cricket ad

Thursday, 15 December 2016

రిచా గంగోపాధ్యాయ్ మళ్లీ చేస్తాందట..!

లీడర్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్. తొలి సినిమా మంచి హిట్ సాధించడంతో ఈ భామకు వరస ఆఫర్స్ వచ్చాయి. దాంతో ఈ భామ మంచి గుర్తింపు వచ్చింది. మిరపకాయ్ , మిర్చి లాంటి సూపర్ హిట్స్ తో యూత్ లో బాగా క్రేజ్ తెచ్చుకుంది.
కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ధనుష్, శింబు వంటి స్టార్ హీరోల సరసన కూడా ఈ భామ నటించింది. కెరియర్ మంచి ఫేమ్ లో ఉన్నప్పుడు సడెన్ గా ఈమె అమెరికా కు వెళ్ళిపోయింది.. సినెమాలకైతే దూరం అయ్యింది కానీ అభిమానులకు మాత్రం తన సోషల్ పేస్ బుక్ పేజీ లో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ దగ్గరవుతుంది.. అసలు సినిమాలని నేను ప్రొఫెషన్ గా తీసుకోలేదని క్యాజువల్ గా ఆఫర్ రావడంతో హీరోయిన్ అయ్యానని.. సినిమా అంటే సీరియస్ గా తీసుకోలేదు కాబట్టే హీరోయిన్ గా ఆఫర్స్ వున్నా చేయకుండా అమెరికా వచ్చేసానని చెబుతోంది.
ప్రస్తుతం అమెరికాలో మూవీ మేకింగ్ కోర్స్‌ చేస్తున్నానని..మళ్ళీ హీరోయిన్ గా చేయాలనే ఇంట్రెస్ట్ వస్తే తెలుగులోనే చేస్తానని చెబుతోంది. మరి ఈమెకు ఇంట్రస్ట్ ఎప్పుడు వస్తుందో ..ఈమెకు ఆఫర్ ఇచ్చే దర్శకుడు ఎవరో చూడాలి.

No comments:

Post a Comment