cricket ad

Thursday 15 December 2016

ఆన్‌లైన్ లావాదేవీలు జరపండి.. రూ.340 కోట్లు గెలుచుకోండి

ఆన్‌లైన్ లావాదేవీలు ప్రోత్సహించేందుకు డబ్బులు గెలుచుకునే రెండు లక్కీ డ్రా పథకాలను కేంద్రం గురువారం ప్రకటించింది. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఈ స్కీమ్స్ వివరాలు వెల్లడించారు. వినియోగదారుల కోసం లక్కీ గ్రాహక్ యోజన, వ్యాపారుల కోసం డిజీధన్ వ్యాపారీ యోజన పథకాలు డిసెంబర్ 25న ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.
డిసెంబర్ 25 నుంచి ఏప్రిల్ 14 వరకు సుమారు వంద రోజుల పాటు జరిపే డిజిటల్ లావాదేవీల్లో సుమారు రూ.340 కోట్లు గెలుచుకునే అవకాశముంది. కనిష్టంగా రూ.50 నుంచి గరిష్టంగా రూ.3000 వరకు జరిపే ఆన్‌లైన్ లావాదేవీలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. రోజువారి, వారం, మెగా అవార్డుల కేటగిరీల వారీగా సుమారు రూ.కోటి వరకు నగదు బహుమతులు గెలుచుకోవచ్చు.


వినియోగదారుల లక్కీ డ్రా కింద రోజుకు 15 వేల మందికి రూ.1000 చొప్పున వంద రోజులపాటు చెల్లిస్తారు. వీక్లీ డ్రాలో రూ.7000 నుంచి సుమారు లక్ష వరకు గెలుచుకునే అవకాశముంది. ఏప్రిల్ 14న నిర్వహించే మెగా డ్రాలో మొదటి బహుమతిగా కోటి రూపాయలు, రెండో బహుమతిగా రూ.50 లక్షలు, మూడో బహుమతిగా రూ.25 లక్షలు చెల్లిస్తారు.
 
వ్యాపారులకు వీక్లీ, మెగా లక్కీ డ్రాలు మాత్రమే వర్తస్తాయి. వీక్లీ డ్రాలో రూ.7000 నుంచి రూ.50,000 వరకు గెలుచుకునే అవకాశముంది. ఏప్రిల్ 14న నిర్వహించే మెగా అవార్డ్స్‌లో మొదటి బహుమతిగా రూ.50 లక్షలు, రెండో బహుమతిగా రూ.25 లక్షలు, మూడో బహుమతిగా రూ.5 లక్షలు చెల్లిస్తారు.
 
ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దుపై ప్రకటన చేసిన 2016 నవంబర్ 8 నుంచి 2017 ఏప్రిల్ 14 వరకు జరిపే ఆన్‌లైన్ లావాదేవీలను లెక్కలోకి తీసుకుంటారు. ఈ పథకాలను ప్రారంభించే డిసెంబర్ 25న తొలి లక్కీ డ్రా నిర్వహిస్తారు.

100 కోట్ల యాహూ యూజర్ల సమాచారం చోరీ

యాహూకు మరో ఎదురు దెబ్బ తగిలింది. 2013 ఆగస్టులో 100 కోట్ల యూజర్ల అకౌంట్లు హ్యాక్ అయ్యాయని యాహూ ప్రకటించింది. 50 కోట్ల యూజర్ల అకౌంట్ల డేటా చోరీకి గురైనట్లు సెప్టెంబరులో యాహూ ప్రకటించింది. ఈ రెండు సంఘటనలు వేర్వేరని తాజాగా పేర్కొంది. దీంతో యాహూ మరిన్ని కష్టాల్లోకి జారుకుంది. యాహూ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ బాబ్ లార్డ్ ఓ ప్రకటనలో ‘‘ఈ చోరీకి సంబంధించిన చొరబాటు ఎలా జరిగిందో గుర్తించలేకపోతున్నాం’’ అని పేర్కొన్నారు. యూజర్ల పేర్లు, ఈ-మెయిల్ చిరునామాలు, టెలిఫోన్ నంబర్లు, పుట్టిన తేదీలు, హాష్‌డ్ పాస్‌వర్డ్‌లు, ఇతరులు గుర్తించకుండా గుప్తంగా ఉంచిన (ఎన్‌క్రిప్టెడ్) లేదా గుప్తంగా ఉంచని ప్రశ్నలు, జవాబులు చోరీకి గురైనట్లు తెలిపారు.
 
లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు యాహూకు ఈ సమాచారాన్ని అందజేశారు. అనంతరం డేటాను యాహూ బయటి ఫోరెన్సిక్ నిపుణులతో పరీక్షించింది. చెల్లింపుల వివరాలు, ప్లెయిన్ టెక్స్ట్ పాస్‌వర్డ్‌లు చోరీకి గురి కానట్లు కనిపిస్తోందని యాహూ పేర్కొంది. దీనినిబట్టి ఎండీ5 ఆల్గోరిథమ్ ఇకపై సురక్షితం కాదని వెల్లడవుతోందని, ఎండీ5 హ్యాష్‌లను సులువుగా ఆన్‌లైన్‌లో చూడటానికి వీలవుతోందని, పాస్‌వర్డ్‌లను తేలిగ్గా తెలుసుకోగలుగుతున్నారని నిపుణులు చెప్తున్నారు.
 
హ్యాకింగ్‌లో ప్రభుత్వ ప్రాయోజిత వర్గాల ప్రమేయం ఉండవచ్చునని విశ్వసిస్తున్నట్లు లార్డ్ చెప్పారు. యాహూ ప్రొప్రయిటరీ కోడ్‌ను ఓ హ్యాకర్ తెలుసుకోగలిగినట్లు తెలిపారు. కుకీలను ఫోర్జరీ చేసేందుకు ఆ కోడ్‌ను ఉపయోగించినట్లు, ఆ కుకీల ద్వారా అకౌంట్లను పాస్‌వర్డ్ లేకుండానే యాక్సెస్ చేసేందుకు ఉపయోగించినట్లు వివరించారు. హ్యాకింగ్ ప్రభావం పడిన అకౌంట్లను తాము గుర్తించామని, ఫోర్జరీ చేసిన కుకీలను పని చేయకుండా చేశామని తెలిపారు.
 
యాహూను చాలా కాలం నుంచి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి. 50 కోట్ల యూజర్ల అకౌంట్లు హ్యాక్ అయినట్లు యాహూ సిబ్బందికి 2014లోనే తెలుసునని సమాచారం. కానీ హ్యాక్‌కు గురైన విషయాన్ని యాహూ ఈ ఏడాది సెప్టెంబరులో మాత్రమే ప్రకటించింది. యాహూను వెరిజాన్ కొనుగోలు చేస్తోంది. ఒప్పందం కుదిరిన కొన్ని నెలల వరకు మొదట జరిగిన హ్యాకింగ్ సమాచారాన్ని యాహూ బయటపెట్టలేదు. యాహూను 4.83 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు జూలైలో వెరిజాన్ ఒప్పందం కుదుర్చుకుంది. రెండుసార్లు హ్యాకింగ్‌కు గురైనట్లు స్వయంగా యాహూ వెల్లడించడంతో ఇప్పుడు వెరిజాన్ మరోసారి బేరసారాలకు దిగుతోందని సమాచారం. 1 బిలియన్ డాలర్లు డిస్కౌంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రధాని నరేంద్రమోదీ కలల బండి ‘హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్’ రేపు పట్టాలెక్కబోతోంది. ఎన్నికల సమయంలో మోదీ ఈ రైలు గురించి హామీ ఇచ్చారు. ఈ రైలు ‘గతిమాన్’,‘టాల్గో’ రైళ్లలా వేగంగా పరుగులు తీయలేదు కానీ అంతకుమించిన ప్రత్యేకతలు దీనిసొంతం. అయితే ప్రస్తుతం ఉన్న రైళ్లలోని ఏసీ-3 టయర్ కంటే మెరుగైన అనుభూతిని మాత్రం సామాన్య ప్రయాణికులకు అందిస్తుంది. ఈ ఏడాది ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఈ రైలును ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైలును రేపు(శుక్రవారం) జెండా ఊపి రైలును ప్రారంభించనున్నారు. ఒక్కో దాంట్లో 72 సీట్లు చొప్పున 16 కోచ్‌లు ఈ రైలులో ఉన్నాయి. ఘజియాబాద్‌లోని ఆనంద్‌విహార్ నుంచి గోరఖ్‌పూర్ మధ్య నడవనుంది. చిప్యానా బుజుర్గ్, గోండా, కాన్పూర్ సెంట్రల్, లక్నో(ఎన్ఆర్), బరాబంకి, బస్తి, స్టేషన్లలో ఆగుతూ 13 గంటల్లో గమ్యాన్ని చేరుకుంటుంది. ఇతర ఏసీ-3 టయర్ కోచ్‌లతో పోలిస్తే హమ్‌సఫర్‌లో చార్జీలు 15శాతం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సాధారణ ప్రయాణికులకు కూడా లగ్జరీ అనుభవం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ రైలులో అడుగుపెట్టిన మరుక్షణం ప్రయాణికుల మూడ్ పూర్తిగా మారిపోతుంది. ఆహ్లాదకరమైన రంగులతో ఆకట్టుకుంటుంది. బెర్త్‌ల మధ్య అన్‌బ్రేకబుల్ మిర్రర్స్ ఏర్పాటు చేశారు. మంటలు, పొగను గుర్తించే సెన్సార్లను కూడా అమర్చారు. కాబట్టి ఇతర రైళ్లతో పోలిస్తే ఈ రైలులో ప్రయాణం పూర్తిగా సురక్షితం. మోదీ స్వచ్ఛభారత్ లక్ష్యానికి అనుగుణంగా రైలును తీర్చిదిద్దారు. బయోటాయిలెట్లు, వాసన నియంత్రణ వ్యవస్థ, ఎక్కడికక్కడ చెత్తవేసుకునే బకెట్లు ఏర్పాటు చేశారు. అంతేకాదు మనకి మనమే టీ, కాఫీ, సూప్ తయారుచేసుకునే వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు. ఒకవేళ మనం ఇంటి నుంచి ఆహారం తెచ్చుకుంటే కావాలనుకుంటే వేడి చేసుకునే ఏర్పాట్లతోపాటు కూలింగ్ చేసుకునే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. హీటింగ్ చాంబర్‌, రిఫ్రిజిరేషన్ బాక్స్ కూడా రైలులో ఉంది. ‘హమ్‌సఫర్’ రైలులో మొదటి ఆరు నెలలు రైల్వే సిబ్బంది, సీనియర్ సిటిజన్లు, కేన్సర్ రోగులకు ఎటువంటి రాయితీలు ఉండవు.

