cricket ad

Tuesday, 13 December 2016

స్వైపింగ్ మిషన్ పొందాలంటే ఎలా..!

పెద్దనోట్ల రద్దు.. చిల్లర కష్టాలతో వ్యాపారులందరూ నగదు రహిత లావాదేవీలవైపు చూస్తున్నారు. దీంతో వ్యాపారం సులభమవుతుంది. మరి ఆ నగదు రహిత లావాదేవీలు ఎలా చేయాలి..? అనేది ఇప్పుడు చాలా మంది వ్యాపారుల మదిలో ఉన్నప్రశ్న. ఇందుకు కావాల్సిందల్లా ఈ పాస్ యంత్రం. ఓ స్మార్ట్ ఫోన్ లేదా ఒక ల్యాండ్ లైన్. ఓ బ్యాంకు ఖాతా.

ఎలా దరఖాస్తు చేయాలి.
బ్యాంకుకు వెళ్లి దీని గురించి అడిగితే అక్కడి సిబ్బందే మీ నుంచి రిక్వెస్ట్ తీసుకుంటారు. వ్యాపారం చేస్తున్నట్లు నిర్ధారించే ఏదైనా ఆధారం, వ్యక్తిగత ఐడీ, షాపు పేరుమీద అడ్రస్ ఫ్రూఫ్ వివరాలు అందించాల్సి ఉంటుంది. బ్యాంకులు మొదట కరెంట్ అకౌంట్ ఇస్తాయి. ఆ తర్వాత ఈడీఆర్ మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న వ్యాపారుల విషయంలో అన్ని రకాల ధృవీకరణ పత్రాలు లేకపోతే వారికి కొంత వెసులుబాటు ఉంటుంది. వారు వ్యక్తిగత కరెంటు అకౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఖాతాకు సదరు వ్యక్తి వివరాలు ఇస్తే చాలు. కరెంటు అకౌంట్ ఓపెన్ చేసి.. ఆ తర్వాత ఈ-పాస్ మిషన్ అందిస్తారు.

ఎంత ఖర్చవుతుంది..!
స్వైపింగ్ మిషన్ల ద్వారా చేసే లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) వసూలు చేస్తారు. ఇది బ్యాంకులకు చెందుతుంది. మిషన్ పెట్టిన బ్యాంకుకు నిర్వహణ కోసం అద్దె చెల్లించాల్సి ఉంటుంది. జీపీఆర్ఎ్సతో నడిచే మూవబుల్ ఈడీఎస్ మిషన్లకు రూ.400 నుంచి రూ.600 వరకు నెల అద్దె వసూలు చేస్తాయి. మొబైల్ సిమ్, ఇంటర్నెట్ ఛార్జీలు బ్యాంకులు భరిస్తున్నందున అద్దె ఎక్కువగా వసూలు చేస్తారు. అదే వైరు కనెక్టు చేసుకునే ఈపాస్ మిషన్ కు కొంత తక్కువ రెంట్ ఉంటుంది. రూ.150 నుంచి రూ.250 వరకు అద్దె వసూలు చేస్తారు. ఎంస్వైప్ లకు కు కొంత తక్కువ మొత్తంలో వసూలు చేస్తారు. ఎంస్వై ప్ లను కొన్ని బ్యాంకులే అందిస్తున్నాయి. ఈఛార్జీలు బ్యాంకును బట్టి, లావాదేవీల సంఖ్యను బట్టి స్వల్పంగా మారుతుంటాయి.

మరి ఎండీఆర్ ఎంత ఉంటుంది..!
ఈ నెలాఖరు వరకు (డిసెంబర్ 31 వరకు) వసూలు చేయరు. సాధారణంగా డెబిట్ కార్డులకు రూ.2వేల లోపు లావాదేవీకి 0.75 శాతం, ఆ పైన లావాదేవీకి ఒక శాతం ఎండీఆర్ ఛార్జులను బ్యాంకులు తీసుకుంటాయి. క్రెడిట్ కార్డ్ అయితే 1.25 నుంచి 1.75 శాతం వరకు ఎండీఆర్ వసూలు చేస్తారు. ఇవీ బ్యాంకులను బట్టి మారుతుంటాయి.

