cricket ad

Saturday, 10 December 2016

హాట్ టాపిక్ : శంషాబాద్ లో నోట్ల కట్టల లారీ?

పాత నోట్ల మార్పిడికి డెడ్ లైన్ దగ్గర పడే కొద్దీ.. కట్టల పాములు ఒక్కొక్కటికీ బయటపడుతున్నాయి. నిన్నటికి నిన్న చెన్నైలో అతిపెద్ద స్కామ్ బయటపడగా.. ఇప్పుడు హైదరాబాద్ లో అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయటం లేదు. వివరాల్లోకి వెళితే.. నాకాబందీలో భాగంగా హైదరాబాద్ – బెంగళూరు హైవేపై శంషాబాద్ దగ్గర పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఓ లారీ వచ్చింది. వెహికల్ మొత్తం కవర్లతో కట్టేసి ఉంది. లారీ సరుకు ఏంటీ అని డ్రైవర్ ను ప్రశ్నించారు. తడబడిన డ్రైవర్… రెండు, మూడు సమాధానాలు చెప్పాడు. అనుమానం వచ్చిన పోలీసులు లారీని తనిఖీ చేశారు. అందులో పాత నోట్ల కట్టలు బయటపడ్డాయి. కోట్లలో ఈ డబ్బు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. లారీని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ లారీ ఎవరిది.. లారీలో ఉన్న డబ్బు ఎవరిది.. లారీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది.. ఐదు గంటలుగా హైదరాబాద్ లో ఈ వార్త హల్ చల్ చేస్తుంటే.. పోలీసులు ఎందుకు క్లారిటీ ఇవ్వటం లేదు.. ఉన్నతాధికారులు సైతం నోరు మెదపటం లేదు.. హైదరాబాద్ హాట్ టాపిక్ గా మారిన ఈ టాపిక్ పై అందరిలో ఆసక్తి నెలకొంది.

నమ్మినబంటే ‘అమ్మ’ను మరిచారా!

టీస్టాల్ ఓనర్‌గా జీవితం ప్రారంభించిన పన్నీర్ సెల్వం ఇప్పుడు తమిళనాడు కొత్త సీఎం అయ్యారు. పన్నీర్ సెల్వం ఇప్పుడు అమ్మకు వారసుడయ్యారు. తనకు అవసరమైనప్పుడు సీఎం సీట్లో సెల్వాన్ని జయ కూర్చోబెట్టారు. సెల్వమే ఇప్పుడు ఆమె ఖాళీ చేసిన వెళ్లిన సీట్లో కూర్చున్నారు. అక్రమాస్తుల కేసులో జయ జైలుకెళ్లినప్పుడు, అనారోగ్యంతో ఆమె ఆసుపత్రిలో వున్నప్పుడు సీఎం బాధ్యతలు నిర్వర్తించిన పన్నీర్‌సెల్వం తన టేబుల్‌పై ముందు భాగంలో ఆమె ఫోటో వుండేలా జాగ్రత్త తీసుకునేవారు. అదే విధంగా మంత్రివర్గానికి నేతృత్వం వహించినా అధ్యక్ష స్థానంలో మాత్రం కూర్చునేవారు కాదు. అయితే శనివారం జరిగిన భేటీలో జయ ఫోటో తన వెనుక వుండేలా కూర్చున్నారు. అంతేగాక ఆయన తొలిసారిగా మంత్రివర్గ అధ్యక్షుడి స్థానంలో కూర్చున్నారు.

16 మంది అమ్మాయిల‌ని ముట్టుకోకుండానే గ‌ర్భ‌వ‌తుల‌ను చేశాడు..!

