cricket ad

Wednesday 30 November 2016

సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్ధం వరకు కనిపిస్తున్నది

స్థలపురాణం:
సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్ధం వరకు కనిపిస్తున్నది. కాని భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదై ఉండవచ్చు. సింహాచలం అంటే సింహం యొక్క పర్వతము అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో నాల్గవదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తి గా వెలశాడు. ఇతిహాసం ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధవైరి. తన కుమారుడైన ప్రహ్లాదుడిని పుట్టుకతోనే విష్ణు భక్తుడు. అనేక విధాల ప్రయత్నించి కూడా కుమారుని విష్ణు విముఖుణ్ణి చెయ్యలేకపోతాడు. చివరికి చంపించేందుకు కూడా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారీ ప్రహ్లాదుని విష్ణుమూర్తి రక్షిస్తాడు. విసిగిన హిరణ్యకశిపుడు 'విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా, ఏడీ ఈ స్థంభంలో ఉన్నాడా? చూపించు'మని స్థంభాన్ని పగలగొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొనివచ్చి, హిరణ్యకశిపుని సంహరించి, ప్రహ్లాదుడిని రక్షించాడు.
స్థలపురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా నరసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన[యాదవుడు] పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్ళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది. అతడికి భూమిలో కప్పబడి ఉన్న నరసింహస్వామి కనిపించాడు. విగ్రహాన్ని సంవత్సరకాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగే టట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు నరసింహ స్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటించడుతోంది. స్వామిలోని వేడిని చల్లార్చడానికి ప్రతీరోజు చందనం తో పూత పూస్తుంటారు. నరుడు మరియు సింహము రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్ర లో (ఆసనంలో) సింహము తల కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది.
ఆలయ విశేషాలు:

గాలి గోపురము-సింహ ద్వారం
సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖముగా కాకుండా, పడమర వైపు ముఖమును కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పున ముఖద్వారము ఐశ్వర్యమును ప్రసాదిస్తే, పడమర ముఖద్వారము విజయాన్ని ఒసగుతుందని హిందువుల నమ్మకం. కొండ మీద నుండి గాలి గోపురము మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 30 మెట్లు ఉంటాయి.
కప్ప స్తంభం
దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారములో కప్ప స్తంభం ఉన్నది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రం పై ప్రతిష్టితమై ఉంది. ఇది అత్యంత శక్తివంతమైనది అని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు ఈ కప్పస్తంభమును కౌగిలించుకొంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామి వారికి భక్తులు ఇక్కడే కప్పాలు (కప్పం:పన్ను) చెల్లించేవారు కనుక దీనిని కప్పపు స్తంభం అనేవారు. కాలక్రమేణా అది కప్ప స్తంభం అయింది.
సింహాచలం దేవాలయ వెనుకభాగంలో నరసింహుని విగ్రహం.
సింహాచలం వద్ద గంగధార
జల ధారలు
సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది. సింహగిరి జలసమృద్ధి గల ప్రాంతం. ఈ కొండలపై సహజసిద్ధమైన జలధారలు ఉన్నాయి. వీటిలో కొన్ని: గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార లు. భక్తులు ఈ ధారలలో స్నానాలు చేసి, దైవదర్శనం చేసి తరిస్తారు. స్వామికి తలనీలాలు సమర్పించుకొన్న భక్తులు సమీపంలోని గంగధారలో స్నానంచేసి దైవదర్శనానికి వెళతారు. ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగములో సహజసిద్ధమైన నీటి సెలయేరు ఉన్నది. స్వామి కల్యాణము తరువాత ఈ ఘట్టంలో స్నానము ఆచరిస్తాడు. ఈ ధారపై యోగ నరసింహ స్వామి విగ్రహం ఉన్నది.
భైరవ వాక
సింహగిరికి మెట్ల మార్గంలో వస్తే కనిపించేది భైరవ వాక. ఆడివివరం గ్రామంలో మెట్ల వద్ద భైరవ ద్వారం ఉన్నది. ఇక్కడ భైరవస్వామి విగ్రహం ఉన్నది. ఈ విగ్రహం ఎటువంటి పూజలు పునస్కారాలు అందుకోదు. 13-16 శతాబ్ధాల మధ్య ఈ ప్రాంతం భైరవపురం గా ప్రాముఖ్యత పొందినది.
కొత్తగా నిర్మించిన విచారణ కార్యాలయం.
వరాహ పుష్కరిణి
వరాహ పుష్కరిణి సింహగిరి కొండ క్రింద ఆడవివరం గ్రామంలో ఉంది. ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒకమారు తెప్పోత్సవం నాడు ఇక్కడికి తీసుకొని వచ్చి నౌకావిహారం చేయిస్తారు. ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపం ఉన్నది.
మాధవధార
మాధవస్వామి దేవాలయం ఉంది. గిరిప్రదక్షిణం సమయంలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తారు.

