ముంబై: అత్తారింట్లో అడుగుపెడుతూనే వందలమంది జీవితాల్లో వెలుగులు నింపిందో పెద్దింటి పెళ్లి కూతురు. పెళ్లికయ్యే ఖర్చుతో పేదలకు ఇళ్లు నిర్మించి ఆదర్శంగా నిలిచింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాకి చెందిన ఓ కోటీశ్వరుడి కూతురు శ్రేయ మునోద్‌కు ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఆమె అత్తింటివారు కూడా శ్రీమంతులే. దగ్గరి బంధువు ఒకరు ఇచ్చిన సలహా మేరకు తన వివాహం సందర్భంగా పేదలకు ఏదైనా చేస్తే బాగుంటుందని శ్రేయ భావించారు. పెళ్లి వేడుకలకు అయ్యే ఖర్చుతో అందరూ గుర్తుంచుకునేలా పేదలకు ఇళ్లు నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవు 108 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనికి ఇరువైపుల కుటుంబాలు పూర్తి సహకారం అందించడంతో ఇప్పటికే 90 ఇళ్లు పూర్తయ్యాయి. నిరాడంబంరంగా మూడు ముళ్లు వేయించుకుని... ఎవరికైతే ఇళ్లు కట్టించిందో వారిని పెళ్లికి పిలిపించుకుని మరీ తాళాలు బహూకరించి శభాష్ అనిపించుకున్నారు శ్రేయ.
No comments:
Post a Comment