టైటిల్ చ‌ద‌వ‌గానే షాక్ అవుతున్నారా. అవును టైటిల్ లో మేము చెప్పింది నిజ‌మే. ఓ 17 ఏళ్ల అబ్బాయి అస‌లు అమ్మాయిల‌ను ముట్టుకోకుండానే గ‌ర్బ‌వ‌తులను చేశాడు. అందులోను వారంతా 16 నుండి 18 ఏళ్ల అమ్మాయిలు కావ‌డం మ‌రింత షాక్కి గురి చేసే విష‌యం. అయితే ఈ వింత ఎలా చోటు చేసుకుంది.? ఎక్క‌డ జ‌రిగింది.? అస‌లు ప్ర‌పంచ వైద్య చ‌రిత్ర‌లో ఇలా జ‌రిగే అవ‌కాశాలున్నాయ‌..? తెలుసుకుందా.sasa
అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ వింత చోటు చేసుకుంది. వీకెండ్ పార్టీలో భాగంగా 16 మంది అమ్మాయిలు స్మిమింగ్ చేసేందుకు స్మిమింగ్ పూల్ లో దిగారు. అందులోను అంద‌రూ 20 ఏళ్ల లోపు అమ్మాయిలే అయితే వారంతా ఒక నెల త‌రువాత ప్రెగెన్సీ పొందామ‌ని షాక్ కు గురయ్యారు. దానికి కార‌ణం ఓ అబ్బాయి. అయితే ఆ అబ్బాయి వీళ్ల ఎవ‌రితో కూడా శృంగారంలో పాల్గొన‌లేదు. కానీ వీళ్లంద‌రిని మాత్రం గ‌ర్భ‌వ‌తుల‌ను చేశాడు. అస‌లు ఇదేలా జ‌రిగిందంటే. ఆరోజు అమ్మాయిలంద‌రు స్మిమింగ్ పూల్ లో స్నానానికి వెళ్ల‌క‌ముందు.. టోమి క‌ల్ట‌ర్ అనే 17 ఏళ్ల వ‌య‌సున్న‌ అబ్బాయి స్మిమ్మింగ్ ఫూల్ లో వీర్య స్క‌ల‌నం చేశాడు. అది కాస్త ఆ త‌రువాత స్నానం చేసిన అమ్మాయిలను గ‌ర్భం దాల్చేలా చేసింది. అయితే నీటిలో స్క‌ల‌నం అయిన వీర్యంతో గ‌ర్భం ఎలా వ‌చ్చింద‌నే క‌దా. అక్క‌డికే వ‌స్తున్నాం.. టోమి స్మెర్మాపోర్టిస్ అనే అరుదైన వ్యాధితో భాద‌ప‌డుతున్నాడంట. ఈ వ్యాధి ప్ర‌పంచంలో ల‌క్ష మందిలో ఇద్ద‌రికి మాత్ర‌మే వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని చెబుతున్నారు వైద్యులు. ఈ వ్యాది సోకిన వ్య‌క్తి వీర్యం మిగ‌తా పురుషుల వీర్యంతో పోలిస్తే వేల రెట్ల శ‌క్తిని క‌లిగి ఉంటుందంట. అందులోను వీర్య కణాల వేగం కూడా ఎక్కువే అని చెపుతున్నారు. నీటిలో ఈ వీర్య‌క‌ణాలు అంత ఈజీగా చనిపోవ‌ని.. వాట‌ర్ రెసిస్టెన్సీ ప‌వ‌ర్ కూడా ఎక్కువే అని చెపుతున్నారు వైద్యులు. ఈ కార‌ణంగానే ఆ ప‌ద‌హారు మంది అమ్మాయిలు గ‌ర్భం దాల్చార‌ని గుర్తించారు.girls
విష‌యం ఎలా బ‌య‌ట‌కి వ‌చ్చిందంటే..
గ‌ర్భం దాల్చిన అమ్మాయిలంతా ఒకే కాలేజికి చెందిన వారు కావ‌డం.. ఒకే సారి గ‌ర్భం రావ‌డంతో ఆందోళ‌న చెందారంట‌. వెంట‌నే డాక్ట‌ర్ను సంప్ర‌దించి జ‌రిగిందంతా చెప్పారు. విష‌యం తెలుసుకున్న డాక్టర్ కూడా షాక్ కి గుర‌య్యాడంట‌ అస‌లు సెక్స్ లో పాల్గొన‌కుండా గ‌ర్భం రావ‌డం ఏంట‌ని ఆలోచించి.. టెస్ట్ ల కోసం డా. జాన్ సుజికిమో.. థ‌లాసి మెమోరియ‌ల్ హ‌స్పిట‌ల్ ను సంప్ర‌దించుమ‌ని స‌ల‌హ ఇచ్చాడంట‌. దీంతో ఆ 16 మంది అమ్మాయిల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన డా.జాన్ సుజికిమో అస‌లు విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాడు. దీంతో అస‌లు విషయం తెలుసుకున్న‌ అమ్మాయిలు అబార్ష‌న్ చేసుకునేందుకు సిద్ద‌ప‌డ్డారు. అయితే ఇందులో ఓ ముగ్గురు మాత్రం త‌మకు వ‌చ్చిన ఈ అదృష్ట గ‌ర్బాన్ని ఇలాగే ఉంచుకుంటామ‌ని తెలిపారు.boy
అయితే ఇంత మంది గ‌ర్భానికి కార‌ణ‌మైన ఈ కుర్రాడు మాత్రం ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు. త‌న వ‌ర్జినిటి ఇంకా అలాగే ఉన్నందుకు గ‌ర్వ‌ప‌డుతున్నా అని చెపుతున్నాడు. ఈ ఘ‌ట‌న గ‌త ఏడాది పిబ్ర‌వ‌రి లో చోటు చేసుకుంది. టోమి ఇప్పుడు న‌లుగురు పిల్ల‌ల తండ్రి కూడా. వింత అంటే ఇదే మ‌రీ.