ప్రధాని నరేంద్రమోదీ కలల బండి ‘హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్’ రేపు పట్టాలెక్కబోతోంది. ఎన్నికల సమయంలో మోదీ ఈ రైలు గురించి హామీ ఇచ్చారు. ఈ రైలు ‘గతిమాన్’,‘టాల్గో’ రైళ్లలా వేగంగా పరుగులు తీయలేదు కానీ అంతకుమించిన ప్రత్యేకతలు దీనిసొంతం. అయితే ప్రస్తుతం ఉన్న రైళ్లలోని ఏసీ-3 టయర్ కంటే మెరుగైన అనుభూతిని మాత్రం సామాన్య ప్రయాణికులకు అందిస్తుంది.
 
ఈ ఏడాది ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఈ రైలును ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైలును రేపు(శుక్రవారం) జెండా ఊపి రైలును ప్రారంభించనున్నారు. ఒక్కో దాంట్లో 72 సీట్లు చొప్పున 16 కోచ్‌లు ఈ రైలులో ఉన్నాయి. ఘజియాబాద్‌లోని ఆనంద్‌విహార్ నుంచి గోరఖ్‌పూర్ మధ్య నడవనుంది. చిప్యానా బుజుర్గ్, గోండా, కాన్పూర్ సెంట్రల్, లక్నో(ఎన్ఆర్), బరాబంకి, బస్తి, స్టేషన్లలో ఆగుతూ 13 గంటల్లో గమ్యాన్ని చేరుకుంటుంది. ఇతర ఏసీ-3 టయర్ కోచ్‌లతో పోలిస్తే హమ్‌సఫర్‌లో చార్జీలు 15శాతం ఎక్కువ ఉండే అవకాశం ఉంది.
 
