cricket ad

Monday, 12 December 2016

బరువెక్కారని తిండి తగ్గిస్తే ప్రమాదం...!

అధిక బరువు ఉంటే స్థూలకాయం అంటారు. అలా అని తిండి తగ్గిస్తే సన్నబడిపోతారు. ఐతే ఇటీవలి కాలంలో చాలామంది జంక్ ఫుడ్ తినడంతో విపరీతంగా లావెక్కిపోతున్నారు. అవసరానికి మించిన కొవ్వు చేరిపోవడంతో పొట్టతో లావుగా కనబడుతున్నారు. ఇలా అధిక బరువు కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందువల్ల శరీరాన్ని ఎంతమేరకు లావు కావాలో అంతమేరకే ఉండేట్లు చూసుకోవాలి. అలాగని కొందరు ఉన్నట్లుండి తిండి తగ్గించేస్తారు. ఇలాంటి వారు శరీరం బరువు పెరిగిపోతోందనో లేదంటే మధుమేహాన్ని నియంత్రించాలనో అదీ కాదంటే ఇంకా సన్నబడాలనో తినే ఆహారం మోతాదును బాగా తగ్గించివేస్తారు.
 
దీనితో సన్నగా వానపాములా మారిపోతారు. చూసినవారు ఇదేంటి ఇలా అయిపోయారు అంటే బరువు తగ్గడానికి ఇలా చేస్తున్నాను అంటారు. కానీ మరీ అంతగా తిండి తగ్గించేస్తే అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు తెలుపుతున్నారు. శరీరానికి అవసరమైన మోతాదులో ఆహారం జీర్ణాశయంలో సగభాగాన్ని కమ్మేసే పరిమాణంలో తీసుకోవాలి. లేదంటే జీర్ణక్రియ బాగానే ఉన్నప్పటికీ విసర్జన క్రియ దెబ్బతింటుంది. మెల్లగా అది మిగిలిన క్రియలపైనా ప్రభావం చూపుతుంది. 
 
జీర్ణాశయంలో తగినంత ఆహారం లేకపోవడంతో ఫలితంగా ఒత్తిడి లేకపోవడంతో మలినాలు బయటికి వెళ్లడంలో తీవ్రమైన అంతరాయం కలుగుతుంది. ఈ కారణంగా కడుపు ఉబ్బరంతో పాటు తరుచూ వాయువులు విడుదల కావడం జరుగుతుంది. ఇంకా తరుచూ తలనొప్పి వంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో శరీరానికి అవసరమైన పదార్థాలను అందించాలి తప్ప సొంతగా నోరు కట్టేసుకుని బరువు తగ్గిపోయామని సంబరపడిపోతే దీర్ఘకాలంలో అది చేటు చేస్తుంది. మరీ జాగ్రత్త.




 

ఎక్మో’ అంటే ఏమిటి? అమ్మకు ఆ చికిత్స ఎందుకు చేస్తున్నారు?

హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్... ఇవి వైద్య పరిభాషలో అత్యంత ప్రాణాపాయ స్థితిని తెలిపే పదాలు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు వచ్చింది గుండెపోటు కాదని.. గుండె ఆగిందని దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారని వైద్యులు చెబుతున్నారు. అపోలో ఆస్పత్రి ప్రకటనలో కూడా హార్ట్ అటాక్ అని రాయలేదు. కార్డియాక్ అరెస్ట్ అని తెలిపారు. శరీరంలోని వివిధ భాగాలకు రక్తం సరఫరాను గుండె ఆపివేయడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తే పేషెంట్ శ్వాస తీసుకోవడం ఉండదు. స్పందనలు ఉండవు. అప్పుడు ఎక్మో అనే వైద్య యంత్రం సాయంతో రక్తం సరఫరా అయ్యేలా చేస్తారు. 
ఎక్మో(Extracorporeal membrane oxygenation-ECMO) పరికరాన్ని లైఫ్ సపోర్ట్ సిస్టమ్ గా పరిగణిస్తారు. శరీరానికి కావాల్సినంత ఆక్సిజన్ అందకున్నా, రక్త సరఫరా సక్రమంగా జరగకున్నా, రోగి ఊపిరితిత్తులు, హృదయం చేయాల్సిన పనిచేయని వేళ ఎక్మోను వాడతారు. రోగి ఎప్పుడైతే సంప్రదాయ పద్దుతులైన సీపీఆర్ కు స్పందించరో… అప్పుడు ఎక్మో పరికరాన్ని వినియోగించి, కొంత వరకూ పరిస్థితిని చెయ్యి దాటకుండా నియంత్రించవచ్చు. రక్తనాళాల్లోని రక్త సరఫరాను పర్యవేక్షిస్తూ, రక్తానికి అవసరమైన ఆక్సిజన్ ను ఈ యంత్రం అందిస్తుంది. దీన్ని వాడుతుంటే శరీరంలోని రక్త ప్రసరణ గుండె, ఊపిరితిత్తులతో సంబంధం లేకుండా జరుగుతూ ఉంటుంది. ఇక ఈ యంత్రం వాడుతూ ఒక రోగిని కొన్ని రోజులు, వారాల పాటు ప్రాణాలతో ఉంచవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. 
ఊపిరితిత్తులు పూర్తిగా పనిచేయని స్థితిలోనే ఈ ఎక్మోను వాడతారు. వైద్యులు చివరిగా చేసే ప్రయత్నమే ఇది. కొంతకాలం పాటు శరీర అవయవాలు చేయలేని పనులను చేసే యంత్రమే ఈ ఎక్మో. రోగిలో కోలుకునే శక్తి ఏమాత్రం ఉన్నా, ఈ ఎక్మో పరికరం తన వంతు సహకారాన్ని అందిస్తుందని సీనియర్ కార్డియాలజిస్టులు చెబుతున్నారు. 
తమిళనాడు సీఎం జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎనిమిది మందితో కూడిన వైద్య బృందం జయలలితకు చికిత్స అందిస్తోంది. లండన్ వైద్యుల సూచనలతో చికిత్స జరుగుతోంది. ప్రస్తుతం ఎక్మో సిస్టమ్ ద్వారా అమ్మకు వైద్యం అందిస్తున్నట్లు అపోలో జాయింట్ ఎండీ సంగీతారెడ్డి తెలిపారు. ఇదే విషయాన్ని వైద్యులు కూడా స్పష్టం చేశారు.

బ్రేకింగ్ న్యూస్..! సుప్రీంకోర్టు న్యాయవాది ఇంట్లో రూ.14 కోట్ల నగదు లభ్యం..!

పెద్దనోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా కట్టలకట్టల డబ్బు వెలుగు చూస్తోంది. ఇప్పటికే తమిళనాడుకి చెందిన ఇసుక కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి ఇంట్లో 175కోట్ల రూపాయల కరెన్సీని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు న్యాయవాది రోహిత్ టాండన్ ఇంట్లో 14 కోట్ల రూపాయల క్యాష్ లభించడం సంచలనం రేపుతోంది. ఇందులో మరో షాకింగ్ విషయం ఏంటంటే.. 2.5 కోట్లు విలువ చేసే 2వేల రూపాయల నోట్లు లభించాయి. ఢిల్లీలోని న్యాయవాది ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించగా, ఈ నగదు బయటపడింది. ఆ డబ్బుని నాలుగు ఇన్నోవా కార్లలో ఐటీ కార్యాలయానికి తరలించారు. అయితే రోహిత్ టాండన్.. ఆ డబ్బుకి లెక్కలు ఉన్నాయని చెబుతున్నారు. కొంత నగదు క్లయింట్లకి చెందినదిగా వివరిస్తున్నారు. ప్రస్తుతం న్యాయవాది రోహిత్ టాండన్ ఐటీ అధికారుల అదుపులో ఉన్నారు.