కీళ్ళ నొప్పులు ఎముకలకు చాలా హాని కలిగిస్తుంది. శరీరంలో ఎముకలు పెళుసుగా మారడం లేదా విరిగిపోవడం జరుగుతుంది.

కీళ్ళ నొప్పులు ఎముకలకు చాలా హాని కలిగిస్తుంది. శరీరంలో ఎముకలు పెళుసుగా మారడం లేదా విరిగిపోవడం జరుగుతుంది. మనకు బయటకు కనబడని ఈ లక్షణాలను బట్టే ఇది సైలెంట్ కిల్లర్ డిసీజ్ గా సూచిస్తున్నారు. ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు కనబడకపోవడం వల్ల చికిత్సను చేయించుకోలేరు. ఈ వ్యాధి ఏవయస్సు వారికైనా వస్తుంది. అయితే వ్యాధి తీవ్రమైనప్పుడు నొప్పితో బోన్ ఫ్రాక్చర్ జరుగుతుంది. బ్యాక్ పెయిన్, బోన్ ఫ్రాక్చర్ మైనర్ కట్స్ ఏర్పడుతాయి. ఈ వ్యాధి ఉన్నప్పుడు డాక్టర్ ను కలిసి బోన్ మినిరల్ డెంసిటి టెస్ట్ చేయించి చికిత్స తీసుకోవడం వల్ల కీళ్ళ వ్యాధులను ినవారించుకోవచ్చు,. ప్రమాద స్థితికి కారణం ఫ్యామిలి హిస్టరీ, పూర్ డైట్, వ్యాయామ లోపం, స్మోకింగ్, మందులు.

SHARE IT

దాల్చిన చెక్క, పాలు తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు

దాల్చిన చెక్క, పాలు తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు💥*
షేర్ చేయండి.
దాల్చిన చెక్క పాల ఆరోగ్య ప్రయోజనాలను కొన్ని ఏళ్లుగా నిపుణులు స్టడీ చేస్తున్నారు. ఇది డయాబెటిస్ ని నివారిస్తుందని తేల్చాయి. ఈ పాలు ప్రిపేర్ చేయడం కూడా చాలా తేలిక. ఒక కప్పు వేడి పాలకు రెండు టీ స్పూన్ల దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకోవడం అంతే. డైలీ డైట్ లో దీన్ని చేర్చుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు చూద్దాం..
దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల డైజెషన్ ప్రాసెస్ మెరుగ్గా సాగుతుంది. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ స్పామ్స్ ని ఇది స్మూత్ గా మార్చి, పొట్టలో వచ్చే అసౌకర్యాన్ని అరికట్టి.. జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది.
టైప్ టు డయాబెటిస్ తో బాధపడేవాళ్లు దాల్చిన చెక్క పాలు రెగ్యులర్ గా తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
కంటినిండా నిద్రపోవాలని భావించేవాళ్లు.. దాల్చిన చెక్క పాలు తాగితే చాలు.. హ్యాపీగా నిద్రపోవచ్చు. కేవలం రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాసు తాగండి.. చిన్న పిల్లల్లా హ్యాపీగా నిద్రపోతారు.
దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల జుట్టు, చర్మానికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల ఇది జుట్టుకి, చర్మానికి మంచిది.అందమైన కురులు, మెరిసే చర్మం పొందాలనుకునేవాళ్లు రెగ్యులర్ గా ఈ పాలు తాగడం మొదలుపెట్టండి.
వయసు పెరిగిన వాళ్లలో ఎముకలు బలంగా ఉండటానికి ఈ పాలు సహాయపడతాయి. రెగ్యులర్ గా దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల వయసు పెరిగిన తర్వాత వచ్చే కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలకు దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
దాల్చిన చెక్క కలిపిన పాలల్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల పంటి సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపేస్తుంది.క్యావిటీస్, ఓరల్ ప్రాబ్లమ్స్ దూరంగా ఉంటాయి.
సాధారణ దగ్గు, ఫ్లూ వంటివి నివారించడానికి ఈ పాలు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా.. హానికర బ్యాక్టీరియాను నివారించి.. హెల్తీగా ఉండటానికి సహాయపడుతుంది.

