cricket ad

Tuesday, 13 December 2016

ఆందోళనలో యాక్సిస్ బ్యాంక్ ఖాతా దారులు.. బ్యాంక్ లైసెన్స్ రద్దు చేస్తున్నారని

ఇండియా లో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ కు గురించి ఓ సంచలన వార్త వెలుగు లోకి వస్తుంది. మనీలాండరింగ్ వ్యవహారాల్లో జోక్యం కారణంగా యాక్సిస్ బ్యాంక్ లైసెన్స్ రద్దు  కానుందన్న  వార్త జాతీయ పత్రికలో వచ్చిన కథనంతో ఖాతా దారులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత నోట్ల మార్పిడిలో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డ యాక్సిస్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ప్రాంతీయ హిందీ వార్తాపత్రిక లో కథనాలు రావడం కలకలం రేపుతోంది.
ఇప్పటికే భారీ అక్రమ లావీదేవీలకారణంగా బ్యాంక్ కు చెందిన సుమారు 19 మంది ఉద్యోగులపై  వేటుపడిన నేపథ్యంలో ఈ వార్తకు మరింత ప్రాధాన్యం లభించింది. ఈ వార్తల నేపథ్యంలో సోమవారం నాటి మార్కెట్ లో యాక్సిస్ షేర్ 3 శాతం నష్టపోయింది. అయితే.. ఈ వార్తలను యాక్సిస్ బ్యాంక్ ఖండించింది. కేంద్ర బ్యాంక్ నిబంధనల ప్రకారం తాము కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని.. తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎవరో కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. అక్రమాలకు తావులేని బలమైన వ్యవస్థ, నియంత్రణలను కలిగి ఉన్నామని యాక్సిస్ బ్యాంక్ స్పష్టం చేసింది.

50 కోట్లివ్వండి లేదా ఆ సీఎంను చంపేస్తాం



50 కోట్లివ్వండి లేదా ఆ సీఎంను చంపేస్తాం

జయలలితకి చేసిన చికిత్స.. అతనికి చేస్తే 24 గంటల్లో లేచి కూర్చున్నాడు!

ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్ కు గురి కావడంతో ఆమెను బతికించడానికి ఎక్మో యంత్రంతో చికిత్స చేశారు. అయినా.. ఆ చికిత్స జయలలిత ప్రాణాలు కాపాడలేక పోయింది. అయితే.. ఇప్పుడు ఇదే చికిత్స ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కాపాడింది. 43 ఏళ్ల టెక్కీ శ్రీనాథ్ కార్డియాక్ అరెస్ట్ కు గురి కావడంతో.. హఠాత్తుగా అతని గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. వెంటనే బెంగళూరులోని నారాయణ హృదయాలయకి తరలించారు. అయితే.. వైద్యులు జయలలితకు చేసిన ఎక్మో చికిత్సను శ్రీనాథ్ కు చేశారు. 24 గంటలు తిరిగేలోపల శ్రీనాథ్ గుండెను మామూలుగా కొట్టుకునే స్థితికి తీసుకొని వచ్చారు.
తన గుండె మామూలుగా కొట్టుకునే సరికి తనకు పునర్జన్మ ఎత్తినట్టు ఉందని శ్రీనాథ్ తెలిపాడు. నారాయణ హృదయాలయ ఇప్పటివరకు 500 మందికి ఎక్మో చికిత్సను చేశారట. విషమ పరిస్థితికి గురైన గుండెను కూడా ఈ చికిత్స ద్వారా సాధారణ స్థితికి తీసుకురావచ్చని చెబుతున్నారు. ఈ చికిత్సను రెండు పరిస్థితుల్లో చేస్తారని.. ఒకటి గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు, రెండోది న్యుమోనియా లేదా గాయాల వల్ల ఊపిరితిత్తులు సరిగా పనిచేయనప్పుడు ఎక్మో ద్వారా ఈ చికిత్సను చేస్తారని చెబుతున్నారు. ఈ చికిత్సకు రూ.  3 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు ఖర్చవుతుందని.. మన దేశంలో ఎంతో మంది గుండె కొట్టుకోవడం ఆగిపోవడం ద్వారా చనిపోతున్నా.. అందరికీ ఈ చికిత్స అందుబాటులో ఉండటం లేదని తెలుస్తుంది. అయితే.. ఇదే చికిత్స జయలలితకి చేసినా ఆమె మరణించడంపై.. అపోలో డాక్టర్ లు స్పందించాల్సి ఉంది.

