cricket ad

Thursday, 15 December 2016

సమంతగా కనిపిస్తా!

టించేందుకు ఆస్కారమున్న ఏ పాత్రనీ వదులుకోనని చెబుతోంది సలోనీ. ‘ఒక వూరిలో’, ‘మర్యాద రామన్న’ తదితర చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన ఆమె ఇటీవల ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో నటించింది. ఆ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సలోనీ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది. ‘‘నవ్వించడమంటే నాకు ఇష్టం. చాలారోజుల తర్వాత ప్రేక్షకులకి గిలిగింతలు పెట్టే పాత్రని ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో చేశా. ఇందులో నా పాత్ర పేరు సమంత. నాకు జోడీగా మహేష్‌ పాత్రలో పృథ్వీ నటించారు. కళాశాలలో నన్ను తోటి విద్యార్థులు ర్యాగింగ్‌ చేస్తుంటే పృథ్వీ వచ్చి కాపాడుతుంటాడు. ఆ సన్నివేశాలన్నీ కడుపుబ్బా నవ్విస్తాయి. నా దృష్టిలో హాస్యనటులు కథానాయకులే’’ అన్నారు సలోనీ. ‘‘ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రల్లో నటించాలనుకొంటా. ‘మర్యాదరామన్న’ తర్వాత చాలామంది పల్లెటూరి అమ్మాయి పాత్రతో నా దగ్గరికొచ్చారు. ఇష్టం లేక వద్దన్నా. ప్రస్తుతం హిందీలో అమితాబ్‌ బచ్చన్‌తో ఓ సినిమా చర్చల్లో ఉంది’’ అని చెప్పారు సలోనీ.

No comments:

Post a Comment