పెద్దనోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా కట్టలకట్టల డబ్బు వెలుగు చూస్తోంది. ఇప్పటికే తమిళనాడుకి చెందిన ఇసుక కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి ఇంట్లో 175కోట్ల రూపాయల కరెన్సీని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు న్యాయవాది రోహిత్ టాండన్ ఇంట్లో 14 కోట్ల రూపాయల క్యాష్ లభించడం సంచలనం రేపుతోంది. ఇందులో మరో షాకింగ్ విషయం ఏంటంటే.. 2.5 కోట్లు విలువ చేసే 2వేల రూపాయల నోట్లు లభించాయి. ఢిల్లీలోని న్యాయవాది ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించగా, ఈ నగదు బయటపడింది. ఆ డబ్బుని నాలుగు ఇన్నోవా కార్లలో ఐటీ కార్యాలయానికి తరలించారు. అయితే రోహిత్ టాండన్.. ఆ డబ్బుకి లెక్కలు ఉన్నాయని చెబుతున్నారు. కొంత నగదు క్లయింట్లకి చెందినదిగా వివరిస్తున్నారు. ప్రస్తుతం న్యాయవాది రోహిత్ టాండన్ ఐటీ అధికారుల అదుపులో ఉన్నారు.
No comments:
Post a Comment