జయలలిత మీద అసత్య ప్రచారానికి ఆ సీనియర్ హీరోనే కారణమా?

జయలలిత జీవితంలో ఎన్నో రాటుపోట్లను ఎదుర్కొని నిలబడింది. ఆమెపై లేనిపోని ఆరోపణలు ఎన్నో వచ్చాయి. జయలలితకు, శోభన్‌ బాబుకు ఏదో సంబంధం ఉన్నదని, వాళ్లకు ఒక బిడ్డకూడా ఉందని, ఆమె హైదరాబాద్‌లో పెరుగుతున్నదని విపరీతంగా ప్రచారంలో పెట్టారు కొందరు. కాని ఇవన్నీ పచ్చి అబద్దాలని జయసుధ లాంటి సీనియర్‌ నటీమణులు కూడా చెప్పారు. జయలలిత బాగా పాపులర్‌ అయి సినీ పరిశ్రమలో వెలుగొందుతున్న రోజుల్లో శోభన్‌ బాబు ఒక చిన్న నటుడు. ఆయన అదృష్టం కొద్ది ఎన్నో ఏళ్ల తరువాత జయలలితతో ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చింది. మానవుడు-దానవుడు, వీరాభిమన్యు లాంటి సినిమాలు వచ్చేదాక ఆయనకు పెద్దగా గుర్తింపు లేదు.



ఒక సినిమా పత్రికలో శోభన్‌ బాబు తనతో నటించిన హీరోయిన్ల గురించి ఒక్కో సంచికలో ఒక్కో హీరోయిన్‌ గురించి వ్యాసాలు రాశాడు.అందులో జయలలిత గురించి రాసేటప్పుడు కొంచెం ఎక్కువగా, అంటే మూడు వారాలపాటు ఆమెతో తన అనుబంధాన్ని రాసారు. పైగా శోభన్ బాబు జయ ఇంటికి వెళ్ళినప్పుడు ఆహ్వానించిన ఫోటో, అన్నం వడ్డిస్తున్న ఫోటో, ఇలాంటివి ఫోటోలు పెట్టడంతో అందరిలో అనుమానం మొదలయ్యింది. శోభన్‌ బాబు జయలలితతో తన అనుబంధాన్ని గురించి రాసిన తీరు కూడా పాఠకులలో వాళ్ల ఇద్దరిమధ్య ఏదో ఉందన్న అనుమానాలను రేకెత్తించింది.
అసలు ఆరోజులలో మొబైల్స్ లేవు అంటే సెల్ఫీ లు లేవు. ఆరోజుల్లో ఫోటో అంటే ఫోటో గ్రాఫర్ వచ్చి తీసేవాడు. వాళ్ళిద్దరూ అంత పర్సనల్ అయితే ఎందుకు ఫోటో గ్రాఫర్ లు అందరు అక్కడ ఉంటారు, ఎందుకు అలా ఫోటోలు దిగుతారు. ఇలా అనవసరంగా ఆమె పై అసత్య ప్రచారాలు మొదలయ్యి చివరికి ఆమెకు శోభన్ బాబుకు కూతురు ఉందనే అసత్య ప్రచారం స్ట్రాంగ్ గా జరిగింది. లైఫ్ లో ఇన్ని ఎదుర్కున్న జయ ఒకవేళ నిజంగా తనకి కూతురు ఉంటె ఆమె నా కూతురు అని చెప్పి మరీ పెంచుకునే ధైర్యం ఉన్న మనషి. అంతే కానీ భయపడి ఎవ్వరికి ఇవ్వదు అని అమ్మ అభిమానులు అంటున్నారు

స్వైపింగ్ మిషన్ పొందాలంటే ఎలా..!

