cricket ad

Tuesday 13 December 2016

రేషమియా

సినిమా కళాకారులు విడాకుల బాట పట్టినట్లున్నారు... తాజాగా ప్రముఖ సంగీతకారుడు నటుడు హిమేష్ రేషమియా భార్య కోమల్ తో విడాకులు తీసుకొనున్నారు. వీరిద్దరూ... తమ 22 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకనున్నారు. హిమేష్ గత కొంత కాలంగా వేరే యువతితో సన్నిహితంగా ఉంటున్నాడనే కారణంతో వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్ధలు చోటు చేసుకొన్నాయి. దీంతో గత కొన్ని నెలలుగా ఇద్దరూ వేరుగా జీవిస్తున్నారు.. ఈ నేపద్యంలో బుధవారం బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేశారు. ఈ విషయంపై కోమల్ మాట్లాడుతూ... నేను హిమేష్ ఒకరినొకరం గౌరవించుకొంటాం. మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాం.. కానీ మాకు ఒకరి మీద ఒకరికి ఉన్న గౌరవం ఎప్పటికీ మారదు అని తెలిపింది......... కాగా హిమేష్ 21 ఏళ్ల వయసులో కోమల్ చేతిని అందుకొన్నాడు.. వీరిద్దరికీ ఒక కుమారుడు కూడా ఉన్నాడు. - See more at: http://www.tv5news.in/NewsDetails.aspx?ID=62515&SID=73&Title=Himesh-Reshammiya-and-wife-file-for-divorce-after-22-years-of-marriage#sthash.1Z0Jw3TA.dpuf

కొడుకులతో కలిసి పార్టీ ఎంజాయ్ చేసిన నాగ్..

అక్కినేని ఫ్యామిలీ పెళ్లి సందడి నెలకొన్నది.. నవంబర్ 9 శుక్రవారం అఖిల్ అక్కినేని, శ్రియా భూపాల్ ల నిశ్చితార్ధం అంగరంగ వైభంగా జరిగిన సంగతి విధితమే...నిశ్చితార్ధం కు కొనసాగింపుగా శనివారం రాత్రి అక్కినేని కుటుంబం పార్టీ చేసుకొన్నది... ఈ పార్టీలో అక్కినేని నాగార్జున తన కొడుకులతో కలిసి దిగిన ఓ ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.. అభిమానులతో తన ఆనందాన్ని పంచుకొన్నారు.. గుడ్ మార్నింగ్... నిన్న సాయంత్రం మా అబ్బాయిలతో చాలా గొప్పగా గడిచింది... లవ్డ్ అని కామెంట్ ను కూడా ఆ ఫోటోకి జత చేశారు.. కాగా తండ్రి కొడుకు బ్లాక్ డ్రెస్ లో సూపర్బ్ అని పించే లుక్ లో కనిపిస్తున్నారు.. కాగా నాగార్జున .. నాగచైతన్య, అఖిల్ కు తండ్రిలా కాకుండా.. అన్నలా హ్యాండ్ సంమ్ గా కనిపిస్తూ.. అభిమానులని అలరిస్తున్నారు. - See more at: http://www.tv5news.in/NewsDetails.aspx?ID=62895&SID=73&Title=Nagarjuna-Party-time-with-his-Sons-Naga-Chaitanya-and-Akhil#sthash.oeOo9r1Q.dpuf
అక్కినేని ఫ్యామిలీ పెళ్లి సందడి నెలకొన్నది.. నవంబర్ 9 శుక్రవారం అఖిల్ అక్కినేని, శ్రియా భూపాల్ ల నిశ్చితార్ధం అంగరంగ వైభంగా జరిగిన సంగతి విధితమే...నిశ్చితార్ధం కు కొనసాగింపుగా శనివారం రాత్రి అక్కినేని కుటుంబం పార్టీ చేసుకొన్నది...

