ఉదయాన్నే 4 గంటలకు లేవడం… రాత్రి
ఇంట్లో వంటలు వండిన గిన్నెలు, తిన్న ప్లేట్లు కడగడం… ఇళ్లంతా శుభ్రం
చేయడం, వంట చేయడం… మిగతా ఏవైనా పనులు ఉంటే పూర్తి చేసుకుని… అందరూ
ఉదయాన్నే తిన్నాక మిగిలింది ఎంత ఉన్నా తిని స్కూల్‌కు వెళ్లడం… సాయంత్రం
రాగానే తిరిగి అదే పని కంటిన్యూ చేయడం… రాత్రి మళ్లీ అందరూ తిన్నాక
మిగిలితే ఇంత తినడం, లేదంటే పస్తుతో పడుకోవడం… తెల్లవారగానే తిరిగి
యథావిధిగా పని… స్కూల్… ఇదీ… ఒకప్పుడు ఆ యువతి దుస్థితి..! 15 ఏళ్లుగా
అలా నరక యాతన అనుభవించింది. ఎవరి దగ్గర ఉన్నా అదే పని. అందులో
మార్పు లేదు. దీనికి తోడు వారు పెట్టే చిత్రహింసలు. వీటన్నింటినీ
మౌనంగానే తట్టుకుంది. కట్ చేస్తే… ఇప్పుడు సొంతంగా జాబ్ చేస్తూ తన
కాళ్లపై తాను నిలబడి స్వేచ్ఛగా జీవిస్తోంది ఆ యువతి..!
ఆమె పేరు పాయల్. వయస్సు 4 సంవత్సరాలు ఉన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో బంధువులే దిక్కయ్యారు. మొదట ఆమెను తన మామయ్య తీసుకెళ్లాడు. కొద్ది రోజుల వరకు సొంత పిల్లల్ని చూసినట్టుగానే చూశారు. కానీ ఆ తరువాతే పాయల్ జీవితం పని మనిషి కన్నా హీనమైంది. పైన చెప్పాం కదా..! నిత్యం అదే జీవితం… ఈ క్రమంలో ఆమె మానసికంగా కుంగి పోయింది. కొద్ది రోజులు వరుసకు అక్క అయ్యే ఒకావిడ దగ్గర ఉంది. అక్కడ కూడా ఇదే పరిస్థితి. అలా బంధువులందరి ఇళ్లలో పాయల్ ఉంటూ వచ్చింది. అయినా ఆమె పరిస్థితిలో ఏమీ మార్పు లేదు. నిత్యం ఒళ్లు అలిసేలా పనిచేయడం, వారి చేతుల్లో చిత్ర హింసలకు గురవడం. ఈ క్రమంలో పాయల్ ఒక్కటే అనుకుంది. ఎలాగైనా చదువుకుని తన కాళ్లపై తాను నిలబడాలని. వెంటనే ఆ నిర్ణయాన్ని అమలులో పెట్టింది. పని చేసుకునేందుకు ఉదయం 4 గంటలకే లేచి త్వరగా అన్ని పనులు ముగించుకుని స్కూల్‌కు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి మళ్లీ పని చేసుకుని తీరిక వేళల్లో చదివేది. ఈ క్రమంలో విద్యాభ్యాసం ఎలాగో ఆమె పూర్తి చేసింది.
No comments:
Post a Comment