సాధారణ ప్రయాణికులకు కూడా లగ్జరీ అనుభవం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ రైలులో అడుగుపెట్టిన మరుక్షణం ప్రయాణికుల మూడ్ పూర్తిగా మారిపోతుంది. ఆహ్లాదకరమైన రంగులతో ఆకట్టుకుంటుంది. బెర్త్‌ల మధ్య అన్‌బ్రేకబుల్ మిర్రర్స్ ఏర్పాటు చేశారు. మంటలు, పొగను గుర్తించే సెన్సార్లను కూడా అమర్చారు. కాబట్టి ఇతర రైళ్లతో పోలిస్తే ఈ రైలులో ప్రయాణం పూర్తిగా సురక్షితం. మోదీ స్వచ్ఛభారత్ లక్ష్యానికి అనుగుణంగా రైలును తీర్చిదిద్దారు. బయోటాయిలెట్లు, వాసన నియంత్రణ వ్యవస్థ, ఎక్కడికక్కడ చెత్తవేసుకునే బకెట్లు ఏర్పాటు చేశారు. అంతేకాదు మనకి మనమే టీ, కాఫీ, సూప్ తయారుచేసుకునే వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు. ఒకవేళ మనం ఇంటి నుంచి ఆహారం తెచ్చుకుంటే కావాలనుకుంటే వేడి చేసుకునే ఏర్పాట్లతోపాటు కూలింగ్ చేసుకునే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. హీటింగ్ చాంబర్‌, రిఫ్రిజిరేషన్ బాక్స్ కూడా రైలులో ఉంది. ‘హమ్‌సఫర్’ రైలులో మొదటి ఆరు నెలలు రైల్వే సిబ్బంది, సీనియర్ సిటిజన్లు, కేన్సర్ రోగులకు ఎటువంటి రాయితీలు ఉండవు.

బీజేపీ నేతలకు పవన్ సూటి ప్రశ్న..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవధ అంశంపై చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీఫ్‌ను ఎందుకు నిషేధించలేదని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఇప్పటికే పలుమార్లు బహిరంగ సభల్లో తీవ్ర విమర్శలు గుప్పించిన పవన్ బీజేపీపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవధ, రోహిత్‌ వేముల, దేశభక్తి, నోట్ల రద్దు, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలపై ప్రశ్నించనున్నట్లు పవన్ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. ఇకపై రోజుకో అంశంపై స్పందిస్తానని పవన్‌ స్పష్టం చేశారు. శుక్రవారం రోజున రోహిత్‌ వేముల అంశంపై స్పందిస్తానని ట్విట్టర్‌లో జనసేన అధినేత పవన్‌ వెల్లడించారు. దీంతో పవన్ అభిమానుల్లో, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ ఆ పని చేయట్లేదన్న విమర్శలకు చెక్ పెట్టినట్లయింది. ఇప్పుడు పవన్ అసలు రూట్‌లోకి వచ్చారని రాజకీయ నిపుణులు చెప్పుకుంటున్నారు.

ఉధృతంగా రూ 500 నోట్ల ముద్రణ

త్వరలో 80 వేల కోట్ల వంద రూపాయల నోట్లు మార్కెట్లోకి వస్తాయని కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు. ఐదొందల రూపాయల నోట్ల ముద్రణ ఉధృతం చేసినట్లు చెప్పారు. డిసెంబర్ 30 కల్లా ఐదొందల రూపాయల నోట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. రెండు మూడు వారాల్లో దేశవ్యాప్తంగా 50 శాతం కరెన్సీ వస్తుందన్నారు. బ్యాంకులు ఏటీఎంలలో సరిపడా క్యాష్ పెట్టాలనే ఆదేశాలు జారీ చేసినట్లు దాస్ తెలిపారు. దేశంలో ఉన్న 2 లక్షలా 10 వేల ఏటీఎంలలో లక్షకు పైగా ఏటీఎంలను అప్‌గ్రేడ్ చేసినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకులకు, సహకార బ్యాంకులకు పెద్ద మొత్తంలో నగదు పంపినట్లు తెలిపారు. 500, రెండు వేల రూపాయల నోట్లను దేశంలోనే తొలిసారిగా డిజైన్ చేసినట్లు దాస్ వెల్లడించారు. మారుమూల గ్రామాలకు నగదు సరఫరా చేసేందుకు విమానాలను వాడుతున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఐటీ దాడుల్లో పట్టుబడుతున్న నోట్లను తిరిగి బ్యాంకులకు తరలిస్తున్నామని శక్తికాంతదాస్ వెల్లడించారు.

