తమిళనాడు దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీప హోర్డింగ్స్ తమిళనాట
దర్శనమిస్తున్నాయి. రాత్రికి రాత్రే దీపా అభిమాన సంఘాలు
పుట్టుకురావడం…మెయిన్ సెంటర్లలో అమ్మ ఫొటోలతో ఉన్న ఆమె హోర్డింగ్స్
వెలిశాయి. దీంతో అమ్మ ఫొటోలతో దీప ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు
అన్నాడీఎంకే కార్యకర్తలు. అమ్మ ఫొటోలు ఎలా పెట్టుకున్నారంటూ
మండిపడుతున్నారు.
జయలలిత నిజమైన వారసురాలిని నేనేనంటు కొంతకాలంగా దీప మీడియా ముందు చెబుతున్నారు. జయలలిత చనిపోయిన తర్వాత తరువాత రాజాజీ హాల్ లో ఆమె భౌతికకాయం దగ్గర దీపాను కనీసం ఒక్క నిమిషం కూడా ఉండనివ్వలేదు. అక్కడి నుంచి పంపించేశారు.
మరుసటి రోజు దీప చెన్నైలోని మెరినా బీచ్ దగ్గరకు వెళ్లి జయలలిత సమాధి దగ్గర పూజలు చేశారు. ఆ సమయంలో మా కుటుంబం జయలలితకు దూరం కావడానికి కారణం అయిన శశికళ , అన్నాడీఎంకేకి చెందిన కొందరు నాయకుల బండారం బయటపెడుతానని దీప మీడియా సాక్షిగా హెచ్చరించారు. అంతే రాత్రికి రాత్రి దీపా అభిమాన సంఘాలు పుట్టుకువచ్చాయి. దీప త్వరలో జయ అన్నాడీఎంకే పార్టీని పెడుతున్నారని ప్రచారం చేశారు. ఎక్కడ చూసినా జయలలిత, దీప ఫోటోలు పెట్టి ఫ్లక్సీలు ఏర్పాటు చేశారు.
జయలలిత, శశికళలతో అన్నాడీఎంకే నాయకులు ఫ్లక్సీలు ఏర్పాటు చేశారు. అయితే దీపా మద్దతుదారులు శశికళ ఫొటోలో ఉన్న ఫ్లక్సీల మీద మసి పూసి…నల్ల రంగు వేసి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న శశికళ మద్దతుదారులు, అన్నాడీఎంకే కార్యకర్తలు దీప ఉన్న ఫ్లక్సీలను తొలగిస్తున్నారు. మొత్తం మీద రాత్రికి రాత్రే జయలలిత మేనకోడలు దీపకు అభిమాన సంఘాలు ఏర్పడటంతో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. దీపతో ఇప్పటి వరకు అన్నాడీఎంకేకి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ముందు ముందు ఆమె ఆ పార్టీకి తలనొప్పిగా మారే అవకాశముందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

No comments:
Post a Comment