cricket ad

Monday 12 December 2016

HEALTH కొబ్బరి బొండాలను కూడా కల్తీ చేస్తున్నారట

కాస్త వేడి చేసిందంటే చాలు కొబ్బ‌రి నీళ్ళు తాగుతాం. జ్వరం వ‌చ్చినా, నీరసంగా ఉన్నా కొబ్బ‌రి బొండాలు కావాల్సిందే. ఏ కాలమైనా మేలు చేసేవి కొబ్బరినీళ్లు. సర్వరోగ నివారిణిగా పేరున్న కొబ్బరి నీళ్లొక్కటే కల్తీ లేకుండా దొరుకుతున్నాయని ప్రతి ఒక్కరి నమ్మకం. సీజన్‌ను బట్టి ఎంత ధర పెట్టి అయినా కొని తాగే కొబ్బరినీళ్లలో కూడా కల్తీ జరుగుతోందట. అదెలా సాధ్యం? త్వరితగతిన కొబ్బరి పిందెలు కొబ్బరి బొండాలుగా తయారుకావాలని.. వాటిని ఎగుమతి చేసుకోవాలనే తాపత్రయంలో వీటిని కూడా కల్తీ చేస్తున్నారట.
 
కొబ్బరి చెట్టు వేర్లు ఉన్నచోట తల్లి వేరును బయటకు తీసి దానిని అక్కడే కవర్లో పెట్టి దానిపై మోనోక్రోటోఫాస్ అనే కెమికల్‌ను పోసి ఆ తరువాత మట్టితో కప్పేస్తారట. ఇలా ఆ కెమికల్‌ను చెట్టుకు ఎక్కించడం ద్వారా పిందెలు త్వరితిగతిన బొండాలుగా మారతాయట. అలా తయారైన బొండాలు తాగితే గుండె, కిడ్నీ, లివర్ సమస్యలు వస్తాయని వైద్యులు అంటున్నారు. చెట్టు నుంచి వాటి కెమికల్ పూర్తిగా నశించాలంటే 40 రోజులు పడుతుందట. సో.. మనం తాగుతున్న బొండాలు కూడా ఎంత వరకు సేఫ్? గ్యారంటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అంతా మాయాప్ర‌పంచం... క‌ల్తీమ‌యం

ఎండుద్రాక్ష.. ఆరోగ్యానికి శ్రీరామరక్ష..!


రైజిన్స్... కిస్ మిస్... ఎండు ద్రాక్ష...' పేరేదైనా వీటిలో పోషకాలు మెండుగా ఉంటాయి. అందుకే చక్కగా రోజూ కాస్తంత ఎండు ద్రాక్ష తీసుకుంటే పలు రకాలైన ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
ఎండుద్రాక్ష తీసుకోవడం వల్ల కలిగే లాభాలు...
* ఎండుద్రాక్షలను తీసుకోవడం ద్వారా బరువు తగ్గడం సులభమవుతుంది.
* జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు
* వీటిల్లోని గ్లూకోజ్ శరీరానికి శక్తినిస్తుంది. రోగ నిరోధకశక్తినీ పెంచుతుంది. పైగా కొన్నే తిన్నా పొట్టనిండినట్లు అనిపిస్తుంది.
* అలాగే రోజూ ఎండుద్రాక్షలను తీసుకోవడం ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్, క్యాన్సర్ కారకాలు దూరమవుతాయి. 
* ఎండుద్రాక్షలో ఉండే క్యాల్షియం, బోరాన్ పోషకాలు ఎముకలకు బలాన్నిస్తాయి. 
* పిల్లల పెరుగుదలకు ఎంతగానో మేలు చేస్తాయి. 
* అలాగే నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలు బాధిస్తుంటే.. ఎండుద్రాక్షల్ని నోట్లో వేసుకుని ఎక్కువసేపు నములుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చిగుళ్ల సమస్యలు అదుపులోకి వస్తాయి. 
* రక్తహీనతకు చెక్ పెట్టాలంటే.. ఎండుద్రాక్షను తీసుకోవాలి. వీటిల్లోని ఇనుము, రాగి, విటమిన్ బి పోషకాలు శరీరానికి అందుతాయి. ఇవన్నీ ఎర్రరక్తకణాల వృద్ధిని పెంచడం, రక్తప్రసరణలో లోపం లేకుండా చూస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

చలికాలంలో ఇవి తినండి, ఆరోగ్యంగా ఉండండి...!