హనుమాన్ తల్లి అయిన అంజనా దేవి చరిత్ర:

హనుమాన్ తల్లి అయిన అంజనా దేవి చరిత్ర:
హనుమంతుని తల్లి అంజనా . తండ్రి కేసరి , శంకరుడు ,వాయువు .ముగ్గురు తండ్రులు ఎలా అయ్యారు అని మీరు అడగవచ్చు. కాని విభిన్న పురాణాలలో విభిన్నగాధలు ఉన్నాయి . కొన్నిటిని ఇక్కడ ముచ్చటిస్తాము.
స్వర్గలోకములో ఇంద్రుని దగ్గర ఎందరో అందమైన అప్సరసలు ఉన్నారు . వారందరిలో మిక్కిలి అందముగా "పుంజికాస్థలా " అనే ఒక అప్సరస ఉంది . ఆమె ఎంతటి అందకత్తో అంతటి సంచల స్వభావము గలది . నవ్వు ఆమె పెదవులపై ఎల్లవేళలా ఉట్టిపడుతుంటుంది . ఒకరోజున తన చంచల స్వభావంచేత ఒకానొక మహర్షిని వేలాకోలం చేసింది . అందుకు కోపపడి మహర్షి "నీవు కోతిమాదిరి చంచలముగా వ్యవహరిస్తావు గనుక భూలోకంలోకి వెళ్లి కోతిగా ఉండు , అని శపించాడు .
మహర్షినోట శాపం వినగానే ఆమెకు మతిపోయి ఆయన పాదాలపై బడి మిక్కిలి వినయముగా అపరాదాన్ని మన్నించమని వేడుకున్నది . మహర్షులు సహజముగా దయకల్గి ఉంటారు . వారి క్రోధం నీటిపైన గీతలాగా కనుపించి మాయమైపోతుంది . ఆయన ప్రసన్నుడై - నేను ఎప్పుడూ అసత్యము పలుకలేదు . నీవు కోతి రూపాన్ని ధరించ వలసిందే , కాని అభీష్టరూపాన్ని ధరిస్తావు . కోరినప్పుడు మానవ రూపాన్ని ధరించగలవు . వానర రూపాన్ని గూడా ధరించగలవు అని అన్నాడు .
మహర్షి శాపం నిజమైంది . పుంజకాస్థల సుమేరుపర్వతగుహలో ఒకవానరిగా జన్మించింది . భూలోకములో వుండే వానరజాతి మాదిరి జాతి కాదు . ఇది ఉపదేవతలలోని కింపురుష జాతికి చెందినది . వీరు అభీష్ట రూపధారులు ,వీరి ఆకృతి మానవాకృతి మాదిరిగానే ఉంటుంది . తోక కూడా ఉంటుంది . కేసరి ఒక వానర రాజు ,అంజనా మిక్కిలి రూపవతి ,కేసరికి ఆమెకు వివాహమైంది . వీరికి సంతానము లేదు . స్త్రీలకూ సహజముగా తల్లికావాలని ,పుత్రుడు కలగాలని కోరిక ఉంటుంది . అంజనా పుత్రప్రాప్తికి భగవాన్ శులపాణిని ఆరాధించింది .
శ్రీరాముడు అవతరించనున్నాడు . తానుగూడ అవనిపై అవతరించి శ్రీరామునికి సేవచేద్దామని శంకరునకు కోరికగలిగినది . శంకరుడు ఏకాదశరుద్రరూపుడు. పదకొండవ అవతారమే హనుమాన్ . శంకరుని వర ప్రసాదము చేత అంజనా గర్భంనుంచి స్వత: శంకరుడు అవతరించినందున హనుమాన్ ని శంకరసూనుడు అని కూడా అంటారు . శంకర వరప్రసాదాన్ని అనురక్తితో పవనదేవుడు అంజనగర్భములొ ఉంచుట చేత పవన కుమారుడైనాడు . కేసరీపత్నికి జన్మించుతచేత కేసరీ నందుడైనాడు .
Share it