త్వ‌ర‌లోనే రూ.2వేల నోటును ప్ర‌భుత్వం ర‌ద్దు చేయ‌నుందా..? ఎందుకు ర‌ద్దు చేయాల‌నుకుంటోంది..? ర‌ద్దు చేసిన త‌ర్వాత చిన్న డినానిమినేష‌న్ నోట్ల‌ను ప్ర‌వేశ‌పెడుతుందా..? అంటే అవున‌నే స‌మాధానం చెబుతున్నారు ఆర్ఎస్ఎస్ నేత ప్ర‌ముఖ చార్ట‌ర్డ్ అకౌంటెంట్ గురుమూర్తి.
రానున్న ఐదేళ్ల‌లో రూ.2వేల నోటును ప్ర‌భుత్వం ర‌ద్దు చేస్తుంద‌ని ప‌క్కాగా చెప్పారు గురుమూర్తి. రూ.2వేల నోటును ప్ర‌భుత్వం తాత్కాలికంగా ప్ర‌వేశ‌పెట్టింద‌ని చెప్పిన ఆయ‌న‌… హ‌ఠాత్తుగా పెద్ద నోట్ల ర‌ద్దుతో ఏర్ప‌డే ఇబ్బందుల‌ను రూ.2వేల నోటుతో పూడ్చాల‌నే ఉద్దేశంతోనే కేంద్రం రూ.2వేల నోటును విడుద‌ల చేసింద‌ని చెప్పుకొచ్చారు.
చిన్న నోట్ల‌నే చ‌లామ‌ణిలో ఉంచాల‌న్న‌ది ప్ర‌భుత్వ ఆలోచ‌న‌గా ఉన్న‌ట్లు గురుమూర్తి వెల్ల‌డించారు. అత్య‌ధిక డినామినేష‌న్‌గా  రూ.500 నోటునే చ‌లామ‌ణిలో ఉంచే దిశ‌గా కేంద్రం అడుగులు వేస్తోంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఆ త‌ర్వాత రూ.250,రూ.100 నోట్ల‌ను విడుద‌ల చేస్తుంద‌ని గురుమూర్తి వివ‌రించారు.
పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నేదానిపై కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు గురుమూర్తి ద‌గ్గ‌ర నుంచి కొన్ని సూచ‌న‌లు తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం.

123w

An idiot once tweeted that I had spoken ill of the Tamilnadu fishermen. 5 years ago. I know how many people still believe that shit. Whenever I am reminded of it I wish he and the people who shared that tweet rot in hell. Or I wish they know hell on earth, each day. He never said he lied. He picked up that line from a satirical web play, and attached my name to it.


 That was busted thanks to a kind Srilankan Tamizh gentleman. He and his cronies instead believed I must be raped and cut to pieces so that I learn a lesson. Each time I tweeted about a concert he d tweet lets go and get her. The alleged 'fisherman' tweet was the final nail. I had to go the police. All his supporters came out of the woodwork. 


I wish those who believed know what it is like to be on the receiving end of an ugly rumour. I faced casteist wrath, random 'educated' doctors who dont know me at all saying I was taking 'revenge'. Stuff I ll never forget. I try. But I cant. I havent been able to let go and I realized I am no Angulimala that was blessed by Buddha to learn forgiveness.



 I remember every name. Every person. Every tweet. I'll forever carry that scar.
No one cares a damn about spreading a rumour. No one cares a damn about checking. No one. Everyone wants that 1 second of fame and a reply that goes 'OMG REALLY??!!??!?'.
Social Media is a tool that is supposed to make lives easier.


 Not worse for others.
The next time you share something harmless as UNESCO declared our Indian _______ (fill the blanks with anything about India) as the best in the world, or a piece of gossip about a filmstar you like or hate or something that can have serious repercussions on someone's life, just stop a second and see if you would like to be the subject you are sharing about.
Be responsible. Be kind.


 హైదరాబాద్‌: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తె ఈమేనంటూ గత కొన్నిరోజులుగా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో ఒక ఫొటో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న ఆమె త్వరలోనే తమిళనాడు వస్తారని, ముఖ్యమంత్రి పదవి చేపడతారని కూడా కథలల్లారు. ఫొటోలోని మహిళకు, జయలలితకు కాస్త పోలికలు ఉండటంతో ఈ వార్త నిజమేనా? అని కొందరికి అనుమానం కూడా కలిగింది. ఇది ఇప్పుడు తాజాగా జరిగిన విషయం కాదు. జయలలిత 2014లో జైలుకు వెళ్లినప్పటి నుంచీ ఈ ఫొటో చర్చనీయాంశంగా ఉంది. అయితే ఇందులో నిజం లేదని ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఫేస్‌బుక్‌ వేదికగా తేల్చి చెప్పారు. సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూ.. ఆ మహిళ కుటుంబం తన కుటుంబానికి తెలుసని పేర్కొన్నారు.
‘నవ్వు తెప్పించే ఓ వార్తకు ఈ ఫొటోను జతచేయడం చూశాను. ఈ ఫొటోలోని దంపతులు మా కుటుంబానికి తెలుసు. వారు శాస్త్రీయ సంగీత కుటుంబానికి చెందిన వ్యక్తులు. చాలా రోజులుగా ఈ పుకారు ప్రచారంలో ఉంది. ఆఖరికి గూగుల్‌ ఇమేజ్‌ సెర్చ్‌లో వెతికినా ఇదే ఫలితం కనిపిస్తోంది. వందసార్లు చెబితే అబద్ధం నిజమవుతుందన్న సామెత గుర్తొస్తోంది. దయచేసి అర్థంలేని వార్తలను షేర్‌ చేయడం ఆపండి. ఆమె మృదంగ విద్వాన్‌ వి. బాలాజీ కుటుంబానికి చెందిన వారు. ఆయన కచేరీలతో బిజీగా లేనపుడు ‘హస్‌బాన్డ్‌’ అనే వెబ్‌సిరీస్‌లో పనిచేస్తారు’ అని చిన్మయి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.
అంతేకాకుండా సామాజిక మాధ్యమాలను వాడుకోవడం విషయంలో పౌరులకు ఓ చురక కూడా అంటించారు. వాట్సాప్‌లో ఇలాంటి సమాచారాన్ని షేర్‌ చేయడానికి ఉపయోగించే సమయంలో సగం సమయాన్ని మంచి పౌరులుగా తమ ధర్మం నెరవేర్చడానికి ఉపయోగిస్తే దేశం ఇంకెంత బాగుండేదో కదా అంటున్నారు చిన్మయి.



