cricket ad

Monday, 12 December 2016

చలికాలంలో ఇవి తినండి, ఆరోగ్యంగా ఉండండి...!

అసలే చలికాలం. ఆపై పడిపోతున్న ఉష్ణోగ్రతలు. ఇలాంటి సమయాల్లో పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలెక్కువ. అందువల్ల మనం తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. శీతాకాలంలో మన శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవటానికి శక్తిని ఇచ్చే ఆహారాలనే తినాలి. అందుకోసం.. గోధుమ..జొన్నలు..సజ్జలు..మినుముల..రాగులు..కందిపప్పు..ఇలాంటివి శరీరానికి శక్తిని అందిస్తాయి.
* రోజూ వారీ డైట్ లో తృణ ధాన్యాలు తీసుకోవాలి. పిల్లలకు తృణధాన్యాలు తప్పకుండా ఇవ్వాలి. వేరు శెనగలు, తేనెను డైట్ లో చేర్చుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
* అల్లం టీ తాగడం ద్వారా జలుబు, అసిడిటీని దూరం చేసుకోవచ్చు. కారం, చేదు, పులుపు వస్తువుల్ని మోతాదుగా తీసుకుంటూ ఉండాలి. మజ్జిగ, పెరుగు కాస్త చేర్చుకోవచ్చు.
* పరిమితంగా మాంసం, ఆవు, పాలు, నట్స్, పన్నీర్, మిల్క్, దాల్, సోయాబిన్, ఫిష్, గుడ్లు, వంటి హై-ప్రోటీన్ ఫుడ్ తీసుకోవటం వల్ల చర్మం, కీళ్ళు మొదలగు వాటిని రక్షిస్తాయి.
* శీతాకాలంలో శరీరం పొడిగా తయారవుతుంటుంది. ఈ పొడితత్వాన్ని తట్టుకొనేందుకు రోజుకు కనీసం 7-8 గ్లాసుల నీరు తాగాల్సి ఉంటుంది.
* వేడినీళ్లతో స్నానం చర్మం మరింత పొడిబారేలా చేస్తుంది. కాబట్టి గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి. చలి తక్కువగా ఉండే సమయంలో అంటే ఉదయం 7-8 గంటలకు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. నడకను ఎంచుకోవడం ఉత్తమం.
* బాదం నూనె, బాదంపొడి, అరటి ముక్కలు, గ్లిజరిన్ లేదా తేనే ఇలా ప్రతి ఒక్కటి రెండు చెంచాల మోతాదులో తీసుకోవాలి. నాలుగు టీ స్పూన్లు పాలు ఆ మిశ్రమానికి కలిపి మెత్తని గుజ్జు మాదిరి పేస్ట్ చేసి ముఖానికి, మెడకు మృదువుగా మసాజ్ చేస్తూ పట్టించి కొద్దిసేపుంచి కడిగేయాలి. ఇది పొడి చర్మానికి ఉపయోగపడుతుంది. 
* జిడ్డు చర్మం కలిగిన వారు.. రెండు టీ స్పూన్లు ఓట్ మీల్ పొడి, నాలుగు టీ స్పూన్లు మజ్జిగ, రెండు టీ స్పూన్లు గంధంపొడి కలిపి ముఖానికి, మెడకు బాగా పట్టించి, గోరువెచ్చని నీటితో కడిగేస్తే జిడ్డు చర్మం పోయి కాంతివంతంగా ఉంటుంది.

No comments:

Post a Comment