cricket ad

Monday 12 December 2016

దేశంలో ఈ వ్యాధుల వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారట..!

మన దేశంలో ఎక్కువ మంది గుండె జబ్బులు, పక్షవాతం, ఊపిరితిత్తుల్లో సమస్యల వల్ల చనిపోతున్నారని తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. వీటి తర్వాత షుగర్, మూత్రపిండ వ్యాధులు, న్యుమోనియా, అతిసారం, టీబీ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారట. వ్యాధులే కాకుండా రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువ మందిని బలితీసుకుంటున్నాయని రీసర్చ్ తెలిపింది.
 
195 దేశాల్లో పరిశోధకులు జరిపిన అధ్యయనంలో మరణాలకు గల కారణాలు వెల్లడయ్యాయి. పాశ్చాత్య జీవనశైలిని పాటించే క్రమంలో, మన దేశంలో అంటువ్యాధులు ఎక్కువ అవుతున్నాయని వెల్లడైంది. అయితే, జీవనశైలిని మార్చుకోవడం, యాంటీబయోటిక్స్ తో సత్వర చికిత్స చేయించుకోవడం ద్వారా అంటువ్యాధులను నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. సురక్షిత నీరు, పారిశుద్ధ్యం లేకపోవడంతో నెలలు నిండకుండానే చిన్నారులు మృత్యువాత పడుతున్నారని వారు పేర్కొన్నారు. ప్రతి ఏడాది మన దేశంలో కోటి కంటే ఎక్కువ మంది చనిపోతున్నారని వివరించారు.

ఒత్తిడికి చెక్ పెట్టాలంటే..?

ఒత్తిడికి చెక్ పెట్టాలంటే.. రోజంతా పనిచేయాల్సిన అవసరం లేదు. పక్కా ప్లాన్ ప్రకారం వేసుకుంటే సరిపోతుంది. కార్యాలయాలు వెళ్ళే మహిళలు రోజూ హడావుడిగా కదలడం ద్వారా వారికి అనారోగ్య సమస్యలు తప్పవని.. అందుచేత చేసే పనిని సమయాన్ని వృధా చేసుకోకుండా చేసుకుంటే.. ఎలాంటి తలనొప్పులు ఉండవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్రపోకుండా త్వరగా నిద్రపోవాలని తెలుపుతున్నారు. రాత్రి ఎంత త్వరగా పనులన్నీ పూర్తి చేసుకుని నిద్రిస్తారో ఆరోగ్యానికి అంత మేలు చేసినట్లవుతుంది. దీని ద్వారా ప్రతి మనిషిలో ఆందోళన తగ్గుతుంది. ప్రతి రోజూ ఒక సమయానికి నిద్ర లేవడం ద్వారా జీవక్రియల రేటు మెరుగవుతుంది. ఈ ప్రక్రియను కొనసాగించాలంటే.. సెలవు రోజూ ఉదయాన్నే లేవాలి.  
 
నిద్రలేవగానే బద్ధకం, మత్తుగా అనిపిస్తే దాన్ని వెంటనే వదిలించుకోవాలి. లేదంటే ఆ ప్రభావం రోజంతా ఉంటుంది. ఉదయం పూట సూర్మరశ్మి తగిలితే శరీరానికి నూతనోత్తేజం అందుతుంది, అసౌకర్యం దూరమవుతుంది. ఎండలో ఉండే 'డి' విటమిన్ ఒత్తిళ్లనూ దూరం చేస్తుంది.
 

సూపర్‌ మార్కెట్లో పళ్లు, కూరగాయలు కొనేముందు వీటిని గమనించండి

సూపర్‌ మార్కెట్‌లో అమ్మే పళ్లు, కాయగూరలను గమనిస్తే వాటిపై ఏవో లేబుల్స్‌ అతికించి ఉంటాయి. కానీ చాలామంది వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. ఆ లేబుల్‌... ఉత్పత్తి చేసేవాడికి, అమ్మేవాడికి మాత్రమే సంబంధించిన విషయంగా భావిస్తారు. నిజానికా లేబుల్‌ వినియోగదారుడు తను కొంటున్న వస్తువు ఎలాంటిదో తెలుసుకోవడానికి ఉద్దేశించినది. 
ప్రస్తుతం ఎక్కడ ఎవరి నోట విన్నా ఆర్గానిక్‌ అనే మాట వినిపిస్తోంది. ఆర్గానిక్‌ కాయగూరలు, పళ్లు అంటే సేంద్రీయ ఎరువులు వేసి సహజ పద్ధతుల్లో పండించినవని మనకు తెలుసు. అందుకే అవి ఆరోగ్యానికి మంచివని కొంచెం ఖరీదు ఎక్కువైనా కొంటుంటాం. ముఖ్యంగా పళ్ల రసాలకి ఆర్గానిక్‌ పళ్లే శరణ్యం. ఎందుకంటే పళ్లరసాలు త్వరగా జీర్ణమై మన శరీరంలో కలిసిపోతాయి. ఆ పళ్లరసం పెస్టిసైడ్స్‌, ఫంగిసైడ్స్‌ వేసి, రసాయనిక ఎరువులు వాడి పండించిన పళ్లనుంచి తయారు చేసినదైతే... పళ్లరసం తీసుకున్న వెంటనే విష పదార్థాలు నేరుగా మన శరీరంలో కలిసిపోతాయి. దానివల్ల అప్పటికప్పుడు ఆరోగ్యం పాడు కావడంతో పాటు... భవిష్యత్తులో క్యాన్సర్‌ వంటి ప్రమాదకర జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. 
మరి ఏవి సహజ పద్ధతుల్లో పండించినవి? ఏవి పురుగు మందులు, రసాయనిక ఎరువులు వేసి పండించినవి? ఏవి జన్యుమార్పిడి ద్వారా పండించినవి?... అని తెలుసుకోవాలంటే పళ్ళు, కాయగూరలపై వేసే లేబుల్స్‌ను జాగ్రత్తగా గమనించాలి.
ఆపిల్‌కున్న లేబుల్‌పై నాలుగు అంకెలు ఉండి, మొదటి అంకె మూడు లేదా నాలుగు ఉంటే రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడి పండించిన పంట.
లేబుల్‌పై అయిదు అంకెలు ఉండి... మొదటి అంకె ఎనిమిది అయితే జన్యుమార్పిడి ద్వారా పండించిన పంట.
లేబుల్‌పై అయిదు అంకెలు ఉండి... మొదటి అంకె తొమ్మిది ఉన్నట్లయితే అది ఆర్గానిక్‌ పంట.
ఇక పళ్లపై లేబుల్‌ని పిల్లలు చూసుకోకుండా తినేస్తే గాభరా పడాల్సిన అవసరం లేదు. ఆ లేబుల్‌ కాగితాన్ని తినదగిన పేపర్‌తోనే తయారు చేస్తారు. అంతేకాదు.. ఆ లేబుల్‌ని అతికించడానికి ఉపయోగించే జిగురు సైతం తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలతోనే తయారవుతుంది.
 

ఆ జ్యూస్ తో గ్యాస్ మటుమాయం

కొందరికి త‌ర‌చుగా క‌డుపులో మంట‌ రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు.ఈ నొప్పి వ‌చ్చిన‌ప్పుడు ఏ ప‌నిని స‌క్ర‌మంగా చేయ‌నివ్వ‌దు.. మంట వ‌స్తూనే ఉంటుంది. దీంతో త‌ర‌చూ బాధ‌ప‌డేవారు గ్యాస్ నొప్పి అని గుర్తించారా.. త‌ర‌చూ నొప్పి వ‌స్తే వైద్యుని స‌ల‌హాతో త‌గిన మందులు వాడడం, స‌రైన స‌మ‌యానికి ఆహారం తీసుకోవ‌డం చేస్తుంటాం.
వీటితో పాటు త్వ‌ర‌గా గ్యాస్ నొప్పి దూరం కావాలంటే బూడిద గుమ్మ‌డి కాయ ర‌సం తాగాలి. క‌డుపులో ఉబ్బ‌రాన్ని త‌గ్గించే గుణాలు ఈ ర‌సంలో ఉన్నాయి. అంతేకాదు బ‌రువు త‌గ్గ‌డానికి దోహ‌దం చేస్తుంది. రోజూ ఓ క‌ప్పు బూడిద గుమ్మ‌డికాయ జ్యూస్‌ను తాగితే క‌లిగే ప్ర‌యోజ‌నాలను తెలుసుకుందాం