I received these photographs attached with ridiculous 'news'.
The couple in the photograph are known to my family and they belong to an illustrious family of classical musicians.
This rumour has been propagated long enough for even google image search to return with similar results.
Like they say, repeat a lie long enough and it becomes 'truth'.
Please, please stop sharing ridiculous 'news stories' created clearly as a figment of the imagination of an unstable mind.
She belongs to the family of renowned Mridangam Vidwan V Balaji. When he is not busy with concerts he is a part of the web series called 'Husbanned'.
If people were half as interested in investing the time sharing whatsapp forwards into being better citizens, our country would be wayy better.



 Clarification regarding my sister in law being portrayed as daughter of former Chief minister Selvi J.Jayalalitha which has been in circulation for a while in social media. The person in this picture is my sister in law and we know her since her childhood and this has been annoying us for a while. Thanks to good friends like Chinmayi Sriprada and others who have done their best to clarify this in public. I request my friends and well-wishers to share this as much as possible and hence help clarify. I would request and appreciate my friends and well-wishers to share this..ur sharing is much important here. Thanks a lot.

Sunday, 11 December 2016

ట్రంప్ గెలిచినప్పటి నుంచి మార్క్ జుకర్‌బర్గ్ సంపద భారీగా తగ్గిపోయింది..

ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ సంపద  భారీగా తగ్గిపోయింది.  ట్రంప్ గెలిచినప్పటి నుంచి జుకర్బర్గ్ నికర సంపద దాదాపు 3.7 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 24వేల 939 కోట్లు తగ్గిందట. ట్రంప్ విజయంలో  ఫేస్ బుక్  పాత్ర ఉందన్న విమర్శల నేపథ్యంలోనే ఇలా జరిగిందంటున్నారు. అయితే ట్రంప్  గెలుపు తర్వాత 14మంది అమెరికన్ ధనికుల సంపద మాత్రం భారీగా పెరుగుతోందట. అత్యధికంగా వారెన్ బఫెట్ సంస్థ షేర్లు విలువ 8 శాతం పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. 

అంగరంగ వైభవంగా జరిగిన ఇషాంత్ శర్మ పెళ్లి.. ధోని హాజరు

టీమిండియా సీనియర్ ఆటగాళ్లు ఒక్కక్కరు పెళ్లిళ్లు చేసుకొని జీవితంలో సెటిల్ అయ్యిపోతున్నారు. ఇటీవలే యువరాజ్ సింగ్ ఓ ఇంటివాడైన సంగతి విధితమే.. కాగా ఇప్పుడు భారత్ ఫాస్ట్ బౌలర్ లంబూ ఇషాంత్ శర్మ తను ప్రేమించిన అమ్మాయి ప్రతిమసింగ్ తో ఏడడుగులు వేశాడు... ఢిల్లీ లో వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు ధోని, ప్రముఖ రాజకీయ నాయకులు... సినీ నటులు హాజరయ్యారు... నూతన దంపతులను ఆశీర్వదించారు. బాస్కెట్ బాల్ లో టీం"సింగ్ సిస్టర్స్" గా పేరున్న నలుగురు అక్కాచెల్లెళ్లలో ప్రతిమసింగ్ చిన్నది... ప్రతిమ నాన్నగారు జీఎస్ సింగ్ రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్... వారణాసిలో నివాసం ఉంటున్నారు..