ఈ పార్టీలో అక్కినేని నాగార్జున తన కొడుకులతో కలిసి దిగిన ఓ ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.. అభిమానులతో తన ఆనందాన్ని పంచుకొన్నారు.. గుడ్ మార్నింగ్... నిన్న సాయంత్రం మా అబ్బాయిలతో చాలా గొప్పగా గడిచింది... లవ్డ్ అని కామెంట్ ను కూడా ఆ ఫోటోకి జత చేశారు.. కాగా తండ్రి కొడుకు బ్లాక్ డ్రెస్ లో సూపర్బ్ అని పించే లుక్ లో కనిపిస్తున్నారు.. కాగా నాగార్జున .. నాగచైతన్య, అఖిల్ కు తండ్రిలా కాకుండా.. అన్నలా హ్యాండ్ సంమ్ గా కనిపిస్తూ.. అభిమానులని అలరిస్తున్నారు.




shared his happiness to fans posted .. .. Good morning ... yesterday evening, our boys grew too great ... Loved the comment that has been attached to the photo .. 



the son of the father appears in a look which had to be superb in black dress .. .. the Nagarjuna, Naga Chaitanya, Akhil, rather than to the father .. .. fan alaristunnaru seen as going hand samm.

ఉబెర్ బైక్‌లను ప్రారంభించిన కేసీఆర్

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఊబర్ బైక్‌లను ప్రారంభించారు.  ఇప్పటికే నగరంలో ఉబెర్ ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయి.  ఉబెర్ బైక్‌ల వల్ల నగరంలో ట్రాఫిక్ జామ్‌లు ఉండవని, కాలుష్యం కూడా తగ్గుతుందని ఆ కంపెనీ సీఈఓ ట్రావిస్ కలానిక్ ట్వీట్ చేశారు.  ఉబెర్ కంపెనీ సీఈఓ ట్రావిస్ ను సీఎం కేసీఆర్ సన్మానించారు.  - See more at: http://www.tv5news.in/newsdetails.aspx?ID=63018&SID=18&Title=KCR-launches-Uber-Bike-Taxi-Services#sthash.9jrfXtQf.dpuf

బంగారం, వెండి లాంటి విలువైన వస్తువులను ప్రసాదంగా పంచుతున్న గుడి! ఎక్కడో తెలుసా?

గుడికి వెళ్ళడం ప్రదక్షణలు చేయడం, దేవిడికి దండం పెట్టుకోవడం ఆఖరున ప్రాసాధం తీసుకుని అక్కడ ఒక నిమషం ప్రసాదం తిని రావడం ఇవన్నీ మనకు తెలిసినవే. ప్రసాదం అంటే మనకు లడ్డు, చక్కెర పొంగళి, పులిహోర ఇలాంటివి ఇస్తారని మనకు తెలుసు. కాని ఈ దేవాలయంలో లడ్డునో, చక్కెర పొంగళినో, పులిహోరనో ప్రసాదంగా ఇస్తున్నారంట.
మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ర‌త్లాం అనే న‌గ‌రంలో ఉన్న మ‌హ‌ల‌క్ష్మి దేవాల‌యాన్ని సందర్శించిన భక్తులకు బంగారం, వెండి లతో పాటు నోట్ల కట్టలను కూడా   ప్రసాదంగా ఇస్తున్నారట.! భక్తుల నుండి వచ్చిన విలువైన కానుకలను ఆలయం వారు తీసేసుకోకుండా, తిరిగి భక్తులకే ప్రసాదంగా పంచడ ఈ ఆలయం ప్రత్యేకత. దంతేరాస్ ముగిసిన మరుసటి రోజు నుండి బంగారం, వెండి లాంటి విలువైన వస్తువులను దేవీ దర్శనం చేసుకున్న భక్తులకు ప్రసాదంగా పంచిపెడుతుంటారు.

