cricket ad

Sunday 11 December 2016

జ‌య‌ల‌లిత‌కు స్లో పాయిజిన్ ఇచ్చింది ఎవ‌రు..!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జయలలిత మరణించి నాలుగు రోజులు అవుతున్నా దేశమంతా ఆమె మరణం గురించే మాట్లాడుకుంటున్నారు. జ‌య మృతికి చాలా కార‌ణాలు ఉన్నాయ‌ని, వాటిని త్వ‌ర‌లోనే భ‌య‌ట‌పెడ‌తాన‌ని జయలలిత సోదరుడి కుమార్తె దీప అన్నారు. సినీ నటి గౌతమీ కూడా జయలలిత మరణంపై ప‌లు సందేహాలు వ్య‌క్తం చేస్తూ ప్ర‌ధాన‌మంత్రి మోడీకే లేఖ రాసి సంచ‌ల‌నం సృష్టించారు.
ఇపుడు తాజాగా ఒక సంచలన వార్త బయటకొచ్చింది. 2012లో తెహెల్కా ప్రచురించిన ఒక కథనం ఆమె మరణంపై అనుమానాలు రేకెత్తిస్తుంది. అప్పట్లో శశికళ “మన్నార్ గుడి మాఫియా” అనే గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని తెహ‌ల్కా ప‌త్రిక‌లో నాలుగు సంవ‌త్స‌రాల క్రిత‌మే క‌థ‌నం వ‌చ్చింది. వీరు తెర వెన‌క చేస్తోన్న కుట్ర‌ల‌ను గ‌మ‌నించిన జ‌య‌ల‌లిత వీరంద‌రిని పోయెస్ గార్డెన్ నుండి వెళ్లగొట్టారు.అయితే శశికళ మాత్రం తాను నియమించిన నర్స్ ద్వారా ఆమెకు స్లో పాయిజన్ ఎక్కించినట్లు ఆ క‌థ‌నం పేర్కొంది. ఆమెకు నిద్రమాత్రలు, మరియు ఆమె తాగే పానీయాలు, మరియు ఆమె తినే పళ్ళు, ఇతర ఆహార పదార్థాలలో విషం ఎక్కించారని వైద్యులు చెప్పారని పేర్కొంది. జయలలిత తాను తీసుకుంటున్న మందులపై ఆమె వ్యక్తిగత వైద్యులు చేసిన పరీక్షలలో ఈ విషయం బయటపడిందని తెలిసింది.శ‌శిక‌ళ కుటుంబ స‌భ్యుల తెర‌వెన‌క దందాలు తెలుసుకున్న జ‌య‌ల‌లిత శశికళతో సహా ఆమె కుటుంబ సభ్యులందరినీ తన ఇంటి నుండి బయటకు పంపేశారు. దీంతో జయలలితను ఎలాగైనా అంతమొందించాలని శశికళ భావించారు. దాంతో మళ్ళీ శశికళ జయలలితను మంచి చేసుకుని ఆమె ఇంట్లోకి వచ్చారు. జయలలిత కూడా శశికళని తప్ప ఆమె కుటుంబ సభ్యులు ఎవరినీ తన ఇంట్లోకి రానీయలేదు. ఇపుడు ఆమె మరణం తర్వాత శశికళ కుటుంబ సభ్యులు అంతా మళ్ళీ జయ ఇంట్లో అడుగు పెట్టడం తో ఈ విషయం మళ్ళీ చర్చనీయాంశమయింది.

జ‌య‌ను ఫ్యామిలీకి దూరం చేసిన కుట్ర సీక్రెట్ ఇదే

భ‌విష్య‌త్తులో తాను త‌మిళ రాజకీయాల్లోకి వస్తానని జయలలిత అన్న కుమార్తె , జ‌య మేన‌కోడ‌లు దీప వెల్లడించారు. జ‌య మృతిచెందాక జ‌య రూపాన్నే పోలిఉన్న ఆమె గురించి మీడియాలో ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన దీప ప‌లు సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు.
శశికళ పన్నిన కుట్ర వల్లే తమ కుటుంబం అత్తకు దూరమైందని శనివారం ఆమె ఆరోపించారు. తన తల్లిదండ్రులు అత్తతో కలిసి పోయెస్‌ గార్డెన్‌లోనే ఉండేవారని, తాను అక్కడే పుట్టానని తెలిపారు. శశికళ ప్రవేశంతో పోయెస్‌ గార్డెన్‌ నుంచి బయటకు రాక తప్పలేదని పేర్కొన్నారు. అత్త అనారోగ్య సమయంలో సరైన వైద్య చికిత్సలు, సపర్యలు అందలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


 ఇక అత్త అనారోగ్యంతో అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ప్పుడు అపోలోకు వెళ్లినప్పుడు, అత్త సమాధి వద్ద అంజలి ఘటించేందుకు వెళ్లినప్పుడు కూడా శశికళ అవమానించారని చెప్పారు. శశికళను పార్టీ పగ్గాలు చేపట్టాలని అ‍న్నాడీఎంకే నేతలు కోరడంపై మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి విషయాలను ప్రజల నిర్ణయానికే వ‌దిలి వేయాల‌ని కూడా ఆమె చెప్పారు. ఇక జ‌య‌ల‌లితే శ‌శికళ కుటుంబ స‌భ్యుల‌ను పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టాల‌ని వ‌స్తోన్న వార్త‌ల‌ను ఆమె ఖండించారు.

నోట్లరద్దు.. హెరిటేజ్-బిగ్ బజార్.. ఓ భారీ కుంభకోణం .. సాక్ష్యాధారాలతో సహా..