HEALTH కొబ్బరి బొండాలను కూడా కల్తీ చేస్తున్నారట

కాస్త వేడి చేసిందంటే చాలు కొబ్బ‌రి నీళ్ళు తాగుతాం. జ్వరం వ‌చ్చినా, నీరసంగా ఉన్నా కొబ్బ‌రి బొండాలు కావాల్సిందే. ఏ కాలమైనా మేలు చేసేవి కొబ్బరినీళ్లు. సర్వరోగ నివారిణిగా పేరున్న కొబ్బరి నీళ్లొక్కటే కల్తీ లేకుండా దొరుకుతున్నాయని ప్రతి ఒక్కరి నమ్మకం. సీజన్‌ను బట్టి ఎంత ధర పెట్టి అయినా కొని తాగే కొబ్బరినీళ్లలో కూడా కల్తీ జరుగుతోందట. అదెలా సాధ్యం? త్వరితగతిన కొబ్బరి పిందెలు కొబ్బరి బొండాలుగా తయారుకావాలని.. వాటిని ఎగుమతి చేసుకోవాలనే తాపత్రయంలో వీటిని కూడా కల్తీ చేస్తున్నారట.
 
కొబ్బరి చెట్టు వేర్లు ఉన్నచోట తల్లి వేరును బయటకు తీసి దానిని అక్కడే కవర్లో పెట్టి దానిపై మోనోక్రోటోఫాస్ అనే కెమికల్‌ను పోసి ఆ తరువాత మట్టితో కప్పేస్తారట. ఇలా ఆ కెమికల్‌ను చెట్టుకు ఎక్కించడం ద్వారా పిందెలు త్వరితిగతిన బొండాలుగా మారతాయట. అలా తయారైన బొండాలు తాగితే గుండె, కిడ్నీ, లివర్ సమస్యలు వస్తాయని వైద్యులు అంటున్నారు. చెట్టు నుంచి వాటి కెమికల్ పూర్తిగా నశించాలంటే 40 రోజులు పడుతుందట. సో.. మనం తాగుతున్న బొండాలు కూడా ఎంత వరకు సేఫ్? గ్యారంటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అంతా మాయాప్ర‌పంచం... క‌ల్తీమ‌యం

ఎండుద్రాక్ష.. ఆరోగ్యానికి శ్రీరామరక్ష..!


రైజిన్స్... కిస్ మిస్... ఎండు ద్రాక్ష...' పేరేదైనా వీటిలో పోషకాలు మెండుగా ఉంటాయి. అందుకే చక్కగా రోజూ కాస్తంత ఎండు ద్రాక్ష తీసుకుంటే పలు రకాలైన ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
ఎండుద్రాక్ష తీసుకోవడం వల్ల కలిగే లాభాలు...
* ఎండుద్రాక్షలను తీసుకోవడం ద్వారా బరువు తగ్గడం సులభమవుతుంది.
* జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు
* వీటిల్లోని గ్లూకోజ్ శరీరానికి శక్తినిస్తుంది. రోగ నిరోధకశక్తినీ పెంచుతుంది. పైగా కొన్నే తిన్నా పొట్టనిండినట్లు అనిపిస్తుంది.
* అలాగే రోజూ ఎండుద్రాక్షలను తీసుకోవడం ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్, క్యాన్సర్ కారకాలు దూరమవుతాయి. 
* ఎండుద్రాక్షలో ఉండే క్యాల్షియం, బోరాన్ పోషకాలు ఎముకలకు బలాన్నిస్తాయి. 
* పిల్లల పెరుగుదలకు ఎంతగానో మేలు చేస్తాయి. 
* అలాగే నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలు బాధిస్తుంటే.. ఎండుద్రాక్షల్ని నోట్లో వేసుకుని ఎక్కువసేపు నములుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చిగుళ్ల సమస్యలు అదుపులోకి వస్తాయి. 
* రక్తహీనతకు చెక్ పెట్టాలంటే.. ఎండుద్రాక్షను తీసుకోవాలి. వీటిల్లోని ఇనుము, రాగి, విటమిన్ బి పోషకాలు శరీరానికి అందుతాయి. ఇవన్నీ ఎర్రరక్తకణాల వృద్ధిని పెంచడం, రక్తప్రసరణలో లోపం లేకుండా చూస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