పెద్దనోట్ల రద్దు.. చిల్లర కష్టాలతో వ్యాపారులందరూ నగదు రహిత లావాదేవీలవైపు చూస్తున్నారు. దీంతో వ్యాపారం సులభమవుతుంది. మరి ఆ నగదు రహిత లావాదేవీలు ఎలా చేయాలి..? అనేది ఇప్పుడు చాలా మంది వ్యాపారుల మదిలో ఉన్నప్రశ్న. ఇందుకు కావాల్సిందల్లా ఈ పాస్ యంత్రం. ఓ స్మార్ట్ ఫోన్ లేదా ఒక ల్యాండ్ లైన్. ఓ బ్యాంకు ఖాతా.

ఎలా దరఖాస్తు చేయాలి.
బ్యాంకుకు వెళ్లి దీని గురించి అడిగితే అక్కడి సిబ్బందే మీ నుంచి రిక్వెస్ట్ తీసుకుంటారు. వ్యాపారం చేస్తున్నట్లు నిర్ధారించే ఏదైనా ఆధారం, వ్యక్తిగత ఐడీ, షాపు పేరుమీద అడ్రస్ ఫ్రూఫ్ వివరాలు అందించాల్సి ఉంటుంది. బ్యాంకులు మొదట కరెంట్ అకౌంట్ ఇస్తాయి. ఆ తర్వాత ఈడీఆర్ మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న వ్యాపారుల విషయంలో అన్ని రకాల ధృవీకరణ పత్రాలు లేకపోతే వారికి కొంత వెసులుబాటు ఉంటుంది. వారు వ్యక్తిగత కరెంటు అకౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఖాతాకు సదరు వ్యక్తి వివరాలు ఇస్తే చాలు. కరెంటు అకౌంట్ ఓపెన్ చేసి.. ఆ తర్వాత ఈ-పాస్ మిషన్ అందిస్తారు.

ఎంత ఖర్చవుతుంది..!
స్వైపింగ్ మిషన్ల ద్వారా చేసే లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) వసూలు చేస్తారు. ఇది బ్యాంకులకు చెందుతుంది. మిషన్ పెట్టిన బ్యాంకుకు నిర్వహణ కోసం అద్దె చెల్లించాల్సి ఉంటుంది. జీపీఆర్ఎ్సతో నడిచే మూవబుల్ ఈడీఎస్ మిషన్లకు రూ.400 నుంచి రూ.600 వరకు నెల అద్దె వసూలు చేస్తాయి. మొబైల్ సిమ్, ఇంటర్నెట్ ఛార్జీలు బ్యాంకులు భరిస్తున్నందున అద్దె ఎక్కువగా వసూలు చేస్తారు. అదే వైరు కనెక్టు చేసుకునే ఈపాస్ మిషన్ కు కొంత తక్కువ రెంట్ ఉంటుంది. రూ.150 నుంచి రూ.250 వరకు అద్దె వసూలు చేస్తారు. ఎంస్వైప్ లకు కు కొంత తక్కువ మొత్తంలో వసూలు చేస్తారు. ఎంస్వై ప్ లను కొన్ని బ్యాంకులే అందిస్తున్నాయి. ఈఛార్జీలు బ్యాంకును బట్టి, లావాదేవీల సంఖ్యను బట్టి స్వల్పంగా మారుతుంటాయి.

మరి ఎండీఆర్ ఎంత ఉంటుంది..!
ఈ నెలాఖరు వరకు (డిసెంబర్ 31 వరకు) వసూలు చేయరు. సాధారణంగా డెబిట్ కార్డులకు రూ.2వేల లోపు లావాదేవీకి 0.75 శాతం, ఆ పైన లావాదేవీకి ఒక శాతం ఎండీఆర్ ఛార్జులను బ్యాంకులు తీసుకుంటాయి. క్రెడిట్ కార్డ్ అయితే 1.25 నుంచి 1.75 శాతం వరకు ఎండీఆర్ వసూలు చేస్తారు. ఇవీ బ్యాంకులను బట్టి మారుతుంటాయి.

