cricket ad

Thursday 15 December 2016

మరణించిన ప్రేయసి పాముగా వచ్చిందని పెళ్లి చేసుకొన్న ప్రేమికుడు

విఠలాచార్య సినిమాల్లో హీరో హీరోయిన్ ప్రేమించుకోవడం.. అనంతరం మరణించడమో.. లేదా ఎవరి శాపానికో గురవ్వడం... అనంతరం ... పక్షి, పాము... గొర్రె ఇలా జంతువులయ్యి.. తాము ప్రేమించిన వారి దగ్గరకి వచ్చి నివసిస్తుంటాయి. ఇక ఇటీవల రాజమౌళి ఈగ సినిమాలో హీరో మరణించి ఈగగా జన్మ ఎత్తి తాను ప్రేమించిన అమ్మాయి ని రక్షించుకొంటాడు... కాగా ఇప్పుడు ఇలాంటి సంఘటన నిజజీవితంలో చోటు చేసుకొన్నది అంటున్నాడు.. ఓ యువకుడు... తన ప్రేయసి మరణించీ పాముగా తన వద్దకు వచ్చింది అని ఆ పాముతో స్నేహంగా జీవిస్తున్నాడు.. ఈ సంఘటన థాయ్ లాండ్ లో చోటు చేసుకొన్నది. వివరాల్లోకి వెళ్తే....
థాయ్ లాండ్ లోని కాంచనాబౌరి అనే ప్రాంతానికి చెందిన వర్రానన్ సరసలిన్ అనే యువకుడు ఓ యువతిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు.. కానీ అమ్మాయి 5 ఏళ్ల క్రితం అనుకోకుండా మరణించింది... దీంతో సరసలిన్ చాలా బాధపడ్డాడు... దిగులుతో కాలం గడుపుతున్నాడు... కాగా ఇటీవల ఓ రోజు అనుకుండా ఓ 10 అడుగులున్న ఓ పాము సరసలిన్ వద్దకు వచ్చింది... ఆ పాముని చూసి మొదట.. భయపడ్డా... ఆ పాము సరసలిన్ తో చాలా స్నేహంగా ఉండడం మొదలు పెట్టింది.. దీంతో మరణించిన తన ప్రేయసి పాము రూపంలో తన వద్దకు వచ్చిందని భావించి ఆ పాముని పెళ్లి చేసుకొని దానితో జీవించడం మొదలు పెట్టాడు.. ఎక్కడకు వెళ్ళినా ఆ పాము వెంట ఉండాల్సిందే... ఆ పాము కూడా ఓ పెంపుడు కుక్క మాదిరి అతని వెంట వెళ్తోంది.. అతను టీవీ చూస్తే.. అతని పక్కన కూర్చోంటుంది.. ఆట ఆడినా.. జిమ్ కు వెళ్ళినా ఇలా సరసలిన్ ఎక్కడికి వెళ్ళినా అతనికి తోడుగా పాముకూడా వెళ్తుంది... కాగా అతని పక్కన ఉన్న పాముని చూసి అందరూ భయపడడం మొదలు పెట్టారు... పాము అంటే విషపురుగని... ఎప్పటికైనా ప్రమాదమని.. అందుకనే ఆ పాముని సరసలిన్ పక్కన పడుకోబెట్టుకోవద్దని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు... కానీ ఎవరిని మాటలను సరసలిన్ పట్టించుకోవడం లేదు.. ఆ పాములోనే తన ప్రేయసిని చూసుకుంటూ.. కాలం గడిపేస్తున్నాడు..

Vithalacarya in love with the heroine of the movie .. .. or anyone sapaniko guravvadam killed after ... after ... bird, snake ... .. jantuvulayyi Like sheep they come to live up to their loved one. took place in Portland. If details ....Everyone is afraid of the serpent began to fear ... ... are always a danger to the snake .. that is why visapurugani sarasalin the serpent said to the neighbors ... but no words padukobettukovaddani sarasalin do not mind .. .. as long as the snake to his girlfriend, looking gadipestunnadu ..