అసలే చలికాలం. ఆపై పడిపోతున్న ఉష్ణోగ్రతలు. ఇలాంటి సమయాల్లో పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలెక్కువ. అందువల్ల మనం తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. శీతాకాలంలో మన శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవటానికి శక్తిని ఇచ్చే ఆహారాలనే తినాలి. అందుకోసం.. గోధుమ..జొన్నలు..సజ్జలు..మినుముల..రాగులు..కందిపప్పు..ఇలాంటివి శరీరానికి శక్తిని అందిస్తాయి.
* రోజూ వారీ డైట్ లో తృణ ధాన్యాలు తీసుకోవాలి. పిల్లలకు తృణధాన్యాలు తప్పకుండా ఇవ్వాలి. వేరు శెనగలు, తేనెను డైట్ లో చేర్చుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
* అల్లం టీ తాగడం ద్వారా జలుబు, అసిడిటీని దూరం చేసుకోవచ్చు. కారం, చేదు, పులుపు వస్తువుల్ని మోతాదుగా తీసుకుంటూ ఉండాలి. మజ్జిగ, పెరుగు కాస్త చేర్చుకోవచ్చు.
* పరిమితంగా మాంసం, ఆవు, పాలు, నట్స్, పన్నీర్, మిల్క్, దాల్, సోయాబిన్, ఫిష్, గుడ్లు, వంటి హై-ప్రోటీన్ ఫుడ్ తీసుకోవటం వల్ల చర్మం, కీళ్ళు మొదలగు వాటిని రక్షిస్తాయి.
* శీతాకాలంలో శరీరం పొడిగా తయారవుతుంటుంది. ఈ పొడితత్వాన్ని తట్టుకొనేందుకు రోజుకు కనీసం 7-8 గ్లాసుల నీరు తాగాల్సి ఉంటుంది.
* వేడినీళ్లతో స్నానం చర్మం మరింత పొడిబారేలా చేస్తుంది. కాబట్టి గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి. చలి తక్కువగా ఉండే సమయంలో అంటే ఉదయం 7-8 గంటలకు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. నడకను ఎంచుకోవడం ఉత్తమం.
* బాదం నూనె, బాదంపొడి, అరటి ముక్కలు, గ్లిజరిన్ లేదా తేనే ఇలా ప్రతి ఒక్కటి రెండు చెంచాల మోతాదులో తీసుకోవాలి. నాలుగు టీ స్పూన్లు పాలు ఆ మిశ్రమానికి కలిపి మెత్తని గుజ్జు మాదిరి పేస్ట్ చేసి ముఖానికి, మెడకు మృదువుగా మసాజ్ చేస్తూ పట్టించి కొద్దిసేపుంచి కడిగేయాలి. ఇది పొడి చర్మానికి ఉపయోగపడుతుంది. 
* జిడ్డు చర్మం కలిగిన వారు.. రెండు టీ స్పూన్లు ఓట్ మీల్ పొడి, నాలుగు టీ స్పూన్లు మజ్జిగ, రెండు టీ స్పూన్లు గంధంపొడి కలిపి ముఖానికి, మెడకు బాగా పట్టించి, గోరువెచ్చని నీటితో కడిగేస్తే జిడ్డు చర్మం పోయి కాంతివంతంగా ఉంటుంది.

అన్ని వ్యాధులకు చికిత్స


 250 గ్రాముల మెంతులు .
* 100 గ్రాముల వాము .
* 50 గ్రాముల నల్ల జీలకర్ర . 

తయారు చేయు విధానము:

* పై మూడు పదార్థాలను శుభ్రం చేసుకోవాలి. 
* వేరు వేరుగా పెన్నం పైన వేసి కొద్దిగా వేడి చేయండి.
* మెంతులు + వాము + నల్ల జీలకర్రలని కలిపి పొడిగా తయారు చేయండి . 
* గాలి దూరని గాజు సీసాలో నిల్వ చేసుకొండి . 

వాడే విధానము : 

> ప్రతి రోజు రాత్రి భోజనం తర్వాత 1 గ్లాసు వేడి నీళ్ళలో 1 స్పూను చూర్ణం (పొడి) ని కలిపి తాగవలెను . 
> వేడి నీళ్ళ లో మాత్రమే తాగ వలెను . 
> ఈ చూర్ణం తాగిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోరాదు . 
> అన్ని వయసుల వారు స్త్రీలు , పురుషులు , వృద్దులు ఈ చూర్ణంని సేవించ వచ్చును . 
> ప్రతి రోజు ఈ చూర్ణంని సేవించడము వల్ల శరీరంలో పేరుకున్న విష పదార్ధాలు మల, మూత్ర , చెమటల ద్వార బయటకు నెట్టి వేయబడును . 
> 80 - 90 రోజులు తీసుకున్న తర్వాత మీకు ఉత్తమ ఫలితాలు రావాడాన్ని మీరు గమనించగలరు. 
> అప్పటికి అధికంగా ఉన్న కొవ్వు కూడా కరిగి పోతుంది . 
> రక్తం శుభ్రపడుతుంది . మంచి రక్తం మీ శరీరంలో ప్రవహిస్తుంది . 
> శరీరంలో ఉన్న ముడతలు తగ్గుతాయి . 
> శరీరం బలంగా, చురుకుగా మరియు ప్రకాశవంతముగా ఉండును.