జయమంత్రం :స్వామి హనుమకు సీతమ్మ దర్శనం అయిన తర్వాత లంకను ఒక ఆట ఆడించారు

జయమంత్రం :
స్వామి హనుమకు సీతమ్మ దర్శనం అయిన తర్వాత లంకను ఒక ఆట ఆడించారు . ఒక తోరణము ఎక్కి కూర్చుని జయమంత్రం చెప్తు వేలమంది రాక్షసుల్ని సునాయాసముగా సంహరించారు . ఎంతో మంది పెద్దలు ఈ జయమంత్రాన్ని ఉపాసన చేసి జీవితములో ధన్యత పొందారు .
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః |
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ||
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః |
అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ||
అర్ధం :రామచంద్రమూర్తి పరక్రమముతో జయముతో షోబిల్లుతున్నారు . ఆయన సోదరడు అయినటువంటి లక్ష్మణుడు కూడా పరాక్రమముతో ప్రకాశిస్తున్నాడు . రామలక్ష్మణుల యొక్క అండదండలు కలిగినటువంటి నా ప్రభువు సుగ్రీవుడు విజయముతో శోబిస్తున్నాడు . నేను ఎటువంటి కార్యాన్ని అయినా అవలీలగా చేయగలిగినటువంటి సమర్ధత ప్రకాశించినటువంటి రామచంద్ర మూర్తి యొక్క కింకరుడిని . నేను ఆయన దాసానుదాసుడిని . నా పేరు హనుమ . నేను వాయుపుత్రుడిని . శత్రుసైన్యములని సంహరించడములో నాకు నేనే సాటి . వేయి మంది రావణాసురులు వచ్చి కూర్చున్నా సరే ఒక పురుగుని చంపినట్టు చంపేస్తాను . ఎలా లంకా పట్టణానికి వచ్చానో అలా వెళ్ళిపోతాను . రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తాను ,మోచేతులతో కుమ్మి చంపేస్తాను ,పాదముల కింద పెట్టి తొక్కి చంపేస్తాను ,అరిచేతులతో మర్దించి చంపేస్తాను ,గోళ్ళతో చీల్చి చంపేస్తాను ,నా కోరలతో కొరికి చంపేస్తాను ,నాకు ఆయుధం అక్కరలేదు . నేను వచ్చింది ఈ లంకా పట్టణమును పీడీస్తాను . నా తల్లి సీతమ్మ దర్శనం కోసం వచ్చాను అయిపోఇంది దర్శనమ్ . మిమ్మల్ని అందరిని పీడించి ఎలా వచ్చానో అలా నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను . నన్ను పట్టగలిగిన మొనగాడు లంకా పట్టణములో లేడు . వంద మంది రాక్షసులైన వేయి మంది రావణులైన నే చంపేస్తాను అని స్వామి హనుమ తోరణము మీద కూర్చుని ఈ జయమంత్రాన్ని చెప్తున్నారు .

