అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలితకు, ఆమె ఆప్తురాలు శశికళ స్లో
పాయిజన్ ఇచ్చారా ?జయలలితను చంపేందుకు శశికళ, మన్నార్ గుడి మాఫియాను
ఏర్పాటు చేసుకున్నారా? అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని
నరేంద్ర మోదీ శశికళ కుట్రల గురించి అమ్మకు ముందుగానే
హెచ్రరించారా? అంటే అవునని సమాధానమిస్తోంది తెహల్కా పత్రిక.
శశికళ స్వస్థలం మన్నార్ గుడి, ఆమె వర్గీయులను తమిళనాడులో మన్నార్ గుడి మాఫియా అంటారు. మన్నార్ గుడి మాఫియా తో కలిసి అమ్మను చంపేందుకు శశికళ కుట్ర చేసిందని తెహల్కా పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది.
జయలలితకు శశికళ నియమించిన నర్సు నిద్రమాత్రలు, కొద్ది మెతాదులో విషం కలిపిన రసాయనాలను ఇచ్చిందని కథనం వెల్లడించింది... చిన్నమ్మ శశికళను గద్దె నెక్కించేందుకు మన్నార్ గుడి మాఫియా కుట్రలు పన్నిందని, అంతఃపుర కుట్రలకు శశికళ సూత్రదారి అని కథనంలో తెలిపింది.
అంతేకాకుండా మన్నార్ గుడి మాఫియా కుట్రల గురించి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ అమ్మను ముందస్తుగా హెచ్చరించారని తెహల్కా కథనాన్ని రాసిన జీమెణ్ జాకబ్ వెల్లడించారు. ఆ తర్వాత జయలలితకు శశికళ కుట్ర గురించి తెలిసి పక్కన పెట్టిందని తెలిపింది.
జయలలిత మరణించడంతో ఆమె మృతి ఓ మిస్టరీగా మారిపోయింది. అమ్మ మృతి పై గత కొద్ది రోజులుగా అనేక అనుమానాలు వస్తున్నాయి. జయ మృతి గురించి నిజనిజాలు బయటపెట్టాలని అభిమానులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

No comments:
Post a Comment