ప్రయోజనాలు :

1. కీళ్ళు మరియు మోకాళ్ళ నొప్పులన్నీ పోతాయి. 
2 . ఎముకలు బలంగా తయారవుతాయి . 
3. కంటి చూపు మెరుగవుతుంది . 
4 . జుట్టు పెరుగుదలని మెరుగు పరుస్తుంది . 
5 . మల బద్దకం శాశ్వతంగా నివారించబడుతుంది.
6 . రక్త ప్రసరణని మెరుగు పరుస్తుంది . 
7 . దీర్ఘ కాలిక దగ్గు నివారించ బడును . 
8 . గుండె యొక్క పనితీరు మెరుగవుతుంది . 
9 . మీరు చలాకిగా ఉంటారు . 
10 . జ్ఞాపక శక్తి పెరుగుతుంది . 
11 . వినికిడి శక్తి పెరుగుతుంది . 
12 . గతంలో తీసుకున్న అల్లోపతిక్ మందుల సైడ్ ఎఫెక్ట్ క్లియర్ చేస్తుంది . 
13 . రక్త శుద్ది జరుగుతుంది . 
14 . అన్ని రక్తనాళాలు శుద్ధి అవుతాయి . 
15 . పళ్ళు చిగుళ్ళు బలముగా తయారవుతాయి . 
16 . మధు మేహ వ్యాధిని నియంత్రిస్తుంది . 
17 . 2 లేక 3 నెలల తరువాత ఈ ఫలితాలను గుర్తించగలరు . 

గమనిక :

నిరాటంకంగా 3 నెలలు ఈ చూర్ణం తీసుకుంటే 15 -20 రోజులు ఆపి , ఆ తర్వాత మళ్ళీ 3 నెలలు తీసుకోవచ్చు.

షుగ‌ర్ వ్యాధికి శుభం కార్డు

ప్ర‌పంచ‌ వ్యాప్తంగా షుగర్ వ్యాధి ఎంతో మందిని నానా ఇబ్బందులకు గురి చేస్తోంది. షుగ‌ర్ వ్యాధి వ‌స్తే చాలు ఎంతోమంది ఆర్థికంగామాన‌సికంగా కుంగిపోతున్నారు. షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తుల క‌ష్టాల సంగ‌తి వ‌ర్ణ‌నాతీతం. ఇక షుగర్ వ్యాధికి రోజులు చెల్లిపోయినట్లుగా భావిస్తున్నారు. అయితే షుగ‌ర్ వ్యాధికి చెక్ పెట్టే రైస్ వ‌చ్చేసింది.

తెలంగాణ‌లోని వరంగల్ రూరల్ జిల్లాలో పూర్తిగా సేంద్రీయ ఎరువులతో షుగర్ ఫ్రీ రైస్ సాగవుతోంది. వివిధ రకాల ఔష గుణాలు కలిగిన ఎరువును ఉపయోగించి ఈ రైస్‌ను సాగు చేస్తున్నారట. ఈ రైస్ వాడితే శరీరంలోని గ్లూకోజ్ లెవల్స్ తగ్గుతాయట. రైస్‌ని ఉపయోగించిన వారికి షుగర్ నుంచి చాలా మేరకు ఉపశమనం కలగడం ఖాయమని వైద్యులు పేర్కొంటున్నారు. త్వరలోనే ఈ రైస్ అందుబాటులోకి వస్తే పెద్ద సమస్య తీరినట్లేనని అభిప్రాయపడుతున్నారు

గుర‌క‌కు ఇలా చెక్ పెడ‌దాం

మ‌న కుటుంబాల‌లో చాలా మంది వ్య‌క్తులు నిద్ర‌లో గుర‌క పెట్ట‌డం మ‌నం చూస్తూనే ఉంటాం. వీరి వ‌ల్ల చాలా ఇబ్బంది ప‌డుతున్నాం అని చెప్పుకోవ‌డం వింటూనే ఉంటాం. అయినా ఏమి చేస్తాం.. వారికి గుర‌క పెడుతున్న‌ట్టు తెలియ‌దు. మ‌న‌కు చాలా ఇబ్బందిగా చిరాకు వ‌స్తుంది. మ‌న‌కు నిద్ర ప‌ట్ట‌దు. స‌మ‌స్య పెద్ద‌దిగా క‌నిపిస్తుంది. అయితే ఏమి చేయాలో తెలియ‌ని ప‌రిస్థితి ఎదుర‌వుతుంది. మీ ఇంట్లో మీరు నిద్రలో గురక పెడుతున్నారా మీ గురక వల్ల మీ ఇంట్లో వారికి అసౌకర్యంగా ఉందా… అయితే ఈ చిట్కాలు పాటించి చూడండి.

