మన ఆంధ్రదేశం లో ఉన్న శ్రీశైలం ఎంతో ప్రాముక్యత కలిగినది . శ్రీశైలం గురించి కొన్ని విశేషాలు ...
సాక్షి
గణపతి ఆలయము:ఇది ముఖ్యాలయానికి కొద్ది దూరంలో ఉంటుంది. ఈ గణపతి ఆలయము
ప్రత్యేకత ఏమిటంటే మనము శ్రీశైలములో శివుడిని దర్శించినంత మాత్రముననే కైలాస
ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. అప్పుడు మనకు ఈ సాక్షి గణపతే సాక్ష్యము
చెపుతాడు, మనము శ్రీశైలము వచ్చినాము అని.ఇతనిని సాక్షి గణపతి అంటారు.
శిఖరేశ్వరం:రీశైలం
మొత్తం లో ప్రత్యేకమైనది, ఈ శిఖరేశ్వరం. శ్రీశైలములో శిఖరదర్శనము
చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖరదర్శనము
అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు; దూరంగా ఉన్న ఈ ఎత్తైనకొండ
శిఖరేశ్వరం పై నుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి. అలా చూస్తే, శిఖరం
కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారు.
ఆది
శంకరాచార్యుడు తపస్సు చేసిన ప్రదేశం:దేశం రాజకీయంగా అల్లకల్లోల
పరిస్థితులలో ఉన్నప్పుడు, వివిద దార్శనికులు,మతప్రచారకులు అశాంతికి
దోహదంచేస్తున్న సమయంలో,భారతీయ సంప్రదాయానికి ఆధారమైన వైదిక వాజ్మయాన్ని
సరిగా అధ్యయనం చేసేవారుగాని, వాఖ్యానించగలిగేవారుగాని చాలా అరుదుగా ఉన్న
సమయంలొ జన్మించిన శ్రీశంకరులు పరిస్థితులను చక్కదిద్ది ప్రజలలో
వైదికధర్మస్ఫూర్తిని వ్యాప్తి చేస్తూ దేశంనలుమూలలా నాలుగు ప్రప్రసిద్ధ
పీఠాలను స్థాపించి విసృతంగా పర్యటిస్తూ ఉండేవారు. అలా పర్యటించే సమయంలోచాలా
కాలం శ్రీశైల పరిసరములందు తపమాచరించారు. ఈయన తపమాచరించిన ఈ ప్రదేశమునకు ఒక
మంచి కథనము కలదు.
శంకరులు
ఇక్కడ తపస్సు చేసుకొంటూ ఈపరిసరాలలో అద్వైతమత వ్యాప్తి చేయుచున్నకాలమందు,
శంకరులు చేయు కార్యములు నచ్చని కొందరు ఆయనను అంతమొందించు యత్నముతో
ఆపరిసరాలయందు భీభత్సము సృష్టించుచున్న ఒకపెద్ద దొంగలముఠానాయకుని
రెచ్చగొట్టి, కొంత సొమ్మిచ్చి పంపించారు.అతడు ఇదే ప్రదేశమున పెద్ద కత్తితో
మాటువేసి తపమాచరించుకొనుచున్న శంకరుని వెనుకగా ఒకేవేటున తలఎగరగొట్టు
ప్రయత్నమున ముందుకురికెను.ఇక్కడ ఇది జరుగుచున్న సమయమున శంకరుని ప్రధాన
శిష్యుడైన పద్మపాదుడు మల్లికార్జునుని దేవాలయమున ఈశ్వరుని ధ్యానించుచూ
కూర్చొని ఉండెను. ఈశ్వరునే మనసున ఉంచి ధ్యానిస్తున్న అతనికి హటాత్తుగా ఈ
దృశ్యము కనిపించెను.వెంటనే అతడు మహోగ్రుడైన శ్రీలక్షీనరసింహుని
వేడనారంభించెను. ఇక్కడ శంకరుని వధించుటకు ఉరికిన ఆ దొంగలనాయకునిపై ఎటునుండో
హటాత్తుగా ఒక సింహము దాడి చేసి, అతడి శరీరాన్ని ముక్కలుముక్కలుగా
చీల్చివేసి ఎట్లు వచ్చినదో అట్లే మాయమయినది.ఈ విషయము శంకరులకు ధ్యానమునుండి
బయటకు వచ్చిన తరువాత తెలియజేసారు. అంతవరకూ ఆయనకు జరిగినది తెలియదు.అధిక
కాలము ఈప్రాంతమందు తపమాచరించిన గుర్తుగా ఇక్కడ ఉన్న పెద్ద బండపై శంకరుని
యొక్క పాదముద్రలు కలవు.
