cricket ad

Thursday 15 December 2016

సమంతగా కనిపిస్తా!

టించేందుకు ఆస్కారమున్న ఏ పాత్రనీ వదులుకోనని చెబుతోంది సలోనీ. ‘ఒక వూరిలో’, ‘మర్యాద రామన్న’ తదితర చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన ఆమె ఇటీవల ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో నటించింది. ఆ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సలోనీ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది. ‘‘నవ్వించడమంటే నాకు ఇష్టం. చాలారోజుల తర్వాత ప్రేక్షకులకి గిలిగింతలు పెట్టే పాత్రని ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో చేశా. ఇందులో నా పాత్ర పేరు సమంత. నాకు జోడీగా మహేష్‌ పాత్రలో పృథ్వీ నటించారు. కళాశాలలో నన్ను తోటి విద్యార్థులు ర్యాగింగ్‌ చేస్తుంటే పృథ్వీ వచ్చి కాపాడుతుంటాడు. ఆ సన్నివేశాలన్నీ కడుపుబ్బా నవ్విస్తాయి. నా దృష్టిలో హాస్యనటులు కథానాయకులే’’ అన్నారు సలోనీ. ‘‘ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రల్లో నటించాలనుకొంటా. ‘మర్యాదరామన్న’ తర్వాత చాలామంది పల్లెటూరి అమ్మాయి పాత్రతో నా దగ్గరికొచ్చారు. ఇష్టం లేక వద్దన్నా. ప్రస్తుతం హిందీలో అమితాబ్‌ బచ్చన్‌తో ఓ సినిమా చర్చల్లో ఉంది’’ అని చెప్పారు సలోనీ.

డిజిటల్‌ చెల్లింపులపోటీ.. మీదే రూ.కోటి రెండు పథకాలను వెల్లడించిన నీతి ఆయోగ్‌

దేశంలో పెద్దనోట్లను రద్దుచేసిన అనంతరం డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించిన కేంద్ర ప్రభుత్వం దాన్ని మరింత వేగవంతం చేసేందుకు మరిన్ని చర్యలకు శ్రీకారం చుట్టింది. డిజిటల్‌ లావాదేవీల వైపు ప్రజల్ని మళ్లించేందుకు కొత్తగా రెండు పథకాలను ప్రారంభిస్తున్నట్లు గురువారం నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ ప్రకటించారు. ఈ నెల 25న క్రిస్మస్‌ పండుగ నుంచి ఈ పథకాలను అమలుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. క్రిస్మస్‌ నుంచి ఏప్రిల్‌ 14 వరకు ఈ ప్రోత్సాహకాలను అందజేయనున్నారు. లక్కీ గ్రాహక్‌ యోజన వినియోగదారులకు సంబంధించిన పథకం కాగా, డిజి ధ‌న్‌ వ్యాపారి యోజన వ్యాపారులకు ఉద్దేశించినది. అయితే లక్కీ గ్రాహక్‌ యోజన పథకం కింద ప్రతిరోజు 15వేల మంది విజేతలను ఎంపికచేసి వారికి రూ.1000 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. అలాగే.. వారానికి ఒకసారికి లక్కీ గ్రాహక్‌ యోజన కింద ఎంపికచేసిన 7వేల మందికి రూ.లక్ష వరకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.
డిజి ధ‌న్‌ వ్యాపారి యోజన పథకం కింద వారానికొకసారి 7వేల మందిని ఎంపికచేస్తారు. వారికి రూ.50వేలు చొప్పున ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. లక్కీ గ్రాహక్‌ యోజన కింద ముగ్గురికి మెగా అవార్డులు ఇస్తారు. మొదటి విజేతకు రూ.కోటి, రెండో విజేతకు రూ.50లక్షలు, మూడో విజేతకు రూ.25లక్షల చొప్పున అందజేస్తారు. అలాగే డిజి ధ‌న్‌ వ్యాపారి యోజన పథకం కింద కూడా మెగా అవార్డులు ప్రకటించారు. మొదటి విజేతకు రూ.50లక్షలు, రెండో విజేతకు రూ.25లక్షలు, మూడో విజేతకు రూ.5లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు అమితాబ్‌ కాంత్‌ తెలిపారు. ఈ మెగా అవార్డులను ఏప్రిల్‌ 14న ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.