గుర‌క రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు ఇలా..

నిద్రలో గురక రావడానికి ప్రధాన కారణం మానసికపరమైన ఒత్తిడికంగారువిపరీతమైన ఆలోచనాధోరణి అని పలువురు పరిశోధకులు చెబుతున్నారు.
సమయానికి తగినట్టుగా ఆహారం తీసుకోకపోవడం కూడా మరో ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా కార్పొరేట్‌ ఉద్యోగుల్లో ఎక్కువమంది ఇలా గురక సమస్యతో బాధపడుతుంటారట. దీనికి కార‌ణం ప‌ని ఒత్తిడే అంటున్నారు.

గుర‌క స‌మ‌స్య‌ను అధికమించ‌డానికి చిట్కాలు ఇలా

ప్ర‌తిరోజూ రాత్రి నిద్ర‌పోయేముందు గుప్పెడు పచ్చి అటుకులను తింటే గురక రాకుండా కంట్రోల్ అవుతుంద‌ట‌.
అర టీ స్పోన్‌ తేనెఅర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు నోటిలో పోసుకుని బాగా పుక్కిలించాలి.
*కొద్దిగా పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ను చేతివేళ్లకు రాసుకుని వాసన చూస్తుంటే గురక తగ్గుతుంది.
ఒక గ్లాసు వేడి నీటిలో అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి నిద్ర‌పోతే మంచి ఫలితం కనిపిస్తుంది.
రాత్రి పడుకునే ముందు మరిగే నీటిలో 4, 5 చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి ఆవిరి పట్టాలి. త‌ద్వారా చాలా కంట్రోల్ అవుతుంద‌ట‌

బరువెక్కారని తిండి తగ్గిస్తే ప్రమాదం...!

అధిక బరువు ఉంటే స్థూలకాయం అంటారు. అలా అని తిండి తగ్గిస్తే సన్నబడిపోతారు. ఐతే ఇటీవలి కాలంలో చాలామంది జంక్ ఫుడ్ తినడంతో విపరీతంగా లావెక్కిపోతున్నారు. అవసరానికి మించిన కొవ్వు చేరిపోవడంతో పొట్టతో లావుగా కనబడుతున్నారు. ఇలా అధిక బరువు కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందువల్ల శరీరాన్ని ఎంతమేరకు లావు కావాలో అంతమేరకే ఉండేట్లు చూసుకోవాలి. అలాగని కొందరు ఉన్నట్లుండి తిండి తగ్గించేస్తారు. ఇలాంటి వారు శరీరం బరువు పెరిగిపోతోందనో లేదంటే మధుమేహాన్ని నియంత్రించాలనో అదీ కాదంటే ఇంకా సన్నబడాలనో తినే ఆహారం మోతాదును బాగా తగ్గించివేస్తారు.
 
దీనితో సన్నగా వానపాములా మారిపోతారు. చూసినవారు ఇదేంటి ఇలా అయిపోయారు అంటే బరువు తగ్గడానికి ఇలా చేస్తున్నాను అంటారు. కానీ మరీ అంతగా తిండి తగ్గించేస్తే అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు తెలుపుతున్నారు. శరీరానికి అవసరమైన మోతాదులో ఆహారం జీర్ణాశయంలో సగభాగాన్ని కమ్మేసే పరిమాణంలో తీసుకోవాలి. లేదంటే జీర్ణక్రియ బాగానే ఉన్నప్పటికీ విసర్జన క్రియ దెబ్బతింటుంది. మెల్లగా అది మిగిలిన క్రియలపైనా ప్రభావం చూపుతుంది. 
 
జీర్ణాశయంలో తగినంత ఆహారం లేకపోవడంతో ఫలితంగా ఒత్తిడి లేకపోవడంతో మలినాలు బయటికి వెళ్లడంలో తీవ్రమైన అంతరాయం కలుగుతుంది. ఈ కారణంగా కడుపు ఉబ్బరంతో పాటు తరుచూ వాయువులు విడుదల కావడం జరుగుతుంది. ఇంకా తరుచూ తలనొప్పి వంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో శరీరానికి అవసరమైన పదార్థాలను అందించాలి తప్ప సొంతగా నోరు కట్టేసుకుని బరువు తగ్గిపోయామని సంబరపడిపోతే దీర్ఘకాలంలో అది చేటు చేస్తుంది. మరీ జాగ్రత్త.