కోట్ల కొద్దీ కొత్త నోట్లు

  • సుప్రీం లాయర్‌ ఇంట్లో 14 కోట్లు
  • ఐటీ దాడుల్లో 33 కోట్ల ఆస్తులు లభ్యం
  • స్వచ్ఛంద వెల్లడి రూ.125 కోట్లు
  • 100 కోట్లతో ఇటీవలే కొడుకు పెళ్లి
  • గత ఏడాదే వంద కోట్ల ఇల్లు కొనుగోలు
  • అగస్టా నిందితులతో సంబంధాలు
 న్యూఢిల్లీ, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): రోహిత టాండన్‌ దేశంలోకెల్లా సంపన్నుడైన సుప్రీంకోర్టు న్యాయవాది. జీవితంలో ఒక్క కేసు వాదించింది లేదు. తాను పెట్టిన టీ అండ్‌ టీ న్యాయవాద కంపెనీ ద్వారా కార్పొరేట్‌ సంస్థల అధిపతులకు ప్రఖ్యాత న్యాయవాదుల్ని సమకూర్చడం, విదేశీ ఆయుధ కంపెనీలకు, రాజకీయ నాయకులకు మధ్య చీకటి ఒప్పందాలు కుదర్చడం.. ఇవీ ఆయన చేసే పనులు. అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల స్కాం నిందితులు అభిషేక్‌ వర్మ, గౌతమ్‌ ఖైతాన్‌లతో సంబంధాలు బయట పడటంతో అప్పటి దాకా పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న ఆయనకు కష్టాలు ఒక్కసారిగా మొదలయ్యాయి. అక్టోబరు 6 నుంచి ఆదాయపు పన్ను శాఖ ఆయన వెంట పడింది. రెండు నెలల్లో ఆయన ఇళ్లు, ఆఫీసులపై మూడు సార్లు దాడులు జరిగితే ప్రతీసారీ కోట్లకు కోట్లు నగదు, ఆస్తులు, డిపాజిట్లు బయటపడ్డాయి. ఇరవై రోజుల కింద ఒక ఇంటిపై ఐటీ అధికారులు దాడిచేస్తే రూ.కోటి దొరికాయి. తాజాగా అదే ఇంట్లో రూ.14 కోట్లు తీసుకొచ్చి దాచగల ధైర్యం టాండన్‌కే సొంతం. టాండన్‌ గత ఏడాదే వంద కోట్లు పెట్టి ఢిల్లీలో ఇల్లు కొన్నాడు. మరో వంద కోట్ల ఖర్చుతో కొడుకు పెళ్లి చేశాడు. రెండు నెలల క్రితం ఐటీ దాడుల్లో అడ్డంగా దొరికి పోవడంతో రూ.125 కోట్ల అక్రమ ఆస్తులను వెల్లడించాడు. ఇంకా ఆయన దగ్గర వందల కోట్లు మూలుగుతున్నాయి.
 
ఢిల్లీలో ఆయనకు అనేక ఇళ్లున్నాయి. వాటిల్లో జనం ఎవరూ ఉండరు. డబ్బులు దాచిపెట్టే గోదాములుగా ఉపయోగిస్తారు. శనివారం నుంచి ఆయన ఇళ్లు, ఆఫీసులపై మరో దఫా దాడులు జరిగాయి. ఈ సందర్భంగా దొరికిన సొమ్మును మెషీన్లతో లెక్క పెట్టడానికే రెండు రోజులు పట్టింది. టాండన్‌ ఇంటిపై ఐటీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించి వివిధ చోట్ల దాచిన రూ.14 కోట్ల నగదును, అత్యంత విలువైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నగదులో రెండు వేల కొత్త నోట్లు రూ.2.6 కోట్లు ఉన్నాయి. పాత వెయ్యి నోట్ల రూపంలో రూ.7 కోట్లు, వంద నోట్ల రూపంలో రూ.3 కోట్లు, మిగిలినవి రూ.50 నోట్లు ఉన్నాయి. రెండు నెలల క్రితం ఐటీ నోటీసులిచ్చి సోదాలు చేసినపుడు రూ.19 కోట్ల విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల పత్రాలు లభించాయి.
 
