హనుమాన్ తల్లి అయిన అంజనా దేవి చరిత్ర:
హనుమంతుని
తల్లి అంజనా . తండ్రి కేసరి , శంకరుడు ,వాయువు .ముగ్గురు తండ్రులు ఎలా
అయ్యారు అని మీరు అడగవచ్చు. కాని విభిన్న పురాణాలలో విభిన్నగాధలు ఉన్నాయి .
కొన్నిటిని ఇక్కడ ముచ్చటిస్తాము.
స్వర్గలోకములో
ఇంద్రుని దగ్గర ఎందరో అందమైన అప్సరసలు ఉన్నారు . వారందరిలో మిక్కిలి
అందముగా "పుంజికాస్థలా " అనే ఒక అప్సరస ఉంది . ఆమె ఎంతటి అందకత్తో అంతటి
సంచల స్వభావము గలది . నవ్వు ఆమె పెదవులపై ఎల్లవేళలా ఉట్టిపడుతుంటుంది .
ఒకరోజున తన చంచల స్వభావంచేత ఒకానొక మహర్షిని
వేలాకోలం చేసింది . అందుకు కోపపడి మహర్షి "నీవు కోతిమాదిరి చంచలముగా
వ్యవహరిస్తావు గనుక భూలోకంలోకి వెళ్లి కోతిగా ఉండు , అని శపించాడు .
మహర్షినోట
శాపం వినగానే ఆమెకు మతిపోయి ఆయన పాదాలపై బడి మిక్కిలి వినయముగా అపరాదాన్ని
మన్నించమని వేడుకున్నది . మహర్షులు సహజముగా దయకల్గి ఉంటారు . వారి క్రోధం
నీటిపైన గీతలాగా కనుపించి మాయమైపోతుంది . ఆయన ప్రసన్నుడై - నేను ఎప్పుడూ
అసత్యము పలుకలేదు . నీవు కోతి రూపాన్ని ధరించ వలసిందే , కాని
అభీష్టరూపాన్ని ధరిస్తావు . కోరినప్పుడు మానవ రూపాన్ని ధరించగలవు . వానర
రూపాన్ని గూడా ధరించగలవు అని అన్నాడు .
మహర్షి
శాపం నిజమైంది . పుంజకాస్థల సుమేరుపర్వతగుహలో ఒకవానరిగా జన్మించింది .
భూలోకములో వుండే వానరజాతి మాదిరి జాతి కాదు . ఇది ఉపదేవతలలోని కింపురుష
జాతికి చెందినది . వీరు అభీష్ట రూపధారులు ,వీరి ఆకృతి మానవాకృతి మాదిరిగానే
ఉంటుంది . తోక కూడా ఉంటుంది . కేసరి ఒక వానర రాజు ,అంజనా మిక్కిలి రూపవతి
,కేసరికి ఆమెకు వివాహమైంది . వీరికి సంతానము లేదు . స్త్రీలకూ సహజముగా
తల్లికావాలని ,పుత్రుడు కలగాలని కోరిక ఉంటుంది . అంజనా పుత్రప్రాప్తికి
భగవాన్ శులపాణిని ఆరాధించింది .
శ్రీరాముడు
అవతరించనున్నాడు . తానుగూడ అవనిపై అవతరించి శ్రీరామునికి సేవచేద్దామని
శంకరునకు కోరికగలిగినది . శంకరుడు ఏకాదశరుద్రరూపుడు. పదకొండవ అవతారమే
హనుమాన్ . శంకరుని వర ప్రసాదము చేత అంజనా గర్భంనుంచి స్వత: శంకరుడు
అవతరించినందున హనుమాన్ ని శంకరసూనుడు అని కూడా అంటారు . శంకర వరప్రసాదాన్ని
అనురక్తితో పవనదేవుడు అంజనగర్భములొ ఉంచుట చేత పవన కుమారుడైనాడు .
కేసరీపత్నికి జన్మించుతచేత కేసరీ నందుడైనాడు .
Share it
No comments:
Post a Comment