cricket ad

Tuesday, 13 December 2016

ఆందోళనలో యాక్సిస్ బ్యాంక్ ఖాతా దారులు.. బ్యాంక్ లైసెన్స్ రద్దు చేస్తున్నారని

ఇండియా లో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ కు గురించి ఓ సంచలన వార్త వెలుగు లోకి వస్తుంది. మనీలాండరింగ్ వ్యవహారాల్లో జోక్యం కారణంగా యాక్సిస్ బ్యాంక్ లైసెన్స్ రద్దు  కానుందన్న  వార్త జాతీయ పత్రికలో వచ్చిన కథనంతో ఖాతా దారులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత నోట్ల మార్పిడిలో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డ యాక్సిస్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ప్రాంతీయ హిందీ వార్తాపత్రిక లో కథనాలు రావడం కలకలం రేపుతోంది.
ఇప్పటికే భారీ అక్రమ లావీదేవీలకారణంగా బ్యాంక్ కు చెందిన సుమారు 19 మంది ఉద్యోగులపై  వేటుపడిన నేపథ్యంలో ఈ వార్తకు మరింత ప్రాధాన్యం లభించింది. ఈ వార్తల నేపథ్యంలో సోమవారం నాటి మార్కెట్ లో యాక్సిస్ షేర్ 3 శాతం నష్టపోయింది. అయితే.. ఈ వార్తలను యాక్సిస్ బ్యాంక్ ఖండించింది. కేంద్ర బ్యాంక్ నిబంధనల ప్రకారం తాము కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని.. తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎవరో కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. అక్రమాలకు తావులేని బలమైన వ్యవస్థ, నియంత్రణలను కలిగి ఉన్నామని యాక్సిస్ బ్యాంక్ స్పష్టం చేసింది.

No comments:

Post a Comment