cricket ad

Tuesday 13 December 2016

తగ్గిన డిమాండ్.. పడిపోయిన బంగారం ధర

దేశీయంగా బంగారానికి డిమాండ్ తగ్గడంతో పసిడి ధర మరోమారు ఢామ్మంది. పది గ్రాములకు వంద రూపాయలు తగ్గి రూ.28,450 వద్ద ఆగింది. వెండి ధర మాత్రం వంద రూపాయలు పెరిగి కేజీకి రూ.41,500 పలుకుతోంది. నోట్ల రద్దు తర్వాత నగల దుకాణాలు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గిపోవడమే ధర తగ్గుదలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశ రాజధానిలో 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర పది గ్రాములకు రూ.28,450 పలుకుతుండగా 99.5 స్వచ్ఛత ఉన్న బంగారం ధర 28,300 పలుకుతోంది.

నో క్యాష్‌.. ఓన్లీ గోల్డ్‌

హైదరాబాద్‌ సిటీ: అంతర్జాతీయ మాయగాళ్లు.. అంతర్రాష్ట్ర ముఠాలు.. అంతర్‌జిల్లా కేటుగాళ్లు.. అందరి చూపు హైదరాబాద్‌ వైపే. ఏటా ఏదో రూపంలో నగరవాసుల నుంచి 100-120 కోట్ల రూపాయలు కొట్టేస్తారు. రాష్ట్రంలో నమోదయ్యే పోలీసు కేసుల్లో మూడొంతులు ఇక్కడివే. ముందుగా స్కెచ్‌ గీయటం..రెక్కీ నిర్వహించటం.. తరువాత దోచుకోవటం..ఇదీ గృహదొంగతనాల్లో వ్యూహం. పోలీసులకు చిక్కితే గ్యాంగ్‌ సభ్యులంతా జైలు పాలవ్వాల్సిందే. అయినా ఇవేమీ లెక్కచేయకుండా అంతర్రాష్ట్ర ముఠాలు నగరాన్ని టార్గెట్‌ చేస్తూనే ఉంటాయి. ఇంతగా చెలరేగే చోరులకు పెద్దనోటు షాక్‌ ఇచ్చింది.దోపిడీలు.. దొంగతనాలతో దోచుకున్నా.. వాటిని మార్చటం ఇబ్బందిగానే మారింది. కరెన్సీ కట్టల జోలికి వెళ్లకుండా బంగారు, వెండి ఆభరణాలతో సరిపెడుతున్నారు. వాటిని రిసీవర్స్‌కు ఇచ్చి అమ్మించటం కంటే.. ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థల్లో తనఖా పెట్టి డబ్బు తీసుకుంటున్నారు. ఈ ఏడాది సాధారణ దొంగతనాల సంఖ్య పెరిగింది.. గృహ చోరీలు అధికమయ్యాయి.
ఎంతమార్పు 
మూడు స్నాచింగ్‌లు.. ఆరు దొంగత నాలతో హల్‌చల్‌ చేసే దొంగల హడావిడి తగ్గుతోంది. అక్కడక్కడా చోరీలకు పాల్పడినా బీరువాల్లో కనిపించే నోట్ల కట్టల జోలికి వెళ్లకుండా బంగారు ఆభరణాలు కొట్టేసి ఉడాయిస్తున్నారు. అంబర్‌పేటలో ఓ ఇంట్లో అర్ధరాత్రి వేళ దొంగ ప్రవేశించాడు. రూ.2లక్షల విలువైన పాతనోట్లు ఉన్నా వాటిని వదిలేసి నాలుగు తులాల బంగారు ఆభరణాలు