cricket ad

Wednesday, 30 November 2016

జయమంత్రం :స్వామి హనుమకు సీతమ్మ దర్శనం అయిన తర్వాత లంకను ఒక ఆట ఆడించారు

జయమంత్రం :
స్వామి హనుమకు సీతమ్మ దర్శనం అయిన తర్వాత లంకను ఒక ఆట ఆడించారు . ఒక తోరణము ఎక్కి కూర్చుని జయమంత్రం చెప్తు వేలమంది రాక్షసుల్ని సునాయాసముగా సంహరించారు . ఎంతో మంది పెద్దలు ఈ జయమంత్రాన్ని ఉపాసన చేసి జీవితములో ధన్యత పొందారు .
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః |
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ||
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః |
అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ||
అర్ధం :రామచంద్రమూర్తి పరక్రమముతో జయముతో షోబిల్లుతున్నారు . ఆయన సోదరడు అయినటువంటి లక్ష్మణుడు కూడా పరాక్రమముతో ప్రకాశిస్తున్నాడు . రామలక్ష్మణుల యొక్క అండదండలు కలిగినటువంటి నా ప్రభువు సుగ్రీవుడు విజయముతో శోబిస్తున్నాడు . నేను ఎటువంటి కార్యాన్ని అయినా అవలీలగా చేయగలిగినటువంటి సమర్ధత ప్రకాశించినటువంటి రామచంద్ర మూర్తి యొక్క కింకరుడిని . నేను ఆయన దాసానుదాసుడిని . నా పేరు హనుమ . నేను వాయుపుత్రుడిని . శత్రుసైన్యములని సంహరించడములో నాకు నేనే సాటి . వేయి మంది రావణాసురులు వచ్చి కూర్చున్నా సరే ఒక పురుగుని చంపినట్టు చంపేస్తాను . ఎలా లంకా పట్టణానికి వచ్చానో అలా వెళ్ళిపోతాను . రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తాను ,మోచేతులతో కుమ్మి చంపేస్తాను ,పాదముల కింద పెట్టి తొక్కి చంపేస్తాను ,అరిచేతులతో మర్దించి చంపేస్తాను ,గోళ్ళతో చీల్చి చంపేస్తాను ,నా కోరలతో కొరికి చంపేస్తాను ,నాకు ఆయుధం అక్కరలేదు . నేను వచ్చింది ఈ లంకా పట్టణమును పీడీస్తాను . నా తల్లి సీతమ్మ దర్శనం కోసం వచ్చాను అయిపోఇంది దర్శనమ్ . మిమ్మల్ని అందరిని పీడించి ఎలా వచ్చానో అలా నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను . నన్ను పట్టగలిగిన మొనగాడు లంకా పట్టణములో లేడు . వంద మంది రాక్షసులైన వేయి మంది రావణులైన నే చంపేస్తాను అని స్వామి హనుమ తోరణము మీద కూర్చుని ఈ జయమంత్రాన్ని చెప్తున్నారు .

No comments:

Post a Comment