cricket ad

Monday, 12 December 2016

గుర‌క‌కు ఇలా చెక్ పెడ‌దాం

మ‌న కుటుంబాల‌లో చాలా మంది వ్య‌క్తులు నిద్ర‌లో గుర‌క పెట్ట‌డం మ‌నం చూస్తూనే ఉంటాం. వీరి వ‌ల్ల చాలా ఇబ్బంది ప‌డుతున్నాం అని చెప్పుకోవ‌డం వింటూనే ఉంటాం. అయినా ఏమి చేస్తాం.. వారికి గుర‌క పెడుతున్న‌ట్టు తెలియ‌దు. మ‌న‌కు చాలా ఇబ్బందిగా చిరాకు వ‌స్తుంది. మ‌న‌కు నిద్ర ప‌ట్ట‌దు. స‌మ‌స్య పెద్ద‌దిగా క‌నిపిస్తుంది. అయితే ఏమి చేయాలో తెలియ‌ని ప‌రిస్థితి ఎదుర‌వుతుంది. మీ ఇంట్లో మీరు నిద్రలో గురక పెడుతున్నారా మీ గురక వల్ల మీ ఇంట్లో వారికి అసౌకర్యంగా ఉందా… అయితే ఈ చిట్కాలు పాటించి చూడండి.

గుర‌క రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు ఇలా..

నిద్రలో గురక రావడానికి ప్రధాన కారణం మానసికపరమైన ఒత్తిడికంగారువిపరీతమైన ఆలోచనాధోరణి అని పలువురు పరిశోధకులు చెబుతున్నారు.
సమయానికి తగినట్టుగా ఆహారం తీసుకోకపోవడం కూడా మరో ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా కార్పొరేట్‌ ఉద్యోగుల్లో ఎక్కువమంది ఇలా గురక సమస్యతో బాధపడుతుంటారట. దీనికి కార‌ణం ప‌ని ఒత్తిడే అంటున్నారు.

గుర‌క స‌మ‌స్య‌ను అధికమించ‌డానికి చిట్కాలు ఇలా

ప్ర‌తిరోజూ రాత్రి నిద్ర‌పోయేముందు గుప్పెడు పచ్చి అటుకులను తింటే గురక రాకుండా కంట్రోల్ అవుతుంద‌ట‌.
అర టీ స్పోన్‌ తేనెఅర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు నోటిలో పోసుకుని బాగా పుక్కిలించాలి.
*కొద్దిగా పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ను చేతివేళ్లకు రాసుకుని వాసన చూస్తుంటే గురక తగ్గుతుంది.
ఒక గ్లాసు వేడి నీటిలో అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి నిద్ర‌పోతే మంచి ఫలితం కనిపిస్తుంది.
రాత్రి పడుకునే ముందు మరిగే నీటిలో 4, 5 చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి ఆవిరి పట్టాలి. త‌ద్వారా చాలా కంట్రోల్ అవుతుంద‌ట‌

No comments:

Post a Comment