ఇతర ఆస్తులూ వెలుగులోకి రావడంతో రూ.125 కోట్లు స్వచ్ఛందంగా బయట పెట్టారు. ఇక తన జోలికి రారులే అనుకున్నారు. పలుచోట్ల దాచిన పాతనోట్ల పాతరలు తెరిచి నోట్ల మార్పిడికి సిద్ధపడ్డారు. విషయం తెలిసి ఐటీ అధికారులు కాపేశారు. ఆదివారం రాత్రి గ్రేటర్‌ కైలా్‌షలోని ఆయన ఇంటికి పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయని ఆకాశరామన్న ఇచ్చిన సమాచారంతో మళ్లీ దాడులు నిర్వహించారు. 14 కోట్ల నగదుకు కేవలం ఇంటి నౌకరు కాపలాగా ఉన్నాడు. టాండన్‌ నుంచి ఇప్పటి వరకూ రూ.33 కోట్ల విలువైన ఆస్తులు, నగదును స్వాధీనం చేసుకున్నారు. టాండన్‌కు దుబాయిలో, ఢిల్లీ చుట్టుపక్కల అనేక ఖరీదైన ఇళ్లు ఉన్నాయి. 18 బ్యాంకు ఖాతాలున్నాయి.
 
లైవ్‌లో ఐటీ సోదాలు
సెల్‌ఫోన్లో వీక్షించిన టాండన్‌
సుప్రీంకోర్టు న్యాయవాది రోహిత టాండన్‌కు చెందిన టీ అండ్‌ టీ కార్యాలయంపై శనివారం రాత్రి ఐటీ అధికారులు దాడి చేసినపుడు మొత్తం సోదాలను ఆయన లైవ్‌లో చూశారు. టాండన్‌ ఇళ్లు, ఆఫీసుల్లో ఏ స్విచ్‌ వేసినా ఆయన సెల్‌ఫోన్లో ఎలర్ట్‌ వస్తుంది. వెంటనే సంబంధిత ఇంటి సీసీటీవీ కెమెరాలను ఆన్‌ చేసుకొని తన ఐఫోన్లో లైవ్‌ చూడగలరు. అలాంటి సాంకేతిక ఏర్పాట్లతో ఉన్న రోహిత టాండన్‌ సోదాలు పూర్తయ్యే వరకు లైవ్‌లో చూస్తూ దరిదాపుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు.
 

ఆందోళనలో యాక్సిస్ బ్యాంక్ ఖాతా దారులు.. బ్యాంక్ లైసెన్స్ రద్దు చేస్తున్నారని

ఇండియా లో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ కు గురించి ఓ సంచలన వార్త వెలుగు లోకి వస్తుంది. మనీలాండరింగ్ వ్యవహారాల్లో జోక్యం కారణంగా యాక్సిస్ బ్యాంక్ లైసెన్స్ రద్దు  కానుందన్న  వార్త జాతీయ పత్రికలో వచ్చిన కథనంతో ఖాతా దారులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత నోట్ల మార్పిడిలో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డ యాక్సిస్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ప్రాంతీయ హిందీ వార్తాపత్రిక లో కథనాలు రావడం కలకలం రేపుతోంది.
ఇప్పటికే భారీ అక్రమ లావీదేవీలకారణంగా బ్యాంక్ కు చెందిన సుమారు 19 మంది ఉద్యోగులపై  వేటుపడిన నేపథ్యంలో ఈ వార్తకు మరింత ప్రాధాన్యం లభించింది. ఈ వార్తల నేపథ్యంలో సోమవారం నాటి మార్కెట్ లో యాక్సిస్ షేర్ 3 శాతం నష్టపోయింది. అయితే.. ఈ వార్తలను యాక్సిస్ బ్యాంక్ ఖండించింది. కేంద్ర బ్యాంక్ నిబంధనల ప్రకారం తాము కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని.. తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎవరో కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. అక్రమాలకు తావులేని బలమైన వ్యవస్థ, నియంత్రణలను కలిగి ఉన్నామని యాక్సిస్ బ్యాంక్ స్పష్టం చేసింది.

50 కోట్లివ్వండి లేదా ఆ సీఎంను చంపేస్తాం



50 కోట్లివ్వండి లేదా ఆ సీఎంను చంపేస్తాం