తీసుకొని పారిపోయాడు. ముషీరాబాద్‌ పరిధిలో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని బీదర్‌ గ్యాంగ్‌ రెక్కీ నిర్వహించింది. వరుస ఇళ్లల్లో చోరీచేసి పారిపోవాలని పథకం వేసింది. కరెన్సీ కష్టాలతో ఆ ముఠా ప్రత్యా మ్నాయమార్గాలను ఎంచుకుంది. నకిలీ బంగారాన్ని తక్కువ ధరకు అమ్ము తామంటూ రంగంలోకి దిగింది. సికిందరాబాద్‌ వద్ద ఓ వ్యాపారికి టోకరా వేసి రూ.50వేలు మస్కా కొట్టింది. మరో అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు బ్యాంకుల వద్ద కాపుకాసి ఒంటరిగా వెళ్లే వారి వద్ద బ్యాగులు, నగలు కాజేసి పారిపోతున్నారు. 
లోకల్‌ గ్యాంగ్స్‌.. నయాస్టైల్‌ 
దొంగతనాలు.. చైన్‌ స్నాచింగ్‌లతో అలజడి సృష్టించిన ఘరానా దొంగల్లో 500 మందిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. వీరంతా జైల్లోనే ఉన్నారు. వీరిలో కరడుగట్టిన నేరస్థులపై రెండోసారి పీడీ యాక్ట్‌ ప్రయోగించి జైలుకు పంపుతున్నారు. గత ఏడాది అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో 420 సాధారణ దొంగతనాలు జరిగితే.. ఈ ఏడాది అదే రెండు నెలల్లో 445 జరిగాయి. 
గృహ దొంగతనాలు గతేడాదితో పోల్చితే 40 శాతం తగ్గాయి. ఘరానా దొంగలు.. జెళ్లలో ఉండటంతో అనుచరగణం.. చోటా నేరస్థులు.. జేబు దొంగతనాలు, మొబైల్‌ స్నాచింగ్‌లకు దిగు తున్నారు. ఆటోలు, ట్యాక్సీలు, ఆర్టీసీ సిటీ బస్సుల్లో ప్రయాణికుల ముసుగులో చోరీలు చేస్తున్నారు. పెద్దనోట్ల మార్పిడి, కరెన్సీ మాఫియా ముఠాల్లో ఏజెంట్లుగా మారుతున్నారు. 
టెక్నాలజీతో అడ్డుకట్ట 
పెరుగుతున్న నేరాలు, దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు నగర పోలీసు యంత్రాంగం టెక్నాలజీ వినియోగం పెంచింది. సీసీఎస్‌, సైబర్‌క్రైమ్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకే పరిమితం కాకుండా శాంతి భద్రతల విభాగంలోనూ పోలీసులు సాంకేతికతను ఉపయోగించాలంటూ నగర సీపీ మహేందర్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అన్ని ఠాణాల స్థాయిలో ఇన్‌స్పెక్టర్‌ నుంచి హోంగార్డు వరకూ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తున్నారు. బ్యాచ్‌ల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

