పెట్రోల్ బంకుల్లో కార్డుల ద్వారా డబ్బు చెల్లింపుపై 0.75శాతం రాయితీ పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ఆఫర్ ఈ రోజు నుంచి అమల్లో ఉంటుందని తెలిపింది. మొదట పూర్తి బిల్లు కార్డు నుంచి కట్ అయి ఆ తర్వాత మూడు రోజుల్లో డిస్కొంట్ మొత్తం వెనక్కి వస్తుందట. ప్రస్తుత ధరల ప్రకారం లీటర్ పెట్రోల్ పై 49పైసలు, లీటర్ డీజిల్ పై 41 పైసలు రాయితీ పొందవచ్చని కేంద్రం పేర్కొంది. క్రెడిట్, డెబిట్, ఈ-వాలెట్లు, మొబైల్ వాలెట్ల ద్వారా పీఎస్‌యూ(ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్) బంకుల్లో పెట్రోల్ కొనుగోళ్లకు ఈ రాయితీ వర్తిస్తుందని వివరించింది.
No comments:
Post a Comment