భవిష్యత్తులో తాను తమిళ రాజకీయాల్లోకి వస్తానని జయలలిత అన్న కుమార్తె , జయ మేనకోడలు దీప వెల్లడించారు. జయ
మృతిచెందాక జయ రూపాన్నే పోలిఉన్న ఆమె గురించి మీడియాలో రకరకాల
కథనాలు వచ్చాయి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన దీప పలు సంచలన
విషయాలు వెల్లడించారు.
శశికళ పన్నిన కుట్ర వల్లే తమ కుటుంబం అత్తకు దూరమైందని శనివారం ఆమె ఆరోపించారు. తన తల్లిదండ్రులు అత్తతో కలిసి పోయెస్ గార్డెన్‌లోనే ఉండేవారని, తాను అక్కడే పుట్టానని తెలిపారు. శశికళ ప్రవేశంతో పోయెస్ గార్డెన్ నుంచి బయటకు రాక తప్పలేదని పేర్కొన్నారు. అత్త అనారోగ్య సమయంలో సరైన వైద్య చికిత్సలు, సపర్యలు అందలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక అత్త అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు అపోలోకు వెళ్లినప్పుడు, అత్త సమాధి వద్ద అంజలి ఘటించేందుకు వెళ్లినప్పుడు కూడా శశికళ అవమానించారని చెప్పారు. శశికళను పార్టీ పగ్గాలు చేపట్టాలని అన్నాడీఎంకే నేతలు కోరడంపై మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి విషయాలను ప్రజల నిర్ణయానికే వదిలి వేయాలని కూడా ఆమె చెప్పారు. ఇక జయలలితే శశికళ కుటుంబ సభ్యులను పార్టీ పగ్గాలు చేపట్టాలని వస్తోన్న వార్తలను ఆమె ఖండించారు.

No comments:
Post a Comment