస్‌, ఆల్కహాలిక్‌ సిర్రోసిస్‌ (ఈ రెండూ 10 నుంచి 20 శాతం). ఆల్కహాల్‌ కారణంగా కాలేయ వ్యాధి రావడానికి మనిషి ఎంత కాలంనుంచి ఆల్కహాల్‌ తీసుకుంటున్నాడు, ఎంత మోతాదులో తీసుకుంటున్నాడనే విషయాలు అవసరమవుతాయి. అంతేకాకుండా, మహిళలా? పురుషులా? అనేది కూడా ప్రధానాంశమే. పురుషుల్లో కంటే మహిళల్లో ఆల్క హాల్‌ను ఎక్కువ, తక్కువ మోతాదుల్లో తీసుకున్నా దాని వలన కలిగే అనర్థాలు త్వరగా వస్తాయి.



పురుషులు రోజుకు 60 నుంచి 80 గ్రాములకంటే ఎక్కువ ఆల్కమాల్‌ చొప్పున పది సంవత్సరాలు తీసుకోవడం వలన కాలేయం ఎంత దెబ్బ తింటుందో, స్త్రీలలో రోజుకు 20 నుంచి 40 గ్రాముల చొప్పున తీసుకుంటే అదే స్థాయిలో కాలేయం దెబ్బ తింటుంది. ఆల్కహాల్‌ తీసుకోవడమనే అంశం స్త్రీపురుష భేదంతోనే కాకుండా, వారివారి సామాజిక, పౌష్టికాహార, వ్యాధినిరోధక శక్తి తదితర అంశాలపై ఆధారపడిఉంటుంది.
దీర్ఘకాలిక హెపటైటిస్‌ సివైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నవారిలో ఆల్కహాల్‌ వలన కాలేయం చాలా త్వరగా దెబ్బ తిని, తీవ్ర స్థాయిలో ఆల్కహా లిక్‌ లివర్‌ డ్యామేజ్‌కు కారణమవుతుంది. సాధారణంగా ఆల్కహాల్‌ తీసుకునే వారికంటే 5 శాతం ఎక్కువగా ఈ దీర్ఘకాలిక హెపటైటిస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్న వారిలో వస్తుంది.
ప్రమాదకర అంశాలు:
మోతాదు : పురుషులు రోజుకు 40 నుంచి 80 గ్రాముల ఆల్క హాల్‌ తీసుకోవడం వలన ఫ్యాటి లివర్‌, రోజుకు 80 నుంచి 160 గ్రాములు తీసు కోవడం వలన 10 నుంచి 20 సంవత్సరాలలో ఆల్కహాలిక్‌ హెపటైటిస్‌ లేదా లివర్‌ సిర్రోసిస్‌ వస్తాయి. 15 శాతం ఆల్కహాలిక్‌ లివర్‌ వ్యాధితో బాధపడతారు.
లింగభేదం : పురుషుల్లో కంటే స్త్రీలలో ఎక్కువ శాతం ఆల్కహాల్‌ వలన త్వరగా కాలేయం దెబ్బతింటుంది. (మోతాదు : రోజుకు 20 గ్రాముల కంటే ఎక్కువ)
హెపటైటిస్‌ సి వైరస్‌ : దీర్ఘకాలిక హెపటైటిస్‌ సి వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్న వారు ఆల్కహాల్‌ తాగడం వలన కాలేయం త్వరగా దెబ్బ తింటుంది. జీవిత కాలం తగ్గుతుంది.
ఒక బీరు, 4 ఔన్సుల వైన్‌ = 12 గ్రాముల ఆల్కహాల్‌, ఒక ఔన్సు స్పిరిట్‌ = 12 గ్రాముల ఆల్కహాల్‌
ఫ్యాటి లివర్‌ – లక్షణాలు:
ఆల్కహాలిక్‌ ఫ్యాటి లివర్‌ వ్యాధి ప్రారంభంలో చాలా వరకూ ఎటువంటి లక్షణాలు లేకుండా ఉంటారు. ఏదో ఒక కారణంగా డాక్టర్‌ వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకుంటున్నప్పుడు కాలేయం పరిమాణం పెద్దదైనట్లు తెలుస్తుంది.
ఒక్కొక్కసారి కడుపు కుడివైపు పైభాగంలో అసౌకర్యంగా ఉండటం, లేదా నొప్పి, వాంతి వచ్చేలా ఉండటం లేదా కళ్లు పచ్చ బడటం వంటి లక్షణాలతో వ్యాధి బైటపడుతుంది. రోగిని దీర్ఘకా లికంగా ఆల్కహాల్‌ తీసుకునే అలవాటు ఉందా? అని ప్రశ్నించి నప్పుడు కారణం బైటపడుతుంది. లేని పక్షంలో డాక్టర్‌ ఇతర కారణాల గురించి ఆలోచించాల్సి ఉంటుంది.
పరీక్షలు:


