పాత నోట్ల మార్పిడికి డెడ్ లైన్ దగ్గర పడే కొద్దీ.. కట్టల పాములు
ఒక్కొక్కటికీ బయటపడుతున్నాయి. నిన్నటికి నిన్న చెన్నైలో అతిపెద్ద స్కామ్
బయటపడగా.. ఇప్పుడు హైదరాబాద్ లో అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఈ
విషయంపై పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయటం లేదు. వివరాల్లోకి వెళితే..
నాకాబందీలో భాగంగా హైదరాబాద్ – బెంగళూరు హైవేపై శంషాబాద్ దగ్గర పోలీసులు
తనిఖీ చేస్తున్నారు. ఓ లారీ వచ్చింది. వెహికల్ మొత్తం కవర్లతో కట్టేసి
ఉంది. లారీ సరుకు ఏంటీ అని డ్రైవర్ ను ప్రశ్నించారు. తడబడిన డ్రైవర్…
రెండు, మూడు సమాధానాలు చెప్పాడు. అనుమానం వచ్చిన పోలీసులు లారీని తనిఖీ
చేశారు. అందులో పాత నోట్ల కట్టలు బయటపడ్డాయి. కోట్లలో ఈ డబ్బు ఉన్నట్లు
ప్రాథమిక సమాచారం. లారీని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ లారీ ఎవరిది..
లారీలో ఉన్న డబ్బు ఎవరిది.. లారీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది.. ఐదు
గంటలుగా హైదరాబాద్ లో ఈ వార్త హల్ చల్ చేస్తుంటే.. పోలీసులు ఎందుకు
క్లారిటీ ఇవ్వటం లేదు.. ఉన్నతాధికారులు సైతం నోరు మెదపటం లేదు.. హైదరాబాద్
హాట్ టాపిక్ గా మారిన ఈ టాపిక్ పై అందరిలో ఆసక్తి నెలకొంది.
No comments:
Post a Comment