cricket ad

Tuesday, 13 December 2016

మోదీ సంచలన నిర్ణయం తర్వాత దేవాలయాల్లో మాయమైన హుండీలు..!

పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డిజిటల్ లావాదేవీలు వెయ్యి శాతం పెరిగాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇందులో భాగంగానే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది స్వైపింగ్ మెషిన్ అంటున్నారు భక్తులు. దేవాలయాల్లో కార్డుతోనే కానుకలు సమర్పించేస్తున్నారు.
పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో దేశవ్యాప్తంగా ఓ రేంజ్ లో మార్పులొచ్చాయి. టెక్నాలజి గురించి తెలియని వారికి సైతం దానిపై అవగాహన వస్తోంది. ప్రస్తుతం మనుషులే కాదు దేవాలయాలు కూడా కాస్త అప్ డేట్ అవుతున్నాయి. చత్తీస్ ఘఢ్ లోని ఓ ఆలయంలో చోటు చేసుకున్న వింతను చూస్తే  షాకవ్వాల్సిందే. అక్కడి గుడికి వచ్చే భక్తులు హుండీల్లో కాకుండా స్వైపింగ్ మిషన్ లో కానుకలు సమర్పించుకుంటున్నారు. 
భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది స్వైపింగ్ మిషన్ అంటున్నారు రాయ్ పూర్ వాసులు. ఇక్కడి బంజరి దేవాలయం.. నోట్ల రద్దు ఎఫెక్ట్ తో పూర్తిగా మారిపోయింది. నిన్నమొన్నటి వరకు అక్కడి వచ్చే భక్తులకు కానుకలు హుండీలో సమర్పించుకునే వారు. అయితే ప్రధాని తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఈ ఆలయంలో హుండీల స్థానాన్ని స్వైపింగ్ మిషన్ ఆక్రమించింది. దీంతో అక్కడికి వెళుతున్నభక్తులంతా భక్తిశ్రద్ధలతోపాటు క్రెడిట్, డెబిట్ కార్డులు పట్టుకుని వెళుతున్నారు.
దేవుడి హుండీలో ఎంత కానుకలు వేయాలో అంతా ఈ స్వైపింగ్ మిషన్ లో వేస్తున్నారు. ఈ స్వైపింగ్ మిషన్ పెట్టడానికి ప్రధాన కారణం చిల్లర లేకపోవడమే అంటున్నారు అక్కడి ఆలయ అధికారులు. దీంతో హుండీ ఆదాయం తగ్గకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు.

No comments:

Post a Comment