యంత్రం మరమ్మతులొస్తే..!
వాడే మిషన్ కు మరమ్మతులొచ్చినా…అందులో వాడే కాగితపు రోల్స్ కావాలన్నా.. సాంకేతిక సమస్యలొచ్చినా బ్యాంకే బాధ్యత తీసుకుంటుంది. చిన్న సమస్యలకు ఛార్జీలు వసూలు చేయకుండా సర్వీసు ఇస్తుంది. పెద్ద సమస్య వస్తే రూ.500 లోపు ఛార్జీలు విధిస్తుంటాయి. ప్రతి బ్యాంకుకు సంబంధిత కస్టమర్ కేర్ నంబర్లు ఉంటాయి. వాటికి ఫిర్యాదు చేస్తే వారే వచ్చి రిపేరు చేసి వెళ్తారు.

ఈ యంత్రం వద్దనుకుంటే!
మిషన్ తీసుకున్న తర్వాత దాన్ని తిరిగి బ్యాంకుకే ఇవ్వాలన్నా డీ ఇనిస్టాలేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆరు నెలలోపు అయితే రూ.500 వరకు ఛార్జీ ఉంటుంది. ఆరునెలల తర్వాత అయితే రూ.150 ఉంటుంది. ఏడాదిపైన అయితే రూ.300 వరకు ఉంటుంది. ఇవి బ్యాంకును బట్టి స్వల్ప మార్పులుంటాయి.

స్వైపింగ్ మిషన్ ఎలా పొందొచ్చు?
ఈ యంత్రాన్ని బ్యాంకులే ఇస్తాయి. బ్యాంకుల ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. విడిగా కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండదు. బ్యాంకులు కూడా అద్దె రూపంలో ఈ యంత్రాలను ఇచ్చి నగదు రహిత వ్యాపార లావాదేవీలకు అవకాశమిస్తాయి.

ఈ మిషన్ వచ్చేందుకు ఎన్ని రోజులు పడుతుంది..!
సాధారణంగా మూడు లేదా ఏడు రోజుల సమయం పడుతుంది. ఇన్నాళ్లు 10 నుంచి 15 రోజులు తీసుకునేవారు. ఇప్పుడు డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని త్వరగా ఇచ్చేందుకు అన్ని బ్యాంకులు కృషి చేస్తున్నాయి. ప్రస్తుత అవసరానికి తగిన స్థాయిలో మిషన్లు అందుబాటులో లేకపోవడంతో కొంత ఆలస్యం అవుతుంది.

ఎటువంటి మిషన్లు ఎంచుకోవాలి..!
స్వైపింగ్ యంత్రాలు(ఎలక్ర్టానిక్ డాటా కాప్చర్(ఈడీసీ)) మూడు రకాలుగా ఉంటాయి. వాటిలో ఎక్కువగా వినియోగంలో ఉన్నవి ఇంటర్నెట్ ఉన్న ల్యాండ్ ఫోన్ కనెక్షన్ ద్వారా పనిచేసేవి. ఇవి పెట్టిన చోట నుంచి కదిపేందుకు వీలుండదు. వీటికి అప్ డేట్ వర్షన్ గా మొబైల్ సిమ్ ఆధారం చేసుకుని పని చేసే కార్డ్లెస్ ఈడీఎస్ మిషన్లు వచ్చాయి.. వీటితోపాటు లేటె్స్టగా స్మార్ట్ ఫోన్ కు కనెక్టు చేసే మిషన్ లు కూడా వినియోగంలోకి వచ్చాయి. మన వ్యాపార అవసరాలకు తగిన విధంగా వీటిని ఎంచుకోవచ్చు.

మోదీ సంచలన నిర్ణయం తర్వాత దేవాలయాల్లో మాయమైన హుండీలు..!

పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డిజిటల్ లావాదేవీలు వెయ్యి శాతం పెరిగాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇందులో భాగంగానే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది స్వైపింగ్ మెషిన్ అంటున్నారు భక్తులు. దేవాలయాల్లో కార్డుతోనే కానుకలు సమర్పించేస్తున్నారు.
పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో దేశవ్యాప్తంగా ఓ రేంజ్ లో మార్పులొచ్చాయి. టెక్నాలజి గురించి తెలియని వారికి సైతం దానిపై అవగాహన వస్తోంది. ప్రస్తుతం మనుషులే కాదు దేవాలయాలు కూడా కాస్త అప్ డేట్ అవుతున్నాయి. చత్తీస్ ఘఢ్ లోని ఓ ఆలయంలో చోటు చేసుకున్న వింతను చూస్తే  షాకవ్వాల్సిందే. అక్కడి గుడికి వచ్చే భక్తులు హుండీల్లో కాకుండా స్వైపింగ్ మిషన్ లో కానుకలు సమర్పించుకుంటున్నారు. 
భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది స్వైపింగ్ మిషన్ అంటున్నారు రాయ్ పూర్ వాసులు. ఇక్కడి బంజరి దేవాలయం.. నోట్ల రద్దు ఎఫెక్ట్ తో పూర్తిగా మారిపోయింది. నిన్నమొన్నటి వరకు అక్కడి వచ్చే భక్తులకు కానుకలు హుండీలో సమర్పించుకునే వారు. అయితే ప్రధాని తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఈ ఆలయంలో హుండీల స్థానాన్ని స్వైపింగ్ మిషన్ ఆక్రమించింది. దీంతో అక్కడికి వెళుతున్నభక్తులంతా భక్తిశ్రద్ధలతోపాటు క్రెడిట్, డెబిట్ కార్డులు పట్టుకుని వెళుతున్నారు.
దేవుడి హుండీలో ఎంత కానుకలు వేయాలో అంతా ఈ స్వైపింగ్ మిషన్ లో వేస్తున్నారు. ఈ స్వైపింగ్ మిషన్ పెట్టడానికి ప్రధాన కారణం చిల్లర లేకపోవడమే అంటున్నారు అక్కడి ఆలయ అధికారులు. దీంతో హుండీ ఆదాయం తగ్గకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు.

మెరీనా బీచ్ లో అమ్మ ‘ఆత్మ’..! సమాధి వద్దే తిరుగుతోందా?

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంపై అనేక అనుమానాలున్నాయి. ఆమెది సహజమరణం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏదో కుట్రకోణం ఉందని అంతా అనుకుంటున్నారు. ఈ క్రమంలో జయలలితకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 
దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆత్మ రూపంలో కనిపిస్తున్నారట.! చెన్నైలోని మెరీనా బీచ్ లో జయ సమాధి వద్దే ఆమె ఆత్మ తిరుగుతోందని తమిళ వెబ్ సైట్లు వార్తలు రాస్తున్నాయి. అమ్మ ఆకారాన్ని పోలి ఉన్న ఆత్మ జయలలిత సమాధి సమీపంలోనే సంచరిస్తోందని తమిళ ప్రసారమాధ్యమాల్లో కథనాలు కూడా వస్తున్నాయి. 
జయలలితది సహజ మరణం కాదని, ఆమెపై విష ప్రయోగం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే, ఆమె ఆత్మగా మారిందని ఆత్మలున్నాయని నమ్మే వారు వాదిస్తున్నారు. మరికొందరైతే, జయలలితకు ప్రధాని కావాలనే కోరిక ఉండేదని, అది తీరకపోవడంతోనే ఆత్మగా మారి ఉంటుందని చెబుతున్నారు. 
మరోవైపు ఈ ఆధునిక కాలంలోనూ ఇవేం మూఢనమ్మకాలంటూ మండిపడే వాళ్లూ లేకపోలేదు. ఇది కచ్చితంగా ఫోటో షాప్ మాయాజాలమే అని వాదిస్తున్నారు. 
ఎవరి వాదనల సంగతి ఎలా ఉన్నా… ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘అమ్మ ఆత్మ’ అంటూ ఆ ఫోటో ఇప్పుడు తమిళనాట బాగా సర్క్యులేట్ అవుతోంది. జయ అభిమానులతో పాటు, అన్నాడీఎంకే కార్యకర్తలు తెగ షేర్ చేస్తున్నారు