cricket ad

Thursday, 15 December 2016

ప్రధాని నరేంద్రమోదీ కలల బండి ‘హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్’ రేపు పట్టాలెక్కబోతోంది. ఎన్నికల సమయంలో మోదీ ఈ రైలు గురించి హామీ ఇచ్చారు. ఈ రైలు ‘గతిమాన్’,‘టాల్గో’ రైళ్లలా వేగంగా పరుగులు తీయలేదు కానీ అంతకుమించిన ప్రత్యేకతలు దీనిసొంతం. అయితే ప్రస్తుతం ఉన్న రైళ్లలోని ఏసీ-3 టయర్ కంటే మెరుగైన అనుభూతిని మాత్రం సామాన్య ప్రయాణికులకు అందిస్తుంది. ఈ ఏడాది ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఈ రైలును ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైలును రేపు(శుక్రవారం) జెండా ఊపి రైలును ప్రారంభించనున్నారు. ఒక్కో దాంట్లో 72 సీట్లు చొప్పున 16 కోచ్‌లు ఈ రైలులో ఉన్నాయి. ఘజియాబాద్‌లోని ఆనంద్‌విహార్ నుంచి గోరఖ్‌పూర్ మధ్య నడవనుంది. చిప్యానా బుజుర్గ్, గోండా, కాన్పూర్ సెంట్రల్, లక్నో(ఎన్ఆర్), బరాబంకి, బస్తి, స్టేషన్లలో ఆగుతూ 13 గంటల్లో గమ్యాన్ని చేరుకుంటుంది. ఇతర ఏసీ-3 టయర్ కోచ్‌లతో పోలిస్తే హమ్‌సఫర్‌లో చార్జీలు 15శాతం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సాధారణ ప్రయాణికులకు కూడా లగ్జరీ అనుభవం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ రైలులో అడుగుపెట్టిన మరుక్షణం ప్రయాణికుల మూడ్ పూర్తిగా మారిపోతుంది. ఆహ్లాదకరమైన రంగులతో ఆకట్టుకుంటుంది. బెర్త్‌ల మధ్య అన్‌బ్రేకబుల్ మిర్రర్స్ ఏర్పాటు చేశారు. మంటలు, పొగను గుర్తించే సెన్సార్లను కూడా అమర్చారు. కాబట్టి ఇతర రైళ్లతో పోలిస్తే ఈ రైలులో ప్రయాణం పూర్తిగా సురక్షితం. మోదీ స్వచ్ఛభారత్ లక్ష్యానికి అనుగుణంగా రైలును తీర్చిదిద్దారు. బయోటాయిలెట్లు, వాసన నియంత్రణ వ్యవస్థ, ఎక్కడికక్కడ చెత్తవేసుకునే బకెట్లు ఏర్పాటు చేశారు. అంతేకాదు మనకి మనమే టీ, కాఫీ, సూప్ తయారుచేసుకునే వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు. ఒకవేళ మనం ఇంటి నుంచి ఆహారం తెచ్చుకుంటే కావాలనుకుంటే వేడి చేసుకునే ఏర్పాట్లతోపాటు కూలింగ్ చేసుకునే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. హీటింగ్ చాంబర్‌, రిఫ్రిజిరేషన్ బాక్స్ కూడా రైలులో ఉంది. ‘హమ్‌సఫర్’ రైలులో మొదటి ఆరు నెలలు రైల్వే సిబ్బంది, సీనియర్ సిటిజన్లు, కేన్సర్ రోగులకు ఎటువంటి రాయితీలు ఉండవు.

ప్రధాని నరేంద్రమోదీ కలల బండి ‘హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్’ రేపు పట్టాలెక్కబోతోంది. ఎన్నికల సమయంలో మోదీ ఈ రైలు గురించి హామీ ఇచ్చారు. ఈ రైలు ‘గతిమాన్’,‘టాల్గో’ రైళ్లలా వేగంగా పరుగులు తీయలేదు కానీ అంతకుమించిన ప్రత్యేకతలు దీనిసొంతం. అయితే ప్రస్తుతం ఉన్న రైళ్లలోని ఏసీ-3 టయర్ కంటే మెరుగైన అనుభూతిని మాత్రం సామాన్య ప్రయాణికులకు అందిస్తుంది.
 
ఈ ఏడాది ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఈ రైలును ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైలును రేపు(శుక్రవారం) జెండా ఊపి రైలును ప్రారంభించనున్నారు. ఒక్కో దాంట్లో 72 సీట్లు చొప్పున 16 కోచ్‌లు ఈ రైలులో ఉన్నాయి. ఘజియాబాద్‌లోని ఆనంద్‌విహార్ నుంచి గోరఖ్‌పూర్ మధ్య నడవనుంది. చిప్యానా బుజుర్గ్, గోండా, కాన్పూర్ సెంట్రల్, లక్నో(ఎన్ఆర్), బరాబంకి, బస్తి, స్టేషన్లలో ఆగుతూ 13 గంటల్లో గమ్యాన్ని చేరుకుంటుంది. ఇతర ఏసీ-3 టయర్ కోచ్‌లతో పోలిస్తే హమ్‌సఫర్‌లో చార్జీలు 15శాతం ఎక్కువ ఉండే అవకాశం ఉంది.
 
సాధారణ ప్రయాణికులకు కూడా లగ్జరీ అనుభవం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ రైలులో అడుగుపెట్టిన మరుక్షణం ప్రయాణికుల మూడ్ పూర్తిగా మారిపోతుంది. ఆహ్లాదకరమైన రంగులతో ఆకట్టుకుంటుంది. బెర్త్‌ల మధ్య అన్‌బ్రేకబుల్ మిర్రర్స్ ఏర్పాటు చేశారు. మంటలు, పొగను గుర్తించే సెన్సార్లను కూడా అమర్చారు. కాబట్టి ఇతర రైళ్లతో పోలిస్తే ఈ రైలులో ప్రయాణం పూర్తిగా సురక్షితం. మోదీ స్వచ్ఛభారత్ లక్ష్యానికి అనుగుణంగా రైలును తీర్చిదిద్దారు. బయోటాయిలెట్లు, వాసన నియంత్రణ వ్యవస్థ, ఎక్కడికక్కడ చెత్తవేసుకునే బకెట్లు ఏర్పాటు చేశారు. అంతేకాదు మనకి మనమే టీ, కాఫీ, సూప్ తయారుచేసుకునే వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు. ఒకవేళ మనం ఇంటి నుంచి ఆహారం తెచ్చుకుంటే కావాలనుకుంటే వేడి చేసుకునే ఏర్పాట్లతోపాటు కూలింగ్ చేసుకునే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. హీటింగ్ చాంబర్‌, రిఫ్రిజిరేషన్ బాక్స్ కూడా రైలులో ఉంది. ‘హమ్‌సఫర్’ రైలులో మొదటి ఆరు నెలలు రైల్వే సిబ్బంది, సీనియర్ సిటిజన్లు, కేన్సర్ రోగులకు ఎటువంటి రాయితీలు ఉండవు.

No comments:

Post a Comment