సంక్షోభం ఉన్నప్పుడే అవకాశాలు అందిపుచుకోవాలి అనేది చంద్రబాబు ఫిలాసఫీ . ఎందుకంటే ప్రజలందరూ ఒక సంక్షోభంలో ఉంటే ఆసమయంలో మిగతా విషయాలు ఏవీ కూడా పట్టించుకోరు , అదే అదునుగా ప్రజల కన్నుగప్పి ఎవరికీ అనుమానం రాకుండా మిగతా రంగాలలో దోచుకోవటం అనేది చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య . దీనిలో చిన్నప్పటి నుండీ ఆరితేరి ఉన్నాడు.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత కేంద్రప్రభుత్వం తీసుకొన్న అతిపెద్ద సాహసోపేత నిర్ణయం ఏదయినా ఉందంటే అది నోట్ల రద్దు వ్యవహారమే . మొదట్లో మోడీ చెప్పినట్లు ఇది అంత్యంత రహస్యమైన నిర్ణయం ఎంతమాత్రం కాదు , ఈరోజు బయటకి వస్తున్న కొత్త సంగతులు ప్రకారం ఇలాంటి నిర్ణయం మోడీ తీసుకోబోతున్నట్లు బీజేపీకి , పారిశ్రామికవేత్తలకి , nda మిత్రపక్షాలందరికి తెలుసు , అందుకే వాళ్ళ పార్టీ మనుషులు అందరూ ముందే జాగ్రత్తపడ్డారు .
పెద్దనోట్లు రద్దుచేయమని సరిగ్గా నెలరోజులు ముందు చంద్రబాబు చెప్పుకొంటున్నట్లు మోడీకి ఉత్తరం వ్రాసినమాట నిజమే . ఎందుకంటే చంద్రబాబుకి ఈ విషయం చాలా రోజులు ముందే తెలుసు , అప్పటినుండి జాగ్రత్తగా పావులు కదిపి తన మనుషులుతో రాజధాని చుట్టూ ఎడాపెడా భూములు కొనిపించాడు ( ఈ విధయాలన్ని మరో పోస్టులో వివరంగా వ్రాస్తాను ) .
భూములు విషయాలు పక్కనపెడితే , నోట్లరద్దు వలన హెరిటేజ్ కి , బిగ్ బజార్ కి తద్వారా చంద్రబాబుకి కలిగిన లబ్ది ఏమిటో ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి .
చంద్రబాబు ముఖ్యమంత్రి కాకమునుపు హెరిటేజ్ విలువ ఎంత ఉంది , ఇప్పుడు హెరిటేజ్ విలువ ఎంత ఉందో చుస్తే దేశంమొత్తం మీద ఇంత పెద్ద ఎత్తున లాభాలు గడించిన సంస్థ ఇంకోటి లేదని తెలుస్తుంది .
ఒక్కసారి గత రెండు సవత్సరాలలోనే హెరిటేజ్ విలువ ఆకాశంలోకి ఎలా దూసుకెళ్లిందో చూడండి .
1995 లో ప్రారంభమైన హెరిటేజ్ 2011 నవంబర్ వరకు కూడా దాని మొత్తం విలువ 189 కోట్లు .మొన్న ముఖ్యమంత్రి కావటానికి ముందు దానివిలువ 411 కోట్లు . ముఖ్యమంత్రి అయిన ఒక్క సంవత్సరంలోనే దానివిలువ 1341 కోట్లకు పెరిగింది . మరొక్క సంవత్సరంలోనే అనగా మొన్న అక్టోబర్ నాటికి దానివిలువ అక్షరాలా 2109 కోట్లు . అనగా దగ్గరదగ్గర ఈ రెండు సవత్సరాలలోనే హెరిటేజ్ విలువ 600 రేట్లు పెరిగింది .
2012 నుండి ఇప్పటివరకు కంపెనీలో వచ్చిన పెద్ద మార్పేమిలేదు . అవే పాలు ,పెరుగు , మజ్జిగ , కూరగాయలు కాకపొతే లాభాలు మాత్రం అమాంతం పెరిగిపోయాయి .ఇది ఎలా సాధ్యం అయింది ?
ఎలాంటి దోపిడీని అయినా ఏ చట్టాలకు దొరకకుండా చేయటంలో చంద్రబాబుది అందెవేసిన చేయి . ఈ రెండు సంవత్సరాలలో దోచుకొన్న డబ్బునంతటిని వైట్ మనీగా మార్చుకోవటానికి వీళ్ళ మనుషులతోనే ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా వీళ్ళ షేర్లు వీళ్ళే కొన్నట్లు లెక్కలు తారుమారు చేసి 189 కోట్లు విలువఉన్న కంపెనీని 2109 కోట్లకు వీళ్ళే పెంచుకున్నారు . ఆ విధంగా దోచుకొన్న డబ్బునంతా హెరిటేజ్ లాభాయాలరూపంలోకి మార్చుకున్నారు .
హెరిటేజ్ షేర్లు ఎలా పెరిగాయో తేదీల వారిగా ఈ క్రింద ఫోటోలు గమనించండి .
-- ఫోటో 1 - నవంబర్ 25, 2011 లో హెరిటేజ్ విలువ 81.52 రూపాయలు ( మొత్తం షేర్లు 23,199,000 ) , అనగా అప్పటి విలువ 189 కోట్ల 11 లక్షలు .
-- ఫోటో 2 - డిసెంబర్ 6,2013 నాటికి హెరిటేజ్ షేరు విలువ 177.45 రూపాయలు , అనగా కంపెనీ మొత్తం విలువ 411 కోట్ల 66 లక్షలు .
-- ఫోటో 3 - జూలై 10,2015 నాటికి షేరు విలువ 400.50 రూపాయలకు కి పెరిగి మొత్తం కంపెనీ విలువ 929 కోట్ల 11 లక్షలకు పెరిగింది .
-- ఫోటో 4 - డిసెంబర్ 18,2015 అనగా మరో నాలుగు నెలల్లోనే షేరు విలువ 578.15 రూపాయలకి పెరిగి మొత్తం కంపెనీ విలువ 1342 కోట్ల కి చేరుకొంది .
-- ఫోటో 5 - అక్టోబర్ 28 , 2016 నాటికి షేరు విలువ ఏకంగా 909.20 రూపాయలకి చేరుకొని కంపెనీ మొత్తం విలువ 2110 కోట్లకు చేరుకొంది .
ఇప్పటివరకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దోచుకొన్న డబ్బునంతా సొంత కంపెనీలో షేర్లు రూపంలోకి మార్చుకొని వైట్ మనీగా మార్చారు . మీరు పరిశీలించండి చూడండి , ముఖ్యమంత్రి కాకముందు 200 కోట్ల ఉన్న హెరిటేజ్ విలువ ఈరోజుకి 2110 కోట్లు అయ్యింది . అనగా గోదావరి పుష్కరాల అవ్వగానే 1000 వెయ్యి కోట్లు పెరిగింది , మొన్న కృష్ణ పుష్కరాలు అవ్వగానే మరో వెయ్యికోట్ల పెరిగింది .
ఇక్కడవరకు బాగానే ఉంది దోచుకొన్న డబ్బుని హెరిటేజ్ షేర్లలోకి మార్చారు , కాకపొతే దీనివలన పెద్దగా లాభంలేదు , ఎందుకంటే ఈ షేర్లు బయట వాళ్ళకి ఈ పెరిగిన ధరకు అమ్ముకొంటేనే వీళ్లకి తిరిగి ఆ డబ్బులు వచ్చేది ,మరి కంపెనీ అసలు విలువ చుస్తే అంత లేదు , షేరు ధరలేమో ఆకాశంలో ఉన్నాయి . కంపెనీ విలువకి షేరు ధరకి అసలు పొంతనే లేదు , అందుకే షేర్లు కొనటానికి ఎవ్వరూ ముందుకి రాలేదు .