శివాజీ
గొప్ప దుర్గా భక్తుడు. శ్రీశైల దేవాలయమును ఎన్నోసార్లు దండయాత్రలనుండి
కాపాడి శ్రీశైలంలో భ్రమరాంబికా అమ్మవారి స్వహస్తాలతో వీరఖడ్గం అందుకొన్న
ఘనుడు.అతని పేరున ఇక్కడ ఇంకనూ తుదిమెరుగులు దిద్దుకొనుచూ రెండు అంతస్తులుగా
నిర్మింపబడిన శివాజీ సాంస్కృతిక,స్మారక భవనము లో- అతడి జీవిత విశేషాల కథనం
మరియు చిత్రాల ప్రదర్శన కొరకు మొదటి అంతస్తునూ, శివాజీ కాంశ్యవిగ్రహము
కొరకు రెండవ అంతస్తునూ కేటాయించారు.మూడు రూపాయల నామమాత్రపు రుసుముతో
సందర్శకులను అనుమతించుచున్నారు.
పాలధార,
పంచధారలు:శిఖరేశ్వరమునకు, సాక్షిగణపతి గుడికి మధ్యగా హటికేశ్వరము నకు
సమీపాన అందమయిన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన
ప్రదేశము ఉన్నది. ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి.
కొండపగులులనుండి పంచధార(ఐదుధార) లతో ఉరికివచ్చే జలాలు చల్లగా ఏ కాలంలోనైనా
ఒకే మాదిరిగా ప్రవహిస్తూ ఒక్కొక్కధార ఒక్కొక్క రుచితో నుండుట ఇక్కడి
ప్రత్యేకత. ఒకధార నుండి జలము సేవించి ప్రక్కమరొక దాని నుండి సేవిస్తే
మార్పు తెలుస్తుంది
శ్రీమల్లికార్జునుని
దేవాలయము: అభేద్యమైన ప్రాకారము లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప
సంపదతో అలరారే అందమైన దేవాలయము. ప్రధాన గర్భాలయము మాత్రము ఎటువంటి శిల్పాలు
లేకుండా సాధారణ నిర్మాణముగా ముష్కరుల నుండి రక్షణ కొరకు కట్టినట్టుగా
ఉంటుంది.
భ్రమరాంబిక
అమ్మవారి గుడి.: భ్రమరాంబికా అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళతో
అందమైన శిల్పతోరణాలతో కూడిన స్థంబాలతోనూ అత్యద్భుతంగా ఉండును. ఈ ఆలయము
ఆంధ్రదేశములోనే అత్యంత విశిష్టమైన శిల్ప కళ కలిగిన దేవాలయముగా
వినుతికెక్కినది. ఈ దేవాలయము నందు గర్భాలయ వెనుక భాగమున గోడకు చెవి ఆన్చి
వింటే ఝమ్మనే బ్రమరనాధం వినవస్తుంది.
మనోహర
గుండము: శ్రీశైలములో తప్పకుండా చూడవలసిన వాటిలో ఇది ఒకటి. దీనిలో
గొప్పతనము ఏమిటంటే చాలా స్వచ్ఛమైన నీరు ఈ గుండములో ఉంటుంది. శ్రీశైలము చాలా
ఎత్తైన ప్రదేశములో ఉన్నది. అంత ఎత్తులో కూడా ఆ రాళ్ళలో ఇంత చక్కని నీరు
ఉండటం నిజంగా చూడవలసినదే. ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మహానంది లోని
కోనేటి నీటిలో క్రింద రూపాయ వేస్తే పైకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ
చిన్ని గుండంలో కూడా కనిపిస్తుంది.
పంచ
పాండవులు దేవాలయాలు: పాండవులు మల్లికార్జునుని దర్శించుకొని వారి పేరున
అయిదు దేవాలయాలను ప్రధాన దేవాలయ వెనుక భాగమున నిర్మించి శివలింగములను
ప్రతిష్టించిరి.
---share it