యంత్రం మరమ్మతులొస్తే..!
వాడే మిషన్ కు మరమ్మతులొచ్చినా…అందులో వాడే కాగితపు రోల్స్ కావాలన్నా.. సాంకేతిక సమస్యలొచ్చినా బ్యాంకే బాధ్యత తీసుకుంటుంది. చిన్న సమస్యలకు ఛార్జీలు వసూలు చేయకుండా సర్వీసు ఇస్తుంది. పెద్ద సమస్య వస్తే రూ.500 లోపు ఛార్జీలు విధిస్తుంటాయి. ప్రతి బ్యాంకుకు సంబంధిత కస్టమర్ కేర్ నంబర్లు ఉంటాయి. వాటికి ఫిర్యాదు చేస్తే వారే వచ్చి రిపేరు చేసి వెళ్తారు.

ఈ యంత్రం వద్దనుకుంటే!
మిషన్ తీసుకున్న తర్వాత దాన్ని తిరిగి బ్యాంకుకే ఇవ్వాలన్నా డీ ఇనిస్టాలేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆరు నెలలోపు అయితే రూ.500 వరకు ఛార్జీ ఉంటుంది. ఆరునెలల తర్వాత అయితే రూ.150 ఉంటుంది. ఏడాదిపైన అయితే రూ.300 వరకు ఉంటుంది. ఇవి బ్యాంకును బట్టి స్వల్ప మార్పులుంటాయి.

స్వైపింగ్ మిషన్ ఎలా పొందొచ్చు?
ఈ యంత్రాన్ని బ్యాంకులే ఇస్తాయి. బ్యాంకుల ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. విడిగా కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండదు. బ్యాంకులు కూడా అద్దె రూపంలో ఈ యంత్రాలను ఇచ్చి నగదు రహిత వ్యాపార లావాదేవీలకు అవకాశమిస్తాయి.

ఈ మిషన్ వచ్చేందుకు ఎన్ని రోజులు పడుతుంది..!
సాధారణంగా మూడు లేదా ఏడు రోజుల సమయం పడుతుంది. ఇన్నాళ్లు 10 నుంచి 15 రోజులు తీసుకునేవారు. ఇప్పుడు డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని త్వరగా ఇచ్చేందుకు అన్ని బ్యాంకులు కృషి చేస్తున్నాయి. ప్రస్తుత అవసరానికి తగిన స్థాయిలో మిషన్లు అందుబాటులో లేకపోవడంతో కొంత ఆలస్యం అవుతుంది.

ఎటువంటి మిషన్లు ఎంచుకోవాలి..!
స్వైపింగ్ యంత్రాలు(ఎలక్ర్టానిక్ డాటా కాప్చర్(ఈడీసీ)) మూడు రకాలుగా ఉంటాయి. వాటిలో ఎక్కువగా వినియోగంలో ఉన్నవి ఇంటర్నెట్ ఉన్న ల్యాండ్ ఫోన్ కనెక్షన్ ద్వారా పనిచేసేవి. ఇవి పెట్టిన చోట నుంచి కదిపేందుకు వీలుండదు. వీటికి అప్ డేట్ వర్షన్ గా మొబైల్ సిమ్ ఆధారం చేసుకుని పని చేసే కార్డ్లెస్ ఈడీఎస్ మిషన్లు వచ్చాయి.. వీటితోపాటు లేటె్స్టగా స్మార్ట్ ఫోన్ కు కనెక్టు చేసే మిషన్ లు కూడా వినియోగంలోకి వచ్చాయి. మన వ్యాపార అవసరాలకు తగిన విధంగా వీటిని ఎంచుకోవచ్చు.

No comments:

Post a Comment