సరిగ్గా ఇక్కడే చంద్రబాబుకి నోట్ల రద్దు వ్యవహారం కలిసొచ్చింది . చాలా రోజులు క్రితమే నోట్లు రద్దు కాబోతున్నాయి తద్వారా సంక్షోభం రాబోతున్నదని ముందే ఉప్పందుకొన్న చంద్రబాబు తన మనుషులతో తన బినామిలతో కనపడ్డ భూములను కొనిపించాడు . ఒక అంచనా ప్రకారం దగ్గరదగ్గర 40 వేళా ఎకరాలు బాబు బినామీలు భూములు కొన్నారు . అందుకే ఎవ్వరూ IDS స్కీమ్ లో కూడా దొరకలేదు . ఎదో ఒకరిద్దరు సొంత mla లు తప్ప ( ఆదికేశవులు భార్య ) .
ఇకపోతే ఇదే అదునుగా మిగిలిన నల్లధనాన్ని , హేరిటేజ్ షేర్ల రూపంలోకి మార్చిన డబ్బుని కూడా ఎలాగయినా మార్చుకోవాలని అంత్యత పకడ్బందీగా వెంకయ్య నాయుడు అండతో అరుణ్ జైట్లీ సహకారంతో హేరిటేజ్ కి ఫ్యూచర్ ఇండియా ( బిగ్ బజార్ ) కి లింక్ కలిపాడు . ఈ డీల్ చూస్తే ఎవరికయినా దిమ్మ దిరాగాల్సిందే .
సరిగ్గా మోడీ నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించటానికి ముందుగా అనగా నవంబర్ 7 తేదీన హేరిటేజ్ కంపెనీని ఫ్యూచర్ ఇండియా ( బిగ్ బజార్ ) కి అమ్మేశారు . ఆ వివరాలు చూస్తే మనకి దిమ్మతిరగాల్సిందే . పైన హెరిటేజ్ ప్రస్తుత విలువ ఎంతో చూసాము కదా , అక్టోబర్ 2016 నాటికి 2110 కోట్ల విలువకి చేరుకొంది .
2110 కోట్ల కంపెనీని కేవలం 270 కోట్ల విలువ చేసే ఫ్యూచర్ ఇండియా కంపెనీ షేర్లు తీసుకొని అమ్మేశారు .
2110 కోట్లు ఎక్కడ 270 కోట్లు ఎక్కడ ? అంత తక్కువకి ఎందుకు అమ్మారు ? ఎందుకంటే కంపెనీ విలువ అంతకన్నా ఎక్కువ చేయదు కనుక , మరి అలా చేయటం వలన చంద్రబాబుకి ఫ్యూచర్ ఇండియా కంపెనీ వలన కలిగే లాభం ఏమిటి ?
--- 6,7,8 ఫోటోలు చూడండి - హెరిటేజ్ కి ఫ్యూచర్ ఇండియా కి జరిగిన డీల్ వివరాలు చూడండి .
బిగ్ బజార్ ద్వారా వేలకోట్లు ఎలా మారుస్తున్నారో చూద్దాం..
మొదట్లోనే చెప్పుకున్నాం కదా సంక్షోభంలో అవకాశాలు వెతుకుతాడాని , ఇప్పుడు కూడా అలాంటి అవకాశం సృష్టించాడు . హెరిటేజ్ కంపెనీని అమ్మేసిన ఫ్యూచర్ ఇండియా ద్వారా ఈసారి అటునుండి నరుక్కోచ్చాడు . నోట్లరద్దు తర్వాత ప్రజలందరూ బ్యాంకులలో పాత నోట్లు మార్చుకొంటుంన్నారు . అలాంటి పాత నోట్లు మార్చుకొనే అవకాశం ఫ్యూచర్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో నడిచే బిగ్ బజార్ ని కూడా చేర్చారు . దీనికి వెంకయ్య అండతో అరుణ్ జైట్లీని , RBI ని కూడా ఒప్పించారు . పాత నోట్లు మార్చుకొనే అవకాశం బ్యాంకులు కాకుండా ప్రైవేట్ కంపెనీలలో ఒక్క బిగ్ బజార్ కి మాత్రమే ఇచ్చారు , అదీ చంద్రబాబు పవర్ .
గత నెల 24 నుండి దేశవ్యాప్తంగా ఉన్న 260 బిగ్ బజార్ షాప్ లలో పాత నోట్లు మార్పిడి మొదలు పెట్టారు . రోజుకి దగ్గర దగ్గర 250 కోట్లు ఈ బిగ్ బజార్ షాప్లలలో మారుస్తున్నారు . ఒక అంచనా ప్రకారం 10000 ( 10 వేల కోట్లు ) కోట్లు డిసెంబర్ ఆఖరి లోపు మార్చే అవకాశం ఉంది .
ఈ షాప్ లలో సామాన్యులకు ఇచ్చేది 1 శాతం మిగతా 99 శాతం చంద్రబాబు మరియు బీజేపీ పెద్దల డబ్బుని మారుస్తున్నారు . ఇలాంటి స్కెచ్ ముందే వేసిన చంద్రబాబు తక్కువ ధరకు హెరిటేజ్ ని అమ్ముకొని బిగ్ బజార్లో భాగస్వామిగా చేరాడు . ఇప్పుడు ఆ బిగ్ బజార్ ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు నల్లధనాన్ని తెల్ల ధనం గా మారుస్తున్నారు .
ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మొదటి రోజు బిగ్ బజార్ SBI తో టైఅప్ అయి ఈ నోట్ల మార్పిడి చేస్తుంది అని ప్రకటించారు . అదే రోజు అరవింద్ కేజ్రీవాల్ , SBI నే డబ్బులు ఇవ్వలేక ప్రతొరోజు ప్రజలని వెనక్కి పంపుతుంది , అలాంటిది ఒక ప్రైవేట్ కంపెనీకి ప్రతొరోజు అంత పెద్ద మొత్తంలో ఎలా ఇస్తది ? అసలు బిగ్ బజార్ కంపెనీకె ఈ అవకాశం ఎందుకు ఇచ్చారు అని విమర్చించాడు .
ఆవిమర్శలకు స్పందించిన బిగ్ బజార్ అధినేత కిషోర్ బియాని మేము SBI దగ్గర మేము కొత్త నోట్లు తీసుకోవటం లేదు , మా కంపెనీ రోజు వారీ అమ్మకాల ద్వారా వచ్చే డబ్బులతో పాత నోట్లు మారుస్తాం అని ప్రకటించాడు . అనగా వాళ్ళు రోజుకి దగ్గర దగ్గర 250 కోట్ల రూపాయల క్యాష్ లావాదేవీలు చేయాలి , ఇది అసలు జరిగే పనేనా ?
--- 13,14 ఫోటోలు చూడండి అరవిందు కేజ్రీవాల్ ట్వీట్ కి కిషోర్ ఇచ్చిన సమాధానం చూడొచ్చు .
మొన్న చంద్రబాబు RBI కి ఫోన్ చేసి మూడు వేల కోట్లు తెప్పించాడు , నిన్న 2 వేల కోట్లు తెప్పించాడు అని వార్తలు చదివే ఉంటారు , ఇవి కూడా నిజమే . కాకపొతే ఆ డబ్బులన్నీ బిగ్ బజార్ లకి చేర్చి అక్కడ వీళ్ల నల్లధనాన్ని మార్చి కొన్ని వేల కోట్లు కొత్త నోట్లలోకి మారుస్తున్నారు . మొన్న శేఖర్ ( టీటీడీ మెంబెర్ ) దొరికిన 100కోట్లు కూడా బిగ్ బజార్ ల ద్వారా మార్చిన డబ్బే . దేశంలో దొరుకుతున్న 100 ల కోట్లు కొత్త నోట్లు అన్నీ బిగ్ బజార్ ద్వారా బయట ప్రపంచంలోకి వచ్చినవే .
---- 8,9,10,11,12 ఫోటోలు చూడండి , ఈ ఫ్యూచర్ ఇండియాకి బీజేపీ భక్తుడు రాందేవ్ బాబాకి ఉన్న లింక్ లు కూడా తెలుస్తాయి , అదే రాందేవ్ బాబా చంద్రబాబుని కలవటం చూడోచ్చు . దేశంలో ఇలాంటి అక్రామార్కులు అందరూ ఈ ఫ్యూచర్ ఇండియా ( బిగ్ బజార్ ) ద్వారానే వ్యవహారం నడుపుతున్నారు .
ఇలాంటి వేల కోట్లు మార్చుకోవడం కోసమే హేరిటేజ్ కంపెనీని బిగ్ బజార్ కి అమ్మేసి దానిలో చంద్రబాబు భాగస్వామి అయ్యాడు .
Source From: Mani Annapureddy