15 ఏళ్ళుగా మౌనంగా భరిస్తున్న నరకాన్ని ఎడమకాలితో తన్నింది.!! హ్యాట్సాఫ్ పాయల్.

ఉద‌యాన్నే 4 గంట‌ల‌కు లేవ‌డం… రాత్రి ఇంట్లో వంట‌లు వండిన గిన్నెలు, తిన్న ప్లేట్లు క‌డ‌గడం… ఇళ్లంతా శుభ్రం చేయ‌డం, వంట చేయ‌డం… మిగ‌తా ఏవైనా ప‌నులు ఉంటే పూర్తి చేసుకుని… అంద‌రూ ఉద‌యాన్నే తిన్నాక మిగిలింది ఎంత ఉన్నా తిని స్కూల్‌కు వెళ్ల‌డం… సాయంత్రం రాగానే తిరిగి అదే ప‌ని కంటిన్యూ చేయ‌డం… రాత్రి మ‌ళ్లీ అంద‌రూ తిన్నాక మిగిలితే ఇంత తిన‌డం, లేదంటే ప‌స్తుతో ప‌డుకోవ‌డం… తెల్ల‌వార‌గానే తిరిగి య‌థావిధిగా ప‌ని… స్కూల్‌… ఇదీ… ఒక‌ప్పుడు ఆ యువ‌తి దుస్థితి..! 15 ఏళ్లుగా అలా న‌ర‌క యాత‌న అనుభ‌వించింది. ఎవ‌రి ద‌గ్గర ఉన్నా అదే ప‌ని. అందులో మార్పు లేదు. దీనికి తోడు వారు పెట్టే చిత్ర‌హింస‌లు. వీట‌న్నింటినీ మౌనంగానే త‌ట్టుకుంది. క‌ట్ చేస్తే… ఇప్పుడు సొంతంగా జాబ్ చేస్తూ త‌న కాళ్ల‌పై తాను నిల‌బ‌డి స్వేచ్ఛ‌గా జీవిస్తోంది ఆ యువ‌తి..!
payal
ఆమె పేరు పాయ‌ల్‌. వ‌య‌స్సు 4 సంవ‌త్స‌రాలు ఉన్న‌ప్పుడే త‌ల్లిదండ్రులు చ‌నిపోయారు. దీంతో బంధువులే దిక్క‌య్యారు. మొద‌ట ఆమెను త‌న మామ‌య్య తీసుకెళ్లాడు. కొద్ది రోజుల వ‌ర‌కు సొంత పిల్ల‌ల్ని చూసిన‌ట్టుగానే చూశారు. కానీ ఆ త‌రువాతే పాయ‌ల్ జీవితం ప‌ని మ‌నిషి క‌న్నా హీన‌మైంది. పైన చెప్పాం క‌దా..! నిత్యం అదే జీవితం… ఈ క్ర‌మంలో ఆమె మాన‌సికంగా కుంగి పోయింది. కొద్ది రోజులు వ‌రుస‌కు అక్క అయ్యే ఒకావిడ ద‌గ్గ‌ర ఉంది. అక్క‌డ కూడా ఇదే ప‌రిస్థితి. అలా