cricket ad

Monday, 12 December 2016

HEALTH కొబ్బరి బొండాలను కూడా కల్తీ చేస్తున్నారట

కాస్త వేడి చేసిందంటే చాలు కొబ్బ‌రి నీళ్ళు తాగుతాం. జ్వరం వ‌చ్చినా, నీరసంగా ఉన్నా కొబ్బ‌రి బొండాలు కావాల్సిందే. ఏ కాలమైనా మేలు చేసేవి కొబ్బరినీళ్లు. సర్వరోగ నివారిణిగా పేరున్న కొబ్బరి నీళ్లొక్కటే కల్తీ లేకుండా దొరుకుతున్నాయని ప్రతి ఒక్కరి నమ్మకం. సీజన్‌ను బట్టి ఎంత ధర పెట్టి అయినా కొని తాగే కొబ్బరినీళ్లలో కూడా కల్తీ జరుగుతోందట. అదెలా సాధ్యం? త్వరితగతిన కొబ్బరి పిందెలు కొబ్బరి బొండాలుగా తయారుకావాలని.. వాటిని ఎగుమతి చేసుకోవాలనే తాపత్రయంలో వీటిని కూడా కల్తీ చేస్తున్నారట.
 
కొబ్బరి చెట్టు వేర్లు ఉన్నచోట తల్లి వేరును బయటకు తీసి దానిని అక్కడే కవర్లో పెట్టి దానిపై మోనోక్రోటోఫాస్ అనే కెమికల్‌ను పోసి ఆ తరువాత మట్టితో కప్పేస్తారట. ఇలా ఆ కెమికల్‌ను చెట్టుకు ఎక్కించడం ద్వారా పిందెలు త్వరితిగతిన బొండాలుగా మారతాయట. అలా తయారైన బొండాలు తాగితే గుండె, కిడ్నీ, లివర్ సమస్యలు వస్తాయని వైద్యులు అంటున్నారు. చెట్టు నుంచి వాటి కెమికల్ పూర్తిగా నశించాలంటే 40 రోజులు పడుతుందట. సో.. మనం తాగుతున్న బొండాలు కూడా ఎంత వరకు సేఫ్? గ్యారంటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అంతా మాయాప్ర‌పంచం... క‌ల్తీమ‌యం

No comments:

Post a Comment