సంబంధిత వార్తలు

శ‌శిక‌ళ అంతఃపుర కుట్ర‌...తెహ‌ల్కా సంచ‌ల‌న క‌థ‌నం

అన్నాడీఎంకే అధ్య‌క్షురాలు జ‌య‌ల‌లిత‌కు, ఆమె ఆప్తురాలు శ‌శిక‌ళ స్లో పాయిజ‌న్ ఇచ్చారా ?జ‌య‌ల‌లిత‌ను చంపేందుకు శ‌శిక‌ళ, మ‌న్నార్ గుడి మాఫియాను ఏర్పాటు చేసుకున్నారా? అప్ప‌టి గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి, ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శ‌శిక‌ళ కుట్ర‌ల గురించి అమ్మ‌కు ముందుగానే హెచ్ర‌రించారా? అంటే అవున‌ని స‌మాధానమిస్తోంది తెహ‌ల్కా ప‌త్రిక‌.

శ‌శిక‌ళ స్వ‌స్థ‌లం మ‌న్నార్ గుడి, ఆమె వ‌ర్గీయులను త‌మిళ‌నాడులో మ‌న్నార్ గుడి మాఫియా అంటారు. మ‌న్నార్ గుడి మాఫియా తో క‌లిసి అమ్మ‌ను చంపేందుకు శ‌శిక‌ళ‌ కుట్ర చేసింద‌ని తెహ‌ల్కా ప‌త్రిక సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

జ‌య‌ల‌లిత‌కు శ‌శిక‌ళ నియ‌మించిన న‌ర్సు నిద్ర‌మాత్ర‌లు, కొద్ది మెతాదులో విషం క‌లిపిన ర‌సాయ‌నాల‌ను ఇచ్చింద‌ని క‌థ‌నం వెల్ల‌డించింది... చిన్న‌మ్మ శ‌శిక‌ళ‌ను గ‌ద్దె నెక్కించేందుకు మ‌న్నార్ గుడి మాఫియా కుట్ర‌లు ప‌న్నింద‌ని, అంతఃపుర కుట్ర‌ల‌కు శ‌శిక‌ళ సూత్ర‌దారి అని క‌థ‌నంలో తెలిపింది.

అంతేకాకుండా మ‌న్నార్ గుడి మాఫియా కుట్ర‌ల గురించి గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి న‌రేంద్ర‌మోదీ అమ్మ‌ను ముంద‌స్తుగా హెచ్చ‌రించార‌ని తెహ‌ల్కా క‌థ‌నాన్ని రాసిన జీమెణ్ జాక‌బ్ వెల్ల‌డించారు. ఆ త‌ర్వాత జ‌య‌ల‌లిత‌కు శ‌శిక‌ళ కుట్ర గురించి తెలిసి ప‌క్క‌న పెట్టింద‌ని తెలిపింది.

జ‌య‌ల‌లిత మ‌ర‌ణించ‌డంతో ఆమె మృతి ఓ మిస్ట‌రీగా మారిపోయింది. అమ్మ మృతి పై గ‌త కొద్ది రోజులుగా అనేక అనుమానాలు వ‌స్తున్నాయి. జ‌య మృతి గురించి నిజ‌నిజాలు బ‌య‌ట‌పెట్టాల‌ని అభిమానులు ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఈ దెబ్బకు బంగారం రేటు పదివేలకు పడిపోవడం ఖాయమనుకుంటున్నారా?

ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా ఒకటే ముచ్చట... మన దగ్గర ఎంత బంగారం వుంది? యాభై తులాలకంటే ఎక్కువ వుందా? అందులో మనం కొనుక్కున్నది ఎంత? పుట్టింటివాళ్లు, మెట్టినింటోళ్లు పెట్టింది ఎంత? వాటికి బిల్లులున్నాయా అని అత్తారింటోళ్లను ఇప్పుడు అడిగితే ఏమన్నా బావుంటుందా?... ఇలా రకరకాల సంశయాలు, చర్చలు.

ఇంతకు ముందు నగలు ధరించి బయటికి వెళ్లాలంటే చైన్‌ స్నాచర్ల భయం ఒక్కటే వుండేది. ఇప్పుడు ఐటీ స్నాచర్ల భయం కూడా పట్టుకుంది.

మరోవైపు... బంగారం తిక్క కుదిరింది. ఈ దెబ్బకు బంగారం కొనుక్కునే వాడే వుండడు. తులం బంగారం రేటు పదివేలకు పడిపోవడం ఖాయం. బంగారం కొట్లు మూతపడడం గ్యారంటీ... అని అనుకుంటున్న వాళ్లూ వున్నారు.

 
              ఈ కోల్డ్‌ సీజన్‌లో ఇది నిజంగానే హాట్‌ టాపిక్‌. కేంద్ర ప్రభుత్వం బోలెడంత వివరణ ఇచ్చింది. అయినా ప్రజల్లో సందేహాలు నివృత్తి కాలేదు. ఏమో... పెద్ద నోట్ల రద్దు గురించి కలగన్నామా? అలాగే బంగారంపై సర్జికల్‌ స్ట్రయిక్‌ జరగదని గ్యారంటీ ఏముంది? పైగా ఇది తొలి అడుగు మాత్రమేనని, మరిన్ని చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా చెప్పారు. అయినా సరే అనేక సందేహాలు సామాన్యులను పట్టిపీడిస్తున్నాయి. నిజానికి ప్రభుత్వం బంగారంపై కొత్తగా ఆంక్షలు ఏమీ విధించలేదు. అనేక సంవత్సరాలుగా అమల్లో వున్న నియమ నిబంధనలే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. ఆదాయపు పన్ను శాఖ వాళ్లు ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేసి ఎంత బంగారం వుందనే లెక్కలు తీయరు. ఆదాయానికి మించిన అక్రమార్జన వున్నట్లు తమ దృష్టికి వచ్చిన సందర్భాలలో మాత్రమే ఎంత బంగారం వుందనేది లెక్కతీస్తారు. అలా లెక్క తీసేటప్పుడు ఒక్క బంగారం గురించి మాత్రమే కాదు, అన్ని ఆస్తుల వివరాలు సేకరిస్తారు. 
 
అమల్లో వున్న చట్టం ఏం చెబుతోంది?
అవినీతితోనో, మరో రూపంలోనే కూడబెట్టిన సంపదను ఏసీబీ, ఐటీ అధికారులు పట్టుకున్నప్పుడు ఇన్ని కోట్ల డబ్బు, ఇన్ని కిలోల బంగారం దొరికిందని, స్వాధీనం చేసుకున్నారని మీడియాలో వార్తలు వస్తాయి. మొత్తం డబ్బు, బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నా, అందులో కొంత బంగారాన్ని తమ వద్దనే వుంచుకునే వెసులుబాటు టాక్స్‌ ఎసెసీలకు వుంది. సెక్షన్‌ 132(4) ప్రకారం ఎసెసీ భార్యకు 500 గ్రాముల వరకు మినహాయిస్తారు. అలాగే అవివాహితకు 250 గ్రాముల బంగారం కలిగి వుండడానికి మినహాయింపు వుంది. పురుషుడు 100 గ్రాముల బంగారం వరకు కలిగి వుండవచ్చు. వీటికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. స్థూలంగా చెప్పాలంటే... చిన్న కుటుంబంలో భార్యాభర్తలకు కలిపి 600 గ్రాముల బంగారం వుండవచ్చు. అంటే అరవై తులాలు. సాధారణ మధ్యతరగతి కుటుంబాలలో ఇంతకు మించి బంగారం వుండడం అరుదు.
 
‘పసిడి’ సందేహాలు ...
ఒకవేళ మధ్యతరగతి కుటుంబాల దగ్గర అరవై తులాలకు మించి వుంటే, ఆ మిగిలినదంతా ప్రభుత్వం లాగేసుకుంటుందా? మరో పెద్ద సందేహం.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... అరవై తులాలకు మించి ఉంటే కూడా ప్రభుత్వం దాన్నేమీ లాక్కోదు. పరిమితికి మించిన బంగారాన్ని ఎలా సమకూర్చుకున్నారో ప్రభుత్వం అడిగినప్పుడు వివరణ ఇవ్వాలి. అది వారసత్వంగా వస్తున్న బంగారం కావొచ్చు. కష్టార్జితాన్ని పొదుపు చేసుకుంటూ అప్పుడప్పుడూ కొంత చొప్పున కొనుగోలు చేసినది కావచ్చు. ఆ వివరాలను అందజేస్తే సరిపోతుంది. అయితే ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా ప్రతి కొనుగోలుకు పన్ను చెల్లించి బిల్లు తీసుకోవడం చాలా మంచిది.  వారసత్వంగా విల్లు ప్రకారం వచ్చిన బంగారంపై కూడా ప్రజలకు హక్కు వుంటుంది. అయితే విల్లుపై ఇద్దరు సాక్షి సంతకాలు వుండాలి. పుట్టింటినుంచో, బహుమతిగానో, మరో విధంగానో వచ్చే బంగారానికి ఆధారపత్రం ఏదన్నా వుండేట్టు చూసుకోవడం మంచిది. బహుమతిగా పొందిన బంగారాన్ని విక్రయించేటప్పుడు బహుమతిగా పొందినప్పటి ధర, ఇప్పటి ధరల మధ్య వ్యత్యాసంపై పన్ను కట్టడం లాంటి నిబంధనలు వున్నాయి.
 
          కేంద్ర ప్రభుత్వ గోల్డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌, 1999 ప్రకారం... 2000-01 నుంచి గోల్డ్‌ డిపాజిట్‌ బాండ్లను జ్యువెలరీ కింద పరిగణించకుండా సెక్షన్‌2(ఈ)కి సవరణ వచ్చింది. దీని ప్రకారం గోల్డ్‌ డిపాజిట్‌ బాండ్లను ఆస్తులుగా పరిగణించరు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏడాది క్రితం ప్రవేశపెట్టిన పథకం ప్రకారం మన బంగారు ఆభరణాలను బ్యాంకులలో నిర్ణీత కాలవ్యవధికి జమచేసి, దానిపై వడ్డీ కూడా పొందే అవకాశం వుంది. బంగారానికి సంబంధించి ఇలా అనేక వెసులుబాట్లు వున్నాయి.  వ్యవసాయ ఆధారిత కుటుంబాలయితే ఈ విషయంలో చీకూచింతా లేకుండా వుండవచ్చు. ఓ పదెకరాల సాగుభూమి, పాడి కలిగిన రైతు కుటుంబం ఓ పదేళ్ల వ్యవధిలో కిలో బంగారాన్ని సమకూర్చుకోవడం అసాధ్యమైన విషయమేమీ కాదు. వ్యవసాయ ఆదాయంపై పన్ను లేనట్టే వ్యవసాయ ఆదాయంతో కొనుగోలు చేసిన బంగారంపై కూడా ఎలాంటి పన్ను వుండదు. 
 
మన దగ్గర సెంటిమెంట్‌ ఎక్కువ ...
బంగారానికీ, భారతీయులకూ విడదీయరాని బంధం ఎప్పటినుంచో ఉంది. బతికినన్నాళ్లేకాదు, చచ్చిపోయే చివరిక్షణాల్లోనూ ఒంటి మీద బంగారం వుండాలని కోరుకుంటారు భారతీయ మహిళలు. ‘‘ఈ ఆడోళ్లున్నారు చూశారూ... బంగారం పేరెత్తితే చాలు, పడిచస్తారు.. ఒళ్లు మరిచిపోతారు. వాళ్లకదో వేలంవెర్రి’’.... ఇలాంటి మాటలు ఇప్పుడే కాదు, ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి మగాళ్లనుంచి. అయితే మహిళలు ఎగబడితేనే, పడిచస్తేనే బంగారం ధర ఇంత దాకా వచ్చిందా?  భారతదేశంలో బంగారం అంటే చాలా క్రేజ్‌ వున్న మాట నిజం. ప్రపంచంలో పసిడి కొనుగోళ్లలో అందరికంటే ఇండియన్లే ముందున్నారన్నది వాస్తవం. ప్రతి సంవత్సరం భారతీయులు కొనుగోలు చేస్తున్న బంగారం దాదాపు 800 నుంచి 1000 టన్నులు. అయినా సరే బంగారం ధర హెచ్చుతగ్గులకు ఇదొక్కటే కారణం కాదు. అనేక అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల ప్రభావం బంగారం ధరపై వుంటుంది. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
 
అసలు ఎవరి దగ్గర ఎక్కువ వుంది?
భారతీయుల దగ్గరే బంగారం ఎక్కువ వుందని చాలామంది అనుకుంటారు. అది నిజం కాదు. అధికారంగా భారతదేశం దగ్గర, రిజర్వ్‌ బ్యాంక్‌ దగ్గర వున్న బంగారం నిల్వలు చాలా తక్కువే. ప్రపంచంలో అన్ని దేశాలకంటే ఎక్కువ బంగారం వున్నది అగ్రరాజ్యం అమెరికా దగ్గరే. అమెరికా రిజర్వ్‌ బ్యాంక్‌ (ఫెడరల్‌ రిజర్వ్‌) దగ్గర 8,133 టన్నుల గోల్డ్‌ వుంటే, ఇండియా దగ్గర వున్నది 557 టన్నులే. అమెరికా విదేశీ మారకద్రవ్యంలో బంగారం వాటా 80 శాతం అయితే, మన విదేశీ మారక ద్రవ్యంలో బంగారం వాటా 10 శాతమే. మనతో పోల్చితే చైనా దగ్గర రెట్టింపు బంగారం వుంది. గత కొన్ని సంవత్సరాలుగా చైనా పసిడిని ఎగబడి కొనుగోలు చేస్తోంది. మన కంటే చిన్న దేశాల దగ్గర కూడా మనకంటే ఎక్కువ బంగారం నిల్వలు వున్నాయి. బంగారం నిల్వలు అధికంగా వున్న దేశాలే సంపన్న దేశాలుగా ప్రపంచ చిత్రపటంలో వెలుగొందడం గమనించాల్సిన అంశం. బంగారం నిల్వలు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేశాయనడానికి ఇది నిదర్శనం.
 
          ప్రపంచ చరిత్రలో బంగారం కోసం అనేక యుద్ధాలు జరిగాయి. బంగారం కోసం స్పెయిన్‌ చేసిన యుద్ధాలు లోకవిదితం. అంతెందుకు... రెండవ ప్రపంచ యుద్ధకాలంలో హిట్లర్‌ సేనలు అనేక ఐరోపా దేశాలపైకి దండెత్తినప్పుడు.. మొదటగా స్వాధీనం చేసుకున్నది బంగారాన్నే. కొల్లగొట్టిన బంగారంతో హిట్లర్‌ తన సేనలను మరింత బలోపేతం చేసుకుని ముందుకు సాగాడు. గత చరిత్రనే కాదు... వర్తమాన మానవ చరిత్రనూ, దేశాల చరిత్రనూ బంగారం ప్రభావితం చేస్తూనే వుంది. పదేళ్ల క్రితం అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, డాలరుకు విలువ తగ్గిపోయాక బంగారం విలువ మరింత పెరిగింది. అప్పటిదాకా డాలరు నిల్వలలో పోటీపడిన ప్రపంచదేశాలు గోల్డ్‌ నిల్వలను పెంచుకోవడానికి పరుగులు తీశాయి. కాబట్టే పదిహేను సంవత్సరాల క్రితం 288 డాలర్లు వున్న ఔన్సు బంగారం ధర ఒక దశలో 2000 డాలర్లదాకా దూసుకెళ్లి ప్రస్తుతం 1200 డాలర్ల దగ్గర స్థిరంగా వుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల కరెన్సీలపై ప్రజలకు నమ్మకం నానాటికీ సన్నగిల్లుతోంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్‌ కరెన్సీ అయిన డాలరుపై విశ్వాసం సడలిపోతోంది. డాలర్‌ ప్రామాణిక ఆర్థిక వ్యవస్థలో లుకలుకలు బయటపడుతున్నకొద్దీ సురక్షిత ఆర్థిక సాధనంగా గోల్డ్‌ నిలుస్తోంది. 
ఇప్పుడు భారతదేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు పరిస్థితిపై అనిశ్చితి నెలకొనడంతో బంగారాన్ని మించినది మరోటి లేదనే భావన మరోసారి బలపడుతోంది.
 