చలికాలంలో ఇవి తినండి, ఆరోగ్యంగా ఉండండి...!

అసలే చలికాలం. ఆపై పడిపోతున్న ఉష్ణోగ్రతలు. ఇలాంటి సమయాల్లో పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలెక్కువ. అందువల్ల మనం తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. శీతాకాలంలో మన శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవటానికి శక్తిని ఇచ్చే ఆహారాలనే తినాలి. అందుకోసం.. గోధుమ..జొన్నలు..సజ్జలు..మినుముల..రాగులు..కందిపప్పు..ఇలాంటివి శరీరానికి శక్తిని అందిస్తాయి.
* రోజూ వారీ డైట్ లో తృణ ధాన్యాలు తీసుకోవాలి. పిల్లలకు తృణధాన్యాలు తప్పకుండా ఇవ్వాలి. వేరు శెనగలు, తేనెను డైట్ లో చేర్చుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
* అల్లం టీ తాగడం ద్వారా జలుబు, అసిడిటీని దూరం చేసుకోవచ్చు. కారం, చేదు, పులుపు వస్తువుల్ని మోతాదుగా తీసుకుంటూ ఉండాలి. మజ్జిగ, పెరుగు కాస్త చేర్చుకోవచ్చు.
* పరిమితంగా మాంసం, ఆవు, పాలు, నట్స్, పన్నీర్, మిల్క్, దాల్, సోయాబిన్, ఫిష్, గుడ్లు, వంటి హై-ప్రోటీన్ ఫుడ్ తీసుకోవటం వల్ల చర్మం, కీళ్ళు మొదలగు వాటిని రక్షిస్తాయి.
* శీతాకాలంలో శరీరం పొడిగా తయారవుతుంటుంది. ఈ పొడితత్వాన్ని తట్టుకొనేందుకు రోజుకు కనీసం 7-8 గ్లాసుల నీరు తాగాల్సి ఉంటుంది.
* వేడినీళ్లతో స్నానం చర్మం మరింత పొడిబారేలా చేస్తుంది. కాబట్టి గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి. చలి తక్కువగా ఉండే సమయంలో అంటే ఉదయం 7-8 గంటలకు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. నడకను ఎంచుకోవడం ఉత్తమం.
* బాదం నూనె, బాదంపొడి, అరటి ముక్కలు, గ్లిజరిన్ లేదా తేనే ఇలా ప్రతి ఒక్కటి రెండు చెంచాల మోతాదులో తీసుకోవాలి. నాలుగు టీ స్పూన్లు పాలు ఆ మిశ్రమానికి కలిపి మెత్తని గుజ్జు మాదిరి పేస్ట్ చేసి ముఖానికి, మెడకు మృదువుగా మసాజ్ చేస్తూ పట్టించి కొద్దిసేపుంచి కడిగేయాలి. ఇది పొడి చర్మానికి ఉపయోగపడుతుంది. 
* జిడ్డు చర్మం కలిగిన వారు.. రెండు టీ స్పూన్లు ఓట్ మీల్ పొడి, నాలుగు టీ స్పూన్లు మజ్జిగ, రెండు టీ స్పూన్లు గంధంపొడి కలిపి ముఖానికి, మెడకు బాగా పట్టించి, గోరువెచ్చని నీటితో కడిగేస్తే జిడ్డు చర్మం పోయి కాంతివంతంగా ఉంటుంది.