సుదర కాండము చదివితే వచ్చే ప్రయోజనాలు

సుదర కాండము చదివితే వచ్చే ప్రయోజనాలు :
నిరాశా, నిస్ప్రుహలకు లోనైనా మనిషిని పునరుజీవితుణి చేస్తుంది`సుదర కాండము
మానసికముగా బలహీనమైన వాడిని మానసికముగా బలోపెతున్ని చేస్తుంది సుందర కాండము
కేవలం పురుష ప్రయత్నం చాలదు . దైవయత్నం కుడా ఉండాలి . అలాగని దైవప్రార్దన చాలదు . మానవ ప్రయత్నం కూడా ఉండాలి . పురుష ప్రయత్నం , దైవయత్నం కలిస్తేనే కార్యసిద్ధి కలుగుతుంది అని చాటి చెప్పినది సుందర కాండము
మనము చేసే కార్యము లో చిత్తశుద్ధి ఉంటే ,మన ప్రమేయము లేకుండానే మనకు బయట నుండి సాయం అందుతుంది అని మనకు తెలియజేసేదే సుందర కాండము .
మన సమస్యకు పరిష్కారము ఎదురుగా ఉన్నా ,మన మనస్సు కల్లోలముగా ఉన్నపుడు ఆ పరిష్కారము మనకు కనపడదు . నిర్మలమైన మనస్సుతో ఆలోచిస్తే ,ఇంతేనా అని అనిపిస్తుంది , పరిష్కారము కళ్ళెదుట కనపడుతుంది అని బోదించింది సుందర కాండము .
జీవితములో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యముగా ఎదుర్కొంటే , మనకు సాయము చేసేవాళ్ళు మనకు కనపడకుండా మన పక్కనే ఉండి సాయము చేస్తుంటారు అని తెలియజేసేది సుందర కాండము .
కోపము అన్ని అనర్దాలకు మూలము ,కోపములో ఏమి చేస్తున్నామో తెలియకుండా చేసేస్తాము తుదకు దు:ఖాలపాలవుతము అని భోదించేది సుందర కాండము .
మనిషికి ఎంత శారీరక బలము ఉన్నా , దానికి బుద్ధిబలం తోడైతేనే గాని రాణించదు అన్న విషయాన్ని తెలియచెప్పేది సుందర కాండము .
ఎన్ని శివపూజలు చేసినా ,ఎంతటి నిష్టాగరిష్టుడైన ,గుణగనాలు మంచివి కాకపోతే ఆ శివపూజలు అతనిని రక్షించలేవు ,అతనికి పతనము తప్పదు అని నిరూపించినది సుందర కాండము .
ఎవరి శక్తి వారికి తెలియదు . ప్రతి మనిషిలోను అంతర్గతముగా అపారమైన శక్తి ఉంటంది . ఆ శక్తి ఒక్కోసారి తనంతట తానే బహిర్గతమవుతుంది . మరి కొన్ని సందర్భాల్లో ఇతరులు చెబితేనే గాని బయట పడదు . కాబట్టి పెద్దవారి మాటలు ,మన శ్రేయోభిలాషుల మాటలు శ్రద్దగా విని , ఆచరించి ,మన శక్తి యుక్తులను సమర్ధవంతముగా వినియోగించుకోవాలి అని చాటి చెప్పినది సుందర కాండము .
share it