డిమాండ్‌ పెరగుతుందే తప్ప తగ్గదు...
సాధారణంగా ఉద్రిక్త పరిస్థితులు బంగారానికి డిమాండ్‌ పెంచుతాయి. టెన్షన్లు తగ్గినప్పుడు బంగారానికి డిమాండ్‌ తగ్గుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు బంగారం నిల్వలు పెంచుకుంటున్నాయి. జర్మనీ, జపాన్‌లు అమెరికా దగ్గర దాచుకున్న తమ బంగారాన్ని వెనక్కు తెచ్చుకుంటున్నాయి. నిక్సన్‌ హయాంలో గోల్డ్‌ స్టాండర్డ్‌ తొలగిపోయింది కానీ ఇప్పుడు మళ్లీ గోల్డ్‌ స్టాండర్డ్‌ వైపు ప్రపంచం అడుగులు వేస్తోంది. డాలర్‌ నిల్వలు అనేది గతించిన చరిత్ర అని చైనా అధ్యక్షుడు అన్నారు. వెనెజులా డాలర్‌ వదిలేసి గోల్డ్‌కి పెద్దపీట వేసింది. ఇరాన్‌, రష్యాలు తమ మధ్య డాలర్‌ లేకుండా డైరెక్ట్‌ ఐపోయాయి. అలాగే చైనా, బ్రెజిల్‌ కూడా. ఇండియాకి ఇరాన్‌ డాలర్‌ లేకుండానే ముడిచమురు ఇస్తోంది. దీని అర్ధం బంగారానికి వన్నె తగ్గబోదని.
 
          అన్నింటికంటే ముఖ్యం... బంగారం ఉత్పత్తి ఏడాదికేడాది తగ్గిపోతోంది. కొత్త గనుల అన్వేషణ దాదాపుగా లేదు. గుర్తించిన గనులను తవ్వడం లాభసాటిగా లేదు. మరోవైపు అనేక రంగాలలో బంగారం వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తోంది. అంతరిక్ష ప్రయోగాలు చేయాలన్నా, స్మార్ట్‌ మొబైల్‌ ఫోన్లు తయారు చేయాలన్నా, కంప్యూటర్‌ మదర్‌ బోర్డులు తయారుచేయాలన్నా బంగారం తప్పనిసరి. ఎలక్ర్టానిక్స్‌ వస్తువుల తయారీలో ప్రతి సంవత్సరం ప్రపంచం ఉపయోగిస్తున్న బంగారం ఎంతో తెలుసా? మూడొందల టన్నులు. ఈ వినియోగం రానురాను మరింత పెరుగుతుంది. మొబైల్‌ ఫోన్‌ హ్యాండ్‌ సెట్స్‌లో వాడే గోల్డ్‌ కంప్యూటర్లలో కంటే ఎక్కువే.
 
        నానో టెక్నాలజీలో బంగారం సూక్ష్మకణాలను ఉపయోగించి కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు సైంటిస్టులు. బంగారం ఇప్పటిదాకా ఆభరణాల విలువను, ఇన్వెస్ట్‌ మెంట్‌ విలువను మాత్రమే కలిగివుంది. ఇప్పుడు మరెన్నో విధాలుగా మానవాళి అభ్యున్నతికి దోహదపడుతోంది. ఆఫ్రికా దేశాలలో మలేరియా వ్యాధిని మట్టుబెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో కూడా గోల్డ్‌ ఎంతగానో ఉపయోగపడుతోంది. మెడికల్‌ పరీక్షల్లో, వ్యాధి నిర్ధారణలో బంగారం తోడ్పడుతోంది. ఈ అంశాలన్నీ కూడా బంగారం ధరను ప్రభావితం చేసేవే. బంగారానికి బంగారు భవిష్యత్తు వుందని నిర్ధారించేవే.
బంగారం... ఎప్పటికీ బంగారమే. ఇత్తడి పుత్తడి కావచ్చు కానీ, పుత్తడి ఎన్నటికీ ఇత్తడి కాదు.
‘బంగారు’ బాబులు
బంగారం అంటే కేవలం మహిళలకే పిచ్చి అనుకుంటే మీరు పొరపడినట్లే. తులాల చొప్పున కాకుండా కిలోల కొద్దీ బంగారాన్ని ఒంటిపై ధరించే మగరాయుళ్లూ ఉన్నారు. నాసిక్‌ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు పంకజ్‌ పరఖ్‌ (47)కు బంగారు ఆభరణాలు ధరించడమంటే చాలా ఇష్టం. అతడి ఒంటిపై ఉంగరాలు, గొలుసులు, బ్రాస్లెట్‌, వాచ్‌, కళ్లజోడు, మొబైల్‌ కవర్‌ రూపంలో ఎప్పుడూ పది కిలోలకు తగ్గకుండా బంగారం ఉంటుంది. అంతేకాదు.. 4.10 కిలోల బంగారంతో (దాని విలువ 1.30 కోట్ల రూపాయలు) చొక్కా కూడా కుట్టించుకుని గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కాడు. పంకజ్‌ తన భద్రత కోసం చుట్టూ సెక్యూరిటీ గార్డులను కూడా పెట్టుకున్నాడు. పుణేకు చెందిన వ్యాపారవేత్త, గోల్డెన్‌మ్యాన్‌గా పేరొందిన దత్తాఫూగే (48)కూడా బంగారు చొక్కా కుట్టించుకుని అందరి దృష్టినాకర్షించాడు. ‘కొందరికి కార్ల పిచ్చి ఉన్నట్టే నాకు బంగారం పిచ్చి ఉంది’ అని చెప్పుకునే దత్తా ఒంటినిండా బంగారంతో కనిపించేవాడు. అయితే గత జూలైలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిని పుణే శివార్లలో హత్య చేశారు.

  • శశికళకు పన్నీర్‌ సెల్వం విస్పష్ట మద్దతు
  • ఆమెతోనే పార్టీకి భవిష్యత్తు అని ప్రకటన
  • ‘చిన్నమ్మ’ ముందు ఎమ్మెల్యేల బారులు 


‘‘అమ్మా! మీరు తప్ప మరెవ్వరూ పార్టీని నడపలేరు. ‘అమ్మ’ పార్టీని ఎలా నడిపేవారో, ఆమె వ్యూహ ప్రతివ్యూహాలు ఏంటో మీకు మాత్రమే తెలుసు. అందువల్ల మీరే పార్టీ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టండి’’ అంటూ అన్నాడీఎంకేకు చెందిన సీనియర్‌ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ‘చిన్నమ్మ’ శశికళను వేడుకున్నారు! శనివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో పోయె్‌సగార్డెనలో హైడ్రామా చోటుచేసుకుంది. అన్నాడీఎంకే నేతలంతా చిన్నమ్మ ముందు వరుసగా నిలబడి ఇక తమను పాలించమని విన్నవించుకున్నారు. దీంతో వారి మాటలను శశికళ మననంలోకి తీసుకున్నారు. మరోవైపు... ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం శనివారం రాత్రి ఆమెతో భేటీ అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘‘శశికళతోనే పార్టీకి భవిష్యత్తు. 33 ఏళ్లుగా జయలలిత వెన్నంట ఉండి... పార్టీకోసం అహరం కృషి చేశారు. సైనిక క్రమశిక్షణతో కూడిన ఆమె తీరు పార్టీ నేతలను ముందుండి నడిపిస్తుంది. ఆమెకు అండగా ఉందాం. పార్టీని విచ్ఛిన్నం చేయాలనుకునే వారి కుట్రలను తిప్పికొడదాం’’ అని అన్నా డీఎంకే శ్రేణులకు పిలుపునిచ్చారు.
 
మరోవైపు... రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల శశికళ పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. మరోపక్క, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి సీనియర్‌ నేతలైన ఎం.తంబిదురై, కేఏ సెంగోట్టయ్యనలు కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ పడ్డారు. అయితే, శనివారం వీరు మనసు మార్చేసుకోవడం గమనార్హం. పార్టీ ప్రిసీడియం చైర్మన ఇ.మధుసూదన, సీనియర్‌ నేతలైన కేఏ సెంగోట్టయ్యన, బి.వలర్మతి, గోకుల ఇందిర, సైదై దురైస్వామి తదితరులంతా పోయెస్‌గార్డెనకు వెళ్లారు. వేదనిలయం నుంచి బయటకు వచ్చిన శశికళ ముందు.. వరుసగా నిలబడిన నేతలు చేతులు జోడిస్తూ ఆమెను బతిమలాడారు. వారి మాటల్ని ఆసాంతం ఆలకించిన ఆమె తల ఊపుతూ లోపలికి వెళ్లారు. త్వరలో జరగనున్న అన్నాడీఎంకే కార్యవర్గ, సర్వసభ్య సమావేశాల్లో శశికళ పేరు ప్రకటించడం ఖాయమైపోయింది. మరోవైపు, తన బంధువులెవరూ అధికార వర్గంలో, పాలనాపరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదని శశికళ ఒక ప్రకటనలో గట్టిగా హెచ్చరించారు. కాగా, జయలలిత మరణాన్ని తట్టుకోలేక 203 మంది మరణించినట్లు పార్టీ గుర్తించింది. వారి కుటుంబాలకు 3 లక్షలు చొప్పున సాయం అందిస్తామని పార్టీ ప్రధాన కార్యాలయం పేరిట ఓ ప్రకటన విడుదలైంది.
ప్రస్తుత గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టి ..తక్కువ సమయంలోనే అనుకున్నంత డబ్బు సంపాదన లేక అడ్డదారులు తొక్కేవారిని చాలా మందని చూస్తున్నాం. అందులో భాగంగా వారిలో చాలా మంది వ్యభిచారం కేసులో పట్టుబడటం జరుగుతోంది. ఎంతో మంది ఇలాంటి కేసుల్లో ఇరుక్కుని పరువు పోగొట్టుకున్నా డబ్బు దాహంతో ఆ పనులు చేయటం ఆపటం లేదు. ఇప్పుడు మరో ఫేమస్ యాంకర్ ఇలా వ్యభిచారం కేసులో ఇరుక్కుందని తెలుస్తోంది. అయితే సీక్రెట్ గా మ్యానేజ్ చేసినట్లు వినపడుతోంది. మీడియా సర్కిల్స్ లో వినపడుతున్నదానికి బట్టి.. తెలుగు బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలకు యాంకర్గా వ్యవహరిస్తూ పలు రియాల్టీ షోలకు, పలు ఆడియో వేడుకలకు యాంకర్ గా వ్యవహరించిన ముద్దుగుమ్మ హాట్ యాంకర్ తాజాగా సెక్స్ రాకెట్ వ్యవహారంలో అడ్డంగా బుక్ అయ్యిందట.
ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా అవకాశాలు రాబట్టుకుంటున్న ఈ హాట్ యాంకర్ ఆ మద్య ఒక మేల్ యాంకర్ తో ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఒక ఫాం హౌస్ లో వ్యభిచారం జరుగుతున్నట్లుగా పక్కా సమాచారం అందండంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు నలువైపుల ఆ ఫాం హౌస్ ని చుట్టుముట్టడంతో లోపల ఉన్నవారు అంతా కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఇక ఈ యాంకర్ ఏకంగా ముగ్గురు యంగర్స్ తో రొమాన్స్ చేస్తూ పోలీసులకు కనిపించిందని చెప్పుకుంటున్నారు. అది చూసిన పోలీసులు షాక్ అయ్యారని చెప్పుకుంటున్నారు. ముగ్గురుతో రోమాన్స్ చేస్తూ పట్టుబడ్డ యాంకర్ ఎవరు అనే విషయాన్ని మాత్రం పోలీసులు వెళ్లడి చేసేందుకు నిరాకరించారని ప్రచారం జరుగుతోంది. ఆమెను అరెస్ట్ చేసి బెయిల్ వెంటనే విడిచిపెట్టారట. ఇంతకు ఆ యాంకర్ ఎవరు అయ్యి ఉంటారనే విషయం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది .