cricket ad

Thursday, 15 December 2016

బీజేపీ నేతలకు పవన్ సూటి ప్రశ్న..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవధ అంశంపై చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీఫ్‌ను ఎందుకు నిషేధించలేదని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఇప్పటికే పలుమార్లు బహిరంగ సభల్లో తీవ్ర విమర్శలు గుప్పించిన పవన్ బీజేపీపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవధ, రోహిత్‌ వేముల, దేశభక్తి, నోట్ల రద్దు, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలపై ప్రశ్నించనున్నట్లు పవన్ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. ఇకపై రోజుకో అంశంపై స్పందిస్తానని పవన్‌ స్పష్టం చేశారు. శుక్రవారం రోజున రోహిత్‌ వేముల అంశంపై స్పందిస్తానని ట్విట్టర్‌లో జనసేన అధినేత పవన్‌ వెల్లడించారు. దీంతో పవన్ అభిమానుల్లో, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ ఆ పని చేయట్లేదన్న విమర్శలకు చెక్ పెట్టినట్లయింది. ఇప్పుడు పవన్ అసలు రూట్‌లోకి వచ్చారని రాజకీయ నిపుణులు చెప్పుకుంటున్నారు.

No comments:

Post a Comment