శ్రీశైలం ఎంతో ప్రాముక్యత కలిగినది . శ్రీశైలం గురించి కొన్ని విశేషాలు ...see full

మన ఆంధ్రదేశం లో ఉన్న శ్రీశైలం ఎంతో ప్రాముక్యత కలిగినది . శ్రీశైలం గురించి కొన్ని విశేషాలు ...
సాక్షి గణపతి ఆలయము:ఇది ముఖ్యాలయానికి కొద్ది దూరంలో ఉంటుంది. ఈ గణపతి ఆలయము ప్రత్యేకత ఏమిటంటే మనము శ్రీశైలములో శివుడిని దర్శించినంత మాత్రముననే కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. అప్పుడు మనకు ఈ సాక్షి గణపతే సాక్ష్యము చెపుతాడు, మనము శ్రీశైలము వచ్చినాము అని.ఇతనిని సాక్షి గణపతి అంటారు.
శిఖరేశ్వరం:రీశైలం మొత్తం లో ప్రత్యేకమైనది, ఈ శిఖరేశ్వరం. శ్రీశైలములో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖరదర్శనము అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు; దూరంగా ఉన్న ఈ ఎత్తైనకొండ శిఖరేశ్వరం పై నుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి. అలా చూస్తే, శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారు.
ఆది శంకరాచార్యుడు తపస్సు చేసిన ప్రదేశం:దేశం రాజకీయంగా అల్లకల్లోల పరిస్థితులలో ఉన్నప్పుడు, వివిద దార్శనికులు,మతప్రచారకులు అశాంతికి దోహదంచేస్తున్న సమయంలో,భారతీయ సంప్రదాయానికి ఆధారమైన వైదిక వాజ్మయాన్ని సరిగా అధ్యయనం చేసేవారుగాని, వాఖ్యానించగలిగేవారుగాని చాలా అరుదుగా ఉన్న సమయంలొ జన్మించిన శ్రీశంకరులు పరిస్థితులను చక్కదిద్ది ప్రజలలో వైదికధర్మస్ఫూర్తిని వ్యాప్తి చేస్తూ దేశంనలుమూలలా నాలుగు ప్రప్రసిద్ధ పీఠాలను స్థాపించి విసృతంగా పర్యటిస్తూ ఉండేవారు. అలా పర్యటించే సమయంలోచాలా కాలం శ్రీశైల పరిసరములందు తపమాచరించారు. ఈయన తపమాచరించిన ఈ ప్రదేశమునకు ఒక మంచి కథనము కలదు.
శంకరులు ఇక్కడ తపస్సు చేసుకొంటూ ఈపరిసరాలలో అద్వైతమత వ్యాప్తి చేయుచున్నకాలమందు, శంకరులు చేయు కార్యములు నచ్చని కొందరు ఆయనను అంతమొందించు యత్నముతో ఆపరిసరాలయందు భీభత్సము సృష్టించుచున్న ఒకపెద్ద దొంగలముఠానాయకుని రెచ్చగొట్టి, కొంత సొమ్మిచ్చి పంపించారు.అతడు ఇదే ప్రదేశమున పెద్ద కత్తితో మాటువేసి తపమాచరించుకొనుచున్న శంకరుని వెనుకగా ఒకేవేటున తలఎగరగొట్టు ప్రయత్నమున ముందుకురికెను.ఇక్కడ ఇది జరుగుచున్న సమయమున శంకరుని ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు మల్లికార్జునుని దేవాలయమున ఈశ్వరుని ధ్యానించుచూ కూర్చొని ఉండెను. ఈశ్వరునే మనసున ఉంచి ధ్యానిస్తున్న అతనికి హటాత్తుగా ఈ దృశ్యము కనిపించెను.వెంటనే అతడు మహోగ్రుడైన శ్రీలక్షీనరసింహుని వేడనారంభించెను. ఇక్కడ శంకరుని వధించుటకు ఉరికిన ఆ దొంగలనాయకునిపై ఎటునుండో హటాత్తుగా ఒక సింహము దాడి చేసి, అతడి శరీరాన్ని ముక్కలుముక్కలుగా చీల్చివేసి ఎట్లు వచ్చినదో అట్లే మాయమయినది.ఈ విషయము శంకరులకు ధ్యానమునుండి బయటకు వచ్చిన తరువాత తెలియజేసారు. అంతవరకూ ఆయనకు జరిగినది తెలియదు.అధిక కాలము ఈప్రాంతమందు తపమాచరించిన గుర్తుగా ఇక్కడ ఉన్న పెద్ద బండపై శంకరుని యొక్క పాదముద్రలు కలవు.