కట్టలకొద్దీ నోట్లు ఎక్కడివి?: సుప్రీం

దేశంలో పెద్దనోట్ల రద్దు అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి లక్షల కొద్దీ కొత్తనోట్లు ఎలా చేరుతున్నాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కొత్తనోటు కోసం సామాన్యులు పడిగాపులు కాస్తున్నారని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దేశంలో కొందరికి కట్టలకొద్దీ నోట్లు ఎలా వెళ్తున్నాయని నిలదీసింది. ప్రస్తుతం దేశంలో రెండు రకాల ప్రజలు ఉన్నారనీ.. కట్టలకొద్దీ కొత్తనోట్లు ఉన్నవారు ఒకరైతే.. చేతిలో చిల్లిగవ్వలేని వారు మరొకరని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కొందరు బ్యాంకు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఈ సందర్భంగా అటార్నీ జనరల్‌ న్యాయస్థానానికి తెలిపారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.

నోట్ల కట్టలు.. బంగారం గుట్టలు విమానాశ్రయాల్లో పట్టుబడ్డ నగదు రూ.70 కోట్లు 170 కిలోల బంగారం కూడా స్వాధీనం పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా వెలుగుచూస్తున్న అక్రమాలు

నోట్ల కట్టలు.. బంగారం గుట్టలు
విమానాశ్రయాల్లో పట్టుబడ్డ నగదు రూ.70 కోట్లు
170 కిలోల బంగారం కూడా స్వాధీనం
పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా వెలుగుచూస్తున్న అక్రమాలు


  ముంబయి: పెద్దనోట్ల రద్దు తర్వాత వివిధ రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలు దర్యాప్తు అధికారుల్నే నివ్వెరపరుస్తున్నాయి. నవంబరు 8న నిర్ణయం వెలువడిన తర్వాత వివిధ విమానాశ్రయాల్లో పట్టుబడిన నగదు విలువ రూ.70 కోట్లకు పైమాటే. పాత నోట్లతో కొని తరలిస్తున్న 170 కిలోల బంగారం కూడా అధికారులకు స్వాధీనమయింది. దొరికిన నగదులో పాత, కొత్త నోట్లు కలిపి ఉన్నాయని సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఒ.పి.సింగ్‌ తెలిపారు.
చండీగఢ్‌ వ్యాపారి నుంచి రూ.2.2 కోట్లు: చండీగఢ్‌లోని ఓ వస్త్రవ్యాపారి వద్ద పెట్టెల్లో, గోనెసంచుల్లో ఉన్న రూ.2.20 కోట్ల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యాపారిని అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. నాలుగు లాకర్లనూ సీజ్‌ చేసి, అక్రమ నగదు చలామణీ కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు. ఛత్తీస్‌గఢ్‌లో మరో వ్యాపారి నుంచి రూ.14 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. దీనిలో రూ.8 లక్షల విలువైన కొత్త రూ.2000,  రూ.500 నోట్లు ఉన్నాయి. ఈ వ్యాపారి వద్ద నుంచి 17 బ్యాంకు పాసు పుస్తకాలు, 40 ఏటీఎం కార్డులు, ఆధార్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. గోవా రాజధాని పనాజీలో రూ.68 లక్షలు, రూ.24 లక్షలు వేర్వేరుగా లభ్యమయింది. కర్ణాటక, మహారాష్ట్రల పరిధిలో ఐ.టి. అధికారులు రూ.వెయ్యి కోట్ల విలువైన లెక్కల్లో చూపని నగదును బయటపెట్టారు.
దిల్లీ హోటల్లో రూ.3.25 కోట్లు: దిల్లీ పోలీసులు కరోల్‌బాగ్‌లోని ఓ హోటల్‌పై దాడి చేసి అయిదుగురు వ్యక్తుల నుంచి రూ.3.25 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా ముంబయికి చెందిన ఒక హవాలా వ్యాపారి సొమ్మేనని ప్రాథమిక విచారణలో తేలింది.
పుణెలో లాకర్లను సోదా చేసిన ఐ.టి.: పుణెలోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రకు చెందిన పార్వతీఏరియా శాఖలో రూ.10 కోట్ల నగదు ఉందన్న అనుమానంతో ఐ.టి. అధికారులు లాకర్లను సోదా చేశారు. వీటిని సీజ్‌ చేసే అవకాశాలున్నాయి.
 కుక్కల్ని కాపలాపెట్టి బెదిరింపు..
రూ.2.89 కోట్లు స్వాధీనం