హైదరాబాద్‌లో ఉబర్ బైక్స్!.. ఎలా బుక్ చేయాలంటే...

కొత్తదనాన్ని ఆస్వాదించడంలో ముందుండే హైదరాబాదీలకు కొత్త సంవత్సరంలో సరికొత్త అనుభూతి కలగబోతోంది. ప్రయాణంలో ఉల్లాసం, ఉత్సాహం సొంతం చేసుకోబోతున్నారు. రద్దీ మార్గాల్లో షేరింగ్ ఆటోలు, సిటీ బస్సుల్లో ప్రయాణించవలసిన అవసరం వచ్చే జనవరి నుంచి ఉండదు. హాయిగా బైకు సవారీ చేయవచ్చు. ఈ సదుపాయాన్ని ఉబర్ ఇండియా అందిస్తోంది. మంగళవారం బేగంపేటలోని తన క్యాంప్ ఆఫీస్‌లో సీఎం కేసీఆర్ ఉబర్ మోటో బైక్స్‌ను ప్రారంభించారు. 
 
తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును ఉబర్ వ్యవస్థాపకుడు, సీఈఓ ట్రవిస్ కలనిక్ మంగళవారం కలిశారు. అనంతరం ఉబర్ ఇండియా ప్రెసిడెంట్ అమిత్ జైన్, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉబర్ మోటో సర్వీసుల ఒప్పందంపై సంతకాలు చేశారు. ట్రవిస్ కలనిక్, తెలంగాణ ఉన్నతాధికారుల సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. మెట్రో స్టేషన్లకు నేరుగా అనుసంధానం చేసేందుకు వీలుగా ఈ సర్వీసులను అందజేయబోతున్నారు. ఉబర్ మోటో బైక్ షేరింగ్‌ ద్వారా ప్రయాణం చేయాలంటే మూడు కిలోమీటర్ల వరకు రూ.20 చెల్లించవలసి ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. తదుపరి ప్రతి కిలోమీటర్‌కు రూ.5 చొప్పున చెల్లించాలి. బైక్ డ్రైవర్లకు ప్రస్తుతం శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.
 
మీడియా సమావేశంలో ట్రవిస్ కలనిక్ మాట్లాడుతూ కొత్తదనాన్ని ఆదరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ప్రగతిశీల ప్రభుత్వమని ప్రశంసించారు. తమ కంపెనీ ప్రధాన కార్యాలయం శాన్ ఫ్రాన్సిస్కోలో ఉందని, తమ ఉద్యోగులు అత్యధికంగా ఉన్న నగరాల్లో శాన్ ఫ్రాన్సిస్కో తర్వాతి స్థానంలో హైదరాబాదే ఉందని తెలిపారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావుతో పాటు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో కాంపస్‌ను ఏర్పాటు చేయడానికి ట్రవిస్ అంగీకరించారన్నారు. ఉబర్ ప్రధాన కార్యాలయం శాన్ ఫ్రాన్సిస్కోలో ఉందని, దానికి బయట ఉన్న కార్యాలయాలన్నిటిలోనూ అత్యధిక ఉద్యోగులను హైదరాబాద్‌లోనే నియమిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌ శాఖలో 2 వేల మందికి పైగా ఉద్యోగులు ఉంటారని చెప్పారు.
 
ఈ ఏడాది మార్చిలో గురుగ్రామ్‌లో బైక్ షేరింగ్ సర్వీసులను ఉబర్ ప్రారంభించింది. ఈ సర్వీసులకు రెగ్యులేటరీ సమస్యలు ఎదురవుతున్నాయి. తెలంగాణలో అటువంటి సమస్యలు ఎదురవకుండా రవాణా శాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. బెంగళూరులో కూడా మార్చి నుంచే ఈ సర్వీసులను ప్రారంభించింది. ఇండోనేషియా, థాయ్‌లాండ్, వియత్నాం తదితర దేశాల్లో కూడా ఊబర్‌మోటో సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
 