కాలేయం పని తీరు పరీక్ష (ఎల్‌ఎఫ్‌టి), లిపిడ్‌ ప్రొఫైల్‌, అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌, కార్బొహైడ్రేట్‌ డెఫిసియెంట్‌ ట్రాన్స్‌ఫెర్రిన్‌ (సిడిటి), గామా గ్లుటామిల్‌ ట్రాన్స్‌ పెప్టిడేస్‌ (జిజిటిపి), మీన్‌ కార్పస్కురాల్‌ వాల్యూమ్‌ (ఎంసివి), సీరం యూరిక్‌ యాసిడ్‌ తదితర పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ జరుగుతుంది.
అనేకమంది రోగులు ఎటువంటి లక్షణాలు లేకుండా ఉంటారు. కాని కొంతమందిలో జ్వరం, కడుపుపైన ఎర్రటి సాలెపురుగులాంటి మచ్చలు, కామెర్లు, తీవ్రమైన కడుపునొప్పి తదితర లక్షణాలతో బాధపడుతుంటారు.
ఏం జరుగుతుంది?
ఆల్కహాలిక్‌ హెపటైటిస్‌తో బాధపడుతున్న వారు ప్రాణాపాయ స్థితిలో పడినప్పుడు వారిలో మరణాల రేటు 70 శాతం వరకూ ఉంటుంది. ప్రోత్రాంబిన్‌ టైమ్‌ 5 సెకండ్లకంటే ఎక్కువగా పెరగడం, రక్తహీనత, శరీరంలోని సీరం ఆల్బుమిన్‌ తగ్గడం, సీరం బిలిరుబిన్‌ శాతం 8మి.గ్రా. కంటే ఎక్కువగా పెరగడం వంటివి సంభవిస్తాయి.
ఉదర కోశంలో నీరు చేరడాన్ని అసైటిస్‌ అంటారు. ఈ అసైటిస్‌తో పాటు ఆహార నాళం నుండి రక్తస్రావం జరుగుతుంది. రక్తస్రావం ఈసోఫేజియల్‌ వారిసెస్‌ల వలన, వాటి తీవ్రత వలన జరుగుతుంది. ఈసోఫేజియల్‌ వారిసెస్‌ అంటే ఆహార నాళం గోడలోని రక్త నాళాలు పోర్టల్‌ హైపర్‌ టెన్షన్‌ వలన ఉబ్బుతాయి. పోర్టల్‌ హైపర్‌ టెన్షన్‌ తీవ్రతనుబట్టి వీటిని 1, 2, 3 గ్రేడులుగా విభజిస్తారు. వీటినే ఈసోఫేజియల్‌ వారిసెస్‌ అంటారు.
మూత్రపిండాలు పని చేయక, రీనల్‌ ఫెయి ల్యూర్‌కు గురి కావడం జరుగుతుంది.
కడుపులో నీరు చేరడం, ఆహార నాళం ద్వారా వారిసెస్‌(varicose veins) వలన రక్తస్రావం, మెదడు మందగించి స్పృహ కోల్పోవడం, తరువాత హెపాటిక్‌ కోమాకు గురికావడం వంటి తీవ్ర ఆల్కహాలిక్‌ హెపటైటిస్‌ వ్యాధికి గురైన వారిని లివర్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చేర్చి చికిత్స చేసినప్పటికీ, మృత్యువాత పడే అవకాశాలు అధికంగా ఉంటాయి.
























No comments:

Post a Comment