శివాజీ గొప్ప దుర్గా భక్తుడు. శ్రీశైల దేవాలయమును ఎన్నోసార్లు దండయాత్రలనుండి కాపాడి శ్రీశైలంలో భ్రమరాంబికా అమ్మవారి స్వహస్తాలతో వీరఖడ్గం అందుకొన్న ఘనుడు.అతని పేరున ఇక్కడ ఇంకనూ తుదిమెరుగులు దిద్దుకొనుచూ రెండు అంతస్తులుగా నిర్మింపబడిన శివాజీ సాంస్కృతిక,స్మారక భవనము లో- అతడి జీవిత విశేషాల కథనం మరియు చిత్రాల ప్రదర్శన కొరకు మొదటి అంతస్తునూ, శివాజీ కాంశ్యవిగ్రహము కొరకు రెండవ అంతస్తునూ కేటాయించారు.మూడు రూపాయల నామమాత్రపు రుసుముతో సందర్శకులను అనుమతించుచున్నారు.
పాలధార, పంచధారలు:శిఖరేశ్వరమునకు, సాక్షిగణపతి గుడికి మధ్యగా హటికేశ్వరము నకు సమీపాన అందమయిన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశము ఉన్నది. ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి. కొండపగులులనుండి పంచధార(ఐదుధార) లతో ఉరికివచ్చే జలాలు చల్లగా ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ప్రవహిస్తూ ఒక్కొక్కధార ఒక్కొక్క రుచితో నుండుట ఇక్కడి ప్రత్యేకత. ఒకధార నుండి జలము సేవించి ప్రక్కమరొక దాని నుండి సేవిస్తే మార్పు తెలుస్తుంది
శ్రీమల్లికార్జునుని దేవాలయము: అభేద్యమైన ప్రాకారము లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయము. ప్రధాన గర్భాలయము మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణముగా ముష్కరుల నుండి రక్షణ కొరకు కట్టినట్టుగా ఉంటుంది.
భ్రమరాంబిక అమ్మవారి గుడి.: భ్రమరాంబికా అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళతో అందమైన శిల్పతోరణాలతో కూడిన స్థంబాలతోనూ అత్యద్భుతంగా ఉండును. ఈ ఆలయము ఆంధ్రదేశములోనే అత్యంత విశిష్టమైన శిల్ప కళ కలిగిన దేవాలయముగా వినుతికెక్కినది. ఈ దేవాలయము నందు గర్భాలయ వెనుక భాగమున గోడకు చెవి ఆన్చి వింటే ఝమ్మనే బ్రమరనాధం వినవస్తుంది.
మనోహర గుండము: శ్రీశైలములో తప్పకుండా చూడవలసిన వాటిలో ఇది ఒకటి. దీనిలో గొప్పతనము ఏమిటంటే చాలా స్వచ్ఛమైన నీరు ఈ గుండములో ఉంటుంది. శ్రీశైలము చాలా ఎత్తైన ప్రదేశములో ఉన్నది. అంత ఎత్తులో కూడా ఆ రాళ్ళలో ఇంత చక్కని నీరు ఉండటం నిజంగా చూడవలసినదే. ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మహానంది లోని కోనేటి నీటిలో క్రింద రూపాయ వేస్తే పైకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ చిన్ని గుండంలో కూడా కనిపిస్తుంది.
పంచ పాండవులు దేవాలయాలు: పాండవులు మల్లికార్జునుని దర్శించుకొని వారి పేరున అయిదు దేవాలయాలను ప్రధాన దేవాలయ వెనుక భాగమున నిర్మించి శివలింగములను ప్రతిష్టించిరి.
---share it
No automatic alt text available.