నో క్యాష్‌.. ఓన్లీ గోల్డ్‌

దరాబాద్‌ సిటీ: అంతర్జాతీయ మాయగాళ్లు.. అంతర్రాష్ట్ర ముఠాలు.. అంతర్‌జిల్లా కేటుగాళ్లు.. అందరి చూపు హైదరాబాద్‌ వైపే. ఏటా ఏదో రూపంలో నగరవాసుల నుంచి 100-120 కోట్ల రూపాయలు కొట్టేస్తారు. రాష్ట్రంలో నమోదయ్యే పోలీసు కేసుల్లో మూడొంతులు ఇక్కడివే. ముందుగా స్కెచ్‌ గీయటం..రెక్కీ నిర్వహించటం.. తరువాత దోచుకోవటం..ఇదీ గృహదొంగతనాల్లో వ్యూహం. పోలీసులకు చిక్కితే గ్యాంగ్‌ సభ్యులంతా జైలు పాలవ్వాల్సిందే. అయినా ఇవేమీ లెక్కచేయకుండా అంతర్రాష్ట్ర ముఠాలు నగరాన్ని టార్గెట్‌ చేస్తూనే ఉంటాయి. ఇంతగా చెలరేగే చోరులకు పెద్దనోటు షాక్‌ ఇచ్చింది.దోపిడీలు.. దొంగతనాలతో దోచుకున్నా.. వాటిని మార్చటం ఇబ్బందిగానే మారింది. కరెన్సీ కట్టల జోలికి వెళ్లకుండా బంగారు, వెండి ఆభరణాలతో సరిపెడుతున్నారు. వాటిని రిసీవర్స్‌కు ఇచ్చి అమ్మించటం కంటే.. ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థల్లో తనఖా పెట్టి డబ్బు తీసుకుంటున్నారు. ఈ ఏడాది సాధారణ దొంగతనాల సంఖ్య పెరిగింది.. గృహ చోరీలు అధికమయ్యాయి.
ఎంతమార్పు 
మూడు స్నాచింగ్‌లు.. ఆరు దొంగత నాలతో హల్‌చల్‌ చేసే దొంగల హడావిడి తగ్గుతోంది. అక్కడక్కడా చోరీలకు పాల్పడినా బీరువాల్లో కనిపించే నోట్ల కట్టల జోలికి వెళ్లకుండా బంగారు ఆభరణాలు కొట్టేసి ఉడాయిస్తున్నారు. అంబర్‌పేటలో ఓ ఇంట్లో అర్ధరాత్రి వేళ దొంగ ప్రవేశించాడు. రూ.2లక్షల విలువైన పాతనోట్లు ఉన్నా వాటిని వదిలేసి నాలుగు తులాల బంగారు ఆభరణాలు తీసుకొని పారిపోయాడు. ముషీరాబాద్‌ పరిధిలో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని బీదర్‌ గ్యాంగ్‌ రెక్కీ నిర్వహించింది. వరుస ఇళ్లల్లో చోరీచేసి పారిపోవాలని పథకం వేసింది. కరెన్సీ కష్టాలతో ఆ ముఠా ప్రత్యా మ్నాయమార్గాలను ఎంచుకుంది. నకిలీ బంగారాన్ని తక్కువ ధరకు అమ్ము తామంటూ రంగంలోకి దిగింది. సికిందరాబాద్‌ వద్ద ఓ వ్యాపారికి టోకరా వేసి రూ.50వేలు మస్కా కొట్టింది. మరో అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు బ్యాంకుల వద్ద కాపుకాసి ఒంటరిగా వెళ్లే వారి వద్ద బ్యాగులు, నగలు కాజేసి పారిపోతున్నారు. 
లోకల్‌ గ్యాంగ్స్‌.. నయాస్టైల్‌ 
దొంగతనాలు.. చైన్‌ స్నాచింగ్‌లతో అలజడి సృష్టించిన ఘరానా దొంగల్లో 500 మందిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. వీరంతా జైల్లోనే ఉన్నారు. వీరిలో కరడుగట్టిన నేరస్థులపై రెండోసారి పీడీ యాక్ట్‌ ప్రయోగించి జైలుకు పంపుతున్నారు. గత ఏడాది అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో 420 సాధారణ దొంగతనాలు జరిగితే.. ఈ ఏడాది అదే రెండు నెలల్లో 445 జరిగాయి. 
గృహ దొంగతనాలు గతేడాదితో పోల్చితే 40 శాతం తగ్గాయి. ఘరానా దొంగలు.. జెళ్లలో ఉండటంతో అనుచరగణం.. చోటా నేరస్థులు.. జేబు దొంగతనాలు, మొబైల్‌ స్నాచింగ్‌లకు దిగు తున్నారు. ఆటోలు, ట్యాక్సీలు, ఆర్టీసీ సిటీ బస్సుల్లో ప్రయాణికుల ముసుగులో చోరీలు చేస్తున్నారు. పెద్దనోట్ల మార్పిడి, కరెన్సీ మాఫియా ముఠాల్లో ఏజెంట్లుగా మారుతున్నారు. 
టెక్నాలజీతో అడ్డుకట్ట 
పెరుగుతున్న నేరాలు, దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు నగర పోలీసు యంత్రాంగం టెక్నాలజీ వినియోగం పెంచింది. సీసీఎస్‌, సైబర్‌క్రైమ్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకే పరిమితం కాకుండా శాంతి భద్రతల విభాగంలోనూ పోలీసులు సాంకేతికతను ఉపయోగించాలంటూ నగర సీపీ మహేందర్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అన్ని ఠాణాల స్థాయిలో ఇన్‌స్పెక్టర్‌ నుంచి హోంగార్డు వరకూ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తున్నారు. బ్యాచ్‌ల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఆదర్శ పెళ్లికూతురు... పెళ్లి కానుకగా ఏమిచ్చిందంటే...