 బెంగళూరు యశ్వంతపురలోని ఓ భవంతిపై ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం దాడిచేసి రూ.2.89 కోట్ల నగదు స్వాధీనపరచుకున్నారు. ఇందులో రూ.2.25 కోట్ల కొత్త నోట్లు. సోమవారమే సమాచారం అందినా భవంతి ఎక్కడుందో గుర్తించేందుకు సమయం పట్టిందని ఆదాయ పన్నుశాఖ అధికార ప్రతినిధి అలెక్స్‌ మ్యాథ్యూ బుధవారం వివరించారు. ఒక వృద్ధురాలు ఆ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లో ఉంటున్నారు. సోదాలకు వెళ్లినప్పుడు పెంచుకున్న శునకాలను ఉసిగొలిపిందని మ్యాథ్యూ వివరించారు. శునకాలను అదుపు చేసి ఆమె దాక్కున్న ఓ గది తలుపులు బలవంతంగా తెరిచారు. అక్కడే గుట్టలుగా నగదు ఉండటంతో అధికారులు అవాక్కయ్యారు. నవంబరు 9 నుంచి ఇప్పటి వరకు బెంగళూరు, చుట్టుపక్కల జిల్లాల్లో చేసిన దాడుల్లో రూ.29.86 కోట్ల కొత్త నగదు, 41.6 కిలోల బంగారం బిస్కెట్లు, 14 కిలోల బంగారు ఆభరణాలను నల్ల కుబేరుల నుంచి జప్తి చేశామని ఆదాయ పన్ను శాఖ అధికారులు ప్రకటించారు.

Tuesday 13 December 2016

జయలలిత-శోభన్‌బాబు కూతురు అని చెప్పబడుతున్న ఆ మహిళ ఎవరో తెలుసా..? ఆమె ప్రస్తుత పరిస్థితి చూడండి..

తమిళనాడు సీఎం జయలలిత మరణించిన తర్వాత ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ వస్తోంది. ఆ ఫోటోలో ఉన్న మహిళ జయ-శోభన్‌బాబులకు పుట్టిందనే రూమర్ కూడా ప్రచారం జరుగుతోంది. తొలుత ఈ వార్తని ఎవరూ పట్టించుకోలేదు కానీ.. రానురాను వైరల్ అవుతుండడంతో అందరూ నిజమనే భావనని వచ్చారు. పైగా.. మీడియా, వెబ్‌సైట్లు సైతం తండోపతండాలుగా వార్తలు రాస్తుండడం.. వాట్సాప్‌లో షేర్ చేస్తుండడంతో.. ఆమె వారిద్దరి పుట్టిన బిడ్డేనని అనుకున్నారు. కానీ.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ అయిన శ్రీపాద చిన్మయి ఆధారాలతో సహా స్పష్టం చేశారు. ఆ మహిళ వివరాల్ని కూడా ఆమె సోషల్ మీడియాలో వివరించారు.

 ఆ మహిళ ‘మృదంగం విద్వాన్’ వి.బాలాజీ కుటుంబానికి చెందిందని చిన్మయి తన అధికారిక ఫేస్‌బుక్ పేజ్‌లో వెల్లడించింది. ప్రస్తుతం ఆయనకి ఎలాంటి కాన్సర్ట్స్ లేకపోవడం వల్లే.. ‘హస్‌బ్యాండ్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారని ఆమె పేర్కొంది. ఆ ఫోటోలో ఉన్న మహిళ తన ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా తెలుసునని.. జయ-శోభన్‌బాబు కూతురిగా వస్తున్న రూమర్లన్నీ అవాస్తవాలనీ క్లారిటీ ఇచ్చింది. నెటిజన్లందరూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఆమెపై చక్కర్లు కొడుతున్న రూమర్‌ని తుడిచిపారేయండంటూ వేడుకుంది. మొత్తానికి.. ఆ మహిళ జయ్-శోభన్ జంటకు పుట్టిన అమ్మాయి కాదని క్లారిటీ వచ్చేసింది.