ముగ్గురితో సెక్స్ చేస్తూ దొరికిన తెలుగు యాంక‌ర్‌

ఆడియో వేడుకలకు, బుల్లితెరపై పలు ప్రోగ్రామ్స్ కి ప్రస్తుతం హోస్ట్‌గా చేస్తున్న ఓ ఫేమ‌స్ యాంకర్ వ్య‌భిచారం కేసులో అడ్డంగా బుక్ అయ్యింది. ఇలా డబ్బు సంపాదించాలనే ఆశతో అడ్డదారులు తొక్కిన ప్రముఖ సెలెబ్రిటీలు చాలామందే పరిశ్రమలో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆ ఫేమ‌స్ యాంక‌ర్ ఇప్ప‌టికే ఎంతో డ‌బ్బు సంపాదిస్తూ ఉండ‌డంతో పాటు ఫేమ‌స్ యాంక‌ర్‌గా పేరు తెచ్చుకుంది.
వ్య‌భిచారం రొంపులోకి దిగి అడ్డంగా దొరికి కేసులో బుక్ అయిన ఆ యాంకర్ త‌న పేరును బ‌య‌ట‌కు రాకుండా ఉండేందుకు చాలా మేనేజ్ చేసిన‌ట్టు అంటున్నారు. ఇటివలే ఆ యాంకర్ మరో మేల్ యాంకర్‌తో ల‌వ్‌లో కూడా ఉందటూ వార్తలు వచ్చాయి. మీడియాలో వినపడుతున్నసమాచారం ప్రకారం పలు రియాల్టీ షో లకు, పలు కార్యక్రమాలకు ప్రముఖ యాంకర్ గా వ్యవహరించిన ఆమె వ్యభిచారం కేసులో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ శివారులోని ఓ బిల్డింగ్‌లో ఆమె ఏకంగా ఒక‌రు కాదు …ఇద్ద‌రు కాదు ముగ్గురు అబ్బాయిల‌తో ఓకే రూమ్‌లో సెక్స్ చేస్తూ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డింది. పోలీసులు ఆమెను ప‌క్కా స‌మాచారం మేర‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుని ఆ త‌ర్వాత ఆమెను బెయిల్‌పై విడిచిపెట్టినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. పోలీసుల‌కు ఆ యాంకర్ పేరు చెప్పడానికి పోలీస్‌లు నిరాక‌రించిన‌ట్టు తెలుస్తోంది. ఆ యాంకర్ ప్ర‌స్తుతం తెలుగులో టాప్-3 స్థానంలో ఉంది.

రిచా గంగోపాధ్యాయ్ మళ్లీ చేస్తాందట..!

లీడర్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్. తొలి సినిమా మంచి హిట్ సాధించడంతో ఈ భామకు వరస ఆఫర్స్ వచ్చాయి. దాంతో ఈ భామ మంచి గుర్తింపు వచ్చింది. మిరపకాయ్ , మిర్చి లాంటి సూపర్ హిట్స్ తో యూత్ లో బాగా క్రేజ్ తెచ్చుకుంది.
కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ధనుష్, శింబు వంటి స్టార్ హీరోల సరసన కూడా ఈ భామ నటించింది. కెరియర్ మంచి ఫేమ్ లో ఉన్నప్పుడు సడెన్ గా ఈమె అమెరికా కు వెళ్ళిపోయింది.. సినెమాలకైతే దూరం అయ్యింది కానీ అభిమానులకు మాత్రం తన సోషల్ పేస్ బుక్ పేజీ లో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ దగ్గరవుతుంది.. అసలు సినిమాలని నేను ప్రొఫెషన్ గా తీసుకోలేదని క్యాజువల్ గా ఆఫర్ రావడంతో హీరోయిన్ అయ్యానని.. సినిమా అంటే సీరియస్ గా తీసుకోలేదు కాబట్టే హీరోయిన్ గా ఆఫర్స్ వున్నా చేయకుండా అమెరికా వచ్చేసానని చెబుతోంది.
ప్రస్తుతం అమెరికాలో మూవీ మేకింగ్ కోర్స్‌ చేస్తున్నానని..మళ్ళీ హీరోయిన్ గా చేయాలనే ఇంట్రెస్ట్ వస్తే తెలుగులోనే చేస్తానని చెబుతోంది. మరి ఈమెకు ఇంట్రస్ట్ ఎప్పుడు వస్తుందో ..ఈమెకు ఆఫర్ ఇచ్చే దర్శకుడు ఎవరో చూడాలి.