ముంబై: అత్తారింట్లో అడుగుపెడుతూనే వందలమంది జీవితాల్లో వెలుగులు నింపిందో పెద్దింటి పెళ్లి కూతురు. పెళ్లికయ్యే ఖర్చుతో పేదలకు ఇళ్లు నిర్మించి ఆదర్శంగా నిలిచింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాకి చెందిన ఓ కోటీశ్వరుడి కూతురు శ్రేయ మునోద్‌కు ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఆమె అత్తింటివారు కూడా శ్రీమంతులే. దగ్గరి బంధువు ఒకరు ఇచ్చిన సలహా మేరకు తన వివాహం సందర్భంగా పేదలకు ఏదైనా చేస్తే బాగుంటుందని శ్రేయ భావించారు. పెళ్లి వేడుకలకు అయ్యే ఖర్చుతో అందరూ గుర్తుంచుకునేలా పేదలకు ఇళ్లు నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవు 108 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనికి ఇరువైపుల కుటుంబాలు పూర్తి సహకారం అందించడంతో ఇప్పటికే 90 ఇళ్లు పూర్తయ్యాయి. నిరాడంబంరంగా మూడు ముళ్లు వేయించుకుని... ఎవరికైతే ఇళ్లు కట్టించిందో వారిని పెళ్లికి పిలిపించుకుని మరీ తాళాలు బహూకరించి శభాష్ అనిపించుకున్నారు శ్రేయ.

హ్యాపీ బ‌ర్త్‌డే గురూ..!

ఈ రోజు ఫ్యామిలీ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ పుట్టిన రోజు. ‘విక్టరీ’ని ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు వెంకటేష్‌. తెలుగు చిత్ర సీమకు నాలుగు మూలస్తంభాలుగా అభివర్ణించే అగ్ర నటుల్లో ఒకరైనా ఆ అహమే ఉండదు. స్టార్‌ ప్రొడ్యూసర్‌ తనయుడైనా ఆ అతిశయమన్నదే కనిపించదు. సినిమా హిట్టయినా, ఫ్లాపయినా ముఖంలో చిరునవ్వు చెరగదు. అవార్డులెన్ని అందుకున్నా అణకువ మారదు. అందుకే ఆయన సమ్‌థింగ్‌ స్పెషల్‌. నటనలోనే కాదు. నిజ జీవితంలోనూ అంతే. మంగళవారం వెంకటేష్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు.

నేటి నుంచే ఈ ఆఫర్ అమలు

పెట్రోల్ బంకుల్లో కార్డుల ద్వారా డబ్బు చెల్లింపుపై 0.75శాతం రాయితీ పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ఆఫర్ ఈ రోజు నుంచి అమల్లో ఉంటుందని తెలిపింది. మొదట పూర్తి బిల్లు కార్డు నుంచి కట్ అయి ఆ తర్వాత మూడు రోజుల్లో డిస్కొంట్ మొత్తం వెనక్కి వస్తుందట. ప్రస్తుత ధరల ప్రకారం లీటర్ పెట్రోల్ పై 49పైసలు, లీటర్ డీజిల్ పై 41 పైసలు రాయితీ పొందవచ్చని కేంద్రం పేర్కొంది. క్రెడిట్, డెబిట్, ఈ-వాలెట్లు, మొబైల్ వాలెట్ల ద్వారా పీఎస్‌యూ(ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్) బంకుల్లో పెట్రోల్ కొనుగోళ్లకు ఈ రాయితీ వర్తిస్తుందని వివరించింది.