ATM క్యూలో BJP లడ్డూ లవ్

బ్యాంకులు, ATM క్యూలో ఉండే జనానికి స్వీట్ న్యూస్. మీరు ఎంతో ఓపిగ్గా లైన్ లో ఉంటున్నందుకు.. ప్రధాని మోడీ పిలుపునకు కలిసి వస్తున్నందుకు కృతజ్ణతగా బీజీపీ లడ్డూ లవ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ATM, బ్యాంక్ క్యూలో ఉన్నవారికి ఒక్కొక్కరికీ ఒక్కో లడ్డూ పంపిణీ చేస్తోంది. ఢిల్లీ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఈ క్రమానికి శ్రీకారం చుట్టారు. ఢిల్లీ కమలానగర్ ఏరియాలో జై భారత్, జై మోడీ అంటూ నినాదాలు చేస్తూ లడ్డూలు పంచారు. నెలాఖరు వరకు ఢిల్లీలోని అన్ని బ్యాంక్, ATM సెంటర్ల దగ్గర క్యూలో లడ్డూలు పంచుతారు. జనవరి ఒకటి నుంచి 10వ తేదీ వరకు ఇంటింటికీ వెళ్లి ఒక్కో లడ్డూ ఇస్తారు. మోడీకి మద్దతు పలికినందుకు థ్యాంక్స్ చెప్పనున్నట్లు భారతీయ జనతా పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ ప్రకటించారు. ఢిల్లీలో మొదలైన లడ్డూ లవ్.. మిగతా రాష్ట్రాలకు విస్తరిస్తుందా.. లేదా అనేది చూడాలి.

బాలీవుడ్‌ కంటే పోర్న్‌ ఇండస్ట్రీయే నయం’!

ఈ మాటలన్నది పోర్న్‌ స్టార్‌ సన్నీలియోన్‌. గతంలో పోర్న్‌ ఇండస్ట్రీలో నటించినప్పటి కంటే ఇప్పుడు బాలీవుడ్‌లోనే ఎక్కువ సెక్సిజాన్ని ఎదుర్కొంటున్నానని చెప్పింది సన్నీ లియోన్‌. బీబీసీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భారత్‌పై, బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. 
 
సన్నీలియోన్‌ వల్ల భారత సంస్కృతి మంట కలిసిపోతోందంటూ పలువురు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదు చేసిన విషయంపై అడిగిన ప్రశ్నకు చాలా వ్యంగ్యంగా సమాధానమిచ్చింది సన్నీ. ‘ప్రపంచంలోనే అతి ఎక్కువ జనభా కలిగిన దేశాల్లో ఒకటైన భారత్‌.. అలా తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంద’ని వ్యాఖ్యానించింది. ‘నా సినిమాలు చూడమని, నన్ను భరించమని నేనెప్పుడూ ఒత్తిడి చేయలేదు. నేనంటే ఆసక్తి లేకపోతే నా గురించి ఇంటర్నెట్‌లో వెతకడం ఆపెయొచ్చు’ అని చెప్పింది. గూగుల్‌లో ఇండియన్స్‌ ఎక్కువగా తన గురించే సెర్చ్‌ చేస్తున్నారని, తన గురించి వెకిలిగా మాట్లాడే అర్హత ఈ దేశంలోని వ్యక్తులకు లేదని సన్నీ ఘాటుగా బదులిచ్చింది.
 
ఇక ఆడవాళ్లను తక్కువగా చూడడం, వివక్ష బాలీవుడ్‌లో చాలా ఎక్కువని, వాటిని భరిస్తూనే ఇక్కడి హీరోయిన్లు కెరీర్‌ కొనసాగిస్తున్నారని చెప్పింది. పోర్న్‌ సినిమాల్లో చేసేటపుడు జాతి, మతం, సెక్సువాలిటీ గురించి పట్టించుకోరని, భారత సినీ పరిశ్రమలో మాత్రం ఓ వ్యక్తి గతం, చరిత్ర తవ్వి తీసిన తర్వాతే వారితో మాట్లాడతారని తెలిపింది. ఇక బాలీవుడ్‌లో కంటే పోర్న్‌ ఇండస్ట్రీలోనే మనుషుల ప్రవర్తన హుందాగా ఉంటుందని చెప్పింది.