ఉబర్ బైక్‌ను ఎలా బుక్ చేయాలి?
ఉబర్మోటో సర్వీసును ఉపయోగించుకోవాలంటే సెల్‌ఫోన్‌లో ఉబర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ యాప్‌లో ఉబర్ మోటో అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. బైక్ ఎక్కడ ఎక్కాలనుకుంటున్నారో ఆ ప్రదేశాన్ని తెలియజేయాలి. తర్వాత బుక్ చేయాలి. వెంటనే ప్రయాణికుడి వద్దకు వెళ్ళే బైకు వివరాలు, దాని డ్రైవర్ పేరు, ఫొటోలను ఉబర్ తెలియజేస్తుంది. బైకు డ్రైవర్‌తో పాటు దానిపై ప్రయాణించే వ్యక్తి కూడా హెల్మెట్ సిద్ధంగా ఉంటుంది. ప్రతి ప్రయాణానికి ముందు, ప్రయాణంలో, ఆ తర్వాత కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలను పాటిస్తారు. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్, 2 వే ఫీడ్‌బ్యాక్, బంధుమిత్రులతో ఈ ప్రయాణం గురించి తెలియజేయడానికి అవకాశాలు ఉంటాయి. ప్రయాణం ముగిసిన తర్వాత ఛార్జీలను నగదు రూపంలోనూ, ఆన్‌లైన్ పద్దతుల్లోనూ చెల్లించవచ్చు. ప్రస్తుతం బెంగళూరులో ఇదే విధంగా జరుగుతోంది. హైదరాబాద్‌లో కూడా ఇంచుమించు ఇలాగే ఉండే అవకాశం ఉంది. బెంగళూరులో కనీస ఛార్జి రూ.15, కిలోమీటర్‌కు రూ.3 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఉబర్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక హైదరాబాద్‌లో ఈ చార్జిలు కొద్దిగా ఎక్కువగా ఉన్నట్లు ఉబర్ నిర్ణయించిన ధరలను బట్టి తెలుస్తోంది. హైదరాబాద్‌లో కనీస ఛార్జి రూ.20, కిలోమీటర్‌కు రూ.5 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఉబర్ ప్రకటించింది. ఇప్పటికే గురుగ్రామ్, బెంగళూరువాసులు ఇటువంటి బైకు సవారీని ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