బంధువులంద‌రి ఇళ్లలో పాయ‌ల్ ఉంటూ వ‌చ్చింది. అయినా ఆమె ప‌రిస్థితిలో ఏమీ మార్పు లేదు. నిత్యం ఒళ్లు అలిసేలా ప‌నిచేయ‌డం, వారి చేతుల్లో చిత్ర హింస‌ల‌కు గుర‌వ‌డం. ఈ క్ర‌మంలో పాయల్ ఒక్క‌టే అనుకుంది. ఎలాగైనా చ‌దువుకుని త‌న కాళ్ల‌పై తాను నిల‌బ‌డాల‌ని. వెంట‌నే ఆ నిర్ణ‌యాన్ని అమ‌లులో పెట్టింది. ప‌ని చేసుకునేందుకు ఉద‌యం 4 గంట‌ల‌కే లేచి త్వ‌ర‌గా అన్ని ప‌నులు ముగించుకుని స్కూల్‌కు వెళ్లి సాయంత్రం ఇంటికి వ‌చ్చి మ‌ళ్లీ ప‌ని చేసుకుని తీరిక వేళల్లో చ‌దివేది. ఈ క్ర‌మంలో విద్యాభ్యాసం ఎలాగో ఆమె పూర్తి చేసింది.
అలాంటి ప‌రిస్థితిలో ఆమెకు ఈతాషా అనే ఓ స్వ‌చ్ఛంద సంస్థ తార‌స‌ప‌డింది. వారు పాయ‌ల్ లాంటి యువ‌తుల‌కు కంప్యూట‌ర్స్‌, డేటా ఎంట్రీ వంటి కోర్సుల‌ను నేర్పించి ఉద్యోగం చూపిస్తారు. అందులో పాయ‌ల్ కూడా శిక్ష‌ణ తీసుకుంది. ఈ క్ర‌మంలో ఆమెకు శిక్షా కేంద్ర అన‌బ‌డే ఓ ఎన్‌జీవోలో ఉద్యోగం వ‌చ్చింది. అక్క‌డే రిసెప్ష‌నిస్ట్‌గా ఆమె ఇప్పుడు ప‌నిచేస్తోంది. ఇప్పుడామెకు 19 ఏళ్లు. సొంతంగా త‌న కాళ్ల‌పై నిల‌బ‌డింది. ప‌నిచేసుకుంటోంది. నెల తిరిగే స‌రికి జీతం పొందుతోంది. మునుప‌టిలా ప‌నిచేసే బాధ లేదు. మానసిక వేద‌న‌, చిత్ర హింస‌లు అంత‌క‌న్నా లేవు. ఇలాగే మ‌రికొన్ని సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డి, పైసా పైసా కూడ‌బెట్టి పెళ్లి చేసుకుంటానంటోంది పాయ‌ల్‌..! ఆమె క‌ల‌లు సాకారం కావాల‌ని, మ‌రింత ఉన్న‌త స్థానాల‌కు ఆమె ఎద‌గాల‌ని మ‌నం కూడా ఆశిద్దాం..!