విజయరథ చక్రాలు
 
‘‘మాతరం ఆటగాళ్లలో విరాట్‌ కోహ్లి అత్యుత్తమ ఆటగాడు’’
- ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ కుక్‌
‘‘సాధారణంగా తమ వేగంతో బౌలర్లు బ్యాట్స్‌మెన్‌ను భయపెడుతుంటారు. మా తరంలో ఒక బ్యాట్స్‌మెన్‌ను చూస్తే బౌలర్లు భయపడేవారు. అతడు విండీస్‌ బ్యాటింగ్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌. ప్రస్తుత తరంలో విరాట్‌ను చూసి బౌలర్లు భయపడుతున్నారు
- కపిల్‌దేవ్‌
ముంబయి టెస్టులో టీమ్‌ఇండియా విజయానంతరం ఇద్దరు గొప్ప ఆటగాళ్ళు చేసిన వ్యాఖ్యలివి. ఒకప్పుడు డాన్‌ బ్రాడ్‌మన్‌ గొప్ప అనేవాళ్లు. వివ్‌ రిచర్డ్స్‌ను చూశాక అలాంటోడు మళ్లీ వస్తాడా అనుకున్నారు. ఇక సచిన్‌ తెందుల్కర్‌ సాగించిన రికార్డుల వేట తర్వాత మరో మాస్టర్‌ బ్లాస్టర్‌ అసాధ్యమే అనిపించింది! కానీ ఆటలో అసాధ్యమన్నదే లేదనడానికి విరాట్‌ కోహ్లి ప్రత్యక్ష ఉదాహరణ. క్రికెట్‌ చరిత్రలో బ్రాడ్‌మన్‌, రిచర్డ్స్‌, సచిన్‌ గొప్ప బ్యాట్స్‌మెన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారి సరసన నిలవడానికి ప్రస్తుత క్రికెట్లో అన్ని అర్హతలు ఉన్న ఏకైక ఆటగాడు విరాట్‌ మాత్రమే. నైపుణ్యం.. షాట్లు ఆడటంలో నలుగురిలో ఎవరి శైలి వారిదే. టన్నులకొద్దీ పరుగులు రాబట్టడంలోనూ అంతే. ఐతే తానాడుతూ అవతలి ఎండ్‌లో ఉన్న సహచర ఆటగాడినీ పరుగులు చేసేలా చేయడం కోహ్లిలోనే ఉన్న అరుదైన ప్రత్యేకత. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో నిలకడలేమితో ఇబ్బంది పడుతున్న ఓపెనర్‌ మురళీ విజయ్‌.. కేవలం 2 టెస్టుల అనుభవమే ఉన్న కుర్ర జయంత్‌ యాదవ్‌లు కోహ్లి అండతో శతకాలు చేయడమే ఇందుకు నిదర్శనం. ఆటలో గెలుపోటమలు సహజమే అయినా కొంతమంది ఆటగాళ్లు తమ అసాధారణ నైపుణ్యంతో క్రీడాభిమానులపై చెరగని ముద్ర వేస్తారు. అలాంటి వాళ్లలో కోహ్లిది ముందు వరుసే. ట్వంటీ20లు, వన్డేలు, టెస్టులు.. ఫార్మాట్‌ ఏదైనా పరుగుల వరద సృష్టించడం ఈ దిల్లీ బ్యాట్స్‌మన్‌కు వెన్నతో పెట్టిన విద్య. తీవ్ర పోటీతత్వం.. అంతకంటే ఎక్కువ దూకుడు.. రెట్టించిన ఉత్సాహం అడుగడుగునా ప్రదర్శించే విరాట్‌ ఎప్పుడైనా, ఎక్కడైనా గెలుపు మంత్రమే.
