cricket ad

Tuesday, 13 December 2016

రేషమియా

సినిమా కళాకారులు విడాకుల బాట పట్టినట్లున్నారు... తాజాగా ప్రముఖ సంగీతకారుడు నటుడు హిమేష్ రేషమియా భార్య కోమల్ తో విడాకులు తీసుకొనున్నారు. వీరిద్దరూ... తమ 22 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకనున్నారు. హిమేష్ గత కొంత కాలంగా వేరే యువతితో సన్నిహితంగా ఉంటున్నాడనే కారణంతో వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్ధలు చోటు చేసుకొన్నాయి. దీంతో గత కొన్ని నెలలుగా ఇద్దరూ వేరుగా జీవిస్తున్నారు.. ఈ నేపద్యంలో బుధవారం బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేశారు. ఈ విషయంపై కోమల్ మాట్లాడుతూ... నేను హిమేష్ ఒకరినొకరం గౌరవించుకొంటాం. మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాం.. కానీ మాకు ఒకరి మీద ఒకరికి ఉన్న గౌరవం ఎప్పటికీ మారదు అని తెలిపింది......... కాగా హిమేష్ 21 ఏళ్ల వయసులో కోమల్ చేతిని అందుకొన్నాడు.. వీరిద్దరికీ ఒక కుమారుడు కూడా ఉన్నాడు. - See more at: http://www.tv5news.in/NewsDetails.aspx?ID=62515&SID=73&Title=Himesh-Reshammiya-and-wife-file-for-divorce-after-22-years-of-marriage#sthash.1Z0Jw3TA.dpuf

No comments:

Post a Comment