శ్రీ‌మ‌హావిష్ణువుకు నారాయ‌ణుడనే పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా..?…

లోక క‌ల్యాణం కోసం శ్రీ‌మ‌హావిష్ణువు 10 అవ‌తారాలను ధ‌రించాడు. అందులో కొన్ని అవ‌తారాల‌తో జ‌నావ‌ళికి మేలు చేయ‌గా, మ‌రికొన్ని అవ‌తారాల్లో రాక్ష‌స సంహారం చేసి జ‌నాల‌ను, దేవ‌త‌ల‌ను ర‌క్షించాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న ధ‌రించిన ఒక్కో అవ‌తారం గురించి అనేక క‌థ‌లు కూడా ఉన్నాయి. పురాణాల్లో వీటి గురించి వివ‌రంగా తెలియ‌జేశారు కూడా. అయితే శ్రీ‌మ‌హావిష్ణువు ఆయ‌న ధ‌రించిన అవ‌తారాల్లోనే కాదు, అనేక ఇత‌ర వేరే పేర్ల‌తో కూడా భ‌క్తుల‌చే పొగ‌డ్త‌లు, కీర్త‌న‌లు, ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. అందులో ఒక పేరే నారాయ‌ణుడు. ఇంత‌కీ ఆయ‌న‌కు ఆ పేరు ఎలా వ‌చ్చిందంటే…
vishnu
ప్రాణికోటి మ‌నుగ‌డ‌కు నీరు అత్యంత ఆవ‌శ్య‌కం. నీరు లేక‌పోతే మ‌నం లేము. అయితే నారాయ‌ణుడు అన్న పేరులో నారము అంటే నీరు అనే అర్థం వ‌స్తుంది. అదేవిధంగా ఆయ‌ణుడు అంటే దారి చూపే వాడు అని అర్థం వస్తుంది. అంటే స‌మ‌స్త ప్రాణికోటికి నీటిని అందించే వాడు క‌నుక‌నే విష్ణువుకు నారాయ‌ణుడ‌నే పేరు వ‌చ్చింది. అంతేకాదు, విష్ణువు నీటి నుంచి ఉద్భ‌వించిన‌ట్టుగా పురాణాలు చెబుతున్నాయి. అందుకు కూడా ఆయ‌న్ను నారాయ‌ణుడ‌ని పిలుస్తారు.
అయితే పైన చెప్పినవే కాకుండా విష్ణువును నారాయ‌ణుడ‌ని పిల‌వ‌డానికి ఇంకొన్ని కార‌ణాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే… నారదుడు ఎల్ల‌ప్పుడూ నారాయ‌ణ‌… నారాయ‌ణ‌… అంటూ స్మ‌ర‌ణ చేసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో విష్ణువును నారాయ‌ణుడని పిల‌వ‌డం మొద‌లుపెట్టార‌ట‌. అదేవిధంగా గంగాన‌ది విష్ణువు పాదాల నుంచి ఉద్భ‌వించ‌డం వ‌ల్ల విష్ణు పాదోదకం అని పేరు వ‌చ్చింద‌ట‌. దీంతోపాటు విష్ణువు ఎల్ల‌ప్పుడూ నీటిలో నివ‌సిస్తాడు కాబ‌ట్టి ఆయ‌న‌కు నారాయ‌ణుడ‌నే పేరు వ‌చ్చింది..!

అపోలో ఆస్ప‌త్రిలో జ‌య చివ‌రి సారిగా మాట్లాడిన మాట‌లివే..!

ఈ ఏడాది గత సెప్టెంబ‌ర్ నెల‌లో జ‌య‌ల‌లిత తీవ్ర అనారోగ్యంతో చెన్నై అపోలో ఆస్ప‌త్రిలో చేరిన ద‌గ్గ‌ర్నుంచీ, మొన్నా మ‌ధ్య ఆమె మృతి చెందిన రోజు వ‌ర‌కు జ‌రిగిన అనూహ్య ప‌రిణామాల‌న్నింటినీ మ‌నం గ‌మ‌నిస్తూనే వ‌స్తున్నాం. ఈ క్ర‌మంలోనే అమ్మ మృతి ప‌ట్ల ప‌లు పుకార్లు షికార్లు కూడా చేస్తున్నాయి. వాటిలో వాస్త‌వ‌మెంతో తెలియ‌దు కానీ… ఇప్పుడు అలాంటిదే మ‌రో వార్త నెట్‌లో, ప్ర‌ధానంగా సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ సృష్టిస్తోంది. నిజానికి అది వార్త కాదు. ఓ ఆడియో క్లిప్‌. జ‌య‌ల‌లిత హాస్పిట‌ల్‌లో ఉన్న‌ప్పుడు త‌మిళ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడిన చివ‌రి మాట‌లుగా అవి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. అందులో జ‌య‌ల‌లిత త‌మిళంలో మాట్లాడుతున్న‌ట్టుగా కూడా ఉంది. ఈ క్ర‌మంలో ఆ ఆడియో క్లిప్‌లో అమ్మ మాట్లాడిన మాట‌ల‌కు తెలుగు వెర్ష‌న్ ఇదే..! ఆ మాట‌ల‌ను ఇప్పుడు చూద్దాం..!
jayalalitha
‘అంద‌రికీ పాదాభివంద‌నం. న‌మ‌స్కారం. నేను మీ అమ్మ‌ను మాట్లాడుతున్నా. నా ఆరోగ్యం బాగు ప‌డాల‌ని ప్రార్థించే అంద‌రికీ హృద‌య పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. దేవుడు మీ మంచి మ‌న‌స్సుల కోసం న‌న్ను ఆరోగ్యంగానే ఉంచాడు. కొంత విశ్రాంతి త‌రువాత మీ ముందుకొచ్చి మాట్లాడే గుండె ధైర్యాన్ని ఆ భ‌గవంతుడు నాకు ఇచ్చాడు. నా ఆరోగ్యం గురించి వ‌చ్చే వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్దు. నా ఆరోగ్యం గురించి ప్ర‌తిప‌క్షాలు అన‌వ‌స‌రంగా రాద్ధాంతం చేస్తున్నాయి. వాటి గురించి మీరు అధైర్య ప‌డ‌వ‌ద్దు. ఎప్పటికీ మ‌న పార్టీయే అధికారంలో ఉంటుంది. నా ర‌క్తానికి ర‌క్త‌మైన అన్న అభిమానుల‌కు మ‌రియు ప్ర‌జ‌ల గుండెల్లో నా మీద ప్రేమ ఉన్నంత వ‌ర‌కు నేను ఆరోగ్యంగానే ఉంటా. నేను ఇంత‌కు ముందు చెప్పిన‌ట్టు మీ కోస‌మే నేను బ్ర‌తికి ఉంటా. ఏవిధంగా అయితే నన్ను సీఎంగా గెలిపించారో అదేవిధంగా మ‌ళ్లీ న‌న్ను గెలిపిస్తార‌ని న‌మ్ముతున్నాను. ఈ నెల 17, 19 తారీఖుల్లో జ‌రిగే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో మెజార్టీ సీట్ల‌తో న‌న్ను గెలిపించుకుంటార‌ని ఆశిస్తున్నా.”
ఇవీ జ‌య ఆస్ప‌త్రిలో ఉన్న‌ప్పుడు చివ‌రి సారి జ‌నాల‌ను ఉద్దేశించి మాట్లాడిన‌ట్టుగా చెబుతున్న ఆడియో క్లిప్ సారాంశం. అయితే వాస్త‌వానికి ఈ ఆడియో క్లిప్‌లో ఉన్నది జ‌య గొంతుకేనా, లేదా ఆమెను ఇమిటేట్ చేస్తూ ఎవ‌రైనా మిమిక్రీ చేశారా అన్న‌ది మాత్రం తెలియ‌దు. కానీ ఇది రాబోయే ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని జ‌య అనుకూల వ‌ర్గాలు బ‌య‌టికి రిలీజ్ చేసిన క్లిప్ అని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ఇందులో ఉన్న నిజం ఎంత అనేది ఆ దేవుడికే తెలియాలి..!

ఇలా చేస్తే 2 వారాల్లోనే మీ ముఖం అందంగా మారుతుంది..! పైసా ఖ‌ర్చు ఉండ‌దు..!

ముడ‌తలు, మ‌చ్చ‌లు, మొటిమ‌లు లేని అంద‌మైన ముఖం కావాల‌ని ఎవ‌రికి మాత్రం ఉండ‌దు చెప్పండి. నేటి త‌రుణంలో అయితే ఆడ‌, మ‌గ అంద‌రూ త‌మ ముఖార‌విందాలు అందంగా క‌నిపించాల‌ని కోరుకుంటున్నారు. అందుకు తగిన విధంగానే ర‌క ర‌కాల ప‌ద్ధతుల‌లో త‌మ ముఖాన్ని అందంగా క‌నిపించే విధంగా చేసుకుంటున్నారు. ఇందు కోసం వారు బ్యూటీపార్ల‌ర్ల‌ను ఆశ్ర‌యించ‌డం లేదంటే వివిధ ర‌కాల క్రీములు గ‌ట్రా రాయ‌డం వంటి ప‌నులు చేస్తున్నారు. అయితే అలాంటి బాధ లేకుండా కేవ‌లం ఒకే ఒక్క సింపుల్ టెక్నిక్‌తో ఎవ‌రైనా త‌మ ముఖాన్ని కేవ‌లం 2 వారాల‌లోనే అందంగా మార్చుకోవ‌చ్చు. అందుకు ఏ క్రీం కొనాల్సిన ప‌నిలేదు. ఎక్క‌డికి వెళ్లాల్సిన అవ‌స‌రం కూడా లేదు. అందుకు ఏం చేయాలంటే…
tanaka-technique
యుకుకో త‌న‌క అనే ఓ జ‌పనీస్ బ్యూటీ ఎక్స్‌ప‌ర్ట్ ‘త‌న‌క’ అనే ఓ కొత్త త‌ర‌హా మ‌సాజ్ టెక్నిక్ ను క‌నిపెట్టింది. ఇందులో కేవ‌లం చేతి వేళ్ల‌ను మాత్ర‌మే ఉప‌యోగిస్తూ నిత్యం 7 నిమిషాల పాటు ముఖాన్ని మ‌సాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా 2 వారాల పాటు రోజూ ముఖాన్ని మ‌ర్ద‌నా చేస్తే చాలు, దాంతో ముఖంపై ఉన్న ముడ‌తలు పోవ‌డ‌మే కాదు, మ‌చ్చ‌లు, మొటిమ‌లు కూడా మాయ‌మ‌వుతాయి. ముఖం మ‌రింత అందంగా, కాంతివంతంగా క‌నిపిస్తుంది. అయితే ఇలా మ‌సాజ్ చేసేందుకు ఎలాంటి క్రీం అవ‌స‌రం లేదు. ఆల్మండ్ ఆయిల్‌, ఆలివ్ ఆయిల్, కొబ్బ‌రి నూనె వంటివి ఉంటే చాలు. ఎంచ‌క్కా వాటిని ముఖానికి రాసుకుని త‌న‌క ప‌ద్ధ‌తిలో ముఖాన్ని మ‌సాజ్ చేస్తే చాలు. దాంతో ముందు చెప్పిన విధంగా అద్భుతమైన ఫ‌లితాలు వ‌స్తాయి.