‘‘స్వదేశీ పిచ్‌లపై కోహ్లి బాగా రాణిస్తాడు’’ ఇంగ్లాండ్‌ పేసర్‌ అండర్సన్‌ చేసిన తెంపరి వ్యాఖ్య ఇది. కానీ కోహ్లి మెరుగైన ప్రదర్శన భారత్‌కు మాత్రమే పరిమితం కాదు. ఆసీస్‌పై అతడు ఆడిన ఇన్నింగ్స్‌లే అందుకు నిదర్శనం. గొప్ప బ్యాట్స్‌మన్‌కు స్టేడియాలు.. పిచ్‌లు.. పరిస్థితులు.. బౌలర్లతో పెద్దగా పనుండదు. మస్తిష్కంలో లక్ష్యం.. కళ్ళముందు బంతి మాత్రమే ఉంటాయి. దృఢమైన పట్టుదల.. రెట్టింపు ఆత్మవిశ్వాసమే బ్యాటులో కనిపించే లక్షణాలు. ఇక కోహ్లి చేసిన శతకాల్లో సగానికిపైగా విదేశాల్లో నమోదైనవే కావడం అండర్సన్‌ అజ్ఞానానికి నిదర్శనం! మొదట్లో ఆఫ్‌స్టంప్‌ ఆవలపడ్డ బంతులను వేటాడి ఔటయ్యే బలహీనత కోహ్లిలో కనిపించేది. కఠోర శ్రమ.. పట్టుదలతో బలహీనతను అధిగమించిన కోహ్లిని అడ్డుకోవడం బౌలర్లకు శక్తికి మించిన పనిలా మారింది. స్పిన్నర్లు, పేసర్లు సంధించే అన్ని రకాల బంతులకు ప్రస్తుతం కోహ్లీ దగ్గర దీటైనా జవాబులున్నాయి. అనుభవంతో వచ్చిన పరిణతితో విరాట్‌లో నిలకడ పెరిగింది. సెంచరీల్ని అవలీలగా ద్విశతకాలుగా మారుస్తున్నాడు. వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌లపై వరుస సిరీస్‌ల్లో విరాట్‌ మూడు ద్విశతకాలు సాధించాడు. ధారాళంగా పరుగులు రాబట్టే బ్యాట్స్‌మన్‌గా.. స్ఫూర్తి రగిలించే నాయకుడిగా.. మొత్తంగా సమర్థుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సిరీస్‌లో 128 సగటుతో ఇప్పటికే 640 పరుగులు సాధించి.. మూడు విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. సాంకేతికంగా అత్యుత్తమ ఆటతీరుతో అలరిస్తున్న విరాట్‌ భవిష్యత్తులోనూ టీమ్‌ఇండియాకు మరిన్ని విజయాలు అందిస్తాడనడంలో సందేహం లేదు.
‘‘ఇటీవలి సిరీస్‌ల్లో టీమ్‌ఇండియా గెలుపునకు 60 శాతం కారణం రవిచంద్రన్‌ అశ్విన్‌. నా బ్యాటింగ్‌ సైతం అశ్విన్‌ ప్రతిభ తర్వాతే’’ అన్నది అశ్విన్‌ బౌలింగ్‌పై కోహ్లి మాట. ఏదేమైనా కోహ్లి పరుగులు.. అశ్విన్‌ వికెట్లు, పరుగులు టీమ్‌ఇండియా విజయాలకు ప్రధాన కారణాలన్నది స్పష్టం. గడిచిన అన్ని సిరీస్‌ల్లో అశ్విన్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తూ.. భారీగా వికెట్లు తీయడంతో ప్రత్యర్థి జట్లకు పెద్ద స్కోర్లు సాధ్యంకాలేదు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా వికెట్లు తీయగల నైపుణ్యం అశ్విన్‌ది. స్పిన్‌కు పెద్దగా సహకరించని పిచ్‌లపైనా అశ్విన్‌ తన మాయాజాలాన్ని ప్రదర్శిస్తుండటం గొప్ప విషయమే. తానాడిన 43 టెస్టుల్లో 24 సార్లు 5, అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడమే అశ్విన్‌ ప్రతిభకు నిదర్శనం. ముంబయి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆరేసి వికెట్లు తీయడంతో ఎలాంటి నాటకీయ పరిణామాలు లేకుండా ఇంగ్లాండ్‌ కథ ముగిసింది. అశ్విన్‌, కోహ్లి భారత్‌ విజయరథానికి రెండు చక్రాలనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు!