cricket ad

Sunday, 11 December 2016

జ‌య‌ల‌లిత‌కు స్లో పాయిజిన్ ఇచ్చింది ఎవ‌రు..!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జయలలిత మరణించి నాలుగు రోజులు అవుతున్నా దేశమంతా ఆమె మరణం గురించే మాట్లాడుకుంటున్నారు. జ‌య మృతికి చాలా కార‌ణాలు ఉన్నాయ‌ని, వాటిని త్వ‌ర‌లోనే భ‌య‌ట‌పెడ‌తాన‌ని జయలలిత సోదరుడి కుమార్తె దీప అన్నారు. సినీ నటి గౌతమీ కూడా జయలలిత మరణంపై ప‌లు సందేహాలు వ్య‌క్తం చేస్తూ ప్ర‌ధాన‌మంత్రి మోడీకే లేఖ రాసి సంచ‌ల‌నం సృష్టించారు.
ఇపుడు తాజాగా ఒక సంచలన వార్త బయటకొచ్చింది. 2012లో తెహెల్కా ప్రచురించిన ఒక కథనం ఆమె మరణంపై అనుమానాలు రేకెత్తిస్తుంది. అప్పట్లో శశికళ “మన్నార్ గుడి మాఫియా” అనే గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని తెహ‌ల్కా ప‌త్రిక‌లో నాలుగు సంవ‌త్స‌రాల క్రిత‌మే క‌థ‌నం వ‌చ్చింది. వీరు తెర వెన‌క చేస్తోన్న కుట్ర‌ల‌ను గ‌మ‌నించిన జ‌య‌ల‌లిత వీరంద‌రిని పోయెస్ గార్డెన్ నుండి వెళ్లగొట్టారు.అయితే శశికళ మాత్రం తాను నియమించిన నర్స్ ద్వారా ఆమెకు స్లో పాయిజన్ ఎక్కించినట్లు ఆ క‌థ‌నం పేర్కొంది. ఆమెకు నిద్రమాత్రలు, మరియు ఆమె తాగే పానీయాలు, మరియు ఆమె తినే పళ్ళు, ఇతర ఆహార పదార్థాలలో విషం ఎక్కించారని వైద్యులు చెప్పారని పేర్కొంది. జయలలిత తాను తీసుకుంటున్న మందులపై ఆమె వ్యక్తిగత వైద్యులు చేసిన పరీక్షలలో ఈ విషయం బయటపడిందని తెలిసింది.శ‌శిక‌ళ కుటుంబ స‌భ్యుల తెర‌వెన‌క దందాలు తెలుసుకున్న జ‌య‌ల‌లిత శశికళతో సహా ఆమె కుటుంబ సభ్యులందరినీ తన ఇంటి నుండి బయటకు పంపేశారు. దీంతో జయలలితను ఎలాగైనా అంతమొందించాలని శశికళ భావించారు. దాంతో మళ్ళీ శశికళ జయలలితను మంచి చేసుకుని ఆమె ఇంట్లోకి వచ్చారు. జయలలిత కూడా శశికళని తప్ప ఆమె కుటుంబ సభ్యులు ఎవరినీ తన ఇంట్లోకి రానీయలేదు. ఇపుడు ఆమె మరణం తర్వాత శశికళ కుటుంబ సభ్యులు అంతా మళ్ళీ జయ ఇంట్లో అడుగు పెట్టడం తో ఈ విషయం మళ్ళీ చర్చనీయాంశమయింది.

No comments:

Post a Comment