త్వరలో 80 వేల కోట్ల వంద
రూపాయల నోట్లు మార్కెట్లోకి వస్తాయని కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి
శక్తికాంత దాస్ తెలిపారు. ఐదొందల రూపాయల నోట్ల ముద్రణ ఉధృతం చేసినట్లు
చెప్పారు. డిసెంబర్ 30 కల్లా ఐదొందల రూపాయల నోట్లు పూర్తి స్థాయిలో
అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. రెండు మూడు వారాల్లో దేశవ్యాప్తంగా 50
శాతం కరెన్సీ వస్తుందన్నారు. బ్యాంకులు ఏటీఎంలలో సరిపడా క్యాష్ పెట్టాలనే
ఆదేశాలు జారీ చేసినట్లు దాస్ తెలిపారు. దేశంలో ఉన్న 2 లక్షలా 10 వేల
ఏటీఎంలలో లక్షకు పైగా ఏటీఎంలను అప్‌గ్రేడ్ చేసినట్లు వెల్లడించారు. గ్రామీణ
ప్రాంతాల్లోని బ్యాంకులకు, సహకార బ్యాంకులకు పెద్ద మొత్తంలో నగదు
పంపినట్లు తెలిపారు. 500, రెండు వేల రూపాయల నోట్లను దేశంలోనే తొలిసారిగా
డిజైన్ చేసినట్లు దాస్ వెల్లడించారు. మారుమూల గ్రామాలకు నగదు సరఫరా
చేసేందుకు విమానాలను వాడుతున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఐటీ దాడుల్లో
పట్టుబడుతున్న నోట్లను తిరిగి బ్యాంకులకు తరలిస్తున్నామని శక్తికాంతదాస్
వెల్లడించారు.
No comments:
Post a Comment