రాత్రికి రాత్రే దీప హోర్డింగ్స్

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీప హోర్డింగ్స్ తమిళనాట దర్శనమిస్తున్నాయి. రాత్రికి రాత్రే దీపా అభిమాన సంఘాలు పుట్టుకురావడం…మెయిన్ సెంటర్లలో అమ్మ ఫొటోలతో ఉన్న ఆమె హోర్డింగ్స్ వెలిశాయి. దీంతో అమ్మ ఫొటోలతో దీప ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అన్నాడీఎంకే కార్యకర్తలు. అమ్మ ఫొటోలు ఎలా పెట్టుకున్నారంటూ మండిపడుతున్నారు.
జయలలిత నిజమైన వారసురాలిని నేనేనంటు కొంతకాలంగా దీప మీడియా ముందు చెబుతున్నారు. జయలలిత చనిపోయిన తర్వాత తరువాత రాజాజీ హాల్ లో ఆమె భౌతికకాయం దగ్గర దీపాను కనీసం ఒక్క నిమిషం కూడా ఉండనివ్వలేదు. అక్కడి నుంచి పంపించేశారు.
మరుసటి రోజు దీప చెన్నైలోని మెరినా బీచ్ దగ్గరకు వెళ్లి జయలలిత సమాధి దగ్గర పూజలు చేశారు. ఆ సమయంలో మా కుటుంబం జయలలితకు దూరం కావడానికి కారణం అయిన శశికళ , అన్నాడీఎంకేకి చెందిన కొందరు నాయకుల బండారం బయటపెడుతానని దీప మీడియా సాక్షిగా హెచ్చరించారు. అంతే రాత్రికి రాత్రి దీపా అభిమాన సంఘాలు పుట్టుకువచ్చాయి. దీప త్వరలో జయ అన్నాడీఎంకే పార్టీని పెడుతున్నారని ప్రచారం చేశారు. ఎక్కడ చూసినా జయలలిత, దీప ఫోటోలు పెట్టి ఫ్లక్సీలు ఏర్పాటు చేశారు.
జయలలిత, శశికళలతో అన్నాడీఎంకే నాయకులు ఫ్లక్సీలు ఏర్పాటు చేశారు. అయితే దీపా మద్దతుదారులు శశికళ ఫొటోలో ఉన్న ఫ్లక్సీల మీద మసి పూసి…నల్ల రంగు వేసి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న శశికళ మద్దతుదారులు, అన్నాడీఎంకే కార్యకర్తలు దీప ఉన్న ఫ్లక్సీలను తొలగిస్తున్నారు. మొత్తం మీద రాత్రికి రాత్రే జయలలిత మేనకోడలు దీపకు అభిమాన సంఘాలు ఏర్పడటంతో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. దీపతో ఇప్పటి వరకు అన్నాడీఎంకేకి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ముందు ముందు ఆమె ఆ పార్టీకి తలనొప్పిగా మారే అవకాశముందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
పెళ్లిరోజున కట్టుకోవాల్సిన చీరలు..పెట్టుకోవాల్సిన నగలూ.. ఇతర అలంకరణ గురించే కదా! ఏ నవ వధువైనా ఆలోచించేది. కానీ శ్రీమంతుల ఇంట్లో పుట్టి.. మరో సంపన్నుల ఇంటికి కోడలుగా వెళ్లిన శ్రేయా మునోత్‌ మాత్రం.. తన పెళ్లి సందర్భంగా పేదలకు ఎలా సాయ పడగలనా అని ఆలోచించింది.. చివరకు 90 పక్కా ఇళ్లు కట్టించి.. వాళ్ల మధ్య ఆనందంగా మనువాడింది. అందుకే ఆమె గురించి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చించుకుంటున్నారు



కొన్ని నెలల క్రితం వరకూ.. శ్రేయ తన పెళ్లి ­రంతా తెలిసేలా జరగాలనీ, ఖరీదైన బట్టలూ, నగలు వేసుకోవాలనీ, వందల రకాల వంటకాలు వడ్డించాలని ఆలోచించింది. కానీ ఉన్నట్టుండి ఆమె తన ఆలోచన మార్చుకుంది. అది ఎందుకో చెప్పేముందు.. శ్రేయ ఎవరో చూద్దాం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ తాలూకా లాసూర్‌ స్టేషన్‌ ఆమె స్వగ్రామం. తండ్రి అజయ్‌ మునోత్‌ జైన్‌ వ్యాపారి. గ్రామంలోనే ధనిక కుటుంబం వాళ్లది. బాగా చదివి తానూ వ్యాపారంలో స్థిరపడాలనే ఆలోచనలతో ఎంబీఏ పూర్తి చేసింది శ్రేయ. వెంటనే ఓ ప్రయివేట్‌ సంస్థ మానవ వనరుల విభాగంలో మేనేజర్‌గా ఉద్యోగంలో చేరింది.
ఆ మాటలే కారణం..
ఆరునెలల క్రితమే శ్రేయ అందం, గుణం నచ్చి ఓ సంబంధం వచ్చింది. ఔరంగాబాద్‌కి చెందిన బాదల్‌ జైన్‌ శ్రేయకూ నచ్చడంతో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. సివిల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న బాదల్‌జైన్‌ది కూడా వ్యాపార కుటుంబమే. తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వాళ్లది. అందుకే పెళ్లి అత్యంత ఆర్భాటంగా చేయాలని పెద్దలు అనుకున్నారు. ఏడు నక్షత్రాల హోటల్‌లో ఘనంగా వివాహం జరపాలని ముందుగానే రుసుము కూడా చెల్లించారు. శ్రేయ కూడా ఆమె పెళ్లి గురించి ఎన్నో ­హించుకుని ఉద్యోగానికీ రాజీనామా చేసింది. మరోవైపు శుభలేఖలు ఎంత గొప్పగా వేయించాలీ, అతిథులకు ఎలాంటి కానుకలు ఇవ్వాలీ... వంటి చర్చలు ఇంట్లో ప్రతిరోజూ జరిగేవి. ఆ సమయంలో ఓ రోజు శ్రేయ కుటుంబానికి అత్యంత వాళ్లకు సన్నిహితుడైన గంగాపూర్‌ శాసనసభ్యుడు ప్రశాంత్‌ బంబు వాళ్లింటికి వచ్చాడు. ఇంట్లో పెళ్లి హడావుడి చూసి..‘ఇన్ని ఆర్భాటాలు అవసరమా. సాదాసీదాగా పెళ్లి జరిపి మిగిలిన డబ్బుతో పేదలకోసం ఏదైనా చేయొచ్చుగా’ అని మాటవరసకు అన్నాడు. ఆ మాటలకు మొదట శ్రేయ నొచ్చుకుంది.


కళ్లారా చూశాక..
మర్నాడు గ్రామంలోని పేదల ప్రాంతానికి వెళ్లి.. వారి పరిస్థితిని దగ్గరగా చూసింది. అక్కడివారు నిలువ నీడలేక రోడ్డుపక్కన గుడారాల్లో ఉండటం, చిన్నారులు మురికి దుస్తులతో మట్టిలో ఆడుకోవడం, అనారోగ్యాల బారినపడటం చూసి బాధపడింది. అప్పుడే శ్రేయ తన పెళ్లికి చేసే ఖర్చు వృథా కాకూడదని అనుకుంది. తల్లిదండ్రులతో అదే మాట చెబితే వారూ సంతోషించారు. కానీ వియ్యాలవారు ఏమంటారోనని భయపడ్డారు. శ్రేయ చివరకు కాబోయే భర్త బాదల్‌ జైన్‌కు తన మనసులో మాట చెప్పింది. ‘మేము నీకు అండగా ఉంటాం’ అంటూ అత్తింటివారు ముందుకొచ్చారు. మొదట శ్రేయ ఏం చేయాలా అని బాగా ఆలోచించింది. అన్నం, దుస్తుల వంటివి అందిస్తే తాత్కాలిక ప్రయోజనం మాత్రమే ఉంటుంది. అలా కాకుండా తన పెళ్లి కానుకగా పేదవాళ్లకు ఏదైనా ఘనంగా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలని అనుకుంది. వారికి పక్కా ఇళ్లు కట్టించి ఇస్తే.. వాళ్లకో ఆశ్రయం ఉంటుందని అనుకుంది. అది మిగిలిన కుటుంబసభ్యులకూ నచ్చడంతో ఎంత ఖర్చైనా భరిద్దామని ఆమె తల్లీతండ్రీ, అత్తమామలు భరోసానిచ్చారు.
108 ఇళ్లు కట్టించాలని..
శ్రేయ ఎలాంటి వారికి ఇల్లు ఇవ్వాలని బాగా ఆలోచించింది. అందరి పరిస్థితి గమనించి సెంటు భూమి, ఇల్లు లేకుండా, దురలవాట్ల జోలికి వెళ్లకుండా ఉండేవారికీ, పిల్లలున్న వితంతులకు ఇళ్లు కట్టించాలని నిర్ణయించుకుంది. ప్రశాంత్‌ సాయంతో తమ గ్రామానికి దగ్గర్లో ఉన్న ఆహర్‌నగర్‌ పరిసరాల్లో అత్యంత దుర్భర జీవితాన్ని గడుపుతున్న 108 మంది కుటుంబాలకు శాశ్వత పక్కా నివాసాలు ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. వారికోసం స్వగ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరాపూర్‌లో రెండున్నర ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. శ్రేయ నానమ్మా, తాతయ్య కళావతి నోమిచంద్‌ల పేర్లతో కళానోమి నగర్‌ అని ఆ ప్రాంతానికి పేరు పెట్టింది. అలా గత అక్టోబర్‌ 2న శ్రేయ ఆ గృహ సముదాయానికి భూమి పూజ చేసింది. ఒక్కో లబ్ధిదారుకు మూడొందల యాభై చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక పడకగది ఉన్న ఇల్లు ఇచ్చేలా ప్రణాళిక వేసుకుంది. డిసెంబరు 12న శ్రేయ వివాహం సందర్భంగా నూట ఎనిమిది కుటుంబాలకు ఇంటి తాళాలను అప్పగించాలనుకుంది. కానీ అప్పటికి కేవలం తొంభై మాత్రమే సకల సౌకర్యాలతో పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి అయ్యాయి. మిగిలినవి నిర్మాణంలో ఉన్నాయి. ఇందుకోసం కోటిన్నర రూపాయలు ఖర్చు చేసింది శ్రేయ. విద్యుత్‌, స్వచ్ఛమైన తాగునీరు, పక్కా మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు చేసింది. త్వరగా ఆసుపత్రి, అంగన్‌వాడీ, ఇతర దుకాణ సముదాయాలూ నిర్మించే ప్రయత్నంలోనూ ఉంది.
పెళ్లి సాదాసీదాగా..
ఆమె వివాహ సమయం రానే వచ్చింది. ఏడు నక్షత్రాల హోటల్‌లో కాకుండా ఆమె కట్టించిన ఇచ్చిన గృహసముదాయాల మధ్యలోనే పెళ్లి చేసుకుంది. వివాహతంతు ముగియగానే అదే వేదిక మీద శ్రేయ లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేసింది. ‘నావల్ల కొందరికైనా మేలు జరుగుతుందనే సంతృప్తి నాకుంది. ఈ స్ఫూర్తి, ఆనందంతో భవిష్యత్‌లో మరికొంత మందికి సాయపడాలనుకుంటున్నా..’ అంటుంది శ్రేయ ఆనందంగా.


