యుద్ధ
నేపథ్యంలో రూపొందే చిత్రాలు చాలా తక్కువ. ఎప్పుడో అరుదుగా అలాంటి
కథలు పుడుతుంటాయి. అందులో నటించే అవకాశం తక్కువగా వస్తుంటుంది.
అయితే రానా ఒకేసారి రెండు చిత్రాల్లో యుద్ధాలు చేసేస్తున్నాడు. అవే ‘బాహుబలి:
ది కన్‌క్లూజన్’, ‘ఘాజీ’. ఈ రెండూ యుద్ధ నేపథ్యంలో సాగే చిత్రాలే.
‘బాహుబలి’లో కత్తి, డాలూ పడితే, ‘ఘాజీ’లో గన్ను చేతపట్టి శత్రువుల
వేట సాగిస్తున్నాడు రానా. ఒకటి భూమ్మీద చేసే యుద్ధం. రెండోది సముద్ర
గర్భంలో పోరాటం. అలా ఏకకాలంలో రెండు వైవిధ్యమైన కథల్లో కనిపించే
అవకాశం దక్కింది. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’లో భళ్లాలదేవుడిగా
మరోసారి విశ్వరూపం చూపించబోతున్నాడు రానా. బుధవారం రానా పుట్టిన
రోజు. ఈ సందర్భంగా ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’, ‘ఘాజీ’లోని రానా
లుక్‌ను విడుదల చేశారు. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ చిత్రీకరణ దాదాపుగా
పూర్తి కావొచ్చింది. 2017 ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
మరోవైపు ‘ఘాజీ’ చిత్రీకరణ దశలో ఉంది. జలాంతర్గామి నేపథ్యంలో తెరకెక్కుతున్న
తొలి భారతీయ చిత్రమిది. సముద్రం అడుగున తెరకెక్కించిన యుద్ధ సన్నివేశాలు
ఆకట్టుకొంటాయని చిత్రబృందం తెలిపింది. సంకల్ప్ దర్శకత్వం వహిస్తున్న
ఈ చిత్రాన్ని పీవీపీ, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్నాయి. తాప్సి కథానాయికగా
నటిస్తున్న ఈ చిత్రాన్ని 2017 ఫిబ్రవరి 17న విడుదల చేస్తారు. మరోవైపు రానా
నిర్మాతగా కూడా మారుతున్నారు. నాగ చైతన్య కథానాయకుడిగా ఓ సినిమా నిర్మించే
ఆలోచనలో ఉన్నారు.
No comments:
Post a Comment