cricket ad

Wednesday, 30 November 2016

అనసూయ అత్రి మహర్షి భార్య మరియు మహా పతివ్రత

అనసూయ అత్రి మహర్షి భార్య మరియు మహా పతివ్రత. ఈమె కర్దమ ప్రజాపతి, దేవహూతి ల పుత్రిక. స్వాయంభువ మనువు మనుమరాలు. ఖ్యాతి, అరుంధతి మొదలగువారు ఆమె సోదరీమణులు. వినయ వివేకాలు ఈమెకు సహజ భూషణాలు. పతిసేవలో మక్కువ ఎక్కువ. ఈమె పతిభక్తికి మెచ్చిన అత్రిమహర్షి అష్టాక్షరీ మంత్రోపదేశం చేస్తాడు. దాని ఉపాసనచేత యోగస్థితిని పొందిన ఈమె మహర్షులకు కూడా పూజ్యనీయమైన మహోన్నత స్థానాన్ని పొందింది.
కౌశిక పత్ని సుమతి తన పతి శాపాన్ని పునస్కరించుకొని సూర్యోదయాన్ని అపేసింది. అనసూయ పదిరోజులను ఒకరోజుగా చేసి సూర్యుడుదయించేటట్లు చేసింది. మరణించిన సుమతి భర్తను మరల బ్రతికించింది. నారదుని కోరికపై గులకరాళ్ళను గుగ్గిళ్ళుగా మార్చి ఆయన ఆకలిని తీర్చింది. లోకమాతలైన లక్ష్మీపార్వతీసరస్వతులను గెలిచింది. శ్రీరాముడు అరణ్యవాసకాలంలో సీతతో ఆశ్రమానికి వచ్చినప్పుడు ఈమె సీతకు పతివ్రతాధర్మాలను ఉపదేశించింది. తన మహిమను పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులను శిశువులను చేసి లాలించింది. లోకమాతలకు పతిభిక్షపెట్టి అత్తగారిగా నిలిచింది. త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు అనే పుత్రున్ని పొందింది.
ఇంకా లలిత పరా భట్టారిక స్తాయికి అనసూయమ్మ ఎలా అయ్యిందో..

No comments:

Post a Comment