రానా... రెండు యుద్ధాలు

యుద్ధ నేపథ్యంలో రూపొందే చిత్రాలు చాలా తక్కువ. ఎప్పుడో అరుదుగా అలాంటి కథలు పుడుతుంటాయి. అందులో నటించే అవకాశం తక్కువగా వస్తుంటుంది. అయితే రానా ఒకేసారి రెండు చిత్రాల్లో యుద్ధాలు చేసేస్తున్నాడు. అవే ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’, ‘ఘాజీ’. ఈ రెండూ యుద్ధ నేపథ్యంలో సాగే చిత్రాలే. ‘బాహుబలి’లో కత్తి, డాలూ పడితే, ‘ఘాజీ’లో గన్ను చేతపట్టి శత్రువుల వేట సాగిస్తున్నాడు రానా. ఒకటి భూమ్మీద చేసే యుద్ధం. రెండోది సముద్ర గర్భంలో పోరాటం. అలా ఏకకాలంలో రెండు వైవిధ్యమైన కథల్లో కనిపించే అవకాశం దక్కింది. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’లో భళ్లాలదేవుడిగా మరోసారి విశ్వరూపం చూపించబోతున్నాడు రానా. బుధవారం రానా పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’, ‘ఘాజీ’లోని రానా లుక్‌ను విడుదల చేశారు. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావొచ్చింది. 2017 ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. మరోవైపు ‘ఘాజీ’ చిత్రీకరణ దశలో ఉంది. జలాంతర్గామి నేపథ్యంలో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రమిది. సముద్రం అడుగున తెరకెక్కించిన యుద్ధ సన్నివేశాలు ఆకట్టుకొంటాయని చిత్రబృందం తెలిపింది. సంకల్ప్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీవీపీ, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్నాయి. తాప్సి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2017 ఫిబ్రవరి 17న విడుదల చేస్తారు. మరోవైపు రానా నిర్మాతగా కూడా మారుతున్నారు. నాగ చైతన్య కథానాయకుడిగా ఓ సినిమా నిర్మించే ఆలోచనలో ఉన్నారు.

సమంతగా కనిపిస్తా!

టించేందుకు ఆస్కారమున్న ఏ పాత్రనీ వదులుకోనని చెబుతోంది సలోనీ. ‘ఒక వూరిలో’, ‘మర్యాద రామన్న’ తదితర చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన ఆమె ఇటీవల ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో నటించింది. ఆ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సలోనీ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది. ‘‘నవ్వించడమంటే నాకు ఇష్టం. చాలారోజుల తర్వాత ప్రేక్షకులకి గిలిగింతలు పెట్టే పాత్రని ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో చేశా. ఇందులో నా పాత్ర పేరు సమంత. నాకు జోడీగా మహేష్‌ పాత్రలో పృథ్వీ నటించారు. కళాశాలలో నన్ను తోటి విద్యార్థులు ర్యాగింగ్‌ చేస్తుంటే పృథ్వీ వచ్చి కాపాడుతుంటాడు. ఆ సన్నివేశాలన్నీ కడుపుబ్బా నవ్విస్తాయి. నా దృష్టిలో హాస్యనటులు కథానాయకులే’’ అన్నారు సలోనీ. ‘‘ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రల్లో నటించాలనుకొంటా. ‘మర్యాదరామన్న’ తర్వాత చాలామంది పల్లెటూరి అమ్మాయి పాత్రతో నా దగ్గరికొచ్చారు. ఇష్టం లేక వద్దన్నా. ప్రస్తుతం హిందీలో అమితాబ్‌ బచ్చన్‌తో ఓ సినిమా చర్చల్లో ఉంది’’ అని చెప్పారు సలోనీ.

డిజిటల్‌ చెల్లింపులపోటీ.. మీదే రూ.కోటి రెండు పథకాలను వెల్లడించిన నీతి ఆయోగ్‌

దేశంలో పెద్దనోట్లను రద్దుచేసిన అనంతరం డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించిన కేంద్ర ప్రభుత్వం దాన్ని మరింత వేగవంతం చేసేందుకు మరిన్ని చర్యలకు శ్రీకారం చుట్టింది. డిజిటల్‌ లావాదేవీల వైపు ప్రజల్ని మళ్లించేందుకు కొత్తగా రెండు పథకాలను ప్రారంభిస్తున్నట్లు గురువారం నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ ప్రకటించారు. ఈ నెల 25న క్రిస్మస్‌ పండుగ నుంచి ఈ పథకాలను అమలుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. క్రిస్మస్‌ నుంచి ఏప్రిల్‌ 14 వరకు ఈ ప్రోత్సాహకాలను అందజేయనున్నారు. లక్కీ గ్రాహక్‌ యోజన వినియోగదారులకు సంబంధించిన పథకం కాగా, డిజి ధ‌న్‌ వ్యాపారి యోజన వ్యాపారులకు ఉద్దేశించినది. అయితే లక్కీ గ్రాహక్‌ యోజన పథకం కింద ప్రతిరోజు 15వేల మంది విజేతలను ఎంపికచేసి వారికి రూ.1000 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. అలాగే.. వారానికి ఒకసారికి లక్కీ గ్రాహక్‌ యోజన కింద ఎంపికచేసిన 7వేల మందికి రూ.లక్ష వరకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.
డిజి ధ‌న్‌ వ్యాపారి యోజన పథకం కింద వారానికొకసారి 7వేల మందిని ఎంపికచేస్తారు. వారికి రూ.50వేలు చొప్పున ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. లక్కీ గ్రాహక్‌ యోజన కింద ముగ్గురికి మెగా అవార్డులు ఇస్తారు. మొదటి విజేతకు రూ.కోటి, రెండో విజేతకు రూ.50లక్షలు, మూడో విజేతకు రూ.25లక్షల చొప్పున అందజేస్తారు. అలాగే డిజి ధ‌న్‌ వ్యాపారి యోజన పథకం కింద కూడా మెగా అవార్డులు ప్రకటించారు. మొదటి విజేతకు రూ.50లక్షలు, రెండో విజేతకు రూ.25లక్షలు, మూడో విజేతకు రూ.5లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు అమితాబ్‌ కాంత్‌ తెలిపారు. ఈ మెగా అవార్డులను ఏప్రిల్‌ 14న ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.