- శశికళకు పన్నీర్ సెల్వం విస్పష్ట మద్దతు
- ఆమెతోనే పార్టీకి భవిష్యత్తు అని ప్రకటన
- ‘చిన్నమ్మ’ ముందు ఎమ్మెల్యేల బారులు
‘‘అమ్మా! మీరు తప్ప
మరెవ్వరూ పార్టీని నడపలేరు. ‘అమ్మ’ పార్టీని ఎలా నడిపేవారో, ఆమె వ్యూహ
ప్రతివ్యూహాలు ఏంటో మీకు మాత్రమే తెలుసు. అందువల్ల మీరే పార్టీ ప్రధాన
కార్యదర్శిగా పగ్గాలు చేపట్టండి’’ అంటూ అన్నాడీఎంకేకు చెందిన సీనియర్
నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ‘చిన్నమ్మ’ శశికళను వేడుకున్నారు! శనివారం
మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో పోయె్‌సగార్డెనలో హైడ్రామా చోటుచేసుకుంది.
అన్నాడీఎంకే నేతలంతా చిన్నమ్మ ముందు వరుసగా నిలబడి ఇక తమను పాలించమని
విన్నవించుకున్నారు. దీంతో వారి మాటలను శశికళ మననంలోకి తీసుకున్నారు.
మరోవైపు... ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శనివారం రాత్రి ఆమెతో భేటీ
అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘‘శశికళతోనే పార్టీకి భవిష్యత్తు.
33 ఏళ్లుగా జయలలిత వెన్నంట ఉండి... పార్టీకోసం అహరం కృషి చేశారు. సైనిక
క్రమశిక్షణతో కూడిన ఆమె తీరు పార్టీ నేతలను ముందుండి నడిపిస్తుంది. ఆమెకు
అండగా ఉందాం. పార్టీని విచ్ఛిన్నం చేయాలనుకునే వారి కుట్రలను
తిప్పికొడదాం’’ అని అన్నా డీఎంకే శ్రేణులకు పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment